Pages

Sunday, May 28, 2017

మీకు ధ్రువీకరణ పత్రాలు అవసరమా..? అయితే ఇలా చేయండి!

మీకు ధ్రువీకరణ పత్రాలు అవసరమా..? అయితే ఇలా చేయండి!


కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జూన్‌ మాసంలో కళాశాలలు, పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందే వారికి ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్‌లో సీటును పొందే వారికి విధిగా కళాశాలలో కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. వీటి ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు స్థానికతను విద్యాసంస్థలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌కు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో ప్రస్తుతం మండల కార్యాలయాల్లో చాలా మంది ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుం టున్నారు. నిబంధనలు తెలియక మధ్య దళారులను ఆశ్రయి స్తూ వారికి లంచాలు ఇస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందడం అతి తేలికని, అందరూ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్‌ కార్యాలయం చెప్తోంది. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వివరాలు మీ కోసం..

ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం..

ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తును నింపి దాంతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఆదాయ డిక్లరేషన్‌ లేదా వేతన సర్టిఫి కెట్‌ను జతచేయాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు వారి రేషన్‌ కార్డులో సూచిం చిన ఆదాయం ధ్రువీకరణ సరిపోతుంది. వీటితో పాటు అడ్రస్‌ ప్రూఫ్‌, ఐడెం టిటీ ప్రూఫ్‌ పత్రాలను జతచేస్తే తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది విచారించి అర్హుల కు ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. గరిష్టంగా 7 పనిది నాలలోపు ఆదాయ ధ్రువీకరణపత్రం, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందించాలి.

గ్యాప్‌ సర్టిఫికెట్‌...

మండల కార్యాలయాల్లో గ్యాప్‌ సర్టిఫికెట్‌ కూడా లభిస్తుంది. విద్యలో వెనుకబడ్డ విద్యార్థులు, అనారోగ్య కారణాలతో చదవలేని వారు విధిగా ఉన్నత విద్య కోసం ఈ గ్యాప్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా స్కాలర్‌షిప్‌లు పొందేం దుకు ఈ సర్టిఫికెట్‌ విధిగా అవసరం అవుతుంది. దీని కోసం మీ సేవా కేంద్రాల్లో 10రూపాయల స్టాంప్‌ పేపర్‌పైన అఫిడవిట్‌ (విద్యలో ఎందుకు గ్యాప్‌ వచ్చిందో సూచిస్తూ) దాని నోటరీ, ఇద్దరు గెజిటెడ్‌ అధికారుల సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనారోగ్య కారణాలతో చదువులో గ్యాప్‌ వస్తే వాటి మెడికల్‌ సర్టిఫికెట్లు జతచేయాలి. వీటిని పరిశీలించిన అనంతరం 15 పనిదినాల్లోపు మండల కార్యాలయం గ్యాప్‌ సర్టిఫికె ట్‌ను ఇస్తుంది.

నివాస ధ్రువీకరణ కోసం..

నివాస ధ్రువీకరణ కోసం దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రాల్లో లభించే దరఖాస్తు పత్రాన్ని నింపాలి. దీంతోపాటు అన్ని విద్యార్హతల బోనోఫైడ్‌ సర్టిఫికె ట్లు, అడ్రస్‌ ప్రూఫ్‌, ఐడెంటిటీ ప్రూఫ్‌ జత చేసి 45రూపా యలు ఫీజును చెల్లిం చాలి. ఇది తహసీల్దార్‌ కార్యాల యానికి చేరుకున్న అనంతరం వీఆర్వోలు విచా రించి అన్ని సజావుగా ఉంటే ఏడు పనిదినాల్లో ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.

కుల ధ్రువీకరణ కోసం...

కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాలు అన్ని మీసేవా కేంద్రాల్లో లభిస్తాయి. వాటిని పూర్తిగా నింపి దరఖాస్తుదారుడి చిరునామా ధ్రువీకరణ, ఫోటో ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరిది పాత కులధ్రువీకరణ పత్రం లేక కుల సంఘం వారితో సర్టిఫికెట్‌, విద్యాసంస్థల నుంచి టీసీ, బోనోపైడ్‌ సర్టిఫికెట్‌ను జత చేసి 45రూపాయల ఫీజుతోపాటు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి దర ఖాస్తు చేరిన అనంతరం వీఆర్వో విచారణ చేసి సెక్షన్‌కు పంపుతారు. అక్కడి నుంచి డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌ ధ్రువీకరణ అనంతరం ఆన్‌లైన్‌ చేసి మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీక రణపత్రం దరఖాస్తుదారుడికి అందుతుంది. ఈ పత్రం అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో 30 పనిదినాలలోపు అందించాలి. ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోతే వాటిని తిరస్కరించే అధికారం కార్యాలయానికి ఉంది.

ఈబీసీ సర్టిఫికెట్‌..

ఈబీసీ సర్టిఫికెట్‌ అంటే ఎకనామికల్లీ బ్యాక్‌ వర్డ్‌ సర్టిఫికెట్‌(ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలు) దీనిని ఓసీ కులస్తులు బ్రాహ్మణ, రెడ్డి, నాయుడు, కాపు, చౌదరి, వైశ్య తదితర ఉన్నత వర్గాల వారు మీ సేవా కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకోవాలి. ఈబీసీ సర్టిఫికెట్‌ ఉంటే ప్రభుత్వం విద్య కోసం స్కాలర్‌ షిప్‌లను ఇస్తుంది. వీటి కోసం ఆదాయ పత్రాలు, రేషన్‌ కార్డు, వేతన స్లిప్‌, విద్యాసంస్థల టీసీ, కుల సంఘాల సర్టిఫికెట్‌, అడ్రస్‌, ఐడీ ప్రూఫ్‌లతో పాటు దరఖాస్తు చేసుకుంటే 7 పనిదినాల్లో సర్టిఫికెట్‌ను ఇస్తారు.

ఓబీసీ సర్టిఫికెట్‌..

ఓబీసీ సర్టిఫికెట్‌ పొందేందుకు దరఖాస్తుదారుడు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తును నింపి వాటితో పాటు కులాన్ని సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(ఆదాయ పన్ను కట్టేవా రు మూడు సంవత్సరాల ఐటీ రిటర్న్స్‌) ప్రైవేటు ఉద్యోగులు వేతన స్లిప్‌, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు రేషన్‌ కార్డు, విద్యార్హతల పత్రాలు జత చేసి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని విచారించి అర్హులైన వారికి 15పనిదినాల్లో ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.

దళారులను ఆశ్రయించవద్దు..

తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. మధ్య దళారులను ఎవరూ నమ్మరాదు. అన్ని అవసరమైన పత్రాలు జతచేస్తే నిర్ణీత కాల వ్యవధిలో ధ్రువీకర ణపత్రాలను ఇస్తాం. కుల, ఆదాయ, నివాస ధ్రు వీకరణ పత్రాల కోసం నోటరీ అఫిడవిట్‌, గెజిటెడ్‌ అధికారుల సంతకాలు తప్పనిసరి ఏమాత్రం కాదు. పాత ధ్రువీకరణ పత్రాలను లేదా కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా పాత ధ్రువీకరణ పత్రాలు జతచేస్తే విచా రణలో మాకు సులభంగా ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నాం. అం దరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

No comments:

Post a Comment

.