Pages

Friday, September 29, 2017

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

  • అనసూయ - అసూయ లేనిది
  • అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
  • అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
  • ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
  • ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
  • ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
  • కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
  • కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
  • కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
  • కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
  • గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
  • గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
  • ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
  • జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
  • తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
  • దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
  • ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
  • త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
  • శంకువులు(పాపాలు) చేసినవాడు.
  • దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
  • దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
  • దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
  • దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
  • ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
  • ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
  • ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
  • నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
  • ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
  • ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
  • ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
  • బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.
  • బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)
  • భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
  • భీముడు - భయమును కలిగించువాడు
  • భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
  • (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
  • మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
  • మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.
  • మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
  • 2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
  • యముడు - యమము (లయ)నుపొందించువాడు.
  • యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
  • రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
  • యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
  • రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు
  • రుక్మిణి - రుక్మము(బంగారము) కలది
  • వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు.
  • వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
  • విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
  • విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
  • శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
  • ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
  • శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
  • శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
  • సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
  • సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)
  • సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది.

Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

బతుకమ్మ నానీలు

బతుకమ్మ నానీలు


స్వరాష్ట్ర సాధనలో
కీలకభూమిక
బతుకమ్మ
వేడుక

ఆత్మగౌరవ నినాదం
బతుకమ్మ
స్వాభిమానానికి
ప్రతీక

అస్తిత్వపు గొంతుక
బతుకమ్మ
తెలంగాణ
ఉద్యమం స్ఫూర్తి

బతుకమ్మ
తెలంగాణ తల్లి
రాష్ట్ర సిగలో
పూసిన మరుమల్లి

పూలను పూజించటం
తెలంగాణ సంస్కృతి
బతుకమ్మ
పూబంతుల గుమ్మ

నేల సింగిడి
బతుకమ్మ
ఊరుఊరంతా
సంబురాల వైభవం

బతుకమ్మ
పువ్వుల తల్లి
ఆడపడుచుల
పులకరింత

వసంతంలా
బతుకమ్మ పండుగ
జీవితం
విరిసే హరివిల్లు

బతుకునివ్వడమే
బతుకమ్మ సందేశం
కలిసి బతకడం
అంతరార్థం

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో
బతుకమ్మ
తెలంగాణ
విశ్వవ్యాప్తం

-----భీంపల్లి శ్రీకాంత్

బాపూజీ నానీలు*

కొండా లక్ష్మణ్ బాపూజీ
మహోన్నత వ్యక్తి
బడుగువర్గాల
ఆశాజ్యోతి

తెలంగాణ కోసం
రాజీనామా అస్త్రం
అసలైన తెలంగాణవాది
బాపూజీ

ఆయన జీవితం
అందరికీ ఆదర్శం
తెలంగాణకు
స్ఫూర్తిదాయకం

తెలంగాణ కోసం
జీవితం త్యాగం
మరవదు
తెలంగాణ లోకం

బాపూజీ లక్ష్యం
తెలంగాణ సాధన
జీవితాంతం
అదే తపన

బాపూజీ జీవితం
నిత్యపోరాటం
ఆయన ఆరాటం
తెలంగాణ రాష్ట్రం

బడుగుల బాంధవుడు
బాపూజీ
నిస్వార్ధం
ఆయన జీవితం

నిబద్ధతకు
నిదర్శనం బాపూజీ
నీతి నిజాయితే
ఆభరణం

రాజకీయాల్లో
ప్రత్యేక ముద్ర
బాపూజీ జీవితం
విలక్షణం

మంత్రి పదవికి
రాజీనామా
తెలంగాణ కోసం
ఉద్యమ దీక్ష-------భీంపల్లి శ్రీకాంత్





బతుకమ్మ

ఉద్యమానికి ఊపిచ్చావు                               మాకు బతుకిచ్చావు
సకలజనులను నడిపించావు
స్వరాష్ట్రన్నీఅoదిచ్చావు
మనందరి తల్లి బతుకమ్మ
అమే తెలంగాణ అమ్మ !!!!
 
సబ్బండ వర్గాలకు
పోరాటం నెర్పిన అమ్మ
వలస వాదులను,ఉద్యమ ద్రోహులను
పొలిమేర దాకా తరిమిన అమ్మ
స్వరాష్ట్ర సాధనలో నీ పాత్ర
అనన్య, అసమనమైంది!!!!!!
 
బతుకమ్మ
మన చైతన్య కెరటం
బతుకమ్మ
మన సాంస్కృతిక పతకం
బతుకమ్మ
తీరొక్క పూల తీరైన రూపం
బతుకమ్మ
ఏడాది బతుకు పాట!!!!!
 
పూలను పూజించే సాంస్కృతి తెలంగాణదే
ఊరు వాడను ఏకం చేసే శక్తి నీదే
బతుకమ్మమంటే
ఉయ్యాల పాటలు,చప్పట్లమోతలు
ఇంద్రధనస్సును తలపించే పుష్పాలు
ఆడబిడ్డల సంబురాలు, కోలాటాలు
 చిన్నారుల కేరింతలు!!!!!!!
              
నాటి బతుకమ్మకు
అడుగడుగునా అవరోధాలు
నేటి బతుకమ్మ
విశ్వవ్యాప్తమైన రాష్ట్ర ప్రభుత్వ అధికారపండుగ!!!!!
 
         డాక్టర్ గుంటి గోపి


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Thursday, September 21, 2017

పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!


పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!

 ఈపుస్తకాలతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు* ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు..* 70కి పైగా భాషలు.. అన్నీ ఆన్‌లైన్‌లో..* ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు.* కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు..* *యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు..* ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్‌ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆన్‌లైన్‌లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సహకారంతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించింది.* ఒక్క క్లిక్‌.. సమస్తం కళ్లముందు!* డిజిటల్‌ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు.* ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ డిజిటల్‌ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.* రిజిస్ట్రేషన్‌ సులభం* డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్‌ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు.* *డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో..🔰* *⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌* *⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు* *⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు* *⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు* *⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు* *⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు* *⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్‌ కోర్సులు* *⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు* *⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు* *💻అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు* *5,36,487 కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్, ప్రోగ్రామింగ్‌* *1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్‌* *1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్‌ అండ్‌ రిలీజియన్‌ఆర్ట్స్‌* *1,45,290లిటరేచర్‌* *4,40,607 హిస్టరీ జియోగ్రఫీ3,65,5358,70,802 సోషల్‌ సైన్సెస్‌:* సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్‌ 56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు 2,65,577 నేచురల్‌ సైన్సెస్‌:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు భాషలు *తెలుగు,*హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు ఫార్మాట్లు పీడీఎఫ్, హెచ్‌టీఎల్‌/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్‌ 70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు

ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే 'హైపర్‌టెన్షన్‌' కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది. అందుకే, లక్షణాలు బయపడేదాకా ఎదురు చూడకుండా, తరచుగా బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

కుళాయిలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులైనా రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక్క రక్తనాళంకీ సక్రమంగా చేరుతుంది.

ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే 'హైపర్‌టెన్షన్‌' అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! ఇక 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది.

రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు. హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు.

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.*...

అధిక బరువు:*అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని సరఫరా చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషర్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.

ఒత్తిడి:* మానసికం, శారీరకం...ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.

అస్తవ్యస్త జీవనశైలి:* సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!

అధిక ఉప్పు:*ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే 'సోడియం' వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.

దురలవాట్లు:* హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఓ ఫ్యాషన్‌ కావటంతో వారాంతాల్లో మద్యం సేవించటం పరిపాటిగా మారింది. వీకెండ్స్‌లో మద్యం సేవించి సోమవారంనాడు హై బీపీతో వైద్యుల్ని కలిసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఆధునిక జీవనశైలి:* గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్లలో రక్తపోటు సమంగా ఉండటం, పట్ణణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యపరమైన పరిశీలనల్లో కనిపించింది. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో పట్టణ వాతావరణం ఉండటమే!

మధుమేహం:* మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు!

రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు ్ల ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

అవేంటంటే...

గుండె దడ,తలనొప్పి,          చమటలు పట్టడం,కళ్లు తిరగటం,ఆయాసం

చికిత్స తేలికే!*

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా, రక్తపోటు అదుపులో ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల పవర్‌ పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే..*.

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. అలాకాకుండా 'లక్షణాలు కనిపించలేదు కదా!' అని రక్తపోటు ఉండీ బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే...అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి, గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. ఇదేకాకుండా మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోవచ్చు లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలటిక్‌ స్ట్రోక్‌ రావొచ్చు.

*హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే.*..

రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించవలసిన నియమాలు...మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి.ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి చేసిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌ల లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి.వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి. రోజూ చేయడానికి సమయం లేకపోయినా వారంలో నాలుగు రోజుల పాటు వీటిని తప్పనిసరిగా చేయాలి.

 *ఉప్పు...పెద్ద తప్పు!*

మనం తినే ప్రతి కూరగాయలో, పళ్లల్లో, ఆకు కూరల్లో సహజసిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తుంటాం. నిజానికి ఉప్పు ఎక్కువ వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు రాదు. ఉప్పు వాడే సంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీన్నిబట్టి ఉప్పు నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది. కాబట్టి ఆహారంలో ఉప్పు వాడకం సాధ్యమైనంత తగ్గించాలి. కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని కలిపేసుకుంటుంటారు. అలాగే పెరుగన్నం కూడా ఉప్పు లేనిదే తినరు. ఈ అలవాట్లు మానుకోవాలి. ఇంట్లో బిపి పేషెంట్లు ఉన్నప్పుడు వంటల్లో ఉప్పు సాధ్యమైనంత తక్కువ వాడాలి.

 *యోగా, ధ్యానంతో చెక్‌!*

యోగా వల్ల ఒరిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో రక్తపోటు అదుపులో ఉండటం ఒకటి. యోగా వల్ల సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 140 ఒక పది మిల్లీమీటర్లు, డయాస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 90 ఒక ఐదు మిల్లీమీటర్ల దాకా తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే వ్యాయామంగా యోగా అంతర్జాతీయంగా ఆమోదం పొందింది. యోగాతోపాటు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

 *బీపీ తగ్గించే...'డ్యాష్‌' డైట్‌*

'డైటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌టెన్షన్‌' అనే 'డ్యాష్‌ డైట్‌'ను అమెరికాకు చెందిన డాక్టర్‌ మార్లా హెల్లర్‌ కనిపెట్టింది. రకరకాల ఆహారపదార్థాల ద్వారా శరీరానికి తగినన్ని పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగు పరచటంతోపాటు రక్తపోటును తగ్గించటంలో ఈ 'డ్యాష్‌ డైట్‌' దిట్ట. రక్తపోటు రాకుండా ఉండాలన్నా, నియంత్రణలో ఉండాలన్నా ఈ డైట్‌ను అనుసరించటం మేలని వైద్యులు అంటున్నారు. ఈ డైట్‌ను అనుసరిస్తే రెండు వారాల్లోనే సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ 8 నుంచి 14 పాయింట్లు తగ్గినట్టు ప్రయోగాత్మకంగా రుజువైంది. సోడియంను తగ్గించటంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియమ్‌లను పెంచటం డ్యాష్‌ డైట్‌ ప్రత్యేకత. ఈ డైట్‌లో భాగంగా తృణధాన్యాలు, పళ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చేపలు, చికెన్‌, చిక్కుళ్లతోపాటు వారంలో ఒకటి రెండు రోజులు నట్స్‌, సీడ్స్‌ తినాలి. తక్కువ పరిమాణాల్లో మాంసం, స్వీట్లు, కొవ్వులు కూడా తీసుకోవచ్చు.

 *డ్యాష్‌ డైట్‌లో రోజుకి.*..

తృణధాన్యాల్లో భాగంగా రోజుకి ఒక హోల్‌ వీట్‌ బ్రెడ్‌ స్లయిస్‌ లేదా అర కప్పు బ్రౌన్‌ రైస్‌ లేదా పాస్తా తినొచ్చు.టొమాటో, క్యారెట్‌, బ్రొకోలీ, చిలకడ దుంపలు, ఆకుకూరల్లో పీచు పదార్థాలు బాగా ఉంటాయి. విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తినటం మేలు.పుల్లగా ఉండే నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు తినాలి.పాలు, పెరుగు, జున్నులలో కాల్షియం, విటమిన్‌-డిలు ఎక్కువ ఉంటాయి.. వీటిని తినటం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.బాదం, కిడ్నీబీన్స్‌, బఠాణీ, పప్పుల్లోనూ మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయి.

డాక్టర్.కె.శరత్ చంద్ర,

కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్,

ఇండో యుఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

తెలంగాణ బతుకమ్మ

తెలంగాణ బతుకమ్మ


తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ  మొదలు కానుంది. ఒక మనిషికి, పకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదియ్యని సంబంధం ఉంటుంది.

ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక పకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం.

ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది:

ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు కారాదనీ, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ.

తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు:

1. ఎంగిలిపూల బతుకమ్మ
2. అటుకుల బతుకమ్మ
3. ముద్దపప్పు బతుకమ్మ
4. నాన బియ్యం బతుకమ్మ
5. అట్ల బతుకమ్మ
6.అలిగిన బతుకమ్మ
7. వేపకాయల బతుకమ్మ
8. వెన్నముద్దల బతుకమ్మ
9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)

ఎంగిలి పువ్వుల బతుకమ్మ :*

బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.

అటుకుల బతుకమ్మ*

రెండవ రోజునాడు ఉదయానే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి,  ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో వేస్తారు.
రెండవ రోజు అటుకులు వాయనంగా పెడుతారు.

ముద్దపప్పు బతుకమ్మ :

మూడవ రోజు బతుకమ్మను మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలసి ఆడవారు ఆడుకొని చెరువులో వేసి వస్తారు.
మూడవ రోజు వాయనంగా సత్తుపిండి,పేసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడుతారు.

నానబియ్యం బతుకమ్మ:

నాలుగవ రోజు నానబియ్యం ఫలహారంగా పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు.వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.

అట్ల బతుకమ్మ :

ఈ ఐదవ రోజు తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు.
ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.

అలిగిన బతుకమ్మ:

ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు.

వేపకాయల బతుకమ్మ :

ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.

వెన్న ముద్దలా బతుకమ్మ:
ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆట,పాటల మధ్య చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.

సద్దుల బతుకమ్మ:

ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని  బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు.

చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.

సర్వేజనా సుఖినోభావంతు

ధర్మో రక్షితి రక్షతి

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

అక్షర్తోత్పత్తి

అక్షర్తోత్పత్తి


ఇదం అంధతమః కృత్స్నం/ జాయతే భువనత్రయం
యది శబ్దాన్వయం జ్యోతి: ఆసంసారం న దీప్యతే
మూడు లోకాలలో శబ్దమనే జ్యోతి వెలిగి ఉండక పోతే, ఈ సమస్త జగత్తు అంధకారంలో మునిగి ఉండేది అని శ్లోక భావం.
నిజమేకదా! పశువులనుండి మనుషులనువేరు చెసేది, మది గదిలో నిదురించిన భావాలను వెలికితీసి, నలుగురితో పంచుకోనేలా చెసేది, సంఘజీవిగా మనిషి మనుగడ సాగించడానికి ఉపయోగ పడేది, గతాన్ని మనకు తెలిపి, వర్తమానంలో మన నడవడికి ఒరవడులు దిద్ది, భవిష్యత్తులోకినడిపించేది ఈ భాషేకదా! అట్టి *భాషకి మూలం అక్షరాలు.

#న క్షరః అక్షరః#* అనగా *క్షరము కానిది (నాశనములేనిది) అక్షరము.
#అక్షరాణామ్ అకారోస్మి#* అక్షరాలలో *అ*కారాన్ని నేను. అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి, అక్షరాల గొప్పతనాన్ని మనకి విశదీకరించెను.

 అందుకే అక్షరాలతో ఏర్పడే శబ్దాన్ని *శబ్ద బ్రహ్మ*గా *ఉపనిషత్తులు* ఎలా వివరించాయో చూడండి.
అనాది నిధనం బ్రహ్మ/ శబ్దతత్త్వం యదక్షరం‌ వివర్తతేర్థ భావేన ప్రక్రియా జగతో యతః

పూర్వకాలంనుండి శబ్ద బ్రహ్మ అక్షరరూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉందని, దానిని మనం సభక్తి పూర్వకంగా సేవించాలని పైశ్లోకం వివరిస్తుంది. అట్టి అక్షరాల ఉత్పత్తిని ఋషులు దర్శించి* మనకి అందించిన విధానాన్ని, ఈ వ్యాసం ద్వారా పెద్దలు తెలుసుకొని, పిల్లలకి భారతీయ ఋషుల గొప్పతనాన్ని, వారి ప్రతిభాపాటవాలని వివరించాలని కోరిక.

నేటి శాస్త్రజ్ఞులు లింగ్విస్టిక్ సైన్సు ద్వారా అక్షరాల అమరికలని, భాష ప్రదుర్భావాన్నిఆధునిక పద్ధతిలో వివరించటానికి పూర్వమే, *అరటిపండు వలచి చేతిలో పెట్టి* నట్లు అక్షరాల ఉత్పత్తిని, వాటిని పలికే విధానాన్ని, మన ఋషులు తేటతెల్లం చేసారు. అద్భుతమైన ఈ అక్షరోత్పత్తిని తెలుసుకొందాం.

పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలుమ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి, పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించెను. ఈ సూత్రాలే "మాహేశ్వర ప్రత్యాహారసూత్రాలు"గా పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.* పైన చెప్పిన విషయానికి ఈ క్రిందిశ్లోకం ప్రమాణం

నృత్యా వసానే నాటరాజ రాజో ననాద ఢక్కాం నవ పంచవారం* ( *నవ=*తొమ్మిది. *పంచ=*ఐదు కలిపితే =14)
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివ సూత్రజాలం

అక్షరాలని గ్రహించి సూత్రీకరించింది *పాణిని మహర్షి* ఐతే, వాటికి వార్తికం (సూత్రాదులను వివరించడం కోసం రచించిన వ్యాఖ్యాన గ్రంథం.) వ్రాసినది మాత్రం *వరరుచి*. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది *పతంజలి మహర్షి* అందుకనే
వాక్యాకారంవరరుచిం భాష్యాకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం

అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం వ్యాకరణాన్ని,తద్వారా భాషని అభ్యసించేవారు. ఇక అక్షరరూపంలోఉన్న పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం. ( ఇవి *ఢమరుక నాదాలని* మరచిపోవద్దు.)
1.‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు).
2.‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు).
3.‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు).
4.‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము).
5.‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు)
6.‘ల ణ్’ (లకారం)
7.‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )
8.‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)
9.‘ఘ,ఢ,ధ ష్’
(ఘకారం, ఢ కారం, ధకారం)
10.‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )
11.‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)
12.‘క ప య్’ (క & ప)
13.‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )
14.‘హల్’ ( హకారం)

“ఇతి మాహేశ్వరాణి చతుర్దశ ప్యత్యహార సూత్రాణి”

ఈ పదునాలుగూ  మహేశ్వరుని ద్వారా ప్రేరేపంపబడ్డ  సూత్రాలు. 
ప్రతి సూత్రం చివర ఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించ బడినవి.#* అట్లే *#అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలోనిర్దేశించబడినవి.#* అవి తొలి సూత్రము లోని మొదటి అక్షరం *అ* నాల్గవ సూత్రము లోని చివరి హల్లు *చ్* కలిపితే *అచ్* సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని *అచ్చులు* అనివ్యవహరించెదరనియు, ఐదవ సూత్రము లోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని విపులముగా వివరించెను. ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో *పాణినిచె రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు.* ఈ సూత్రాలకే *వరరుచి* వార్తికాలని, *పతంజలి*భాష్యాన్ని విరచించి లోకానికి ప్రసాదించిరి. *#భాషాశాస్త్ర వేత్తలకి ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.

ఇక అక్షరాలని ఎలాపలుకుతామో ఇప్పుడు తెలుసుకొందాం. ముందుగా సంస్కృత సూత్రాలని తెలిపి, వాటిని తెలుగులో వివరిస్తాను.
అకుహ విసర్జ నీయానాం కంఠ:#*
అ ఆ లు, కవర్గ, హకారమూ, విసర్గలు, అనే అక్షరాలు కంఠము నుండి వెలువడి పలుకబడతాయి.
ఇ చు యశానాం తాలు.#* ఇ ఈ లు, చవర్గ, యకారము, శకారము తాలువు అనగా నాలుకతో పలుకబడతాయి.
ఋ టు ర షాణామ్ మూర్ధా* ఋకారము, టవర్గ, రకారము, షకారము అనే అక్షరాలూ పలికేటప్పుడు శబ్దం శిరస్సునుండి వెలువడుతుంది. మూర్ధా అంటే శిరస్సు.
లు తు ల సనామ్ దంతాః* అచ్చులలోని అలూ అనే అక్షరం, తవర్గ, లకారము, సకారము దంతముల సహాయముతో పలుకుబడతాయి.
ఉ పూప పద్మానీయానాం ఓష్టౌ* ఉ,ఊలు, పవర్గ పెదవులతో పలుకబడతాయి.
ఙ మ ఞ ణ నానాం నాసికాచ* వర్గల యొక్క చివరి అక్షరములు ఐదు నాసిక అంటే ముక్కు. అవి ముక్కుతో పలుకబడతాయి.
ఏ దైతో: కంఠ తాలు* ఏకారము, ఐకారము కంఠము, నాలుక సాహాయముతో పుడతాయి.
ఓ దౌ తో: కంఠ, ఓష్ట్యం* ఓ మరియు,ఔ అనేఅచ్చులు కంఠము, పెదవుల కలయికతో పుడతాయి.
వ కారస్య దంతోష్ట్యం* వకారము దంతములు, పెదవుల సాహాయముతో ఉచ్ఛరించ బడుతుంది.

అక్షరాల పుట్టుకని, వాటిని పలకడానికి ఉపయోగపడే స్థానాలని ‘పాణిని మహర్షి’
ఎంత విపులంగా వివరించాడో! ఇంకా వీటికి *స్వరాలని,వ్యంజనాలని, ప్రాణులని, మహాప్రాణులని* ఇలా అక్షరాలకి రకరకాల పేర్లు పెట్టి అవి ఉచ్చారణలో ఎలా ఉపయోగ పడతాయోతెలియ జెప్పిన ఋషుల గొప్పతనాన్ని తెలుసుకొని వారిని నిత్యం స్మరించుకోవడం మరియు వారి అడుగుజాడల్లో నడుచుకోవడం మన విధి.

దేశ భాషలందు తెలుగు లెస్స

తెలుగు చదువుదాము
తెలుగు మాట్లాడుదాం
తెలుగు వ్రాద్దాం
సర్వేజనాఃసుఖినోభవంతు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది !

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది !


అవును ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది.
అల్లో పతి మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.. ఇలా 7 రోజులు చేస్తే అద్భుత మైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..
ఇలా చేయాలి:
రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి.
ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.
50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.
పచ్చి ఉల్లిపాయతో పచ్చిపులుసు చేసుకుని అన్నంతోపాటు తిన్నా సరిపోతుంది.
పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:
ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రావు.
కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు.
షేర్ చేయండి.
Wish you a good health...
forwarded as received
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!


సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.



రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

ఈ ఉపయోగకరమైన సమాచారం మీ మిత్రులకి షేర్ చేయండి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఈ 10 అలవాట్లు మార్చుకోకపోతే ఎప్పటికి ధనవంతులు కాలేరు..!

ఈ 10 అలవాట్లు మార్చుకోకపోతే ఎప్పటికి ధనవంతులు కాలేరు..!

శాస్త్రాల ప్రకారం మనుషులకు ఉండే కొన్ని అలవాట్ల వలన దరిద్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందట .కొంతమంది ఎంత కష్టపడినా ఆర్దికంగా పైకి రారు.ఎప్పుడు కష్టాలు దారిద్య్రంలో చివరకు రోడ్డుపైకి వస్తారు.అయితే ఎలాంటి చేయకూడని పనులేమిటి తెలుసుకుందాం./

  • బాత్రూమ్ కడగకుందా నీట్ గా ఉంచకపోవడం వలన దరిద్రం చుట్టుకుంటుంది.
  • ఎవరైనా వారు తినగలిగినంత కాక ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు అన్నాన్ని.
  • ఇలా చేయడం వల్ల ఎప్పుడు పేదవారిలాగానే ఉంటారట.
  • తిన్న తరువాత ప్లేట్ అలానే ఉంచకూడదు
  • వెంటనే కడిగేయాలి లేదంటే శని చుట్టుకుంటుంది .
  • రోజూ వాడే మంచం పక్కబట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట.
  • మంచాన్ని ఉదయకాలంలో మాత్రమే శుభ్రపరచాలి రాత్రిపూట శుభ్రపరుస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
  • ఉమ్మును ఎక్కడపడితే అక్కడ ఊయడం వలన లక్ష్మి దేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది ఇంతకంటే దరిద్రం మరింకేది ఉండదు.
  • శాస్త్రం ప్రకారం సంధ్యా వేళలో ఊడ్చకూడడు
  •  ఇలా చేయడం కూడా దరిద్రమే.ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగెటివ్ ఎనర్జీ నీ తెస్తాయి.
  • ఉత్తర దక్షిణ మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు .ఇలా చేస్తే గొడవలు వస్తాయి .
  • మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు.
  • ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి ఇంటీలోనుంచి వెళ్ళిపోతుంది
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.