Pages

Friday, July 29, 2016

జపానులో పూర్వం ఒక కౄరమైన అలవాటు ఉండేదట

జపానులో పూర్వం ఒక కౄరమైన అలవాటు ఉండేదట… వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి ఎతైన కొండప్రాంతాలలో వదిలి వచ్చేవారట. వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండల్లో వదలేసి రావడానికి తన బుజాలపై మోసుకుని బయలు దేరాడు.
దారిలో బుజం పై ఉన్న తల్లి ఎదో చేస్తున్నట్టు అనిపించి గమనించగా చెట్టు కొమ్మల నుంచి ఆకులు తెంపడం గమనించి చాలా దూరం వెళ్ళిన తరవాత తల్లిని దించి నువ్వు ఎందుకు ఆకులు తెంచుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పుకొచ్చింది… నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయానని, నన్ను వదిలెయ్యాలని పైగా నేను తిరిగి రాకూడదని చాలా దూరం తీసుకుని వస్తున్నావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశ్యంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను. అని చెప్పింది ఆ తల్లి. అమ్మ మనసు మంచు కన్నా చల్లనిది, మల్లె కన్నా తెల్లనిది, దేవతతో సమానురాలు అని అందుకే అంటారు. ఆమె మాటలు విన్న ఆ యువకుడికి కనువిప్పు కలిగి తల్లిని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లి చక్కగా చూసుకోవడం మొదలు పెట్టాడు.అప్పటి నుంచి అందరూ ఆ ఆచారం వదిలేసారంట.
మనం కన్న పిల్లలు ఏమి చేసినా నేను కూడా చిన్నప్పుడు అలాగా చేసాను, ఇలానే చేసాను ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే అని మురిసిపోయే మనం… మన తల్లి తండ్రులు వ్రుద్దులైపోతే నేను కూడా కొన్ని సంవత్సరాల తరవాత ఇలా ఉంటాను అన్న మాట అని ఎందుకు అనుకోము. నేటి తరం అయిన మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం పాకులాడి, మన స్థాయికి మించిన చదువులు వాళ్ళ ఇష్టాలు తీర్చడానికి పాటు పడే మనము, మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేనని ఎందుకు మరచిపోతాము.
ఒక్కసారి ఆలోచిద్దాం… అందరికి తెలియజేసి, ఒకరిలోనైనా మార్పుకు కారణం అవుదాం, ఆ విషయాన్ని మన వృద్దాప్యంలో మాన మనమలు, మనవరాల్లతో  కూడా షేర్ చేసుకుందాం." తెలంగాణ కోకిల" మాస పత్రిక ఎడిటర్ mv రమణ దన్యవాదాలు .

No comments:

Post a Comment

.