ఆధార్ సమస్యలపై ఫోన్ చేయాల్సిన నంబర్ ఇదే!Aadhar Card corrections
1 9 4 7
ఆధార్ కార్డులలో రకరకాల తప్పులు దొర్లుతుంటాయి. వాటిని పరిష్కరించుకోడానికి చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నింటినీ పరిష్కరించడానికి... ఆధార్ తప్పులు సరిచేయడానికి వీలుగా ఒక సరికొత్త టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. దాని నెంబరు కూడా దేశ ప్రజలందరికీ సులభంగా గుర్తుండేలా.. స్వాతంత్ర్యం వచ్చిన 1947గా నిర్ణయించారు. బ్యాంకు సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయిపోయింది. దాంతో దీని గురించిన సమాచారం మొత్తాన్ని తెలుసుకోడానికి వీలుగా పనిచేసే ఐవీఆర్ఎస్ హెల్ప్‌లైన్ 1947ను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది పనిచేస్తుంది. ఆదివారాల్లో అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏజెంట్లు కాల్స్‌కు ఆన్సర్ చేస్తారు. సగటున ఈ హెల్ప్‌లైన్ నెంబరు రోజుకు లక్షన్నర వరకు ఫిర్యాదులు స్వీకరించగలదు.
దీంతో ఆధార్ అందరికీ మరింత దగ్గరవుతుందని యూఐడీఏఐ సీఈఓ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి దీనికి ఫోన్ చేసి సమస్యలు ఏంటో చెప్పచ్చని ఆయన అన్నారు. ఆధార్ నమోదు కేంద్రం దగ్గరలో ఎక్కడుంది, ఆధార్ నెంబరు జనరేషన్ స్టేటస్ ఏంటి, ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తమ కార్డు పోగొట్టుకున్నా కూడా.. ఆధార్ వివరాలు ఏంటన్న విషయాలను ఈ హెల్ప్‌లైన్ ద్వారా పొందచ్చు.
💷పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా ఆధార్ ఉపయోగాలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరికీ సులభంగా అర్థం అయ్యేలా సరికొత్త టోల్‌ఫ్రీ నెంబరు ప్రవేశపెట్టారు. అలాగే, ఎవరికైనా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇచ్చే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని యూఐడీఏఐ ప్రజలను హెచ్చరించింది. వాటిని సులభంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఆధార్ జిరాక్సు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా అది ఎందుకు ఇస్తున్నామో చెప్పడంతో పాటు తేదీ, సమయం కూడా రాయాలని.. అందువల్ల దాన్ని వేరే దేనికీ ఉపయోగించడం వీలు కాదని డాక్టర్ పాండే వివరించారు. అయితే.. ఒకవేళ ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేయాలనుకున్నా, డిజిటల్‌గా ఎక్కడికక్కడ చెక్ చేసుకునే అవకాశం ఉండటంతో ఇది సురక్షితమైనదని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment