Pages

Wednesday, May 31, 2017

SMART PHONES _ PROBLEM & SOLUTION

SMART PHONES _ PROBLEM & SOLUTION


ఎంతటి గొప్ప స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తక తప్పదు. అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాంకేతిక లోపాలు తలెత్తటం సహజం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో తలెత్తే పలు సమస్యలు, వాటిని పరిష్కరించుకునేందుకు సులువైన మార్గాలను మీకు సూచించటం జరుగుతోంది..

సమస్య: ఇంటర్నల్ మెమరీ తక్కువుగా ఉంది.

పరిష్కారం: ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచీలను తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచుకోవచ్చు.


సమస్య: బ్లూటూత్ పని చేయటం లేదు

పరిష్కారం: ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లుటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

సమస్య : బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతోంది.

పరిష్కారం: ఫోన్‌లోని కనెక్టువిటీ ఫీచర్లుతో పాటు బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్‌లను నిలిపి వేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

సమస్య: ఆండ్రాయిడ్ ఫోన్ మెమురీ కార్డును గుర్తించటం లేదు.

పరిష్కారం: సదరు మెమరీ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇలా చేయాలంటే.. Go to settings > Storage > Format SD card > Ok

సమస్య: ఫోన్ సిమ్‌కార్డ్‌‌ను గుర్తించటం లేదు

పరిష్కారం: ముందుగా వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి.

సమస్య: కెమెరా స్టార్ట్ అవటం లేదు

పరిష్కారం: ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత 'Force stop' 'clear data', 'clear cache' ఆప్షన్‌లను 'Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

సమస్య: బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం పడుతోంది....?

పరిష్కారం: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

సమస్య : ఫోన్ హ్యాంగ్ అయిన సమయంలో ఏం చేయాలి

పరిష్కారం: రీస్టార్ట్ చేయటం ద్వారా ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తరచూ ఇలాను జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయవల్సిందే.⁠⁠⁠⁠
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.