గురు, శిష్యులు ఇద్దరూ ఒక బీచ్ కి వెళ్ళారు..
అక్కడ ఒక నోటిస్ బోర్డ్ మీద ఇలా వ్రాసి ఉంది.. " సముద్రం లో మునిగిపోతున్న వాళ్ళాని కాపాడిన వాళ్ళకి రూ. 500 బహుమతి.."అది చూసిన గురువు : అరేయ్, నేను సముద్రం లోకి దిగి, మునిగిపోతున్నట్లుగా అరుస్తాను. నువ్వు నన్ను కాపాడినట్లు నటించు. అప్పుడు మంకు రూ. 500 వస్తాయ్. అందులో నీకు 100 రూ. ఇస్తాను..
శిష్యుడు: మరీ 100 ఏంటి గురూ గారూ, కనీసం సగం అయినా ఇవ్వండి...
గురువు: నోర్మూసుకో.. నేను గురువుని.. అయినా అయిడియా నాది...
అనుకుంటూ, సముద్రం లోకి దిగి చాలా దూరం లోపలకి వెళ్ళిపోయి, అరవడం మొదలెట్టాడు..
ఆ అరుపులు వింటూ, శిష్యుడు పాటలు పాడుకుంటూ ఒడ్డున కూర్చుని ఉన్నాడు...
సముద్రం లోకి కొట్టుకుపోతూ గురువు గారు చివరిగా అరిచాడు..
" ఒరేయ్ వెధవా, నీకు సగం ఇస్తాలేరా.. ముందు నన్ను కాపాడు..."
శిష్యుడు: గురూజీ, మీరు బోర్డు పూర్తిగా చదవలేదు... " ఈ సముద్రం నుండి
' శవాన్ని ' బయటకి తీస్తే 5000 రూ. ఇస్తామని వ్రాసి ఉంది కింద...
No comments:
Post a Comment