Pages

Wednesday, April 25, 2018

క్రెడిట్‌ కార్డు

క్రెడిట్‌ కార్డు విషయంలో ఇలా..

హైదరాబాద్ :ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డులు వాడటం ఎక్కువైపోయింది. అయితే చాలామంది వాటిని వాడటం సరిగ్గా రాకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది.

అందుకే క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు వాటి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. కార్డు పరిమితి, చెల్లించాల్సిన ఫీజు, వడ్డీ శాతం మొదలైన వివరాలపై అవగాహన ఉండాలి. ఆ సమాచారం  తెలుసుకుందాం.

 *మొదట క్రెడిట్, డెబిట్‌ కార్డుమధ్య తేడా గుర్తించాలి.*

క్రెడిట్‌ కార్డుకి డెబిట్‌ కార్డులా డబ్బులు నేరుగా ఖాతా నుంచి తీయబడవు. క్రెడిట్‌ కార్డుకి వడ్డీ కూడా ఉంటే అదనపు పాయింట్లు జోడించబడతాయి. బిల్లింగ్‌ చక్రంలోపు క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టేస్తే ఆ

వడ్డీని నివారించవచ్చు.


APR  *ఏపీఆర్‌ అంటే..*?

వాణిజ్య ప్రకటనల్లో చూసి ఏపీఆర్‌ అంటే వార్షిక రేటు శాతం. ఏపీఆర్‌ అంటే గుర్తు ఉండకపోయినా పర్వాలేదు కానీ, మీరు క్రెడిట్‌ కార్డుకి దరఖాస్తు చేసేముందు సరైన ఏపీఆర్‌ శాతం చూసుకోవాలి.

ఎందుకంటే మీ బిల్లు బాకీ ఉంటే కట్టాల్సింది ఏపీఆర్‌యే. కొన్ని ఏపీఆర్‌లు రూ.30 శాతం అంతకంటే ఎక్కువగా కూడా ఉంటాయి.


 *ప్రామాణికం కాని ఫీజు గురించి*

కొన్ని క్రెడిట్‌ కార్డులకి ప్రామాణికం కాని ఫీజులు ఉంటాయి. మీరు అంచనా వేసిన విధంగానే వాటి పేర్లు వైవిధ్యమైనవి, మంచి క్రెడిట్‌ కార్డులకు ఎప్పుడూ ప్రామాణికం కాని ఫీజులు ఉండవు. అడిట్‌

ఫీజు, మార్పిడి ఫీజు, త్రైమాసిక టెక్నాలజీ ఫీజు, భద్రతా ఫీజు మొదలైనవి ఉండవు.

 *కనీస చెల్లింపు కంటే*

ప్రతీ నెల కేవలం క్రెడిట్‌ కార్డు బిల్‌ మీద కనీసమే చెల్లించాల్సి వస్తే, కొంచెమే కదా అని చెల్లించకుండా వదిలేయవద్దు. అలాగే మొత్తం నెలలో వచ్చిన కార్డు బిల్లు కట్టేయండి.


 *వార్షిక ఫీజు గురించి*

మీరు తరచూ క్రెడిట్‌ కార్డు వాడకపోతే, వార్షిక ఫీజు లేని క్రెడిట్‌ కార్డు తీసుకోవడమే మంచిది. ఈ ఫీజు ఏడాదికి రూ.100 నుంచి రూ.300 దాకా ఉంటుంది.


 *కార్డుల ప్రయోజనం తెలుసుకోవాలి:*

క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలు కొన్ని నిబంధనలు మరియు షరతులతో వస్తాయి. ఉదాహరణకు మీకు రివార్డు పాయింట్స్‌ ఇస్తామంటారు. కానీ అవి నాణ్యమైన వస్తువుల కొనుగోలుపై మాత్రమే

ఉండవచ్చు. మరియు ప్రతీ త్రైమాసికానికి మారవచ్చు. అందుకే క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల గురించి క్షుణంగా తెలియకపోతే, క్రెడిట్‌ కార్డ్‌ నుంచి మొత్తం లాభం పొందలేము.


*కొనుగోలు చేయటం మర్చిపోకండి*

లెక్కలేనన్ని క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. అందుకే ఏదైనా కొనుగోలు చేసేముందు వేరే వాటితో పోల్చుకుని కొనండి. బిల్లు కట్టే సమయంలో ఒత్తి డికి లోనయ్యి స్కోర్‌ క్రెడిట్‌ కార్డు తీసుకోకండి.


 *క్రెడిట్‌ కార్డు మినిమమ్‌ డ్యూ:*

కార్డుకు సంబంధించి ప్రారంభంలో ఈ విషయంలో చాలా మంది తికమకపడుతూ ఉంటారు. మీరు బిల్లులో ఇంత మొత్తం చెల్లిస్తే అని ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. దాన్ని మినిమమ్‌ బ్యాలెన్స్‌ అంటారు.

ఈ మినిమం అమౌంట్‌ డ్యూలను చెల్లించి ఊరుకుంటే మొత్తం అప్పు తీరినట్టు కాదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వడ్డీలు బాగా ఉంటాయి. అందుకే వాడిన మొత్తం బిల్లును బిల్లు తేదీ

తుది గడువులోపు కట్టేయాలి. సాధారణంగా మనం వాడుకున్న బ్యాలెన్స్‌లో 5 శాతం మినిమం అమౌంట్‌ డ్యూగా వ్యవహరిస్తుంటారని గమనించాలి.

No comments:

Post a Comment

.