Pages

Friday, July 29, 2016

స్ఫూర్తినిచ్చే సూక్తులు...

భారతరత్న అబ్దుల్ కలాం  వర్ధంతి సందర్భంగా... స్ఫూర్తినిచ్చే సూక్తులు...
బుధవారం, 27 జూలై 2016

1. వర్షం వస్తే పక్షులన్నీ వాటివాటి గూళ్లలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది.

2. మానవుడికి కష్టాలు కావాలి ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఆనందించడానికి.

3. నీ భాగస్వామ్యం లేనిదే నీ విజయం సాధ్యం కాదు. నీ భాగస్వామ్యం లేనిదే నీ అపజయానికీ తావులేదు.

4. మనం కేవలం విజయాల మీద నుంచే పైకి రాలేము. అపజయాల పై నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.

5. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.

6. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయినవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది.

7. నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.

8. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.

9. ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.

10. నువ్వొక మనిషిని అవమానిస్తూ అతడి నుంచి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తియ్యలేవు. 
11. హృదయాలతో పనిచెయ్యని వాళ్ళ విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప చేస్తుంది.

No comments:

Post a Comment

.