Pages

Friday, June 10, 2016

telugu pholosophy

నరకం అనుభవించే వారెవరు?
ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు
65
బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
ప్రవర్తన మాత్రమే
66
మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
మైత్రి
67
ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
68
ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
సుఖపడతాడు
69
ఎవడు సంతోషంగా ఉంటాడు?
అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు
70
ఏది ఆశ్చర్యం?
ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71
లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు
72
స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు?
నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు.

No comments:

Post a Comment

.