Pages

Saturday, February 25, 2017

ATM పిన్ మర్చిపోయారా..? నిమిషంలో తెలుసుకోండి !

ATM పిన్ మర్చిపోయారా..? నిమిషంలో తెలుసుకోండి !

ATM పిన్ మర్చిపోయారా..? నిమిషంలో తెలుసుకోండి !
సాధారణంగా ATM పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డు కి అప్లై చేయడం లాంటివి చేస్తారు. కాని ఇప్పుడున్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు. బ్యాంకుకు వెళ్ళే అవసరమా అంతకన్నా లేదు. కేవలం నిమిషంలో మీ పిన్ తెలుసుకోవచ్చు.

పిన్ తెలుసుకోడానికి మీకు కావలసినవి:
1. ATM కార్డ్

2. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్

3. మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్.

దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్లి మీ కార్డు ని పెట్టండి. ఆ తర్వాత...

1. Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి

2. Pin Generate లేదా ATM Pin reset అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి


3. మీ Account Number ని ఎంటర్ చేయండి

4. మీ Phone number ఎంటర్ చేయండి

5. మీ ఫోన్ కి OTP (One Time Password) వస్తుంది

6. OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ని మార్చితే సరిపోతుంది. పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ ఆక్టివేట్ అవుఉతుంది.

ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసి అవగాహన కలిపించండి.  
Please Leave your Comment below
Share this to your Friends

దేశీయ ఆవు నెయ్యి - ఉపయోగాలు

 దేశీయ ఆవు నెయ్యి - ఉపయోగాలు 

1. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది . మతిభ్రమణం తగ్గుతుంది
.
2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది .
.
3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది
.
4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది
.
5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది
.
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది
.
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు
.
7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది
.
.
8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊదడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది
.
9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
.
10. 20 - 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతి బెల్లం కలిపి తినిపిస్తే భంగు , గంజాయి , మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది
.
11. అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి
.
12. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి
.
13. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ , మల బద్ధకం రావు . ఉంటె పోతాయి
.
14. ఆవు నెయ్యి బల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది
.
15. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .
.
16. మీరు బలహీనంగా , సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు
.
17. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు , వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది
.
18. హృద్రోగులకు ఆవునెయ్యి వరం .
.
18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది
.
19. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు
.
20. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది .
.
22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి .
.
ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుదామా , వాటిని నరికి తిని, ఆ జాతిని లేకుండా చేసుకుందామా?
.
Please Leave your Comment below
Share this to your Friends

Thursday, February 23, 2017

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? 



సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. 

అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. 

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు;-

  • ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. 
  • శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. 
  • చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. 
  • ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. 
  • ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. 
  • ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. 
  • ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. 
  • ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. 
  • మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం. 
  • జీవారాధాన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. 
  • శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. 
  • అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, 
  • మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. 
  • మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. 
  • మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. 
  • వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. 
  • అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, 
  • అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. 
  • మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, 
  • శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. 
  • ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి. 
  • ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. 
  • విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? 
  • అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. 
  • ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. 
  • అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. 
  • శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. 
  • జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. 
  • సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. 
  • అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 
  • మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. 
  • శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. 
  • అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, 
  • తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు...
 తెలుగు లోమీరు కని వినీ ఎరుగని మంచి విషయాల కొరకు;క్లిక్- https://telugufb.blogspot.com/
 .
పిల్లలకు/పెద్దలకు అందిరికి పనికి వచ్చే విసయాల కొరకు;- https://telugufb.blogspot.com/
 .
హిందూమతానికి సంబందించిన విసయలకోరకు;-https://telugufb.blogspot.com/
.
తెలుగు లో విజ్ఞానానికి ;- https://telugufb.blogspot.com/

Wednesday, February 15, 2017

భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు? బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?

ప్రశ్న: బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?


🔷 జవాబు: బొగ్గులో కార్బన్‌ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్‌ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలే కాకుండా కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.

బొగ్గును కాల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్‌ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.

                


ప్రశ్న: భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు?


జవాబు: చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే కాలం, అలా తిరుగుతూనే దాని అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే పరిభ్రమణ కాలం సమానంగా ఉండడం వల్ల ఎల్లప్పుడూ చంద్రుని ఒక వైపు ఉపరితలమే మనకు కనిపిస్తుంది. చంద్రుని కక్ష్యకు ఉండే ఈ ధర్మాన్ని ఏక కాలిక భ్రమణం (Synchronous Rotation) అంటారు. చంద్రుడు ఇలా తిరగడానికి కారణం చంద్రునిపై భూమి ప్రయోగించే ఆటుపోట్ల ప్రభావం. చంద్రునిపై ఎలాంటి సముద్రాలు లేకపోవడంతో అక్కడ ఆటుపోట్లకు గురై పొంగిపొరలే నీరు లేనందున, భూమి గురుత్వాకర్షణ బలం చంద్రుని తలంపైనే పనిచేస్తుంది. ఆ ప్రభావం చంద్రుని తలాన్ని పైకి కిందకీ ఊగేటట్లు చేస్తుంది. అందువల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే పరిభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతూ, అది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే ప్రదక్షిణ కాలానికి సమానమైంది. అందువల్లే మనం ఎల్లప్పుడూ చంద్రుని ఒకవైపు ఉండే గోతులను (Craters) ఎత్తు పల్లాలను చూస్తున్నాం. అదే కాకుండా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో చంద్రుడు ఉపరితలంలో సగం కన్నా ఎక్కువగా, 59 శాతం మేర చూడగలుగుతున్నాం. మానవుడు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు చంద్రుని అవతలి వైపునకు వెళ్లి అక్కడి ఛాయాచిత్రాలను భూమికి పంపే వరకు అది ఎలా ఉంటుందనే సంగతి మనకు తెలియలేదు.

బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మా  ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?


బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.
  
బ్రాహ్మా  ముహూర్తం
సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా  ముహూర్తం అంటారు.
  
ఆఖరి నిమిషాలు
రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా  ముహూర్తం అంటారు.
  
పూజలు
బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.
  
విద్యార్థులకు
విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.
  
జీవక్రియలు
మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.
  
ఒత్తిడి
అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.
  
పెద్దవాళ్లు ఎందుకు లేవాలి ?
ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.

ఫ్రెష్ ఆక్సిజన్
రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.

గృహిణులు ఎందుకు లేవాలి.?
గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

ఆందోళన
బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని..ఆందోళన లేకుండా అయిపోతాయి....

సూర్యోదయము
ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....

ఆరోగ్యము
బ్రహ్మా ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.

Saturday, February 4, 2017

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.
   
దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

33) గోపుర దర్శనం తప్పక చేయాలి.

34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.    
 దేవుడి ఎదుట చెంపలు ఎందుకు వేసుకుంటారంటే?🌷
సహజంగా దైవ దర్శనానికి వెళ్లినపుడు చెంపలు వేసుకుంటారు? ఇదేం ఆచారం? అని చాలామందికి అనుమానం వస్తుంది. చెంపల్ని సంస్కృతంలో ‘హనువు’ లని పిలుస్తారు. మనం మాట్లాడటానికి ఎంతో ఎక్కువగా సహకరించేవి దవడలే. ఇవి సక్రమంగానూ, ధర్మబద్ధంగానూ ఉండటం బట్టి ఆంజనేయుడిని ‘హనుమాన్’ అని పిలిచారు.
మనం ఈ హనువులతో ఏదైనా తప్పు చేసి ఉంటే (చాడీలు, అబద్ధాలు, అపనిందలు) వాటిని క్షమించవలసిందని .. ఇక ఎప్పుడు అలా చేయకుండా చేయమని భగవంతుడినికి అడగటమే చెంపలు వేసుకోవడంలోని పరమార్ధం

.