గ్రీన్ టీ దీన్ని ఎలా తయారుచేస్తారో,ఎవరు తాగకూడదో తెలుసా ?
గ్రీన్ టీ… నేడు చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇది. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతామని, సాధారణ టీ కన్నా గ్రీన్ టీ ఎంతో బెటరని ఇప్పుడు చాలా మంది దీన్ని తాగేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి..? ఆ టీ పొడిని ఏ ఆకులతో తయారు చేస్తారు..? అసలు గ్రీన్ టీ వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గుతారా..? ఇంకా మనకు దాని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Camellia sinensis అనే మొక్కకు చెందిన ఆకులనే గ్రీన్ టీ పొడిగా తయారు చేస్తారు. అది ఈ పొడి తయారీ సాధారణ టీ పొడి తయారీలా ఉండదు. వేరేగా ఉంటుంది. ఎలా అంటే… ఈ మొక్క ఆకులు లేత నుంచి కొద్దిగా ముదురుకు మారాక వాటిపై ఎండ తగలకుండా పరదా వంటివి కప్పుతారు. దీంతో ఆ మొక్కలకు ఉన్న ఆకులు రంగు మారతాయి. ఇలా కొద్ది రోజులు ఉంచాక ఆ ఆకులను తెంపి మళ్లీ వాటిని నీడలో ఎండబెట్టి రోలింగ్ చేస్తారు. ఆ తరువాత పొడి చేసి ప్యాక్ చేస్తారు. మొత్తం సహజసిద్ధమైన పధ్దతిలోనే జరుగుతుంది. కనుక ఈ టీ పొడి మనకు చాలా మంచిది. దీంతో తయారు చేసిన గ్రీన్ టీని తాగితే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీని తయారు చేయాలంటే ఒక కప్పు వేడి నీటికి ఒక టీస్పూన్ పొడి వేస్తే చాలు. అయితే నీటిని బాగా మరిగించాక మాత్రమే ఈ పొడిని వేసి 4 – 5 నిమిషాలు వేచి ఉండాలి. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని వడ కడితే గ్రీన్ టీ తయారైనట్టే. అయితే నేడు చాలా మంది గ్రీన్ టీలోనూ చక్కెర కలుపుకుని తాగుతున్నారు. కానీ అలా తాగితే మళ్లీ సాధారణ టీ తాగినట్టే అవుతుంది. కనుక చక్కెర లేకుండా అలాగే డైరెక్ట్‌గా తాగితేనే కింద చెప్పిన ఫలితాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. గ్రీన్ టీని రోజూ ఉదయం, సాయంత్రం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజమిది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి.
2. గ్రీన్ టీలో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి.
3. గ్రీన్ టీని రోజూ తాగితే గుండె సంబంధ సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
4. మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తాగితే వారి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.
5. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతోపాటు కొవ్వు కూడా కరిగి అధిక బరువు తగ్గుతారు.
6. నొప్పులు, వాపులను తగ్గించడంలోనూ గ్రీన్ టీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
7. గ్రీన్ టీని ఎప్పటికీ తాగే వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
8. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విష పదార్థాలు తొలగిపోతాయి. లివర్ శుభ్రమవుతుంది.
ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి…
1. గర్భిణీలు మాత్రం డాక్టర్ల సలహా మేరకు గ్రీన్ టీ తాగితే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు కడుపులో ఉండే పిండాలకు పడకపోవచ్చు.
2. గ్రీన్ టీ అనేది కేవలం పెద్దలు మాత్రమే తాగాలి. పిల్లలు తాగకూడదు. తాగితే వారికి పోషణ సరిగ్గా అందక వారు ఎదగరు.
3. రక్తహీనతతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు. ఎందుకంటే గ్రీన్ టీ వల్ల శరీరం ఆహారంలో ఉండే ఐరన్‌ను ఎక్కువగా గ్రహించదు.
4. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు. లేదంటే ఆ సమస్య ఇంకా ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది.
5. హై బీపీ ఉన్నవారు కూడా గ్రీన్ టీ తాగకూడదు. ఎందుకంటే రక్తసరఫరా ఎక్కువగా అవడం వల్ల బీపీ ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment