Pages

Friday, June 10, 2016

visa

అమెరికా వెళ్లాలనుకునేవారు వీసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలిసి ఉంటుంది. ఎంతో మంది ఈ వీసాల గురించి తెలియక దళారుల చేతుల్లో మోసపోయి లబోదిబోమంటున్నారు. ఈ మధ్యనే ఇద్దరు భారతీయ సోదరులు వీసాల విషయంలో మోసం చేశారని అమెరికా కోర్టు ఏడేళ్లు శిక్ష విధించింది. తాజాగా ఇద్దరు ఇండియన్ అమెరికన్ కపుల్స్ కూడా ఇలా దొంగ వీసాలను ఇస్తూ జైలు ఊచలు లెక్కబెట్టారు. వీరు ఉద్యోగాల వీసా ఇస్తామని చెప్పి చాలామందిని మోసం చేసిన కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. మాములుగా అయితే అమెరికా వెళ్లే వారికి.. ఆ వ్యక్తి పనిని బట్టి, అక్కడ ఉండే కాలపరిమితిని బట్టి వీసాలు మంజూరు చేస్తుంటారు. ఒక్కోరకం వీసాకి ఒక్కో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి.

అసలు అమెరికా వెళ్లాలంటే ఏ వీసాలు ఉండాలి. ఎక్కువ మంది జనాలకు తెలియని రకరకాల వీసాలేంటో ఓ లుక్కేద్దాం.
Source:

బి-1 వీసా:

అమెరికాలో బహుమతులు అందుకోవటానికి, కాన్ఫరెన్స్లకు వెళ్లే వారు, క్రీడల్లో పాల్గొనటానికి వెళ్లే వారికి బి-1 వీసాను మంజూరు చేస్తారు. వ్యాపార పనుల నిమిత్తం అమెరికాకు వెళ్లే వారికి ఈ కేటగిరీ వీసానే మంజూరు చేస్తారు.

 బి-2 వీసా:
దీన్నే విజిటర్ వీసా లేదా టూరిస్ట్ వీసా అని కూడా అంటారు. అమెరికాను చూడటానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి, బంధుమిత్రులతో గడపటానికి వెళ్లాలంటే బి-2 కేటగిరీ వీసాను పొందాల్సిందే. దీంతోపాటు సోషల్ సర్వీస్ ఈవెంట్స్లో పాల్గొనేవారు, రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు, క్రీడాకారులకు ఈ వీసాను ఇస్తారు.

 సి- వీసా:
అమెరికా మీదుగా మరొక దేశానికి వెళ్లాలంటే ఈ వీసా ఉండాలి.

 డి- వీసా:
అమెరికాలోని విమానాల్లో లేదా నౌకల్లో పనిచేసే బృందంలో ఉద్యోగిగా జాయిన్ కావాలంటే డి- వీసా పొందాలి

 ఎఫ్‌-1 వీసా:
ఇది విద్యార్థులకు సంబంధించిన వీసా. అమెరికాలో అకడమిక్ కోర్సుల్లో చదువుకోవాలనుకునే వారు ఈ వీసాను పొందాలి.

 హెచ్‌-1బి వీసా:
అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ వీసాను తీసుకోవాల్సిందే. ఇక అమెరికాలో పర్మినెంట్, ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలు చేయాలంటే గ్రీన్కార్డు హోల్డర్ అయి ఉండాలి. అద్భుతమైన పరిజ్ఞానం అవసరమయ్యే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్లో పని చేసేవారికి మాత్రమే ఈ వీసాను ఇస్తారు. అమెరికాలో పిటిషన్ అమోదం ఉంటేనే ఇండియా నుంచి అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.

 జె వీసా:
ఎక్చ్సేంజ్ విజిటర్లకు ఈ వీసాలు ఇస్తారు.

 ఎల్‌ వీసా:
ఇండియాలోని బహుళజాతి సంస్థలు అమెరికాలోని తన కంపెనీల్లో ఉద్యోగం చేయటానికి తీసుకుంటే, ఆ ఉద్యోగి ఈ వీసాను తీసుకోవాల్సిందే.

 ఎమ్‌-1 వీసా:
వృత్తి విద్యా సర్టిఫికేషన్లు పొందేవారికి ఈ వీసా అవసరం.

 ఓ- వీసా:
టెలివిజన్, సినిమా, లలిత కళలు, క్రీడలు, శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వారు వెళ్లటం కోసం ఓ వీసా తీసుకోవాలి.

 పి-1 వీసా:
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కళాకారులు, క్రీడాకారులు ఈ వీసా కోసం అప్లై చేస్తారు.

 పి-2 వీసా:
ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటు కింద కళాకారులకు వెల్కమ్ చెబుతుంటుంది. ఇలా అమెరికాకి వెళ్లే కళాకారులకు పి-2 వీసా ఉండాలి.

 పి-3 వీసా:
కల్చరల్ ప్రోగ్రామ్స్లో ప్రదర్శనలు ఇవ్వటానికి వెళ్లే ఆర్టిస్టులు, కళాకారులకి ఈ వీసా అవసరం.

 R-1 వీసా:
మతసంబంధమైన విషయాలకోసం వెళితే ఆర్-వీసా ఉండాలి.

No comments:

Post a Comment

.