Pages

Wednesday, August 23, 2017

ఫోన్ పోగుట్టు కుంటే?

ఫోన్ పోగుట్టు కుంటే?

సోమాజిగూడ/హైదరాబాద్: క్రాంతి ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పంజాగుట్టలో గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. డోర్‌ పక్కన మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి స్నానానికి వెళ్లాడు. ఆఫీసుకు వెళ్లేందుకు బ్యాగ్‌, టిఫిన్‌ బాక్స్‌ సిద్ధం చేసుకున్నాడు. ఫోన్‌ తీసుకుందామని డోర్‌ వద్దకు వెళ్లి చూడగా లేదు. రూమ్‌లో ఉన్న మరో స్నేహితుడిని.. నా ఫోన్‌ ఎక్కడుందని అడగగా తెలయదని సమాధానం చెప్పాడు. ఓ క్షణం ఆలోచించాడు... తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ తన పక్కనే ఉన్న రూమ్‌లో ఉందని గుర్తించాడు. ఇవ్వమని వారిని బతిమాలాడు. నీ ఫోన్‌ మేమెందుకు తీసుకుంటామని వాగ్వివాదానికి దిగారు. క్రాంతి పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌కెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కానిస్టేబుల్స్‌ వెళ్లి ఆ గదిని పరిశీలించగా.. మొబైల్‌ ఆచూకీ లభించింది.

      సోమాజిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సింధు స్మార్ట్‌ఫోన్‌ను ఆమె మూడేళ్ల కుమార్తె తీసుకుంది. ఇంట్లో తిరుగుతూ ఫోన్‌తో ఆడుకుంటుంది. గమనించిన ఆమె ఎక్కడికి వెళ్తుందిలే అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి చేతిలో నుంచి ఫోన్‌ మాయమైంది. సింధు అర్జెంటుగా ఆఫీసుకు వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి. ఫోన్‌ లేకపోతే కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. కూతురిని అడిగితే చెప్పలేకపోతోంది. గంట సమయం దాటిపోయింది. ఫోన్‌ దొరకడం లేదు. మరో మొబైల్‌ నుంచి ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా.. ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఫ్రెండ్‌ సహాయంతో ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేసి తన జీమెయిల్‌ ఐడీ ద్వారా మొబైల్‌ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకుంది.

     ఎక్కడో ఫోన్‌ పెట్టి మరిచిపోతాం.. పని చేసుకుంటూ ఎక్కడ పెట్టామో తెలియక వెతుకుతుంటాం. పిల్లలు పోన్‌ తీసుకుని గేమ్‌ ఆడుకుని అయిపోయాక ఎక్కడో పెట్టి మరిచిపోతారు. ఫోన్‌ ఎక్కడుందని అడిగితే సమాధానం రాదు. దానికోసం వెతుకుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగుతాం. ఆలోచిస్తే వెతికి పట్టుకోవచ్చు. ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ ఉన్న ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు. ఈమెయిల్‌ ఐడీతో కనిపించని మొబైల్‌ ఫోన్‌ను గుర్తించొచ్చు. ఎవరైనా దొంగలిస్తే లొకేషన్‌ కూడా పట్టేస్తుంది.
ఇలా గుర్తించవచ్చు

         ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు జీమెయిల్‌ ఐడీ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి. కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీమెయిల్‌ ఐడీని ఓపెన్‌ చేయాలి. మెయిల్‌ ఐడీ పేజీలో కుడివైపు మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫైండ్‌ యువర్‌ ఫోన్‌ అని ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మన జీ మేయిల్‌ ఐడీ ఏ ఏ మొబైల్స్‌కి అనుసంధానం చేశామే చూపిస్తుంది. అక్కడ మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ను సెలెక్ట్‌ చేయాలి. అకౌంట్‌ వెరిఫై చేయాలని పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. రింగ్‌, లొకేట్‌ యువర్‌ ఫోన్‌ అని ప్రత్యక్షం అవుతుంది. కుడివైపు రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఒకటి రింగ్‌, రెండోది మ్యాప్‌ లొకేషన్‌. ఇంట్లోనే ఉంటే రింగ్‌ అప్షన్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్న రింగ్‌టోన్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఎడమ భాగంలో మరిన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. మొబైల్‌ లొకేషన్‌, డివైజ్‌ లాక్‌, కన్సిడర్‌ ఎరైజ్‌ డాటా... అని ఉన్నాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

వ్యక్తిగత డేటా తొలగించొచ్చు
మహానగరంలో ఎక్కువమంది ఉపయోగించేది ఖరీదైన ఫోన్లే. రోజుకు సుమారు వందకు పైగా వారివారి ఫోన్‌లను పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరి కొంతమంది పోనీలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. యువతులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటే దొరికిన వ్యక్తి సామాజిక మద్యమాల్లో పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌లు ఉంటాయని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని మనోవేదన చెందుతారు. వీటికి పరిష్కారం ఉందని చాలా మందికి తెలియదనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్‌ ఫోన్‌ను లాక్‌ చేయడంతో పాటు కీలక సమాచారాన్ని తొలగించే అవకాశం ఉంది.

లొకేషన్‌ తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసిన జీ మెయిల్‌ ఐడీ సహాయంతో మీ ఫోన్‌ లొకేషన్‌ ఎక్కడుందో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. జీ మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసిన తర్వాత మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ద్వారా మొబైల్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

జాగ్రత్తగా వ్యవహరించాలి
ఏ పని చేయాలన్నా అందరూ స్మార్ట్‌ ఫోన్‌ మీద ఆధారపడుతున్నారు. సమాచారాన్నంతటినీ ఫోన్‌లోనే భద్రపరుస్తున్నారు. భద్రతపరంగా భాగానే ఉంటుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాల.....

No comments:

Post a Comment

.