మీ ఫోన్ సురక్షితమేనా?
ర్యాన్సమ్‌వేర్..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి నోటా ఈ సైబర్ వైరస్ పేరే వినిపిస్తోంది. సుమారు
150 దేశాలను వణికించిన ఇది స్మార్టుఫోన్లను ఏమీ
చేయదా? ఒకవేళ స్మార్టుఫోన్లను లక్ష్యంగా చేసుకుని
ఇలాంటి సైబర్ దాడి జరిగితే ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న ఇది.
ర్యాన్సమ్‌వేర్
దాడులకు స్మార్టుఫోన్లేమీ మినహాయింపు కాదు. అలా అనీ కొత్తా కాదు. కానీ, కంప్యూటర్లతో పోల్చితే కొంత తక్కువే. అదేసమయంలో ఇటీవల కాలంలో ఇవి
పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో
పనిచేసే స్మార్టుఫోన్లపై ర్యాన్సమ్‌వేర్ దాడులు నాలుగు రెట్లు పెరిగాయి.
పెద్దపెద్ద సంస్థలను, ప్రభుత్వ విభాగాల కంప్యూటర్లను కొల్లగొట్టి
డబ్బు వసూలు చేసినట్లుగా వ్యక్తిగత ఫోన్లను హ్యాక్ చేసి వసూలు చేయడం గిట్టుబాటు
కాదన్న ఉద్దేశంతో స్మార్టుఫోన్లపై దాడులు ఇప్పటికీ కొంత తక్కువగానే ఉన్నాయి. అయితే, ఎప్పటికైనా స్మార్టుఫోనూ ఇలాంటి దాడులకు గురయ్యే ప్రమాదం ఉండడంతో
ముందుజాగ్రత్తలు తీసుకోవడమే దీనికి పరిష్కారం.
వ్యక్తిగత
కంప్యూటర్ల స్థానాన్ని స్మార్టుఫోన్లు ఆక్రమిస్తుండడం.. ప్రపంచంలో అత్యధిక
స్మార్టుఫోన్‌లు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండడం.. ఇంటర్నెట్
అందుబాటుతనం పెరగడంతో మొబైల్ వినియోగదారుల్లోనూ వైరస్‌ల భయం పెరుగుతోంది.
అదేసమయంలో అవగాహన కరవవుతోంది.
మొబైళ్లను కొల్లగొట్టిన ర్యాన్సమ్‌వేర్‌లు
ఫ్యుసాబ్
స్మాల్
ప్లెటార్
స్వెపెంగ్(ఇది
ర్యాన్సమ్‌వేర్‌గా కంటే బ్యాంకింగ్ మాల్‌వేర్‌గా భారీ నష్టం కలిగించింది)
100 దేశాల్లో
ఫ్యుసాబ్
గత ఏడాది ఏప్రిల్‌లో ఫ్యుసాబ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా
మొబైల్‌ఫోన్లను నాశనం చేసింది. జర్మనీ, అమెరికా, బ్రిటన్‌లలో వినియోగదారులు భారీగా నష్టపోయారు.
ఈ-మెయిళ్లతో జాగ్రత్త
ర్యాన్సమ్‌వేర్ ఈ-మెయిల్ నుంచి వచ్చే అవకాశం
ఉంటుంది కాబట్టి ఫోన్లో మెయిళ్లు చూసుకునేవారంతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం
లేని మెయిళ్లు, ఆకర్షించేలా గుర్తు తెలియని ఐడీల నుంచి వచ్చేవి
అస్సలు తెరవొద్దు. తెరిచినా అందులోని అటాచ్‌మెంట్లపై క్లిక్ చేయొద్దు.
యాప్‌స్టోర్లలోనూ.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోనూ ఏటా వేలకొద్దీ యాప్‌లను సురక్షితం కావన్న కారణంతో
తొలగిస్తుంటారు. అయినప్పటికీ యాప్ స్టోర్‌లోనూ కొన్ని ప్రమాదకరమైనవి
మిగిలిపోతుంటాయి. ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ల తయారీసంస్థ గత ఆరు నెలల్లో 3.7 కోట్ల యాప్‌లలో మాల్‌వేర్‌లను గుర్తించింది.
ఏం చేయాలి?
స్మార్టుఫోన్లలో
ఉంచే ముఖ్యమైన ప్రతి సమాచారాన్నీ వేరేచోట కూడా భద్రపరుచుకోవాలి.
ఫోన్లో కచ్చితంగా
యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలి. తరచూ
స్కాన్ చేయాలి.
ఓఎస్ అప్‌డేషన్
అందుబాటులో ఉంటే వినియోగించుకోవాలి.
అవసరం లేని యాప్‌లు
డౌన్‌లోడ్ చేయకపోవడం మంచిది.
కావాల్సిన యాప్‌లను
ఆయా ఓఎస్‌లకు చెందిన ప్లేస్టోర్‌ల నుంచి మాత్రమే తీసుకోవాలి.
సామాజిక
మాధ్యమాల్లో వచ్చే అనవసరపు లింకులను క్లిక్ చేయొద్దు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్ భద్రం
సాధారణంగా మొబైల్ వినియోగదారుల వైఖరుల
ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఏ మాధ్యమంలో వైరస్ చొప్పించాలా అన్నది
నిర్ణయించుకుంటారు. ఎక్కువగా వాడే గేమ్స్, యాప్‌ల నుంచి
వీటిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ర్యాన్సమ్ వేర్
సాధారణంగా వ్యక్తులను కాకుండా వ్యవస్థలు, సంస్థలను లక్ష్యం
చేసుకుని చొప్పిస్తారు. అప్పుడే వారికి లాభదాయకం. కానీ, స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వ్యక్తిగత వాడకంలోనే ఉంటాయి కాబట్టి వీటిని
లక్ష్యంగా చేసుకోవడం ఇంకా తక్కువగానే ఉంది. పైగా ఎక్కువమంది ఫోన్లలో కీలక పత్రాలు
వంటివేమీ దాచి ఉంచరు కాబట్టి డబ్బు డిమాండ్ చేసినా ఇచ్చే అవకాశమూ తక్కువే. సైబర్
నేరగాళ్లు కోరినంత ఇవ్వడం కంటే కొత్త ఫోన్ కొనుక్కోవడమో, ఫార్మేట్ చేయడమో నయమనుకుంటారు. అందుకే వీటిని లక్ష్యం చేసుకోవడం కొంత
తక్కువే.
అయినప్పటికీ ఇటీవల కాలంలో స్మార్టుఫోన్లపై
ఇలాంటి దాడులు పెరుగుతున్నాయి. దీనిబారిన పడకుండా ఉండడం అనేది మన చేతుల్లోనే
ఉంటుంది. ఫేస్‌బుక్, వాట్స్‌యాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే
సందేశాల్లోని అనుమానాస్పద, అవసరం లేని లింకులను తెరవకపోతే సగం ముప్పు
తప్పుతుంది.👈
అలాగే యాప్‌లు
డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు కూడా అవి మన ఫోన్‌లోని ఏఏ అంశాలను తమ నియంత్రణలోకి
తీసుకుంటాయో తెలుసుకోవాలి. దాని ఆధారంగానే ఆ యాప్ డౌన్‌లోడ్ చేయాలో వద్దో
నిర్ణయించుకోవాలి.
ఇటీవల కాలంలో ఫోన్‌తోనే ఆర్థిక వ్యవహారాలు
చక్కబెడుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ యాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
ప్లేస్టోర్లలోనూ బ్యాంకుల పేరుతో నకిలీ యాప్‌లు ఉండే ప్రమాదం ఉంది. బ్యాంకు వెబ్‌సైట్లోని
డౌన్లోడ్ లింకు నుంచి అసలైన యాప్ తీసుకోవాలి.
సీహెచ్‌ఏఎస్ మూర్తి,
సమాచార భద్రత
ముఖ్య అధికారి, సీడాక్.
సమాచార భద్రత
విద్య, అవగాహన సమన్వయకర్త
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
Share this to your Friends
No comments:
Post a Comment