Pages

Thursday, May 4, 2017

ప్రాథమిక హక్కుల వర్గీకరణ

ప్రాథమిక హక్కుల వర్గీకరణ


సమానత్వపు హక్కు (ప్రకరణలు 14-18)

-14-చట్టం దృష్టిలో సమానత్వం, చట్టం అందరిని సమానంగా రక్షిస్తుంది.
-15(1)- జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు.
-15(2)- జాతి, మత, కుల, లింగ, జన్మస్థల ప్రాతిపదికపై ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశాల్లోకి రానివ్వకుండా ఉంచరాదు.
-15(2)(ఎ)-దుకాణాలు, హోటళ్లు, వినోదపు ప్రదేశాల్లో వివక్ష చూపరాదు.
-15(2)(బి) - ప్రభుత్వ ధన సహాయంతో ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశించిన బావులు, చెరువులు, స్నానపుఘట్టాలను అందరూ సమానంగా వాడుకోవచ్చు.
-15(3)- స్త్రీ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు.
-15(4)-సాంఘికంగా వెనుకబాటుకు గురైన వారు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు జారీ చేయవచ్చు.
-15(5)- మైనార్టీ విద్యా సంస్థలను మినహాయించి మిగతా ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే నిబంధనలు పార్లమెంట్ చేయవచ్చు. (93 సవరణ-2005)
-16(1)-ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమానావకాశాలు
-16(2)-మతం, వర్గం, కులం, లింగం, వంశం, జన్మస్థలం నివాస స్థలం ప్రాతిపదికపై ఏ పౌరుని పట్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపరాదు.
-16(3)-కొన్ని ప్రాంతాల ఉద్యోగాలను కొన్ని ప్రాంతాల వారికే పరిమితం చేయాలి అనే నిబంధన చేయవచ్చు.
-16(4)- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు.
-16(4ఎ) - ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల సదుపాయం కల్పించబడింది.
-16(4బి)- ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు క్యారీ ఫార్వర్డు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో 50 శాతం రిజర్వేషన్లు దాటవచ్చు.
-16(5) - ఒక మత విశ్వాసానికి సంబంధించిన శాఖలో ఆ మతానికి చెందినవారినే నియమించవచ్చు.
-17- అస్పృశ్యత నేరంగా ప్రకటించబడి రద్దు చేయబడింది.
-18-బిరుదులు
-18(1)- సైనిక, విద్యా సంబంధమైన బిరుదులు మాత్రమే ప్రకటించవచ్చు.
-18(2)- విదేశాలు ఇచ్చే బిరుదులను భారత పౌరులెవరూ స్వీకరించరాదు.
-18(3)- భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తుంటే బిరుదును స్వీకరించరాదు.
-18(4) - ఒక వ్యక్తి భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఏ పదవిని నిర్వహిస్తున్నా ఆ వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేనిదే ఇతర దేశాల నుంచి ఎలాంటి బహుమతిని, ఉద్యోగాన్ని, పదవిని స్వీకరించరాదు.

✡స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 19-22)

-19- వివిధ రకాలైన స్వేచ్ఛా హక్కులు
-19(1)(ఎ) - వాక్, భావ ప్రకటనా స్వాతంత్య్రం
-19(1)(బి) - శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశం జరుపుకొనే స్వాతంత్య్రం
-19(1)(సి) - సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకొనే హక్కు
-19(1)(డి) - దేశవ్యాప్తంగా సంచరించే హక్కు
-19(1)(ఇ) - దేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే హక్కు
-19(1)(ఎఫ్) - ఆస్తిని సంపాదించడం, దాన్ని అన్యాక్రాంతం చేయడం గురించి తెలిపేది. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించారు.
-19(1)(జి) - ఏ వృత్తినైనా, వ్యాపారాన్నయినా చేసుకోవచ్చు.
-20(1) - ఒక వ్యక్తి గత కాలంలో చేసిన నేరానికి ప్రస్తుత కాలంలో చేసిన చట్టప్రకారం శిక్షను విధించరాదు. కాని ఇది క్రిమినల్ నేరాలకు మాత్రమే వర్తిస్తుంది. సివిల్ నేరాలను గత కాలం నుంచి వర్తించేవిధంగా చట్టం చేయవచ్చు.
-20(2) - నేరం ఆరోపించబడ్డ వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్షం చెప్పాల్సిందిగా బలవంతం చేయరాదు.
-21- ప్రతి వ్యక్తికి జీవించేహక్కు ఉంది. చట్టం నిర్దారించిన పద్ధతిలో తప్ప మరేవిధంగా కూడా వ్యక్తి ప్రాణాలకు హాని కల్గించరాదు.
-21(ఎ) - 6-14 ఏండ్ల మధ్య గల బాలలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య హక్కు కల్పించబడుతుంది.
-21(1) - ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి ఆ అరెస్టుకు సంబంధించిన కారణాలను వీలైనంత త్వరగా తెలియజేయాలి.
-22(2) - అరెస్ట్ అయ్యి నిర్బంధంలో ఉన్న ఏ వ్యక్తినైనా 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరుపర్చాలి. ప్రయాణ కాలాన్ని మినహాయిస్తారు.
-22(3) - అరెస్ట్ అయిన వ్యక్తి శత్రుదేశానికి చెందినవాడైనా, ముందస్తు నిర్బంధం కింద అరెస్టు అయినా 22(1), 22(2)లు వర్తించవు.
-22(4) - ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ అయిన వ్యక్తిని మూడు నెలల కన్నా మించి నిర్బంధంలో ఉంచరాదు. కానీ పార్లమెంట్ ఏదైనా శాసనం చేసి గరిష్ట పరిమితిని పెంచవచ్చు.
-22(5) - ముందస్తు నిర్బంధం కింద అరెస్టు చేసిన వ్యక్తికి అతని అరెస్టుకు సంబంధించిన కారణాలు తెలియజేయాలి.
-22(6) - ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ముందస్తు నిర్బంధం కింద అరెస్టయిన వ్యక్తికి అరెస్టుకు సంబంధించిన కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.
-22(7) - ముందస్తు నిర్బంధ విధాన కాలపరిమితికి సంబంధించిన శాసనాలను చేసే అధికారం కేవలం పార్లమెంట్కు ఉంది.

✳పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణలు 23-24)

-23(1) - మనుషుల క్రయ విక్రయాలను, బలవంతపు వెట్టిచాకిరీ నిషేధించింది. వెట్టిచాకిరీని బేగార్ అంటారు.
-23(2) - 23(1) కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు. ఉదాహరణకు డాక్టర్లను విద్య పూర్తయిన తర్వాత కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే నిబంధనను పెట్టవచ్చు.
-23(1) - 24-14 ఏండ్లలోపు పిల్లలచేత ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయించరాదు.

⭕మత స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 25-28)

-25(1) - భారతదేశంలోని ప్రజలందరు తమకు నచ్చిన మతాన్ని, విశ్వాసాన్ని స్వీకరించవచ్చు. అచరించవచ్చు. ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి మార్చరాదు.
-25(2) - మత కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేక ఇతర సంక్షేమ కార్యకలాపాలను పరిమితం చేయడం, నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
-26 - ప్రజా శాంతి, ఆరోగ్యకరమైన నైతికతలకు లోబడి మత సంస్థలు మత ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు. వీటికి సంబంధించిన ఆస్తులను సేకరించవచ్చు. వీటి కార్యకలాపాలను తమకు తామే నిర్వహించవచ్చు.
-27 - ఏదేని ఒక మతవ్యాప్తికి లేదా మత పోషణకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయడంపై నిషేధం విధిస్తుంది.
-28(1) - ప్రభుత్వ నిధులు పొందుతున్న విద్యాలయాల్లో మత బోధన నిషేధించింది.
-28(2) - ప్రభుత్వ నిధులు కాకుండా తమ సొంత నిధులతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో మత బోధన జరుపవచ్చు.
-28(3) - ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన విద్యాసంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు. లేదా పాల్గొనకపోవచ్చు. వారిని ఆ కార్యకలాపాల్లో పాల్గొనమని బలవంతం చేయరాదు.

సాంస్కృతిక విద్యా విషయపు హక్కు (ప్రకరణలు 29-30)

-29(1) - భారతదేశంలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకొనే హక్కు కలిగి ఉన్నారు.
-29(2) - ప్రభుత్వం సహాయం పొందే విద్యాసంస్థల్లో జాతి, మతం, కులం, భాష వంటి వాటిల్లో ప్రవేశం నిరాకరించరాదు.
-30 - విద్యాసంస్థలు స్థాపించడానికి మతప్రాదిక లేదా భాషా ప్రాదిక మైనారిటీ వర్గాల వారికి హక్కు ఉంది.
-30(2) - ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు అది అల్పా సంఖ్యాకులు నడిపే విద్యాసంస్థల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు.
రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ)
-ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు 32వ అధికరణ ప్రకారం హైకోర్టు 226 అధికరణ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది.
-రిట్ అంటే కచ్చితంగా పాటించాల్సిన కోర్టు ఆజ్ఞ
-32- ప్రాథమిక హక్కుల సంరక్షణకు రాజ్యాంగం ద్వారా పరిహారం పొందడానికి అవకాశం ఉంది.

No comments:

Post a Comment

.