Pages

Sunday, October 15, 2017

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..
తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి, ఆర్థికంగా బలవంతులకు, సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…? వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..? ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు…. కాకపోతే కాస్త ముందే సంప్రదించండి… రిజర్వ్ చేసుకొండి… ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు….*

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
1. ఎప్పుడైనా ఛార్జింగ్ 96% కంటే ఎక్కువ అవ్వనివ్వద్దు. 20% కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి.

2. మీ మొబైల్ పౌచ్ ఉంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టండి.

3. మొబైల్ ఛార్జింగ్ పెట్టె టప్పుడు  హీట్ గా ఉంటే 5 లేదా 10 నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టండి.

4. మొబైల్ ఛార్జింగ్ లో వున్నప్పుడు  wi.fi, hot spot, songs, net,calls, games use చేయకండి.

5. మొబైల్ కి వచ్చిన చార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ చార్జర్ ని కొనుక్కొని వాడండి, 100 Rs cheap చార్జర్ అస్సలు వాడకూడదు.

6. మీకు అవసరం లేని applications వెంటనే తీసేయ్యండి, కొన్ని games, applications వళ్ళు మీ మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది వాటిని uninstall చెయ్యండి.

7. మొబైల్ ఛార్జింగ్ ఐయినా వెంటనే వీడియో కాల్ , హెవీ గేమ్స్ అస్సలు ఆడకూడదు, ఛార్జింగ్ ఐనా తర్వాత మొబైల్ హీట్ ఉంటే 5 min. వరకు మొబైల్ ని పట్టుకోకుండా, ఫాంట్ జాబులో పెట్టుకోకుండా ఉంటే మంచిది.

8. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేదా airoplane mode on చేసి ఛార్జింగ్ పెట్టడానికె ఎక్కువ  ప్రయత్నించండి. ఇలా చెయ్యడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది మీరు safe.

9.మొబైల్ హీట్ గా వున్నప్పుడు తడి చేతులతో అస్సలు పట్టుకోకూడదు.

10. మొబైల్ ఛార్జింగ్ లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్ లో మొబైల్ ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఎక్కువ. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అవుతే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి చల్లబడ్డాక on చెయ్యండి.

11. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఐయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరీ తీసుకోని మార్చండి.

12.కొంతమంది ఛార్జింగ్ పెట్టి ear phones lo సాంగ్స్ వింటూంటారు అలా చేయ్యడం  చాలా risk,  ఇప్పుడికె ముగ్గురు చనిపోయారు.

ఒకటే గుర్తుపెట్టుకొండి redmi ఒక్కటే కాదు phone 6 , samsung edge, oppo, vivo, lenovo, cool pad mobiles కూడా కొన్ని పేలాయి ఇండియాలో redmi మొబైల్స్ sales ఎక్కువ కాబట్టి ఎక్కువ అవే పేలుతున్నాయి అనిపించడం సహజం

మనం మొబైల్  వాడే దాని బట్టే మన ప్రాణాలు ఆధార పడి ఉన్నాయి. Mobile company బట్టి కాదు,  మొబైల్ లో చెత్త applications , heavy గేమ్స్ ని వాడకూడదు.

FRIENDS SHARE THIS MESSAGE TO ALL..


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

1. ఆకలి నిన్ను చంపుతున్నపుడు
2. నిద్ర మత్తులో ఉన్నపుడు
3. మద్యం సేవించినపుడు

ఈ మూడు సమయాల్లో ఎవరికీ వాగ్దానం చేయకూడదు.
1.బాగా సంతోషంగా ఉన్నపుడు
2.బాగా దుఃఖంలో ఉన్నపుడు
3.బాగా కోపంలో ఉన్నపుడు

అలాగే ఈ ముగ్గురుని ఎప్పటికీ మరవకూడదు.
1.ఆపదలో మనల్ని ఆదుకున్న వారిని
2మనలో లోపాల్ని బూతద్దంలో చూడని వారిని
3.మన మంచిని సదా కోరే వారిని

ఈ ముగ్గురుని దరికి రానివ్వకండి..!!
1.మనకు విలువ నివ్వని వారిని
2.మనల్ని చూసి ఈర్ష పడేవారిని
3.మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారికి.
- మంచిమాట



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

నైవేద్యము అంటే..?

నైవేద్యము అంటే..?

ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య:

నైవేద్యము అంటే ఏమిటి?

నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము.

అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు.

మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది. అలా చేయ కూడదు . భగవంతునికి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను.

మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను.

భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ .....
అని నివేదన చేయ వలెను.

మరి ఈ నివేదన ఎలా చేయాలి?

వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభికరించ వలెను. ఆవు నేతితో అది అమృతము అవుతుంది. గో సంబంధమైన పదార్దములు అమృతములు. అమృతమైన పదార్దములనే భగవంతునికి నివేదన చేయ వలెను. ఇతర పదార్ధములను పెట్టకూడదు.

యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి , మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను. దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు సమర్పించ వలెను స్వాహా కారముతో.
ముద్రలు తెలియని వారు గాయత్రీ మంత్రముతో సంప్రోక్షణ గావించి నివేదన చేయ వచ్చు.

నివేదన అయిన తరువాత ఆ పాత్రలు తీసి, ఆ తీసిన చోట మరలా నీళ్ళు చల్ల వలెను. ఆ పైన తాంబూలాది సర్వోపచారములు చేసి భగవంతునికి నీరాజనము, మంత్ర పుష్పము చేయ వలెను.

తరువాత అపరాధాస్తవము చదువ వలెను.

ఓం...నమో... వేంకటేశాయ


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
.