ఈ
మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్
జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!
🍁దేనికైనా కాలం కలసి రావాలి.
అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్ చెయ్యాలన్నారు.అలాగే నాటకం
చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో
కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
🍁సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్
కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య
వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
🍁ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు
ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే
పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.
🍁తాళం తో పాటే తాళం చెవి
కూడా
తయారు చేయబడుతుంది.
ఒకటి
లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే
పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు
:తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క
మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే
మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు
🍁మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర
లాగ కాదు.
సూది
పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర
పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని
కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర
లాగా విడదీస్తూ కాదు..
🍁నిజాన్ని మార్చే శక్తి ఈ
ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ
ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
🍁నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు
సమష్యల్లేవని కాదు,
వాటిని
ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…
🍁స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని
యుద్ధంలోను,
భార్యను
పేదరికంలోను,
గొప్పవ్యక్తిని
అతని వినయంలోను
పరీక్షించాలి.
🍁చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు
ధైర్యవంతుడు.
ఎదుటి
వారి తప్పును
క్షమించగలిగిన
వాడు బలవంతుడు.
🍁కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని
కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై
నిన్ను ప్రేమిస్తుంది.
🍁ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం
లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు
గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు
పాఠాన్ని స్వీకరించు.
ఎలా
నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి
విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ
ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.
🍁ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు
ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు
ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని
ఆలోచిస్తుంటాడు.
అదే
తేడా…
🍁గెలవాలన్న తపన,
గెలవగలను
అన్న నమ్మకం,
నిరంతర
సాధన.
ఈ
మూడే నిన్ను గెలుపుకు
దగ్గర
చేసే సాధనాలు.
🍁నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో
గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ
గెలుస్తాను.. గెలిచి తీరుతాను.
🍁స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం
ఉంటుంది గానీ,
అహంకారం
ఉండదు.
No comments:
Post a Comment