ఏయే ఆల్కహాల్ డ్రింక్స్‌ను తాగితే ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ అలవాటును చాలా మంది మానుకోలేరు. కొందరు ఆల్కహాల్‌ను లిమిట్‌లో తీసుకుంటే కొందరు రోజూ అదే పనిలో ఉంటారు. సరే… ఇది ఎలా ఉన్నప్పటికీ బీర్, విస్కీ, వోడ్కా, వైన్, బ్రాందీ… ఇలా ఆల్కహాల్‌లో ఉన్న ఒక్కో రకం డ్రింక్‌ను మితంగా తీసుకుంటే దాంతో పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం. ఇంతకీ ఆ ప్రయోజనాలేంటో, ఏ డ్రింక్‌ను తాగితే ఏం లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!విస్కీ…
వారానికి ఒకటి, రెండు పెగ్గుల విస్కీ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. గుండె సమస్యలు కూడా రావట. గుండె ఆరోగ్యానికి మంచిదట. బరువు నియంత్రణలో ఉంటుంది. దెమెంతియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వోడ్కా…
వోడ్కా తాగితే ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయట. డిప్రెషన్ తగ్గుతుందట. అంతేకాదు, నోటి దుర్వాసన పోతుందట. జుట్టు సమస్యలు పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయట. జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. చుండ్రు తగ్గుతుందట. అధిక బరువు తగ్గుతారు. బీపీ కంట్రోల్ అవుతుంది. దంతాల నొప్పులు పోతాయి.
రెడ్ వైన్…
రెడ్‌వైన్ తాగితే శరీరంలో ఏర్పడే హార్మోన్ అసమతుల్యతలు తగ్గిపోతాయి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మెటబాలిక్ రేట్ నియంత్రణలోఉంటుంది. గుండె సంబంధ జబ్బులు రావు. అంతేకాదు, రెడ్ వైన్ తాగేవారి ఆయువు పెరుగుతుందట. ఇతరులతో పోలిస్తే వీరి ఆయుర్దాయం 34 శాతం పెరుగుతుందట.
టెకీలా…
దీన్ని సేవిస్తే గుండె జబ్బులు రావు. జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండదు. జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. జీర్ణాశయంలో ఉండే క్రిములు చనిపోతాయి. ఆందోళన, కంగారు వంటివి తగ్గుతాయి. అయితే దీన్ని వారానికి ఒక పెగ్గు మాత్రమే తాగాలి సుమా..! లేదంటే ఆరోగ్యం కలగకపోగా, అనారోగ్యం బారిన పడేందుకు అవకాశం ఉంటుంది.
బ్రాందీ…
బ్రాందీ తాగితే నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు ఒక్క పెగ్గు బ్రాందీ తాగి పడుకుంటే చాలు, హాయిగా నిద్రపోవచ్చట. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పోతుంది. చలికాలంలో తాగితే రెట్టింపు లాభాలు కలుగుతాయి.
బీర్…
బీరు తాగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకలు దృఢంగా పెరుగుతాయి. ప్రకాశవంతంగా మారుతాయి. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. మెదడు పదునుగా మారుతుంది. గుండె ఆరోగ్యం చక్కబడుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. కిడ్నీలకు చాలా మంచిది. విటమిన్లు శరీరానికి అందుతాయి.
షాంపేన్…
షాంపేన్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు పోతాయి. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు పోతాయి. అధిక బరువు తగ్గుతారు. గుండె పనితీరు మెరుగు పడుతుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు. దంత సమస్యలు పోతాయి.
వైట్ వైన్…
వైట్ వైన్ వల్ల ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. దాని సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మ సమస్యలు పోతాయి. శక్తి పెరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు రావు. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుం
No comments:
Post a Comment