Pages

Monday, December 26, 2016

ఉద్యోగం పురుష లక్షణం

*ఉద్యోగం పురుష లక్షణం*


"ఏం..వదినా..అన్నయ్య ఆఫీసుకెళ్ళారా..?"
అని పక్కింటి పంకజ ను పలకరించింది సరోజ.

"లేదు వదినా..వారం రోజులుగా ఆఫీసుకు సెలవు పెట్టి ATM ల చుట్టూ తిరుగుతున్నారు" అని బదులిచ్చింది పంకజ.

"అయ్యో! పాపం. అందరికీ అదే కష్టం వచ్చింది వదినా. కార్డుకు 2000 రూ|| మాత్రమే ఇస్తున్నారంట కదా. ఇంతకూ ఓ 4000 రూ|| అయినా తెచ్చారా లేదా?" అని అడిగింది సరోజ.

"రోజుకు ఐదారు వేల చొప్పున ఇప్పటికి 30,000 రూ|| సంపాదించారు" అని గర్వంగా మురిసిపోతూ సమాధానమిచ్చింది పంకజ.

ఖంగుతిన్న సరోజ "ఆఁ..!!" అని నోరు వెళ్ళబెట్టి " ఎన్ని కార్డులు పట్టుకెళుతున్నారేంటి?" అంది.

"కార్డులతో పనే లేదు వదినా. ఒక క్యాను నిండా టీ, ఒక సంచి నిండా సమోసాలు పట్టుకెళ్తే చాలు. సాయంత్రానికి అవన్నీ అమ్ముడుపోయి ఐదారు వేలు చేతికొస్తున్నాయ్. రోజూ పొద్దున్నే నిద్రలేచి అవి రెండూ సిద్ధం చేసుకుంటున్నారు మీ అన్నయ్య" అని అసలు రహస్యం చెప్పేసింది పంకజ.

"థ్యాంక్స్..వదినా. రేపటి నుంచి మా వారిని కూడా ఓ వారం రోజులు సెలవు పెట్టమని చెప్తా" అని వెలిగిపోతున్న ముఖంతో ఇంటిలోకి పరుగెత్తి సెల్ ఫోన్ తీసి తన భర్తకు డయల్ చేయడం మొదలెట్టింది సరోజ.  

No comments:

Post a Comment

.