Pages

Saturday, November 19, 2016

ఎడమ వైపు నిద్ర పోవడం

ఎడమ వైపు నిద్ర పోవడం - (Sleeping Left Side)sleeping left side


       భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

      ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి .
# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .

పడుకునే విధానం :----
     ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .
# దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .
# మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
ప్రయోజనాలు ( Benefits ) :--

1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు  తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .

      ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే  మార్పు చేసుకోవచ్చును .
      ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .
మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి

గమనిక : ----
   తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది .       

ఆధార్‌ సమస్యలపై ఫోన్ చేయాల్సిన నంబర్

ఆధార్‌ సమస్యలపై ఫోన్ చేయాల్సిన నంబర్ ఇదే!Aadhar Card corrections

       1 9 4 7


aadhar card correctionsఆధార్ కార్డులలో రకరకాల తప్పులు దొర్లుతుంటాయి. వాటిని పరిష్కరించుకోడానికి చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నింటినీ పరిష్కరించడానికి... ఆధార్ తప్పులు సరిచేయడానికి వీలుగా ఒక సరికొత్త టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. దాని నెంబరు కూడా దేశ ప్రజలందరికీ సులభంగా గుర్తుండేలా.. స్వాతంత్ర్యం వచ్చిన 1947గా నిర్ణయించారు. బ్యాంకు సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిపోయింది. దాంతో దీని గురించిన సమాచారం మొత్తాన్ని తెలుసుకోడానికి వీలుగా పనిచేసే ఐవీఆర్ఎస్ హెల్ప్‌లైన్ 1947ను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది పనిచేస్తుంది. ఆదివారాల్లో అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏజెంట్లు కాల్స్‌కు ఆన్సర్ చేస్తారు. సగటున ఈ హెల్ప్‌లైన్ నెంబరు రోజుకు లక్షన్నర వరకు ఫిర్యాదులు స్వీకరించగలదు.

దీంతో ఆధార్ అందరికీ మరింత దగ్గరవుతుందని యూఐడీఏఐ సీఈఓ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి దీనికి ఫోన్ చేసి సమస్యలు ఏంటో చెప్పచ్చని ఆయన అన్నారు. ఆధార్ నమోదు కేంద్రం దగ్గరలో ఎక్కడుంది, ఆధార్ నెంబరు జనరేషన్ స్టేటస్ ఏంటి, ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తమ కార్డు పోగొట్టుకున్నా కూడా.. ఆధార్‌ వివరాలు ఏంటన్న విషయాలను ఈ హెల్ప్‌లైన్ ద్వారా పొందచ్చు.

💷పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా ఆధార్ ఉపయోగాలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరికీ సులభంగా అర్థం అయ్యేలా సరికొత్త టోల్‌ఫ్రీ నెంబరు ప్రవేశపెట్టారు. అలాగే, ఎవరికైనా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇచ్చే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని యూఐడీఏఐ ప్రజలను హెచ్చరించింది. వాటిని సులభంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఆధార్ జిరాక్సు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా అది ఎందుకు ఇస్తున్నామో చెప్పడంతో పాటు తేదీ, సమయం కూడా రాయాలని.. అందువల్ల దాన్ని వేరే దేనికీ ఉపయోగించడం వీలు కాదని డాక్టర్ పాండే వివరించారు. అయితే.. ఒకవేళ ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేయాలనుకున్నా, డిజిటల్‌గా ఎక్కడికక్కడ చెక్ చేసుకునే అవకాశం ఉండటంతో ఇది సురక్షితమైనదని ఆయన తెలిపారు.                     

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు.socrates biography in telugu 

socrates biography in telugu

 తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు.

బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు. జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.

సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకి ఆపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు.

మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. శిష్యులు ”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు.

సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం....  మరణం గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు, ఇక్కడున్న అందరం, ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతీక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయముంది. అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు. శిష్యుల నోట మాట రాలేదు.

బెల్లం కలిపిన పాలు తాగితే.. ఏమవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బెల్లం కలిపిన పాలు తాగితే.. ఏమవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Uses of Jaggery
ఇప్పటిదాకా పాలు, కాఫీ, టీ లను పంచదారతో తాగి విసుగు వస్తే.. ఇప్పుడు కొత్తదనం కోరుకుంటే పాలు, బెల్లం కాంబినేషన్ ను ప్రయత్నించవచ్చు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నిజానికి పంచదార కన్నా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ బెల్లం కన్నా పంచదార టేస్ట్ బాగుండటంతో అందరూ  పంచదార వైపే మొగ్గుచూపుతారు. మరి పాలు, బెల్లం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం.

 పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

 బెల్లం కు అనీమియా ఎదుర్కోనే శక్తి వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను త్రాగవచ్చు.

 బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

 మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనంనకు బెల్లం కలిపిన పాలు కాంభినేషన్ సహాయపడుతుంది.

 ఈ కాంభినేషన్ తో ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది.

  ఎముకల ను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.

  జీర్ణక్రియను , మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.

  జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది.

ఇది అందరికీ షేర్ చేయగలరు.

uses of jaggery

ఝాన్సీ లక్ష్మీబాయి(Jhansi Laxmi Bai)

 ఝాన్సీ లక్ష్మీబాయి(Jhansi Laxmi Bai)

ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

బాల్య జీవితం


ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.

ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.

వివాహం🌹

లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడు.

ఆక్రమణ🌹

వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడింది. సభలో ఆమె తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలినిన యువతులు, ఎవరైతే జెనన కి నిర్బంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది.ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాల్లందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసింది.

1851 లో రాణి లక్ష్మిబాయి తన కుమారుడికి జన్మనిచ్చింది, కాని అతను తన నాలుగు నెలల వయస్సులోనే చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయిన తరువాత, ఝాన్సీ యొక్క రాజు మరియు రాణి దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కాని రాజు అయిన ఆమె భర్త తన కుమారుడి మరణం నుంచి తేరుకోలేక, 21 నవంబర్ 1853 లో పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ చనిపోయాడని చెప్పబడింది. వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.

గొప్ప తిరుగుబాటు🌹

రాణి ఝాన్సీ ని ఇవ్వకూడదని నిశ్చయించుకొన్నది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సేనను తయారుచేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భు బక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.

1857 స్వాతంత్ర్య పోరాటం🌹
   
ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కాని,వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంప బడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు.

ఇంతలో, మే 1857,లో భారత దేశంలో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసినదిగా నిర్భందం రావడంతో,ఝాన్సీ ని లక్ష్మిబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ తన సమర్థత కారణం వలన లక్ష్మిబాయి మధ్య కాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయములో కూడా ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

అప్పటి వరకు, బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశయించిన కాని,జూన్ 8 1857 జోఖన్ బాఘ్ లో బ్రిటిష్ HEIC అధికారుల, వాళ్ళ భార్య, పిల్లల "జన సంహారం"లో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదము గానే నిలిచిపోయింది.చివరికి మార్చి 23 1858 లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్ వశములో ఝాన్సీ ని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగ కూడదని ఆమె నిర్ణయించుకొంది. యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది. ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండరములను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.

ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్ఛ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని, "ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే" వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది,ఆ రక్షకులలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే.

1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.

జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.

ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు, మరియు తన బలగాలతో కల్పి కి పారిపోయి తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,17 జూన్ 1858,లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది.ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను.

తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.

మరణం

ఆమె 17 జూన్, 1858 లో గ్వాలియర్ తో యుద్ధ సమయములో తన ఎనిమిదొవ యుద్ధ గుర్రంతో మరణించింది, అది గ్వాలియర్లోని ఫూల్ బాఘ్ దగ్గర కోతః-కి-సేరిలో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది,ఇది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో ఉండే లక్నోకి పడమరగా 120 మైళ్ళ దూరంలో ఉంది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ ను ఆక్రమించుకొన్నారు. గ్వాలియర్ యుద్ధ నివేదిక ప్రకారం, గెనరల్ సర్ హుఘ్ రోస్ ఆమెని "చాలా చెప్పుకోదగిన అందమైనది,తెలివైనది, మరియు పట్టుదల కలది"అని "తిరుగుబాటు నాయకులలో కెల్లా అతి భయంకరమైనది" అని విర్శించారు.

కాని, కొరతగా ఉన్న శవాన్ని గుర్తించి, అది రాణి అని నమ్మించారని " పరాక్రమ" పటాలముగా చెప్పబడే ఆమె గ్వాలియర్ యుద్ధంలో చనిపోలేదని కెప్టన్ రీస్ నమ్మబడి, "[ది] ఝాన్సీ మహారాణి బ్రతికే ఉంది!" అని బహిరంగంగా ప్రకటించాడు.ఆమె ఎక్కడైతే మరణిచిందో అక్కడే అదే రోజు ఆమెకు అంత్య క్రియలు జరిగాయని నమ్మకం. ఆమె పరిచారికలలో ఒకరు అంత్యక్రియల సన్నాహాలకు సహాయపడింది.

ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, మరియు వివేకము, భారత దేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు, మరియు ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపింది. ఝాన్సీ మరియు గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు,రెండింటిలోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు.

ఝాన్సీ అధికారం పోయిన కొన్ని రోజులకే ఆమె తండ్రి అయిన, మోరోపంత్ తమ్బేని పట్టుకొని ఉరితీసారు. .తన దత్త పుత్రుడైన దామోదర్ రావు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భరణం ఇవ్వబడ్డాడు, కాని అతనెప్పుడు తమ పిత్రార్జితాన్ని అందుకోలేదు.


నగదుతో పనేముంది? ధనం మూలం ఇదం జగత్‌!

నగదుతో పనేముంది?  ధనం మూలం ఇదం జగత్‌!


 ఉదయం లేచిన దగ్గర్నుంచి ఏది కావాలన్నా డబ్బుతోనే కదా.. పాల ప్యాకెట్లు, కిరాణా సామగ్రి, పెట్రోలు, మందులు, పనివాళ్ల జీతాలు, ఇలా ఏది కావాలన్నా డబ్బు అవసరమే. అయితే, వీటన్నింటికీ నోట్ల రూపంలోనే డబ్బు కావాలా? భారతదేశం నగదు రహిత లావాదేవీల దిశగా త్వరితంగా అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో, నోట్ల వాడుకకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే బోలెడు సులభ ప్రత్యామ్నాయాలే ఉన్నాయని చెప్పుకోవాలి.
అయితే, వాటిని ఇంతకాలం మనం విస్మరించాం..అంతే!

♦డబ్బు తీసుకోవడమేనా?
అత్యధిక శాతం మంది ఖాతాదారులు ఏటీఎం/డెబిట్‌ కార్డులను కేవలం ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి మాత్రమే వినియోగిస్తారు. వేరే ఖాతాలకు నగదు బదిలీ, క్రెడిట్‌ కార్డు వినియోగించి నగదు పొందడం, క్రెడిట్‌ కార్డుల బిల్లుల చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జిలు, రైల్వే, విమాన టికెట్ల బుకింగ్‌, టెలిఫోన్‌/కరెంట్‌/గ్యాస్‌/నీటి బిల్లుల చెల్లింపు, ఆదాయపు పన్ను చెల్లింపు, ఆన్లైన్‌ కొనుగోలు చెల్లింపులు వంటి సేవల్ని నగదు రహితంగా ఏటీఎం డెబిట్‌ కార్డులు ఉపయోగించి పొందవచ్చు. డెబిట్‌ కార్డుల వినియోగంలో కొన్ని బ్యాంకులు అందిస్తున్న రివార్డు పాయింట్ల ద్వారా ప్రోత్సాహకాల్ని కూడా పొందవచ్చు.

 క్రెడిట్‌ కార్డులతో..

ఆదాయ ప్రాతిపదికగా ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు మంజూరు చేస్తాయి. ప్రాథమిక కార్డుకు అనుబంధ కార్డులు తీసుకొని, కుటుంబ సభ్యులు వినియోగించుకోవచ్చు. కొనుగోళ్లకు సంబంధించి గరిష్ఠంగా 50రోజుల వరకూ సున్నా శాతం వడ్డీతో బిల్లు చెల్లింపే వెసులుబాటు ఉంటుంది. వినియోగించిన మొత్తాన్ని నెలసరి వాయిదాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. దాదాపు అన్ని బ్యాంకులూ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌తో..

వ్యక్తులు, సంస్థలు తమ లావాదేవీలు సులభతరంగా నిర్వహించుకోవడానికి అన్ని బ్యాంకులూ కల్పిస్తున్న ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ద్వారా బ్యాంకు శాఖలకు వెళ్లనవసరం లేకుండా, నగదు రహితంగా 24గంటలూ అనేక రకాల సేవలు పొందవచ్చు. వివిధ బ్యాంకు ఖాతాలకు తక్షణ నగదు బదిలీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాలు తెరవడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల రద్దు, విద్యుత్‌, గ్యాస్‌, మొబైల్‌, డీటీహెచ్‌, ల్యాండ్‌లైన్‌ వంటి వినియోగ బిల్లుల చెల్లింపు, ఆదాయపు పన్ను చెల్లింపు, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు, వివిధ రకాల పన్నుల చెల్లింపు, గిఫ్ట్‌కార్డులు, మ్యూచువల్‌ ఫండ్ల కొనుగోలు, బీమా ప్రీమియాల చెల్లింపు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, నిర్ధారిత చెల్లింపు ఆదేశాల వంటి సేవలు పొందవచ్చు. ఆయా బ్యాంకుల నిబంధనలను అనుసరించి, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌, ట్రాన్సాక్షన్‌ పాస్‌వర్డ్‌లను ఖాతాదారులే ఎంపిక చేసుకోవచ్చు
.
అరచేతిలోనే...

స్మార్ట్‌ ఫోన్‌ లేని బ్యాంకు ఖాతాదారులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా పొందగలిగే బ్యాంకింగ్‌ సేవలు పొందడం మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా సాధ్యమవుతోంది. మీ ఖాతా ఉన్న బ్యాంకుకు సంబంధించిన మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకొని బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ చేసుకునేందుకు వీలవుతుంది. కొన్ని బ్యాంకుల యాప్‌లతో మీ రుణ ఖాతా, రుణ చెల్లింపు వివరాలు, గిఫ్ట్‌ వోచర్ల కొనుగోలు వంటి ప్రత్యేక సేవలు కూడా పొందవచ్చు.

క్షణాల్లో నగదు బదిలీ...

వ్యక్తులు, సంస్థల మధ్య నగదు బదిలీకి ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ ఎంతో సౌకర్యవంతమైన సేవలు. బ్యాంకు అన్ని పనిదినాలలోనూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ రోజుకు 12సార్లు గంటకోసారి పరిష్కరించే బాచ్‌ల ద్వారా ఎన్‌ఈఎఫ్‌టీ సేవలు వినియోగించుకొని, నగదు బదిలీ చేయవచ్చు. బ్యాంకు శాఖల ద్వారా అయితే వ్యాపార పనివేళల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సాయంత్రం 7గంటల అయితే, మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో ఎన్‌ఈఎఫ్‌టీ లేదా ఆర్‌టీజీఎస్‌ ద్వారా నమోదు చేస్తే.. మరుసటి పని దినాన నగదు బదిలీ జరుగుతుంది. ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా నగదు బదిలీకి కనిష్ఠ, గరిష్ఠ పరిమితి లేదు. ఆర్‌టీజీఎస్‌ ద్వారా కనీసం రూ.2లక్షల బదిలీ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు.

*99#సేవలు

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో బ్యాంకులు, టెలికాం సంస్థలు సంయుక్తంగా అందిస్తున్న సేవ *99#. బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నెంబరు నుంచి *99# డయల్‌ చేసి 7 రకాల ఆర్థిక/ఆర్థికేతర సేవలు పొందవచ్చు. లబ్దిదారునికి మొబైల్‌ నెంబరు, ఎంఎంఐడి లేదా ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ సహాయంతో తక్షణ నగదు బదిలీ చేయవచ్చు. బ్యాంకు సెలవులతో నిమిత్తం లేకుండా అన్ని రోజులపాటు 24గంటలూ ఈ సేవలు పొందవచ్చు. సాధారణ ఫోన్‌ వినియోగదారులు *99# అని డయల్‌ చేసి, స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి *99# యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకొని ఈ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. ఈ సేవల నిమిత్తం బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవచ్చు. టెలికాం సంస్థలు ఒక్కో సేవకు గరిష్ఠంగా రూ.1.50 వసూలు చేస్తాయి. మొబైల్‌కు ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోయినా నగదు రహిత సేవలు పొందడం దీని ప్రత్యేకత.

యూపీఐతో...

ఇటీవల అందుబాటులోకి వచ్చిన యూపీఐ యాప్‌ ద్వారా, నగదు పొందేవారి బ్యాంకు ఖాతా నెంబరు, ఎంఎంఐడీ (మొబైల్‌ మనీ ఐడెంటిఫయర్‌), ఐఎఫ్‌ఎస్‌సీ వంటి వివరాలు అవసరం అక్కర్లేకుండానే.. కేవలం ఖాతాదారుని వర్చువల్‌ ఐడీ సహాయంతో తక్షణమే వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి సంస్థలు లేదా వ్యాపారులకు నగదు బదిలీ చేయవచ్చు. అలాగే నగదు పొందవవచ్చు. ఒక వ్యక్తికి వేర్వేరు ఖాతాలు ఉన్నా, అన్ని బ్యాంకులకు కలిపి ఒకే యూపీఐ యాప్‌ ద్వారా లావాదేవీలు చేయవచ్చు.

గిఫ్ట్‌ కార్డులు🎁

స్నేహితులకు వివాహాది శుభకార్యాలయాల్లో బహుమతిగా ఇచ్చేందుకు ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌కార్డులు చాలా సౌకర్యవంతం. ఒక సంవత్సరం పాటు అమలులో ఉండే విధంగా జారీ చేయబడే ఈ ప్రీ పెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులను షాపింగ్‌ మాల్స్‌లోనూ, ఆన్‌లైన్‌ కొనుగోలుకు వినియోగించవచ్చు. 100 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ లభ్యమయ్యే ఈ ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులు భారతదేశ వ్యాప్తంగా చెల్లుతాయి. సంస్థలు వారి ఉద్యోగులకు, ఖాతాదారులకు బహుమతిగా ఇచ్చేందుకు కూడా ఈ గిఫ్ట్‌కార్డులు వినియోగించుకోవచ్చు

ఈ కథ ను ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవాలి.Stories in telugu

ఈ కథ ను ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవాలి.stories in telugu


చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక  ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు.టూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!

బస్సుపై…అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.

కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!
🔸పిల్లలది కావచ్చు!
🔸తోబుట్టువులది కావచ్చు!
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము – పెంచుకోగలము
stories in telugu

Thursday, November 10, 2016

Charles Phillip Brown

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి సందర్భంగా.

(ఆంగ్లం:Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు.

తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు . ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.
వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.🍀

🍀జీవిత విశేషాలు🍀

🍀సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు.

🍀1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది.

🍀భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు.

🍀అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు.

🍀1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు.

🍀పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు

🍀తెలుగు భాషకు చేసిన సేవ🍀

🍀వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.

 🍀1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
 🍀"ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.

🍀తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.

🍀లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.

🍀"హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.

🍀1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.

🍀1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.

🍀రచనలు🍀

🍀ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.

🍀లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం

🍀రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.

🍀తెలుగు-ఇంగ్లీషు (1852), ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్

🍀(తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు)

🍀తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ

🍀వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం

🍀ఇతరుల ప్రశంసలు🍀

🍀నాటి పండితుడు, అద్వైతబ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏ యే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి"

🍀 ప్రముఖ పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్"

🍀• బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు
🍀భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"

🍀 "సి.పి.బ్రౌను అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు

🍀 "ఆంధ్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి
స్మృతి చిహ్నం

🍀• బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వము మరియు ప్రజల నిధులు మరియు సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు.2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది.

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది . ఆడుతూ పాడుతూ పని చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది . సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు . ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు . చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది , దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని . ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గ నియమించాడు . బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది . వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గ నియమించుకుంది . సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది , పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు . ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది . అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు , ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి . ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్ ,వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు మొదలైనాయి . క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది . ఉత్పత్తి పడిపోయింది . సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్తితిగతులని అద్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు . వెంటనే సింహం ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి
తొలగించాలని తీర్మానించాయి.
.


Sunday, November 6, 2016

ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! Astrology

ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.!

Astrology
జనవరి:
అందంగా ఉంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. ఎక్కడైనా తగ్గగలరు, నెగ్గగలరు. సాధించాలన్న పట్టుదల ఎక్కువ.

ఫిబ్రవరి:
ఏదైనా విషయానికి తొందరగా బాధపడిపోతారు. కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు.

మార్చి:
భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎదుటివారి ఆలోచనలకు దారితీస్తుంది.

ఏప్రిల్:
ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. నమ్మకం ఎక్కువ. సున్నితమైన మనసు కలిగిన వారు.

మే:
తొందరగా ఆకర్షితులవుతారు మరియు అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.

జూన్:
కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.

జూలై:
అహంకారంగా ఉంటారు. ఖ్యాతిని కోరుకుంటారు. తొందరగా భావోద్వాగానికి లోనవ్వడం అనూహ్య మార్పులకు దారితీస్తుంది.

ఆగస్ట్:
ఎప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు. సరదాగా ఉండటం, రహస్యాలను తెలుసుకోవడం, మంచి సంగీతం వినడం, పగటి కలలు కనడం, తొందరగా బాధపడటం, ఇక నమ్మినవారు మోసం చేస్తే వారిని అఇష్టపడతారు.

సెప్టెంబర్:
స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.

అక్టోబర్:
చాట్ చేయడానికి ఇష్టపడతారు. అపద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ.

నవంబర్:
నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు. సీక్రెట్స్ చెప్పరు మరుయు స్వతంత్రంగా ఉంటారు.

డిసెంబర్:
చూడటానికి చాలా బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.
 Astrologer.

ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

🚿సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

🌐ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

🔑తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా  సమస్య కూడా  రాదు

🍥తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

🍥మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

👍నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

💪నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…

🎀స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.

👏చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

💞కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

🍥ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

⏰ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…

✊గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

🚶నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

✊స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.



దీనమ్మా.... పురుష జీవితం
ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా...😂
👦☆☆..మగవాడు..☆☆👦
భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..

తన🍫చాక్లెట్స్ చెల్లికి👧ఇవ్వగలవాడు..

తన కలలను తల్లి👪తండ్రుల
😀చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..

తన పాకెట్ మనీ💰గర్ల్ ఫ్రెండ్
🎁గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..

తన యవ్వన కాల మంతా త్యాగం చేసి 👰భార్యా👫పిల్లలకోసం గొడ్డులా🌂
పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..

వారి భవిష్యత్తు కోసం🏦బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి🚶 కట్టేవాడు..

అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య,  బాసు లతో తిట్లు😛తింటూ వాళ్ళ 😄ఆనందం కోసం జీవించేవాడు..

బయటకు వెడితే🏠ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..

🏡ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు
👞కాలు పెట్టడు అంటారు..

పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..

పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..

అమ్మ మాట వింటే అమ్మ కూచి
అంటారు..

భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..

ఆడపిల్లలూ ♡..మగవాడిని..♡
గౌరవించండి...🙏

వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..👀

మగవాళ్ళూ..!
ఇది అందరికీ పంపించండి..!
మన మీద మనమే సానుభూతి  చూపక పోతే ఎలా..?

ఈ  సమయానికి  ఎవరో  మెసేజ్ చేస్తే కాని తెలియ లేదు
Happy Men's day

మినరల్ వాటర్ మంచిదా? జనరల్ వాటర్ మంచిదా?

మినరల్ వాటర్ మంచిదా?
జనరల్ వాటర్ మంచిదా?
Miniral water Vs General Water
మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!

భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.

ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ తెలియచేయండి.
.