అక్షరాలలో
స్త్రీ కి నిర్వచనమిది
అ
- అపురూపమైనది
ఆ
- ఆప్యాయత పంచేది
ఇ
- ఇంటికి దీపం వంటిది
ఈ
- ఈశ్వరుడి మూడోకన్నులాంటిది
ఉ
- ఉన్నంతలో సర్దుకుపోయేది
ఊ
- ఊరటనిచ్చేది
ఋ
- ఋణం తీర్చుకోలేని సేవచేసేది
ఎ
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఏ
- ఏకాగ్రత కోల్పోకుండా
ఐ
- ఐనవారికోసం
ఒ
- ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ
ఓ
- ఓరిమితో నేరిమితో
ఔ
- ఔదార్యం చూపేది
అం
- అందరి అవసరాలూ తీర్చేది
అః
- అః అనిపించేది
కొన్ని
ఆవకాయ పద్యాలు:
(అంతర్జాల సేకరణ)
శ్రేష్టంబిది
పచ్చళ్ళన,
టేష్టున
ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ
ఆవకాయను
సుష్టుగ
తిని దొర్లినంత సుఖమది కలదే!
ఊరిన
ముక్కను కొరకగ,
ఔరా!
అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ
నాల్గు ముక్కలు
నోరారా
తినని నోరు నోరవ్వదుపో!
బెల్లము
వేసిన మధురము,
పల్లీనూనెను
కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి
వేయ మధురము,
పుల్లని
మామిడితొ చేయ ముక్కది మధురం!!
ఈ
ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు
కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు
దీనికన్ని పేర్లున్నవయా!
ఆవకాయ
ఉపయోగాలు:
ఉదయమె
బ్రెడ్డున జాముకు
బదులుగ
ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి
మహిమొ తెలియదు,
పదునుగ
నీ బుర్ర అపుడు పనిచేయునయా!
ఇందువల
దందు బాగని
సందేహము
వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు
కలపి చూసిన,
అందందే
రుచిగనుండు, అద్భుత రీతిన్!
ఆవకాయ
అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు
పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు
మార్గం బొక్కటి
చెప్పుము
మా నాల్కలొక్క చింతలు తీర్పన్”
ముక్కోటి
దేవులందరు
మ్రొక్కగ
తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది
ఆవకాయన
ముక్క
తినని వాడు కొండముచ్చై పుట్టున్!!
చారెరుగనివాడును, గో
దారిన
తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన
ఆవకాయను
ఆరారగ
తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!. Dedicated to All Aavakaya Lovers.
All is well
No comments:
Post a Comment