Pages

Sunday, May 8, 2016

Old days were Gold days

Sweet Memories about child hood


రోజులే బాగున్నాయ్
టెన్షన్లు.. ఒత్తిళ్లు... డబ్బు సంపాదన... కోసం అతిగా ఆలోచనలు లేకుండా... ఉన్నంతలో కుటుంబమంతా కలసి... ఆనందంగా గడిపిన ఆరోజులు బాగున్నాయ్...! ఆదివారం ఆటలాడుతూ... అన్నాన్ని మరచిన రోజులు బాగున్నాయ్...! మినరల్ వాటర్ గోల లేకుండా... కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర... నీళ్లు తాగిన రోజులు బాగున్నాయ్...! ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం... ఎర్రని ఎండను సైతం లెక్కచేయని...
రోజులు బాగున్నాయ్..!
వందలకొద్దీ చానెళ్లు లేకున్నా... ఉన్న ఒక్క దూరదర్శన్ లో చిత్రలహరి... ఆదివారం సినిమా కోసం వారమంతా... ఎదురు చూసిన రోజులు బాగున్నాయ్...! సెలవుల్లో అమ్మమ్మ..నానమ్మల ఊళ్లకు వెళ్లి... ఇంటికి రావాలన్న ఆలోచనే లేని... రోజులు బాగున్నాయ్...! ఏసీ కార్లు లేకున్నా ఎర్రబస్సుల్లో... కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని.. ఆస్వాధించిన రోజులు బాగున్నాయ్...! మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా... బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ... చాక్లెట్లు పంచిన రోజులు బాగున్నాయ్...! మటన్ బిర్యానీ.. చికిన్ బిర్యానీ లేకున్నా... ఎండాకాలం మామిడి కాయ పచ్చడితో... అందరం కలసి కడుపునిండా అన్నం తిన్న...
ఆరోజులు బాగున్నాయ్...!
ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా... పరసు నిండా డబ్బులున్నా... కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర... కాజేసిన రోజులే బాగున్నాయ్...! సెల్లు నిండా గేములున్నా... బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్ తో... క్రికెట్టాడిన రోజులే బాగున్నాయ్...! ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా... రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
రోజులే బాగున్నాయ్...
ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... పావలా ఆశా చాక్లెట్ తిన్న... రోజులే బాగున్నాయ్...! చిన్న చిన్న మాటలకే దూరం... పెంచుకుంటున్న రోజుల్లో... పిల్లలం కొట్టుకున్నా సాయంత్రంకల్లా... కలసిపోయిన రోజులే బాగున్నాయ్... ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా... నాన్న కొనుక్కొచ్చే చిరుతిళ్ల కోసం... ఎదురు చూసిన
రోజులే బాగున్నాయ్...
ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లు... చల్లగా నోట్లో నానుతున్నా అమ్మ... చీరకొంగు పైసలతో పుల్లఐసు కొనితిన్న... రోజులు ఎంతో బాగున్నాయ్...! పొద్దుపోయేదాకా చేల్లో పనులు చేసుకొచ్చి... ఎలాంటి చీకూచింత లేకుండా.. ఎండాకాలంలో ఆకాశంలోని చందమామను చూస్తూ... నిదురించిన రోజులు బాగున్నాయ్...! రోజులు ఎంతో బాగున్నాయ్... రోజులు ఎంతో బాగుంటాయ్... ఎందుకంటే గడచి పోయిన రోజులు... మళ్లీ తిరిగి రావు కాబట్టి... రోజులు ఎంతో బాగుంటాయ్...”
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.