Pages

Sunday, May 8, 2016

Mother

అమ్మ

అనురాగాల చెలిమె అమ్మా..
అనుబంధాల చెలిమే అమ్మా..
ఆత్మీయత ఆకలికి ఆహారం
అమ్మా
ఆప్యాయత దాహానికి చల్లని నీరు అమ్మా..
అపురూపాల ధనమే అమ్మా..
ముద్దు మురిపాల నిధియే అమ్మా.
పసి మనసుల పరవశం అమ్మా.
చిరునవ్వుల చిగురింపులూ అమ్మా
రక్త మాంసాలను పోగు చేసి
మనషి ఆకృతి నిచ్చే అమ్మా..
ప్రపంచానికి పరిచయం చేసి
పరిపోషణకు పరితపించే అమ్మా..
తన శక్తినే క్షీరముగా మలచి
ఆహారంగా అందించేది అమ్మా.
తన బాధలను దిగమింగి
ఆనందాలను పంచేది అమ్మా..
మకరందం కన్నా మధురం అమ్మా..
అమృతమే తరువాయి అమ్మ ప్రేమ కన్నా..

కనుపాపకు రెప్పే రక్షణ కవచం
పసిపాపకు అమ్మ ఒడే ఎంతో పదిలం..

మాలిన్యం లేనిది మంచి మనసు అమ్మా..
కాలుష్యం కానిది కన్న ప్రేమా
అమ్మా..

తలచుకుంటే సరిపోదు తల్లి ప్రేమ ఋణం..
ఆదరించండి అమ్మ ను పోకముందే ప్రాణం..

సాటి రాదు ఏది నీ ప్రేమకు ఈసృష్టిలో తల్లీ...
సాష్ట్రాంగ ప్రణామములు నీపాదాలకు మోకరిల్లీ..
(మాతృదినోత్సవ శుభాకాంక్షలు )
 కొప్పోలు యాదయ్య

No comments:

Post a Comment

.