Pages

Sunday, May 21, 2017

మీ ఫోన్‌ సురక్షితమేనా?


మీ ఫోన్‌ సురక్షితమేనా?

 
ర్యాన్సమ్‌వేర్‌.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి నోటా ఈ సైబర్‌ వైరస్‌ పేరే వినిపిస్తోంది. సుమారు 150 దేశాలను వణికించిన ఇది స్మార్టుఫోన్లను ఏమీ చేయదా? ఒకవేళ స్మార్టుఫోన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి సైబర్‌ దాడి జరిగితే ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న ఇది. 
ర్యాన్సమ్‌వేర్‌ దాడులకు స్మార్టుఫోన్లేమీ మినహాయింపు కాదు. అలా అనీ కొత్తా కాదు. కానీ, కంప్యూటర్లతో పోల్చితే కొంత తక్కువే. అదేసమయంలో ఇటీవల కాలంలో ఇవి పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)తో పనిచేసే స్మార్టుఫోన్లపై ర్యాన్సమ్‌వేర్‌ దాడులు నాలుగు రెట్లు పెరిగాయి. పెద్దపెద్ద సంస్థలను, ప్రభుత్వ విభాగాల కంప్యూటర్లను కొల్లగొట్టి డబ్బు వసూలు చేసినట్లుగా వ్యక్తిగత ఫోన్లను హ్యాక్‌ చేసి వసూలు చేయడం గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో స్మార్టుఫోన్లపై దాడులు ఇప్పటికీ కొంత తక్కువగానే ఉన్నాయి. అయితే, ఎప్పటికైనా స్మార్టుఫోనూ ఇలాంటి దాడులకు గురయ్యే ప్రమాదం ఉండడంతో ముందుజాగ్రత్తలు తీసుకోవడమే దీనికి పరిష్కారం. 
వ్యక్తిగత కంప్యూటర్ల స్థానాన్ని స్మార్టుఫోన్లు ఆక్రమిస్తుండడం.. ప్రపంచంలో అత్యధిక స్మార్టుఫోన్‌లు ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండడం.. ఇంటర్నెట్‌ అందుబాటుతనం పెరగడంతో మొబైల్‌ వినియోగదారుల్లోనూ వైరస్‌ల భయం పెరుగుతోంది. అదేసమయంలో అవగాహన కరవవుతోంది.
 
మొబైళ్లను కొల్లగొట్టిన ర్యాన్సమ్‌వేర్‌లు 
 ఫ్యుసాబ్‌

 స్మాల్‌

 ప్లెటార్‌

 స్వెపెంగ్‌(ఇది ర్యాన్సమ్‌వేర్‌గా కంటే బ్యాంకింగ్‌ మాల్‌వేర్‌గా భారీ నష్టం కలిగించింది)
100 దేశాల్లో ఫ్యుసాబ్‌ 
గత ఏడాది ఏప్రిల్‌లో ఫ్యుసాబ్‌ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ఫోన్లను నాశనం చేసింది. జర్మనీ, అమెరికా, బ్రిటన్‌లలో వినియోగదారులు భారీగా నష్టపోయారు.
ఈ-మెయిళ్లతో జాగ్రత్త
ర్యాన్సమ్‌వేర్‌ ఈ-మెయిల్‌ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్లో మెయిళ్లు చూసుకునేవారంతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం లేని మెయిళ్లు, ఆకర్షించేలా గుర్తు తెలియని ఐడీల నుంచి వచ్చేవి అస్సలు తెరవొద్దు. తెరిచినా అందులోని అటాచ్‌మెంట్లపై క్లిక్‌ చేయొద్దు.
యాప్‌స్టోర్లలోనూ. 
గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోనూ ఏటా వేలకొద్దీ యాప్‌లను సురక్షితం కావన్న కారణంతో తొలగిస్తుంటారు. అయినప్పటికీ యాప్‌ స్టోర్‌లోనూ కొన్ని ప్రమాదకరమైనవి మిగిలిపోతుంటాయి. ప్రముఖ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్ల తయారీసంస్థ గత ఆరు నెలల్లో 3.7 కోట్ల యాప్‌లలో మాల్‌వేర్‌లను గుర్తించింది.
ఏం చేయాలి? 
 స్మార్టుఫోన్లలో ఉంచే ముఖ్యమైన ప్రతి సమాచారాన్నీ వేరేచోట కూడా భద్రపరుచుకోవాలి. 
 ఫోన్లో కచ్చితంగా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలి. తరచూ స్కాన్‌ చేయాలి. 
ఓఎస్‌ అప్‌డేషన్‌ అందుబాటులో ఉంటే వినియోగించుకోవాలి. 
అవసరం లేని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయకపోవడం మంచిది. 
 కావాల్సిన యాప్‌లను ఆయా ఓఎస్‌లకు చెందిన ప్లేస్టోర్‌ల నుంచి మాత్రమే తీసుకోవాలి. 
 సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనవసరపు లింకులను క్లిక్‌ చేయొద్దు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్‌ భద్రం 
సాధారణంగా మొబైల్‌ వినియోగదారుల వైఖరుల ఆధారంగా సైబర్‌ నేరగాళ్లు ఏ మాధ్యమంలో వైరస్‌ చొప్పించాలా అన్నది నిర్ణయించుకుంటారు. ఎక్కువగా వాడే గేమ్స్‌, యాప్‌ల నుంచి వీటిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ర్యాన్సమ్‌ వేర్‌ సాధారణంగా వ్యక్తులను కాకుండా వ్యవస్థలు, సంస్థలను లక్ష్యం చేసుకుని చొప్పిస్తారు. అప్పుడే వారికి లాభదాయకం. కానీ, స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా వ్యక్తిగత వాడకంలోనే ఉంటాయి కాబట్టి వీటిని లక్ష్యంగా చేసుకోవడం ఇంకా తక్కువగానే ఉంది. పైగా ఎక్కువమంది ఫోన్లలో కీలక పత్రాలు వంటివేమీ దాచి ఉంచరు కాబట్టి డబ్బు డిమాండ్‌ చేసినా ఇచ్చే అవకాశమూ తక్కువే. సైబర్‌ నేరగాళ్లు కోరినంత ఇవ్వడం కంటే కొత్త ఫోన్‌ కొనుక్కోవడమో, ఫార్మేట్‌ చేయడమో నయమనుకుంటారు. అందుకే వీటిని లక్ష్యం చేసుకోవడం కొంత తక్కువే. 
అయినప్పటికీ ఇటీవల కాలంలో స్మార్టుఫోన్లపై ఇలాంటి దాడులు పెరుగుతున్నాయి. దీనిబారిన పడకుండా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల్లోని అనుమానాస్పద, అవసరం లేని లింకులను తెరవకపోతే సగం ముప్పు తప్పుతుంది.👈 
 అలాగే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు కూడా అవి మన ఫోన్‌లోని ఏఏ అంశాలను తమ నియంత్రణలోకి తీసుకుంటాయో తెలుసుకోవాలి. దాని ఆధారంగానే ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలో వద్దో నిర్ణయించుకోవాలి.
ఇటీవల కాలంలో ఫోన్‌తోనే ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ యాప్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్లేస్టోర్లలోనూ బ్యాంకుల పేరుతో నకిలీ యాప్‌లు ఉండే ప్రమాదం ఉంది. బ్యాంకు వెబ్‌సైట్లోని డౌన్లోడ్‌ లింకు నుంచి అసలైన యాప్‌ తీసుకోవాలి. 
 సీహెచ్‌ఏఎస్‌ మూర్తి
సమాచార భద్రత ముఖ్య అధికారి, సీడాక్‌. 
సమాచార భద్రత విద్య, అవగాహన సమన్వయకర్త 
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఎవరికీ మోక్షం - హిందూ ధర్మచక్రం


ఎవరికీ మోక్షం - హిందూ ధర్మచక్రం

త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.

అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండిఅని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.

స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!అన్నారు నారదులవారు. అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలుఅని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మఅన్నారు విష్ణుమూర్తి.

స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారుఅని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!అన్నారు స్వామి.

విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారుఅన్నారు నారదులవారు. భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారుఅన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.

అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారుఅన్నారు నారదులవారు. మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!అన్నాడు భక్తుడు. అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.

భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందాఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.
ఈ పరిపక్వత  మన అందరిలో వచ్చినప్పుడే మనం నిజమైన స్వామీ భక్తులం అవుతాము
ఏమంటారు ???
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Monday, May 15, 2017

మితిమీరితే

మితిమీరితే ......... అతి_సర్వత్ర_వర్జయేత్..


మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది.
మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన సంపాదన మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

మితిమీరిన కర్తవ్యం అగచాట్ల పాలు చేస్తుంది.
మితిమీరిన క్రమ శిక్షణ రక్త సంబధీకులను దూరం చేస్తుంది.

మితిమీరిన  బాధ్యతలు అప్పుల పాలు చేస్తుంది.
మితిమీరిన  హాస్యం నవ్వుల పాలు చేస్తుంది.

మితిమీరిన  కోపం శతృవులను వృద్ధి చేస్తుంది.
మితిమీరిన  ఆలోచనలు  జీవితాన్ని దుర్భరం చేస్తుంది.

మితిమీరిన వ్యసనాలు అపమృత్యు పాలు చేస్తుంది.
మితిమీరిన స్వార్ధం అందరినీ దూరం చేస్తుంది.

మితిమీరిన పోటీ నష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన  లాభార్జన వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది.

మితిమీరిన  వస్తూత్పత్తి నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది.
మితిమీరిన  గర్వాహంకారం ఆపదలు కొని తెస్తుంది.

మితిమీరిన అలంకారం వెగటు పుట్టిస్తుంది.
మితిమీరిన  శృంగారం వైరాగ్యాన్ని కలిగిస్తుంది.

మితిమీరిన  కామాంధకారం జీవచ్చవాన్ని చేస్తుంది.
మితిమీరిన  దారిద్రయం నేరాల పాలు చేస్తుంది.

మితిమీరిన  అధికార దాహం హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.

మితిమీరిన త్యాగం కడగండ్ల పాలు చేస్తుంది.
మితిమీరిన  వ్యావసాయకోత్పత్తి భూమిని నిస్సారం చేస్తుంది.

మితిమీరిన  జనాభా పెరుగుదల దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.
మితిమీరిన  స్నేహాలు అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.

మితిమీరిన  గారాబం చెడు స్నేహాల పాలు చేస్తుంది.
మితిమీరిన వేదాంతం  వెటకారం పాలు చేస్తుంది.

మితిమీరిన ఈర్ష్ర్యాసూయాద్వేషాలు నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.
మితిమీరిన భక్తి మూర్ఛల పాలు చేస్తుంది.

మితిమీరిన  తీర్ధ యాత్రలు నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.
మితిమీరిన  ఉపవాసాలు నిస్రాణతకు దారి తీస్తుంది.

మితిమీరిన  ప్రేమ అనుమానాలకు దారి తీస్తుంది.
మితిమీరిన  నమ్మకం ద్రోహానికి దోహదం చేస్తుంది.

మితిమీరిన  విశ్వాసం లోకువ పాలు చేస్తుంది.
మితిమీరిన  ఋణం మరణం పాలు చేస్తుంది.

మితిమీరిన  అభిరుచి దుబారాకు దారి తీస్తుంది.
మితిమీరిన  కీర్తి దాహం ఆదాయాన్ని మింగేస్తుంది.

అతి సర్వత్ర వర్జయేత్..

మితా హారం
మిత భాషణం
మితమైన నిద్ర
మిత సంసారం
మిత సంపాదన
మనో కాలుష్య రహితంగా జీవన యానం సాగిస్తే
పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు అదే రాచబాట

గుండె ఆరోగ్యానికి సలహాలు

గుండె ఆరోగ్యానికి సలహాలు

గుండె ఆరోగ్యానికి ప్రశ్నలకి ఇచ్చిన
డాక్టర్ వై.వి.రావు గారుసలహాలు

1) ప్రశ్న . గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ?

జవాబు :
1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనెలు
2) వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3) ధూమ పానం మానడం
4) బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం
5) బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం
.
2) ప్రశ్న . కొవ్వును కండగా మార్చుకొగలమా ?

జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు – కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు . కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం . కొవ్వు కండగా మారదు

3) ప్రశ్న : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?

జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి .

4) ప్రశ్న : గుండె పోటు వంశ పారం పర్యమా ?

జవాబు : అవును

5) ప్రశ్న : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )

జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి .

6) ప్రశ్న: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ?

జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు

7) ప్రశ్న : మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు ?

జవాబు : మదర్ తెరెసా !
పేద ప్రజలు వారికీ సేవ చేయటం
మా హాస్పటల్ ముక్య ఉద్దేశం

8) ప్రశ్న : లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోతూ వచ్చే అవకాశం ఉందా ?

జవాబు : చాలా తక్కువ

9) ప్రశ్న : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ?
నా వయసు 22 to 30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా ?

జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది

10) ప్రశ్న : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?

జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు . ఆఅహారమ్ జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి .

11) ప్రశ్న : మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?

జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా

12) ప్రశ్న : గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ? చెడ్డ ఆహారం ఏది ?

జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి

13)ప్రశ్న : ఏ నూనె మంచిది ? సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె , ఆలివ్ ఆయిల్ ?

జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే

14) ప్రశ్న : ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?
జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి
.
15) ప్రశ్న : గుండె పోతూ వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?

జవాబు : గుండె పోతూ వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి . ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .

16) ప్రశ్న : గేస్త్రిక్ నొప్పికీ – గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?

జవాబు : ఈ సి జీ చూస్తే గానీ చెప్పలేము

17) ప్రశ్న : యువకులలో గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 – 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )

జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .
.
18) ప్రశ్న : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ?

జవాబు : ఉంటారు

19) ప్రశ్న : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు . వాస్తవమా ?

జవాబు : వాస్తవమే ! దగ్గర సంబంధాల వలన కంజెనితల్ ఎబనార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు . మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరు పిల్లాడు పుట్టాక పోవచ్చు ( అందరూ నవ్వేరేమో ! )

20) ప్రశ్న : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపం . నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం . ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?

జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది ఇటువంటి అసంబద్ధ జీవిత విధానానం నుండి . కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి .

21) ప్రశ్న: ఎన్టీ హైపర్ టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )

జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్

22) ప్రశ్న : కాఫీ / టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ?
జవాబు : లేదు

23) ప్రశ్న : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?
జవాబు : లేదు

24) ప్రశ్న : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి ?

జవాబు : వేపుళ్ళు ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా

25) ప్రశ్న: భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా !

జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది ( అనుకూలత ఉంటుంది ) దురదృష్ట వశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది .

26) ప్రశ్న : అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?
జవాబు : నో

27) ప్రశ్న : గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా ? ( మాకు ఈ మెయిల్స్ లో సాధ్యం అని చెప్పారు )

జవాబు : వెల్లకిలా పడుకోవాలి . నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి . అంబులెన్స్ రావడం త్వరగా జరగదు .

28) ప్రశ్న : లో వైట్ బ్లడ్ సెల్స్ ( తక్కువ తెల్ల రక్త కణాలు ) హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా ?
జవాబు : కావు . కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది

29)ప్రశ్న : మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సేర్సైజ్ చెయ్యడానికి టైం ఉండదు . ఇంట్లో నడవడం , మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా

జవాబు : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీలోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు .

30) ప్రశ్న : షుగరుకూ , గుండె జబ్బులకూ సంబధం ఉందా ?

జవాబు : ఉంది . షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ .

31) ప్రశ్న : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?

జవాబు : ఆహారం , ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బి పీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం
.
32)ప్రశ్న : రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి , డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?

జవాబు : నో

33) ప్రశ్న : ఎన్టీ హైపర్ తెన్సివ్ డ్రగ్స్ ఏమిటి ?

జవాబు : కొన్ని వందలు ఉన్నాయి . మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు . కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం ( నడక ) . ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం .

34) ప్రశ్న: డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?

జవాబు : నో

35) ప్రశ్న : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?

జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది

ఆఖరు ప్రశ్న :
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?

జవాబు :
ఆరోగ్య వంత మైన ఆహారం తినండి
ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి
జంక్ ఫుడ్ తినకండి
స్మోకింగ్ మానండి
30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త CHECK చేసుకోవాలి

Tuesday, May 9, 2017

పెళ్లిమంత్రాలకు అర్థం- పరమార్థం

పెళ్లిమంత్రాలకు అర్థం- పరమార్థం

marriage mantra meaning
పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?
పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...
పెళ్లంటే... ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం.
ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం.
మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం.
ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు...
వాటి అర్థాలపై ప్రత్యేక కథనం...
జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.
వైవాహిక జీవితానికి మూలం...
వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.
సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి. అవి సమావర్తనం, కన్యావరణం, కన్యాదానం, వివాహహోమం, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, సప్తపది, నక్షత్ర దర్శనం.
-
సమావర్తనం
-
పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన ‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం. గురుకులంలో విద్యపూర్తయ్యాక, ‘చరితం బ్రహ్మచర్యోహం’ అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి, గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం. వివాహం చేసుకున్నాక, గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.
గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...
రాత్రి సమయంలో స్నానం చేయను వస్త్రరహి తంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతులలోకి దిగను నదిని చేతులతో ఈదుతూ దాటను ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను... అని పలికిస్తారు.
-
అంకురారోపణం
-
వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు. పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు. ఇందులోని పరమార్థం... ‘‘కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి’’ అని ధర్మసింధు చెబుతోంది.
-
కన్యావరణం
-
కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు.
-
మధుపర్కం
-
మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం. వరుడికి... తేనె, పెరుగు, బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.
ఎదుర్కోలు సన్నాహం
ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.
-
కన్యాదానం- విధి
-
వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు...
అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా
ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం
‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’
‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు.
‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మకామార్థ సిద్ధికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’
‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’
వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. అప్పుడు వరుడు ‘పృణేమహే’ (వరిస్తున్నాను) అంటాడు.
ఆ తరువాత వధువు తండ్రి వరునితో,
‘‘నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు. ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.
-
యోక్త్రధారణం :
-
యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు. వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు. ఈసమయంలో వరుడు...
ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,
రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్’’ అంటాడు.
ఉత్తమమైన మనస్సును, యోగ్యమైన సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైన తనువును ధరించి, అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను... అనేది ఈ మంత్రార్థం.
-
జీలకర్ర , బెల్లం :
-
వధూవరులు... జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు. ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. ఈ సమయంలో ‘‘ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః’’ వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక’’ అని అర్థం. ఇదే అసలైన సుముహూర్తం.
-
మంగళసూత్రధారణ :
-
(తాళి... తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది).
వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి.
మాంగల్య తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం
నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.
పాణిగ్రహణము
ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం॥
చంద్రుడు (మనస్సు), బృహస్పతి (కాయం), అగ్నిహోత్రుడు (వాక్కు) ... వీరు ముగ్గురి నుంచి బతిమాలి, వధువును తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణశుద్ధిగా కాపురం బావుంటుంది అని అర్థం.
(కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని కాపాడతారట. ఆ తరువాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట).
‘సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నికిచ్చాడు, నేను నిన్ను కాపాడవలసిన నాలుగవవాడను’ అని అభిమంత్రించి పెళ్లికూతురు చేయి పట్టుకొంటాడు. ఇదే పాణిగ్రహణం.
తలంబ్రాలు
దీనినే అక్షతారోహణంగా చెబుతారు. అక్షతలు అంటే నాశం లేనివి. వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు. ఇందులో ముందుగా... ఒకరి తరవాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది. సంతానం, యజ్ఞాది కర్మలు, సంపదలు, పశుసంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు.
_
సప్తపది
-
ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది. వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుతాడు. ఇదే సప్తపది. ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాదికం, పశుసంపద, సంతానం, ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగూ వేస్తూ చదువుతారు.
ఈ మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు. ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.
-
కొత్త బంధాలు, పరిచయాలు :

మానవజీవితంలోని అన్ని సంస్కారాలలోకీ అతి ముఖ్యమైనది వివాహం. దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది. మూడుముళ్ల బంధం తో వివాహజీవితం కొనసాగుతుంది. వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతీ దర్శనం. ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య, బంధుమిత్రుల శుభాశీస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది. వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అనుబంధాలు కలుగుతాయి.
-
ఆత్మల అనుసంధానం :

మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి, తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది, స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.
జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది. లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

పాలిసెట్ ప్రవేశాలు

పాలిసెట్ ప్రవేశాలు


 వెబ్సైట్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలీసెట్ వివరాలు
 అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక విద్యా శాఖ
 వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ఈ నెల చివరి వారంలో మొదలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 22న నిర్వహించిన పాలిసెట్–2017 ఫలితాలను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటి ప్రవేశాల కౌన్సెలింగ్పైనా దృష్టి సారించింది. ఈ నెల 15 నాటికి పాలిటెక్నిక్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసి, చివరి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకుని, ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్–2017 పరీక్షను నిర్వహించింది. ఈ నెల 12న ఎంసెట్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
వచ్చే నెలలో ఆయా సెట్స్కు సంబంధించిన ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఏయే ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు లభించాయి తదితర సమగ్ర వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెబ్సైట్ ( dtets.cgg.gov.in, tsche.cgg.gov.in, sbtet.telangana.gov.in )లో అందుబాటులోకి తెచ్చింది. వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమయిన తరువాత విద్యార్థులు ఆందోళన చెందకుండా, ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు.

సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్లివి...

♦ వివిధ కోర్సులకు అవసరమైన ఎస్సెస్సీ/డిప్లొమా/ఇంటర్మీడియట్/డిగ్రీ మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం.
♦ పాలిసెట్కు 4 నుంచి 10వ తరగతి వరకు, ఈసెట్కు 7 నుంచి డిప్లొమా వరకు, ఎంసెట్కు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఐసెట్కు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి.
♦ 2017 జనవరి 1.. ఆ తరువాత జారీ చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం.
♦ విద్యార్థులు తమ పేరుతో బ్యాంకు అకౌంట్ తెరువాలి (ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం). æ చివరగా చదువుకున్న విద్యా సంస్థ నుంచి టీసీ.
♦ స్పెషల్ కేటగిరీ (ఫిజికల్ చాలెంజ్డ్, సైనిక ఉద్యోగుల పిల్లలు/ఎన్సీసీ/స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.
♦ తల్లిదండ్రులు గతంలో తెలంగాణలో ఉండి, ఉద్యోగరీత్యా, ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలకు ప్రవేశాలు కావాలంటే.. ఆ తల్లిదండ్రులు గతంలో పదేళ్లపాటు తెలంగాణలో ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రం జత పరచాలి.
♦ ఓపెన్ స్కూల్ వంటి విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు తాము ఏడేళ్లు తెలంగాణలో ఉన్నట్లు నివాస సర్టిఫికెట్ను సమర్పించాలి.
♦ కన్వీనర్ కోటాలోని 15 శాతం అన్రిజర్వుడు కోటా సీట్లలో ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీల రీజియన్ల పరిధిలో చదువుకున్న వారు అర్హులు.                       
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

తెలంగాణాలో బీసీ కులాల జాబితా - List of BC s in Telangana

తెలంగాణాలో బీసీ కులాల జాబితా - List of BC s in Telangana


తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. గ్రూపు ‘ఏ’లోని కులాలకు 7 శాతం, గ్రూపు ‘బీ’లోని కులాలకు 10 శాతం, గ్రూపు ‘సీ’లోని కులాలకు 1 శాతం, గ్రూపు ‘డీ’లోని కులాలకు 7 శాతం, గ్రూపు ‘ఈ’లోని కులాలకు 4 శాతం కలుపుకొని మొత్తం 29 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింద


గ్రూపు ‘ఏ’

అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బేస్త, జాలరి, గంగవర్, గంగపుత్ర, గోండ్ల, వన్యకుల క్షత్రీయ (వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి), నెయ్యాల, పట్టపు, బాల సంతు, బుడబుక్కల, రజక (చాకలి, వన్నార్), దా సరి, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మేదరి లేదా మహేంద్ర, మొండిరేవు, మొండిబండ, బండ, నాయి బ్రాహ్మణ (మంగలి), మంగల, భజంత్రీ, వంశరాజ్/పిచ్చగుంట్ల, పాము ల, పార్థి (మిర్మికారి) పంబల, దమ్మలి/దమ్మల/దమ్ముల/దమల, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముల్యాలమ్మవాండ్లు, వీరముష్టి (నెట్టికోటల), వీరభద్రేయ, వాల్మీకిబోయ (బో య, బేదర్, కిరాటక, నిషాది, ఎల్లపి, ఎల్లపు, పెద్దబోయ) తల యారి, చుండవల్లిగుడాల, కంజర-భట్ట, కెప్మారే లేదా రెడ్డిక, మొండిపట్ట, నొక్కర్, పారికి మొగ్గుల, యాట, చోపేమరి, కైకడి, జోషినందివాలాస్, వడ్డె (వడ్డీలు, వడ్డి, వడ్డెలు), కునపు లి, పాత్ర, పాల-ఈకరి, ఈకిల, వ్యాకుల, ఈకిరి, నాయనివారు, పాలేగారు, తోలగరి, కావలి, రాజ న్నల, రాజన్నలు, బుక్కఅయ్యవారు, గోత్రాల, కా సికాపడి/ కాశీకాపుడి, సిద్ధుల, సిక్లిగర్/సైకల్‌గర్, పూసల (గ్రూపు ‘డీ’నుంచి తొలగించి చేర్చారు).

గ్రూపు ‘బీ’

ఆర్య క్షత్రియ, చిత్తారి, గినియార్, చిత్రకార, నఖాస్, దేవాంగ, గౌడ్ (ఈడిగ, గౌడ (గమ్మల), కలాలి, గుండ్ల, శ్రీశయన (సెగిడి, దూదేకుల, లద్దాఫ్, పింజరి లేదా నూర్‌బాషా, గాండల తెలికుల, దేవతిలకుల, జాండ్ర, కుమ్మర లేదా కులాల, శాలివాహన, కిరకలభక్తుల, కైకోలన్ లేదా కైకల (సేన్‌గుండం లేదా సేన్‌గుంతర్), కర్ణభక్తుల, కురుబ లేదా కురుమ, నీలకాంతి, పల్కార్ (ఖత్రి, పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ), నెస్సి లేదా కుర్ణి, పద్మశాలి (శాలి, శాలివన్, పట్టుశాలి, సేనాపతులు. తొగట శాలి), స్వాకులశాలి, తొగటి / తొగట వీరక్షత్రియ, విశ్వబ్రాహ్మణ, ఔసుల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల (వడ్ర, వడ్రంగి, శిల్పి, విశ్వకర్మ, లోధ్, లోధి, లోధా, బోంధిలి, ఆరె మరాఠీ, మరాఠా (బ్రాహ్మణేతరులు), ఆరాకలీస్, సురభి నాటకాలవాళ్లు, నీలి, బుడుభుంజల/భుంజ్వా/భద్‌భుంజా.

గ్రూపు ‘సీ’

క్రైస్తవమతాన్ని స్వీకరించిన షెడ్యూల్‌కులాల వారు

గ్రూపు ‘డీ’

ఆరెకటిక, కటిక, ఆరె సూర్యవంశి, భట్రాజులు, చిప్పొళ్లు (మెర), హట్కర్, జింగర్, కచి, సూర్యబలిజ (కళావంతుల) గానిక, కృష్ణబలిజ (దాసరి, బుక్క), మాతుర, మాలి (బారె, బారియ, మారార్, తాంబోలి), ముదిరాజ్, ముత్తరాశి, తెనుగోళ్లు, మున్నురు కాపు, లక్కమారికాపు, పస్సి, రంగ్రేజ్/భవసారక్షత్రియ, సాధుచెట్టి, సాతాని (చాత్తాదశ్రీవైష్ణవ), తమ్మలి (బ్రాహ్మణేతరులు), శూద్రకులం), ఉప్పర లేదా సగర, వ ంజర (వంజరి), యాదవ (గొల్ల), ఆరె, ఆరెవాళ్లు, ఆరోళ్లు, అయ్యరక, నగరలు, అఘముడియన్, అఘముడియర్, అఘముడి వెల్లాలర్, అఘముడి ముడాలియర్, సొండి/సుండి, వరాల, శిష్టకరణం, వీరశైవలింగాయత్/ లింగబలిజ, కురిమి.

గ్రూపు ‘ఈ’

అచ్చుకట్టలవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపానీవాళ్లు, అచ్చుకట్టువారు, అచ్చుకట్లవాండ్లు, అత్తర్‌సాయెబులు, అత్తరోల్లు, ధోబీ ముస్లిం/ముస్లిం ధోబీ/ ధోబీ ముసల్మాన్, తురకచాకల లేదా తురకసాకల, తురకచాకలి, తుళుక్కవన్నన్, సాకల, సాకల లేదా చాకలస్, ముస్లిం రజక, ఫఖీర్, ఫఖీర్ బుడబుక్కి, ఘంటి ఫకీర్, ఘంటా ఫకీర్లు, తురక బుడబుక్కి, దర్వేష్, ఫకీర్, గారడీ ముస్లిం, గారడీ సాయెబులు, పాములవాళ్లు, కాణి/కట్టువాళ్లు, గారడోళ్లు, గారడిగా, గోసంగి ముస్లిం, ఫకీర్ సాయెబులు, గుడ్డిఎలుగువాళ్లు, ఎలుగుబంటువాళ్లు, ముసల్మాన్ కీలు గుర్రాలవాళ్లు, హజ్జాం, నాయి, నాయి ముస్లిం, నవీద్, లబ్బి, లబ్బై, లబ్బన్, లబ్బా, ఫకీర్ల, బోర్‌వాలే, డీరఫకీర్లు, బొంతల, ఖురేషి, కురేషి/ఖురేషి, ఖసాబ్, మరాఠీ ఖసాబ్, ముస్లిం కటిక, ఖటిక్ ముస్లిం, షేక్/ షైక్, సిద్ది, యాబా, హబ్షి, జాసి, తురకకాశ, కక్కుకొట్టే జింకసాయెబులు, చక్కిటాక్‌నె వాలే, తెరుగాడుగొంతలవారు, తిరుగటిగంట్ల, పత్థర్‌పోడ్లు, చక్కెటకారే, తురకకాశ.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Jokes in Telugu

Jokes in Telugu


టీచర్ : రామూ " 8" లో సగం ఏంత రా ?
రాము :అడ్డం గా అయితే "0" నిలువు గా అయితే "3"
టీచర్ : సీనియర్ కి జూనియర్ తేడా ?
రాము : సముద్రం దగ్గర వుండేవాడు sea"near"
జూ కి దగ్గర వుండేవాడు ju"near"
టీచర్ : oxford అంటే ఏంటీ ?
రాము : ox అంటే ఎద్దు, ford అంటే బండి,
oxford అంటే ఎద్దులబండి

టీచర్ : రోడ్ మీద వెళ్ళేటప్పుడు నీకు రెండు సంచులు దొరికాయి అనుకో, ఒకదానిలో జ్ఞానo, ఒకదానిలో డబ్బు వున్నాయి అనుకో నువ్వు ఏది తీసుకుంటావ్ ?
రాము : డబ్బు వున్న సంచి తీసుకుంటా మేడం,
టీచర్ : అదేరా నీకూ నాకూ తేడా, నేనయితే జ్ఞానo తీసుకునేదాన్ని,
రాము : కరక్టే మేడం, ఎవరి దగ్గర ఏది లేకపోతే అదీ తీసుకుంటారు
టీచర్ : ఒరేయ్ నీకు తెలివి ఎక్కువయిందిరా, పంది పావురం ఒకేచోట వుండలేవురా !
రాము : అందుకే మేడం నేను మీ క్లాస్ నుండి ఎగిరిపోతున్నాను
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends



భార్య : ఏవండోయ్.. ఇవాళ  సాయంకాలం తొందరగా ఇంటికి రండి సినిమాకు వెళ్దాం....

భర్త : నా దగ్గర TRS 🚙గుర్తేమైనా ఉందా, ఉండేది TDP🚲 గుర్తు... ఆలస్యం అవుతుందేమో!

భార్య : సకాలానికి వస్తే BJP🌹 గుర్తు, ఆలస్యమైతే కాంగ్రెస్ గుర్తు, మరీ ఆలస్యమైతే AAP🏒 గుర్తు మీకు స్వాగతం పలుకుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం....
.
.
.
.
.
ఇంకా నయం ఈ మహాతల్లికి CPI గుర్తు గుర్తురాలేదు...

ఒక బ్యాంకు మేనేజర్ హోటల్ కు వెళ్ళి వేటర్  తో...
బ్యా.మే:-బాబు టిఫిన్స్ ఏమున్నాయి?
వేటర్:-ఇడ్లీ,వడ,దోస,
పూరి,ఊతప్పం.
బ్యా.మే:- సరే రెండు ప్లేట్ ఇడ్లీ,ఒక ప్లేట్ వడ,ఒక ఊతప్పం పార్సిల్ ఇవ్వు.
వేటర్:-లేవు అయిపోయినవి సార్.
బ్యా.మే:-మరి ఇంత పెద్ద మెనూ చదివావు అన్నీ ఉన్నట్టు నా టైం వేస్ట్ చేసావు (అని అరిచాడు)
వేటర్:-సార్ నేను మీ ATM కు డబ్బులకోసం వెళ్తే అది పిన్ అడుగుతుంది,కరంటా సేవింగా అడుగుతుంది,ఎంత కావాలని అడుగుతుంది,రసీదు కావాలా అని అడుగుతుంది,అన్నీ అడిగాక నో క్యాష్ అని వస్తుంది...అపుడు మాకెంత మండుతుంది సార్....అన్నాడు కూల్ గా...

: భక్తుడు: స్వామీ..! మీరు సన్యాసిగా ఎలా మారారు?
సన్యాసి: చీరల షాప్ లో పనిచేసే నేను అక్కడ ఆడవాళ్ళు మాట్లాడిన రెండే రెండు మాటలకి సన్యాసిగా మారాను.
.
ఏంటి స్వామి ఆ మాటలు?
" 1. ఈ Design లో వేరే కలర్ చూపించు...
2. ఈ కలర్ లో వేరే design చూపించు....



భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?

దేవుడు : పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాల్లని భార్యలుగా మీరు చేసుకున్నారు....
అది మీ ఖర్మ...

--------------------------------------------

Teacher:- ఓరేయి..Hospital..అంటే అర్దం...ఏమిటిరా.....

Student:- భూమి నుండి నరకానికి...వెళ్ళేటప్పుడు మద్యలో వచ్చే...Toll Plaza.సార్....










బార్య : ఏమండీ ఫైర్ స్టేషన్లో మగవాళ్లు మాత్రమే పని చేస్తారు ఆడవాళ్లు ఎందుకు చేయరండి?
భర్త:  మీ ఆడవాళ్లుకు మంట పెట్టడమే తెలుసు ఆర్పడం తెలవదు కదే అందుకు..

భార్య  : రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా..

భర్త : లేదే నేను అసలు తాగలేదు.

భార్య  : అబ్బో రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వులు మీవి

భర్త : టీవీ చూస్తూ నవ్వితే తాగినట్ల...

భార్య  : స్విచ్ ఆఫ్ అయినా టీవీ ని చూస్తూ నవ్వారు...






 జడ్జి: విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు? 

భర్త: నా భార్య నాతో వెల్లుల్లి వలిపిస్తుంది. ఉల్లిపాయలు కోయిస్తుంది. అంట్లు తొమిస్తుంది. 

జడ్జి: వీటిలో అంత కష్టం ఏముంది? వెల్లుల్లిని వేడి నీటిలో వేస్తే సులువుగా వలవ్వొచ్చు. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి అప్పుడు కట్ చేస్తే కళ్ళు మండవు. గిన్నెలు కాసేపు నీటిలో నానబెట్టి కడిగితే సులువుగా శుభ్రపడతాయి. బట్టలు ఉతికే ముందు ఒక అరగంట సర్ఫ్ నీళ్లలో నాన పెడితే సులువుగా ఉతక వచ్చు. చేతులూ పాడవ్వవు.  

భర్త: అర్ధం అయ్యింది. నా కేస్ వాపస్ తీసుకుంటాను. 

జడ్జి: ఏమి అర్ధం అయ్యింది?!!!  

భర్త: మీ పరిస్థితి నా కన్నా దారుణంగా ఉందని😡
 

Thursday, May 4, 2017

ప్రాథమిక హక్కుల వర్గీకరణ

ప్రాథమిక హక్కుల వర్గీకరణ


సమానత్వపు హక్కు (ప్రకరణలు 14-18)

-14-చట్టం దృష్టిలో సమానత్వం, చట్టం అందరిని సమానంగా రక్షిస్తుంది.
-15(1)- జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు.
-15(2)- జాతి, మత, కుల, లింగ, జన్మస్థల ప్రాతిపదికపై ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశాల్లోకి రానివ్వకుండా ఉంచరాదు.
-15(2)(ఎ)-దుకాణాలు, హోటళ్లు, వినోదపు ప్రదేశాల్లో వివక్ష చూపరాదు.
-15(2)(బి) - ప్రభుత్వ ధన సహాయంతో ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశించిన బావులు, చెరువులు, స్నానపుఘట్టాలను అందరూ సమానంగా వాడుకోవచ్చు.
-15(3)- స్త్రీ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు.
-15(4)-సాంఘికంగా వెనుకబాటుకు గురైన వారు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు జారీ చేయవచ్చు.
-15(5)- మైనార్టీ విద్యా సంస్థలను మినహాయించి మిగతా ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే నిబంధనలు పార్లమెంట్ చేయవచ్చు. (93 సవరణ-2005)
-16(1)-ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమానావకాశాలు
-16(2)-మతం, వర్గం, కులం, లింగం, వంశం, జన్మస్థలం నివాస స్థలం ప్రాతిపదికపై ఏ పౌరుని పట్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపరాదు.
-16(3)-కొన్ని ప్రాంతాల ఉద్యోగాలను కొన్ని ప్రాంతాల వారికే పరిమితం చేయాలి అనే నిబంధన చేయవచ్చు.
-16(4)- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు.
-16(4ఎ) - ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల సదుపాయం కల్పించబడింది.
-16(4బి)- ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు క్యారీ ఫార్వర్డు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో 50 శాతం రిజర్వేషన్లు దాటవచ్చు.
-16(5) - ఒక మత విశ్వాసానికి సంబంధించిన శాఖలో ఆ మతానికి చెందినవారినే నియమించవచ్చు.
-17- అస్పృశ్యత నేరంగా ప్రకటించబడి రద్దు చేయబడింది.
-18-బిరుదులు
-18(1)- సైనిక, విద్యా సంబంధమైన బిరుదులు మాత్రమే ప్రకటించవచ్చు.
-18(2)- విదేశాలు ఇచ్చే బిరుదులను భారత పౌరులెవరూ స్వీకరించరాదు.
-18(3)- భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తుంటే బిరుదును స్వీకరించరాదు.
-18(4) - ఒక వ్యక్తి భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఏ పదవిని నిర్వహిస్తున్నా ఆ వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేనిదే ఇతర దేశాల నుంచి ఎలాంటి బహుమతిని, ఉద్యోగాన్ని, పదవిని స్వీకరించరాదు.

✡స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 19-22)

-19- వివిధ రకాలైన స్వేచ్ఛా హక్కులు
-19(1)(ఎ) - వాక్, భావ ప్రకటనా స్వాతంత్య్రం
-19(1)(బి) - శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశం జరుపుకొనే స్వాతంత్య్రం
-19(1)(సి) - సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకొనే హక్కు
-19(1)(డి) - దేశవ్యాప్తంగా సంచరించే హక్కు
-19(1)(ఇ) - దేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే హక్కు
-19(1)(ఎఫ్) - ఆస్తిని సంపాదించడం, దాన్ని అన్యాక్రాంతం చేయడం గురించి తెలిపేది. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించారు.
-19(1)(జి) - ఏ వృత్తినైనా, వ్యాపారాన్నయినా చేసుకోవచ్చు.
-20(1) - ఒక వ్యక్తి గత కాలంలో చేసిన నేరానికి ప్రస్తుత కాలంలో చేసిన చట్టప్రకారం శిక్షను విధించరాదు. కాని ఇది క్రిమినల్ నేరాలకు మాత్రమే వర్తిస్తుంది. సివిల్ నేరాలను గత కాలం నుంచి వర్తించేవిధంగా చట్టం చేయవచ్చు.
-20(2) - నేరం ఆరోపించబడ్డ వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్షం చెప్పాల్సిందిగా బలవంతం చేయరాదు.
-21- ప్రతి వ్యక్తికి జీవించేహక్కు ఉంది. చట్టం నిర్దారించిన పద్ధతిలో తప్ప మరేవిధంగా కూడా వ్యక్తి ప్రాణాలకు హాని కల్గించరాదు.
-21(ఎ) - 6-14 ఏండ్ల మధ్య గల బాలలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య హక్కు కల్పించబడుతుంది.
-21(1) - ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి ఆ అరెస్టుకు సంబంధించిన కారణాలను వీలైనంత త్వరగా తెలియజేయాలి.
-22(2) - అరెస్ట్ అయ్యి నిర్బంధంలో ఉన్న ఏ వ్యక్తినైనా 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరుపర్చాలి. ప్రయాణ కాలాన్ని మినహాయిస్తారు.
-22(3) - అరెస్ట్ అయిన వ్యక్తి శత్రుదేశానికి చెందినవాడైనా, ముందస్తు నిర్బంధం కింద అరెస్టు అయినా 22(1), 22(2)లు వర్తించవు.
-22(4) - ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ అయిన వ్యక్తిని మూడు నెలల కన్నా మించి నిర్బంధంలో ఉంచరాదు. కానీ పార్లమెంట్ ఏదైనా శాసనం చేసి గరిష్ట పరిమితిని పెంచవచ్చు.
-22(5) - ముందస్తు నిర్బంధం కింద అరెస్టు చేసిన వ్యక్తికి అతని అరెస్టుకు సంబంధించిన కారణాలు తెలియజేయాలి.
-22(6) - ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ముందస్తు నిర్బంధం కింద అరెస్టయిన వ్యక్తికి అరెస్టుకు సంబంధించిన కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.
-22(7) - ముందస్తు నిర్బంధ విధాన కాలపరిమితికి సంబంధించిన శాసనాలను చేసే అధికారం కేవలం పార్లమెంట్కు ఉంది.

✳పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణలు 23-24)

-23(1) - మనుషుల క్రయ విక్రయాలను, బలవంతపు వెట్టిచాకిరీ నిషేధించింది. వెట్టిచాకిరీని బేగార్ అంటారు.
-23(2) - 23(1) కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు. ఉదాహరణకు డాక్టర్లను విద్య పూర్తయిన తర్వాత కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే నిబంధనను పెట్టవచ్చు.
-23(1) - 24-14 ఏండ్లలోపు పిల్లలచేత ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయించరాదు.

⭕మత స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 25-28)

-25(1) - భారతదేశంలోని ప్రజలందరు తమకు నచ్చిన మతాన్ని, విశ్వాసాన్ని స్వీకరించవచ్చు. అచరించవచ్చు. ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి మార్చరాదు.
-25(2) - మత కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేక ఇతర సంక్షేమ కార్యకలాపాలను పరిమితం చేయడం, నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
-26 - ప్రజా శాంతి, ఆరోగ్యకరమైన నైతికతలకు లోబడి మత సంస్థలు మత ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు. వీటికి సంబంధించిన ఆస్తులను సేకరించవచ్చు. వీటి కార్యకలాపాలను తమకు తామే నిర్వహించవచ్చు.
-27 - ఏదేని ఒక మతవ్యాప్తికి లేదా మత పోషణకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయడంపై నిషేధం విధిస్తుంది.
-28(1) - ప్రభుత్వ నిధులు పొందుతున్న విద్యాలయాల్లో మత బోధన నిషేధించింది.
-28(2) - ప్రభుత్వ నిధులు కాకుండా తమ సొంత నిధులతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో మత బోధన జరుపవచ్చు.
-28(3) - ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన విద్యాసంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు. లేదా పాల్గొనకపోవచ్చు. వారిని ఆ కార్యకలాపాల్లో పాల్గొనమని బలవంతం చేయరాదు.

సాంస్కృతిక విద్యా విషయపు హక్కు (ప్రకరణలు 29-30)

-29(1) - భారతదేశంలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకొనే హక్కు కలిగి ఉన్నారు.
-29(2) - ప్రభుత్వం సహాయం పొందే విద్యాసంస్థల్లో జాతి, మతం, కులం, భాష వంటి వాటిల్లో ప్రవేశం నిరాకరించరాదు.
-30 - విద్యాసంస్థలు స్థాపించడానికి మతప్రాదిక లేదా భాషా ప్రాదిక మైనారిటీ వర్గాల వారికి హక్కు ఉంది.
-30(2) - ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు అది అల్పా సంఖ్యాకులు నడిపే విద్యాసంస్థల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు.
రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ)
-ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు 32వ అధికరణ ప్రకారం హైకోర్టు 226 అధికరణ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది.
-రిట్ అంటే కచ్చితంగా పాటించాల్సిన కోర్టు ఆజ్ఞ
-32- ప్రాథమిక హక్కుల సంరక్షణకు రాజ్యాంగం ద్వారా పరిహారం పొందడానికి అవకాశం ఉంది.

‘ట్రిపుల్ ఐటీ’లో చేరాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే..


‘ట్రిపుల్ ఐటీ’లో చేరాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే.. 

బాసర:
 పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బాసర ట్రిపుల్‌ ఐటీ 2017-18 సంవత్సరానికి గాను ప్రవేశా లకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
 తెలంగాణలో ఉన్న ఏకైక రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ)లో వెయ్యి సీట్ల భర్తీకి మంగళ వారం యూనివర్సీటి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
  • 28వ తేది నుంచి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 
  • ఫలితాలకు సంబంధం లేకుండా పదో తరగతి హాల్‌ టికెట్‌ నెంబరుతో దరఖాస్తులు చేసుకోవచ్చు. 
  • యూనివర్సీటి సెకండరీ బోర్డు నుంచి మార్కుల జాబితాను తీసుకొని ప్రవేశాల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. 
  • ప్రవేశ అర్హతలు.:-
  • 2017 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 
  •  ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాసై ఉండాలి. రిజర్వేషన్లు...
  • ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గాను 85 శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించనున్నారు.
  • మిగతా 15 శాతం సీట్లు ఓపెన్‌ కెటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. 
  • రిజర్వేషన్‌ ప్రకారం పరిశీ లిస్తే ఎస్సీకి 15, 👉 ఎస్టీ 6, 👉 బీసీ-ఏ 7, 👉 బీసీ- బి-10, 👉 బీసీ-సీ 1, 👉 బీసీ-డీ 7, 👉 బీసీ-ఈ 4, 👉 ఫిజికల్లీ హ్యండిక్యాప్‌-3, 👉 క్యాప్‌ 2, 👉 ఎన్‌సీసీ ఒకటి, 👉 స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. 
  • దీంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు, 
  • ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు.
  •  అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటిస్తారు. 
  • ప్రవేశ విధానం.:-
  • పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. 
  • ప్రభుత్వం, నాన్‌రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 0.4 పాయింట్లను వచ్చిన పదో తరగతి గ్రేడుకు జతకలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. 
  • సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన గ్రేడు పాయింట్లు ఉన్నట్లయితే మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, ఆ తర్వాత సోషల్‌ స్టడీస్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజీలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. 
  • అయినా సమానమైతే పుట్టిన తేది ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. ✍ దరఖాస్తు చేసుకునే విధానం... 
  • అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ✍ మీసేవా, పీఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 150, ✍ ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 ప్రవేశరు సుము చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఈ మొత్తాన్ని ఆయా ఆన్‌లైన్‌ సెంటర్ల వద్దనే చెల్లిం చాలి. ✍ దీంతో పాటు ఆ సెంటర్‌ సర్వీస్‌ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు. 
  • ముఖ్యమైన తేదిలు.. 
  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేది 28-04-2017 
  •  చివరి తేది 24-05-2017 
  • దరఖాస్తు దారులు తమ సర్టిఫికేట్‌లను యూనివర్సీటికి పంపించాల్సిన ఆఖరు తేది : 29-05.2017 
  • విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల జూన్‌ 5. ✍ మొదటి కౌన్సెలింగ్‌ జూన్‌ 19, 20 తేదిల్లో 
  • ప్రత్యేక కెటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ జూన్‌ 22, 24, 27 తేదిల్లో 
  •  చివరి దశ కౌన్సెలింగ్‌ జూన్‌ 29, 30 తేదిల్లో.
  • కొత్త విద్యార్థులకు జూలై 1వ తేది నుంచి తరగతులు ప్రారంభం. ✍ఫీజుల వివరాలు...
  •  ప్రవేశం పొందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో 6 సంవత్సరాలు విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ✍ ఇందులో ఇంజనీరింగ్‌ సంబంధించిన అన్ని కోర్సులు ఉంటాయి. 
  • మొదటి రెండేళ్లు ఏడాదికి రూ. 36 వేలు,
  • ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 
  • ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రం మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ✍ ఇలాంటి వారికి యూనివర్సిటీ బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించనుంది. 
  • అన్ని ఉచితమే... ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని ఉచితంగా అందజేస్తుంది. 
  • ఆరు సంవత్సరాల పాటు ల్యాప్‌టాప్‌, మూడుజతల డ్రెస్సులు, రెండు జతల షూలు, ఇతర హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. 
  • దీంతో పాటు కార్పొరేట్‌ స్థాయి కంటే ఎక్కువ వసతులను కల్పిస్తుంది.
  • కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. 
  • ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ద్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే ప్రవేశం కల్పిస్తారు. 
  • దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాల న్నింటిలో దగ్గరుంచుకోవాలి. 
  • దరఖాస్తు చే సుకున్న రశీదు, టెన్త్‌ హల్‌టికెట్‌,మార్కుల షీట్‌, రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌, కులద్రువీక రణ పత్రాలు. Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.