జయోస్తు తే తెలంగాణ!
త్యాగానురాగము, ఆత్మార్పణ ఫలితము!
తెలంగాణరాష్ట్రము, తరతరాల స్వప్నము!!
పసిడి కలల భాగ్యమా, ప్రశాంత చిత్త మంత్రము!
బంగరు మాగానమా, భాగ్యాయుత గీతము!!
మనయాస మనబాస, మన ఉనికికి తిలకము!
మననీరు మననదులు, మన ప్రగతికి మార్గము!!
మననిధులు మనవిధులు, మన జీవన నేతలు!
మనచేలు మనబడులు, నవ్య భవ్య వెలుగులు!!
మనజాతి మనఖ్యాతి, సనాతన తప: ఫలం!
మన ధ్యేయం మనవాదం, విశ్వశ్రేయ కావ్యఝరీ!!
మనపండుగ మనజాతర, వారసత్వ వనరులు!
మన మానం మనబోనం, సత్య ధర్మ ప్రతీకలు!!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవ సంబురాలు 2 జూన్ 2016.
త్యాగానురాగము, ఆత్మార్పణ ఫలితము!
తెలంగాణరాష్ట్రము, తరతరాల స్వప్నము!!
పసిడి కలల భాగ్యమా, ప్రశాంత చిత్త మంత్రము!
బంగరు మాగానమా, భాగ్యాయుత గీతము!!
మనయాస మనబాస, మన ఉనికికి తిలకము!
మననీరు మననదులు, మన ప్రగతికి మార్గము!!
మననిధులు మనవిధులు, మన జీవన నేతలు!
మనచేలు మనబడులు, నవ్య భవ్య వెలుగులు!!
మనజాతి మనఖ్యాతి, సనాతన తప: ఫలం!
మన ధ్యేయం మనవాదం, విశ్వశ్రేయ కావ్యఝరీ!!
మనపండుగ మనజాతర, వారసత్వ వనరులు!
మన మానం మనబోనం, సత్య ధర్మ ప్రతీకలు!!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవ సంబురాలు 2 జూన్ 2016.
No comments:
Post a Comment