Pages

Thursday, March 8, 2018

రంగులలో ఆధ్యాత్మిక సారం

రంగులలో ఆధ్యాత్మిక సారం

Image result for color
ఎన్నెన్నో వర్ణాలు అన్నింటా అర్థాలు

పువ్వు పూస్తే రంగు... 
మెరుపు మెరిస్తే రంగు.. 
రంగుల్లేని ప్రకృతిని ఊహించలేం... 
రుతువు రుతువుకీ కొత్త వర్ణాలను పులుముకునే పరిసరాలు 
మనసుకు ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని 
కలిగిస్తాయి... 
ఫాల్గుణమాసంలో ప్రకృతి శోభాయమానమైన వర్ణాలతో స్వాగతం పలుకుతుంది... 
ఆ నెలలో వచ్చే పౌర్ణమి హోలీ పేరుతో  అందరినీ రంగుల్లో ముంచి తేలుస్తుంది... 
చూసే మనసుకు కళ్లుంటే జీవితం ఓ హరివిల్లు... 
ఎంతో భావకుడైన సృష్టికర్త ప్రపంచాన్ని రంగుల మయంచేశాడు... చూసి ఆనందించమని. 
అలా చూడ్డానికి అనుకూలంగా కంటిని అద్భుతంగా నిర్మించి మనిషికి ఇచ్చాడు. 
భగవంతుడి సృష్టికే శోభాయమానం, అద్భుతం అనదగ్గ విషయమది. 
దేవుళ్ల విషయానికి వస్తే శివుడు నీల కంఠుడు... కృష్ణుడు నీలి చంద్రుడు... రాముడు నీల మేఘశ్యాముడు... అంతే కాదు పువ్వుకో రంగు, ఆకుకో రంగు, హరివిల్లులో ఏడు రంగులు... ఇంత చేసిన భగవంతుడు ఓ అద్భుతమైన చిత్ర కారుడు. ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకత.. ఓ విశేషం... ఓ ఆకర్షణ ఉన్నాయి మనిషి మనస్తత్వాన్ని బట్టి వాటిపై ఆరాధన ఉంటుందంటారు. అవసరం మారుతుందంటారు. జాతకశాస్త్రంలో కూడా రంగుల విశ్లేషణ ఉంది. ఆ రంగుపై ఇష్టం ఆధారంగా అతని మనో స్వభావాలను విశ్లేషిస్తున్నారు నేటి మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇవన్నీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న వర్ణాలకు, మనిషి జీవితానికి ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేసే విషయాలే. దీన్ని అర్థం చేసుకోగలిగితే, విశ్లేషించుకోగలిగితే మన జీవితాన్ని మరింత తీర్చిదిద్దుకోవచ్చు. సుందరంగా, ఆకర్షణీయంగా, రంగుల లిపిగా మార్చుకోవచ్చు. 
* తెలుపు రంగు ప్రశాంతతకు చిహ్నం. తాత్వికతకు నిదర్శనం. మనిషి ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు తెల్లటి రంగును ఇష్టపడతాడు. తెలుపు దుస్తులను ధరించాలనుకుంటాడు. స్వచ్ఛతకు ఈ రంగు ప్రతీక. 
*  నలుపును సాధారణంగా విషాదానికి చిహ్నంగా భావించినా ఇది పవిత్రతను సూచిస్తుంది. ఐహిక ప్రపంచానికి దూరంగా ఉన్నవారు ఈ రంగు దుస్తులను ధరించాలంటారు. అయ్యప్ప దీక్షధారులు ఈ రంగు దుస్తులను ధరించడంలో పరమార్థమిదే.  మనం చూస్తున్న రంగులన్నీ నలుపులో నుంచే వచ్చాయని వేదాంతం చెబుతుంది. చీకటిలో నుంచి అనేక రంగులు ఉద్భవించి తెలుపులో లీనమవుతున్నాయి, కాబట్టి ఈ రంగును భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. అందుకే ధ్యానం చేసేటప్పుడు నల్లటి చుక్కపై దృష్టి నిలుపుతారు. నలుపు చెడు ప్రాణ శక్తులను ఆకర్షిస్తుంది. తనలో నిక్షిప్తం చేసుకుంటుందని నమ్ముతారు. అందుకే కాటుకను దిష్టి చుక్కగా పెడతారు. 
ఎరుపు రంగు పౌరుషానికి, ఉత్తేజానికి నిదర్శనం. రజో గుణానికి ఎరుపు, తమోగుణానికి నలుపు, సత్వగుణానికి తెలుపు సూచికలు. సృష్టికర్త రజోగుణంలో ఉంచి సమస్తాన్నీ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఎరుపు సృజనాత్మకతకు కూడా చిహ్నం.  శత్రువులను భయపెట్టే గుణం కూడా ఈ రంగులో ఉంది. 
* దివ్యత్వాన్ని నీలిరంగు సూచిస్తుంది. ఎక్కడ నీలిరంగు వ్యాపించి ఉంటుందో అక్కడ మనస్సు ప్రశాంత స్థితిలోకి జారుకుంటుంది. సాధారణంగా పూజా గదుల్లో, ధ్యానమందిరాల్లో నీలిరంగు కాంతులతో వెలుగుతున్న చిన్నపాటి విద్యుద్దీపాన్ని పెట్టుకుంటారు. దీనివల్ల ఏకాగ్రత కుదురుతుందని, మనసు లక్ష్యంపై లగ్నమవుతుందని చెబుతారు. నిద్ర గదిలో ఈ రంగు కాంతి ఉండడం వల్ల గాఢమైన, ప్రశాంతమైన నిద్ర పడుతుందని సైన్స్‌ రుజువు చేసింది. 
*  ఆకుపచ్చ ఎదుగుదలకు, ఉత్పత్తికి చిహ్నం. మనసులో ఒక పార్శ్వాన్ని పచ్చగా ఉంచుకోండని చెబుతారు. దీనివల్ల అంతులేని సృజనాత్మకత పెరుగుతుంది.  ఆకుపచ్చదనం ఏర్పడడానికి అసలు కారణం పత్రహరితం. వాతవరణ కాలుష్యాన్ని పారదోలే శక్తి దీనికి ఉంది. రుషులు కూడా అందుకే తమ తపోస్థలిగా అడవులను, పచ్చటి ప్రాంతాలను ఎంచుకున్నారని చెప్పవచ్చు. 
ఒక్కో రంగుకు ఒక్కో లక్ష్యం, అవసరం, ప్రత్యేకత ఉన్నాయి. మానసిక ఔన్నత్యం, ఆధ్యాత్మిక శక్తులకు రంగులు ప్రతీకగా నిలుస్తాయని కిర్లియన్‌ ఫొటోగ్రఫీ నిరూపించింది. దీంతో ఫొటోలు తీసినప్పుడు మనిషి చుట్టూ వైవిధ్యమైన రంగులతో కాంతి పరివేషం కనిపిస్తుంది. ఇది కోపంగా ఉన్నప్పుడు ఒకరకం, శాంతంగా ఉంటే మరో రకం, ఆందోళనగా ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం భగవాన్‌ సత్యసాయిబాబాను ఈ విధానంలో ఫొటో తీసినప్పుడు ఆయన చుట్టూ అద్భుతమైన నీలికాంతులను గమనించానని ఓ శాస్త్రవేత్త వివరించారు. ఏ రంగు మన ఆధ్యాత్మికతకు, మన ఉన్నతికి, మన మనస్తత్వానికి దోహదపడుతుందో అర్థం చేసుకోవడమే భగవంతుడి స్వప్నలిపిని అధ్యయనం చేయడం. మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్ధితికి ఎదగడానికి ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుంది. దీన్ని తెలుసుకున్న వాళ్ల జీవితం వర్ణరంజితమవుతుంది. సప్తవర్ణ శోభితమవుతుంది Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

No comments:

Post a Comment

.