Pages

Tuesday, May 9, 2017

పాలిసెట్ ప్రవేశాలు

పాలిసెట్ ప్రవేశాలు


 వెబ్సైట్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలీసెట్ వివరాలు
 అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక విద్యా శాఖ
 వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ఈ నెల చివరి వారంలో మొదలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 22న నిర్వహించిన పాలిసెట్–2017 ఫలితాలను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటి ప్రవేశాల కౌన్సెలింగ్పైనా దృష్టి సారించింది. ఈ నెల 15 నాటికి పాలిటెక్నిక్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసి, చివరి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకుని, ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్–2017 పరీక్షను నిర్వహించింది. ఈ నెల 12న ఎంసెట్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
వచ్చే నెలలో ఆయా సెట్స్కు సంబంధించిన ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఏయే ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు లభించాయి తదితర సమగ్ర వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెబ్సైట్ ( dtets.cgg.gov.in, tsche.cgg.gov.in, sbtet.telangana.gov.in )లో అందుబాటులోకి తెచ్చింది. వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమయిన తరువాత విద్యార్థులు ఆందోళన చెందకుండా, ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు.

సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్లివి...

♦ వివిధ కోర్సులకు అవసరమైన ఎస్సెస్సీ/డిప్లొమా/ఇంటర్మీడియట్/డిగ్రీ మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం.
♦ పాలిసెట్కు 4 నుంచి 10వ తరగతి వరకు, ఈసెట్కు 7 నుంచి డిప్లొమా వరకు, ఎంసెట్కు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఐసెట్కు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి.
♦ 2017 జనవరి 1.. ఆ తరువాత జారీ చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం.
♦ విద్యార్థులు తమ పేరుతో బ్యాంకు అకౌంట్ తెరువాలి (ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం). æ చివరగా చదువుకున్న విద్యా సంస్థ నుంచి టీసీ.
♦ స్పెషల్ కేటగిరీ (ఫిజికల్ చాలెంజ్డ్, సైనిక ఉద్యోగుల పిల్లలు/ఎన్సీసీ/స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.
♦ తల్లిదండ్రులు గతంలో తెలంగాణలో ఉండి, ఉద్యోగరీత్యా, ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలకు ప్రవేశాలు కావాలంటే.. ఆ తల్లిదండ్రులు గతంలో పదేళ్లపాటు తెలంగాణలో ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రం జత పరచాలి.
♦ ఓపెన్ స్కూల్ వంటి విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు తాము ఏడేళ్లు తెలంగాణలో ఉన్నట్లు నివాస సర్టిఫికెట్ను సమర్పించాలి.
♦ కన్వీనర్ కోటాలోని 15 శాతం అన్రిజర్వుడు కోటా సీట్లలో ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీల రీజియన్ల పరిధిలో చదువుకున్న వారు అర్హులు.                       
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.