ఎందుకు? ఏమిటి? ఎలా?
రాయి
మునుగుతుందిగానీ పడవ మునగదేం?
ప్రశ్న : చిన్న
రాయి నీటిలో వేస్తే మునుగుతుంది. పెద్ద పెద్ద పడవలు నీటిలో మునగవు. ఎందుకు?
జవాబు: ఒక
వస్తువు నీటిలో మునుగుతుందా? తేలుతుందా? అన్న విషయం ఆ వస్తువు పరిమాణం
మీద ఆధారపడదు.
నిజానికి పరిమాణంతో అసలు
సంబంధమే లేదు.
ఆ వస్తువు సాంద్రత నీటి
సాంద్రతకన్నా తక్కువగా ఉందా లేక ఎక్కువగా ఉందా అనే విషయం మీద మాత్రమే మునగటం, తేలటం ఉంటుంది.
ఒక వస్తువుకున్న సాంద్రతను కేవలం ఆ వస్తువులోని పాదార్థిక
సాంద్రతతో సరిపెట్టకూడదు.
ఆ వస్తువుకున్న రూపం ద్వారా
సంతరించుకున్నవూ వాస్తవ స్వరూప సాంద్రతను పరిగణించాలి.
పడవలు పుటాకార బోలుగా ఉండటం వల్ల వాటి స్వరూప ఘన పరిమాణం
ఎక్కువగా ఉంటుంది.
స్వరూపం బోలుగా కాకుండా పలుచగా
ఉన్నట్లయితే పరిమాణం తక్కువగా ఉంటుంది.
ద్రవ్యరాశి, ఘన పరిమాణానికి ఉన్న నిష్పత్తే
సాంద్రత.
కాబట్టి పడవ రూపంలో ఉన్న ఇనుప తొట్టె సాంద్రత, విప్పారి ఉన్న ఇనుప పలక సాంద్రత
కన్నా తక్కువగా ఉంటుంది.
నీటి
సాంద్రతకన్నా బోలుగా తొట్టె(పుటాకార) రూపంలో ఉన్న ఇనుప పడవ స్వరూప సాంద్రత
తక్కువగా ఉండటం వల్ల పడవ తేలుతుంది.
No comments:
Post a Comment