Pages

Friday, July 27, 2018

హరితహారము కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

హరితహారము కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

  1. అడవులు మానవ మనుగడకు జీవనాధారం
  2. చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు
  3. పచ్చదనం-మన ప్రగతికి సంకేతం
  4. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
  5. భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం
  6. వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
  7. వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు
  8. ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం
  9. మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం
  10. మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
  11. చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి
  12. వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
  13. చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి
  14. వనాలు పెంచు-వానలు వచ్చు
  15. చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
  16. పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
  17. వనాలు-మానవాళి వరాలు
  18. పచ్చని వనములు-ఆర్థిక వనరులు
  19. అడవులు-మనకు అండదండలు
  20. అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
  21. అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
  22. అటవీ సంపద-అందరి సంపద
  23. చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
  24. అడవులు-వణ్యప్రాముల గృహములు
  25. పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
  26. సతతం-హరితం
  27. మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
  28. చెట్టుకింద చేరు-సేదను తీరు
  29. అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
  30. అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు
  31. దోసిలిలోకి తీసుకోమొక్కా!-ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
  32. స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది
  33. పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది
  34. ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం
  35. ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
  36. పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు
  37. వృక్షాలు- మన శరీరం బయటఉండే ఊపిరితిత్తులు
  38. ఇంటింటా చెట్లు - ఊరంతా పచ్చదనం
  39. వృక్ష సంపదను పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి
  40. బిడ్డకు తల్లి రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ
  41. మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి
  42. జీవులను బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి
  43. జల సంరక్షణ-వన సంరక్షణ
  44. పర్యావరణ రక్ష-విపత్తులకు శిక్ష
  45. సృష్టికి మూలం జీవం-జీవానికి మూలం వనం
  46. ఇంటింటికీ చెట్లు-సంక్షేమానికి మెట్లు
  47. వరాల వర్షం కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాం
  48. మొక్కలు నాటడం గొప్ప కార్యం-సంరక్షించడం మహత్కార్యం

Haritha Haram telugu slogans



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

ఆషాఢమాసం యొక్క విశిష్టత తెలుసుకుందాం.

ఆషాఢమాసం యొక్క విశిష్టత తెలుసుకుందాం.



ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

ఆషాఢమాసంలో
చేసి తీరాల్సిన పనులు!

వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి...

పేలాల పిండి

ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.

మునగాకు

మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది. పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకుని తినేందుకే ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వాలేదనుకున్నా... వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది.

దానాలు

ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా!

సముద్రస్నానాలు

ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.

గోరింటాకు

ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవక తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకి ఉంది. పైగా గోరిటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.

ఆషాఢ మాస విశేషాలు ప్రాముఖ్యత

ఆషాఢమాసం:-
14-07-2018 చంద్రోదయం, జగన్నాథ రథయాత్ర.
17-07-2018 స్కందపంచమి, దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటకమాసారంభం.
23-07-2018 సర్వేషాం తొలి ఏకాదశి,చతుర్మాస్య గోపద్మ వ్రతారంభాలు.
27-07-2018 వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ.
29-07-2018 సింకింద్రాబాద్ మహంకాళి జాతర.
31-07-2018 సంకష్ట హరచతుర్థి.

Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
.