ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్త సమాచారం.. ఇలా పొందండి.
కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు ప్రజాసౌకర్యార్థం ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వీటిపై సరైన అవగాహన
ఉంటే ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్త సమాచారం పొందొచ్చు. 24 గంటలూ పలు శాఖలు
ఉచిత సేవలు అందజేస్తున్నాయి. సమాచారం, ఫిర్యాదులు
అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. సంక్షేమ పథకాలు, ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు, ఇతరులను
కాపాడేందుకు, అసాంఘిక శక్తుల గురించి, వ్యవసాయంలో రైతుల సమస్యలు,
విద్యుత్ సరఫరాలో
ఆటంకాలు, ఎలాంటి సామాజిక సమస్య అయినా శాఖల వారీగా నేరుగా
అధికారులకు సమాచారం ఇచ్చేందుకు ఒక్కోశాఖ ఒక్కో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు
చేసింది. ఎటువంటి పైకం చెల్లించకుండానే ప్రజలు తమ సమస్యకు ఈ నెంబర్లు ఉపయోగించుకోవచ్చు.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుకు సమాచారం- 100
ఏదైనా ప్రమాదం సంభవించినా... గమనించినా....ఇతర
సాయం కోసం ఈ నెంబరుకు ఫోన్ చేయవచ్చు. దొంగలు, దుండగులను
గుర్తించి ఒక్క ఫోన్ కాల్‌తో పట్టించొచ్చు. అసాంఘిక శక్తులపై సమాచారం ఇచ్చి
వారికి అడ్డుకట్టవేయొచ్చు
1090 :
శాంతిభద్రతలను
పరిరక్షించాల్సిన పోలీసులు సరిగ్గా పనిచేయడం లేదా, దరఖాస్తులు
ఇచ్చినా తీసుకోవడం లేదా అయితే వారిపై ఫిర్యాదు చేయాలంటే 1090కు ఫోన చేసి సమాచారం అందించొచ్చు.
1091 :
మీకు ఎక్కడైనా
ఈవ్‌టీజింగ్ దృశ్యాలు కనిపించాయా?
వరకట్నం పేరుతో ఇబ్బందులు
పెడుతున్నారా? అత్తమామల హింస, ఆకతాయిల ఆగడాలను
గురించి 1091కు ఫోన చేసి రక్షణ పొందొచ్చు.
1098 :
ఆరు నుంచి 14 ఏళ్ల పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా? ఎక్కడైనా
తప్పిపోయారా? ఇటువంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు 1098కు డయల్ చేయాల్సి ఉంటుంది
ఆర్టీసీ సమాచారం...
18002004599
ఈ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆర్టీసీ
సమాచారం తెలుసుకోవచ్చు. బస్సుల రాకపోకలు, విహారయాత్రల కోసం
బస్‌పాస్‌లు, సిబ్బంది ప్రవర్తనపై కూడా ఫిర్యాదు చేయొచ్చు.
అత్యవసర వైద్య సేవలు... 108
రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, గుండెపోటు వంటి అత్యవసర వైద్యసేవలకు 108కు ఫోన్ చేయొచ్చు
తపాలా బీమాలో
చేరాలంటే.. 1800-180-5232
తపాలా బీమాలో చేరాలన్నా, ఇతర వివరాలు పొందాలన్నా.. ఈ 1800-180-5232 నెంబర్‌కు ఫోన చేస్తే చాలు.
అగ్నిప్రమాదాల నివారణకు -101.
అగ్ని ప్రమాదాలను నివారించేందుకు 101కు సమాచారం ఇవ్వొచ్చు. ఒక్క ఫోన్ కాల్‌తో ప్రాణ, ఆస్తినష్టం నివారించొచ్చు.
మహిళల రక్షణకు -1090.a
సమాజంలో మహిళలు, యువతులు
ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నెంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. గృహహింస, అసభ్యప్రవర్తనలపై కూడా ఫిర్యాదు చేయొచ్చు. బాల్యవివాహాలు, బాలికల నిర్భందం, అక్రమ మానవ రవాణాల అంశాలపై నిర్భయంగా, నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదుదారుల సమాచారాన్ని గోప్యంగా
ఉంచుతారు.
ఎన్టీఆర్ వైద్య
సేవలు... 104
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల కోస 104కు ఫోన్ చేయొచ్చు. సిబ్బంది అందించే సేవల్లో ఆలస్యం జరిగినా, సిబ్బంది అవినీతికి పాల్పడినా ఈ నెంబరుకు ఫిర్యాదు చేయొచ్చు.
టెలికామ్ సేవల కోసం -198
బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్లకు సంబంధించి ఏమైనా
సమస్యలుంటే ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ల్యాండ్‌లైన్ ఫోన్లకు సంబం
ధించిన సమస్యలను 1500 నెంబర్‌కు డయల్ చేయొచ్చు.
ఓటు నమోదు కోసం 1950.
ఈ నెంబరు ద్వారా
ఓటరుజాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల వివరాలను కూడా
తెలుసుకోవచ్చు. ఓటు తొలగింపు, పేరు మార్పిడి, ఓటరు చిరునామా
మార్పులు చేసుకోవచ్చు.
సర్కారీ కార్యాలయాల్లో ఇబ్బందులెదురైతే 155361.
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ
మీకు ఇబ్బందులు ఎదురైతే.. ఈ 155361 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు..
మీ సేవ కోసం 1100
మీసేవ కేంద్రాలు సరిగ్గా పని చేయడం లేదా? అయితే 1100కు ఫోన్ చేయొచ్చు.
విద్యుత్ సమాచారం 18004250028
విద్యుత్‌శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఈ నెంబరు ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం, లోఓల్టేజీ, సిబ్బంది పనితీరు, విద్యుత్ లైన్ల సమస్యలు ఏవైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇళ్లలో షార్ట్ సర్క్యూట్
అయినా.. కరెంటు బిల్లుల్లో హెచ్చుతగ్గులు వచ్చినా.. ఈ నెంబర్‌కు ఫిర్యాదు
చేయొచ్చు. ఇతర విద్యుత్ సమస్యల కోసం 133355 నెంబర్‌కు ఫోన్
చేస్తే సరిపోతుంది.
ఉపాధి’ సమాచారం 18002004455
ఉపాధి హామీ పథకంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా ఈ
నెంబర్‌కు ఫిర్యాదు ఇవ్వొచ్చు. అవినీతి, నిర్లక్ష్యం, అవకతవకలు వంటి అంశాలను నేరుగా ఉన్నతాధికారులకు సమాచారం అందించొచ్చు. జాబ్‌కార్డులు
ఇవ్వకపోయినా, సిబ్బంది విధులను విస్మరించినా అధికారులకు
సమాచారం ఇవ్వొచ్చు. కూలి డబ్బులు ఇవ్వకపోయినా... ఈ 155321 నెంబర్‌కు డయల్‌చేసి
ఫిర్యాదు చేయండి.
రైల్వే సమాచారం 139
రైల్వే సమాచారం ఏదైనా ఈ నెంబరు ద్వారా
క్షణాల్లో తెలుసుకోవచ్చు. రైళ్ల రాకపోకలు, సమయం, పీఎన్‌ఆర్ నెంబర్ తదితర విషయాలను ల్యాండ్ లైన ద్వారా ఫోన్ చేసి
తెలుసుకోవచ్చు. రైళ్ల అసౌకర్యం,
ఇతర సమస్యలు, స్టేషన్‌లో రైలు పరిస్థితి తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా
పొందొచ్చు.
వ్యవసాయ సమాచారం
*18001801551
వ్యవసాయశాఖలోని
సమగ్ర సమాచారాన్ని ఈ నెంబరు ద్వారా ఏ సమయంలోనైనా తెలుసుకోవచ్చు*. పంటలపై
చీడపురుగుల నివారణ చర్యలపై శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు
పొందొచ్చు. ఈ నెంబరుకు ఫోన్ చేసి భాషను ఎంచుకుంటే చాలు దేశంలోని 13 భాషలను ఇందులో పొందుపర్చారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు
చేయొచ్చు. పంట సాగులో సమాచారం కోసం రైతులు ఈ 1800425-3536కు ఫోన్ చేసి
వివరాలు పొందొచ్చు
No comments:
Post a Comment