Pages

Friday, March 10, 2017

ఆధార్ పేమెంట్ యాప్‌తో లాభాలు- ఇబ్బందులు

ఆధార్ పేమెంట్ యాప్‌తో లాభాలు- ఇబ్బందులు ఇవే..


నోట్లరద్దు తర్వాత ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ‘ఆధార్ పేమెంట్ యాప్’ను లాంఛ్ చేసింది. ఇంతకు ముందు ‘భీమ్’ యాప్‌ను లాంఛ్ చేసినా దాని సేవలు పొందాలంటే ప్రతి ఒక్కరూ ఆ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకపోవడంతో ‘భీమ్’ యాప్ అందరికీ చేరువకాలేకపోయింది.

💎అయితే ‘ఆధార్ పేమెంట్ యాప్’ అలా కాదు. కేవలం మర్చంట్స్ మాత్రమే యాప్ వాడుతారు. వినియోగదారులు యాప్ అవసరం లేకుండా కేవలం ఆధార్ నంబర్, వేలి ముద్రల ద్వారా నగదు చెల్లింపులు జరపొచ్చు. దీనికోసం దుకాణాదారుడు స్మార్ట్‌ఫోన్‌లో ‘ఆధార్ పేమెంట్ యాప్’, ‘బయోమెట్రిక్ స్కానర్’ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ రెండింటినీ అనుసంధానించి, మొబైల్‌కు బయోమెట్రిక్ స్కానింగ్ పరికరాన్ని కనెక్ట్ చేయాలి. అనంతరం ‘ఆధార్ పేమెంట్ యాప్’లో కొనుగోలుదారుడి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి వేలిముద్రను స్కాన్ చేసి, సంబంధింత బ్యాంకును ఎంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యాప్ పనిచేయాలంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే. ముఖ్యంగా వినియోగదారుల బ్యాంక్ అంకౌంట్స్‌కు వాళ్ల ఆధార్ నంబర్‌లు లింక్ చేసి ఉంటేనే ఈ విధానం సాధ్యమవుతుంది.

యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి.



ఉపయోగాలివీ...:-
1. కొనుగోలుదారులు ఎలాంటి స్మార్ట్‌ఫోన్స్ కానీ, టెక్నాలజీ కానీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

2. సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇతర ఎక్స్‌ట్రా ఛార్జీలు కానీ ఉండవు.

3. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు.
4. పాస్‌వర్డ్స్, MPINs గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఈ యాప్ ద్వారా చాలా లాభాలున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.

ఈ యాప్ ద్వారా పేమెంట్ చెల్లించాలంటే ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు ఉన్నాయో.. వాళ్ల ఆధార్ నంబర్‌తో పాటు వాళ్లు కూడా అందుబాటులో ఉండాల్సిందే.

ఏదైనా అత్యవసర సమయంలో అకౌంట్ ఉన్న వాళ్లు ఒకచోట ఉండి, పేమెంట్ ఇంకో చోట చేయాల్సిన సమయంలో ఇది సాధ్యపడదు. ఎందుకంటే సంబంధిత వ్యక్తి వేలిముద్రలు ఉంటేనే అకౌంట్ యాక్సెస్ అవుతుంది.

ఇంకో విషయం ఏంటంటే మనం సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేటప్పుడు మన వేలి ముద్రలు కనిపించేలా ఉండి, వాటిని మన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేస్తే.. వాటి ద్వారా మన వేలిముద్రలను తస్కరించే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు ఇది వరకే స్పష్టం చేశారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజలు ఎంతవరకు ఈ యాప్‌ను వాడుకలోకి తీసుకొస్తారో చూడాలి.  

Monday, March 6, 2017

ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ఆటంబాంబ్ -- రాబర్ట్ ఓపెన్‌హీమర్
👉*ఆస్పిరిన్ -- ఫెలిక్స్ హాఫ్‌మన్
👉*ఇన్సూలిన్ -- బాంటింగ్
👉*ఎక్స్ కిరణాలు -- రాంట్‌జన్
*👉ఎర్రరక్త కణాలు-- లీవెన్‌హాక్
👉*ఎలవేటర్స్-- ఎలిషా ఓటిస్
*👉ఏకె-47 -- Alexander Kalashnikov
👉*కంప్యూటర్ (అనాలిటికల్.ఇంజన్)--చార్లెస్ బాబేజ్,
👉*కాటన్ జిన్ -- ఎలి విట్నీ
*👉కుక్క కాటుకు మందు -- లూయీపాశ్చర్
👉*కుట్టుమిషన్ -- ఐజాక్ సింగర్
👉*క్రాస్‌వర్డ్ పజిల్ -- ఆర్థర్ వైనె
👉*క్రెస్కోగ్రాఫ్ -- జగదీశ్ చంద్రబోస్
👉*క్వాంటం సిద్ధాంతం -- మాక్స్ ప్లాంక్,
👉*గ్రామ్‌ఫోన్ - థామస్ ఆల్వా ఎడిసన్
👉*జిరోగ్రఫి -- చెస్టర్ కార్ల్‌సన్
👉*జెట్ ఇంజన్-- ఫ్రాంక్ విటిల్,
👉*టెలిగ్రాఫ్ కోడ్ -- మోర్స్
👉*టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రహంబెల్
*👉టెలివిజన్- జె.ఎల్.బైర్డ్
👉*ట్రాన్సిస్టర్ -- జాన్ బార్డిన్
👉*ట్రాన్స్‌ఫార్మర్ -- మైకేల్ ఫారడే
👉*డిఎన్‌ఏ నమూనా -- వాట్సన్, క్రిక్
*👉డిడిటి -- పాల్ ముల్లర్
👉*డీజిల్ ఇంజన్ -- రుడాల్ఫ్ డీజిల్
👉*డైనమో - మైకేల్ ఫారడే
👉*డైనమైట్-- ఆల్‌ఫ్రెడ్ నోబెల్,
👉*నియాన్ లాంప్ -- జార్జెస్ క్లాడ్
👉*న్యూక్లియర్ రియాక్టర్-- ఎన్రికో ఫెర్మి
👉*పెన్సిలిన్ -- అలెగ్జాండర్ ఫ్లెమింగ్
👉*పోర్ట్‌లాండ్ సిమెంట్-- జోసెఫ్ ఆస్పిడిన్
👉*పోలియో వాక్సిన్ -- అల్బర్ట్ సాబిన్
👉*పోస్టల్ స్టాంప్ -- రౌలాండ్ హిల్
👉*ప్రింటింగ్ మిషన్ - గూటెన్‌బర్గ్
👉*ఫౌంటెన్ పెన్-- వాటర్‌మాన్
👉*బాక్టీరియా -- లీవెన్‌హాక్
*👉బారోమీటర్ -- టోరిసెల్లి
👉బేకలైట్ -- లియో బేక్‌లాండ్
👉బ్యాటరీ -- అలెసాండ్రో ఓల్టా
👉రక్తప్రసరణం - విలియం హార్వే
👉రక్తమార్పిడి -- లాండ్ స్టీనర్
👉రాడార్ -- రాబర్ట్ వాట్సన్ వాట్
👉రామన్ ఎఫెక్ట్ -- సివి రామన్
👉రివాల్వర్ - కోల్ట్
👉రూబిక్ క్యూబ్-- ఎర్నో రూబిక్,
👉రేడియం - మేరీక్యూరీ
👉రేడియో -- మార్కోని
👉లాగరిథమ్‌ టేబుల్ -- జాన్ నేపియర్
👉లేజర్ -- థియోడర్ మైమన్
👉వరల్డ్ వైడ్ వెబ్ -- టిమ్‌ బెర్నర్స్ లీ
👉వికీపీడియా -- జిమ్మీవేల్స్, లారీసాంగర్స్
👉విటమిన్ - ఫంక్
👉వైర్‌లెస్ - మార్కోని
👉సిమెంట్-- ఆస్పిడిన్
👉సూక్ష్మదర్శిని -- లేవెన్‌హాక్
👉సెల్సియస్ మాపని -- ఆండర్స్ సెల్సియస్
👉సేఫ్టీ లాండ్ -- హంప్రీడేవీ
👉సైకిల్ -- మాక్‌మిలన్
👉స్టీమ్‌ఇంజన్ -- జేమ్స్ వాట్
👉స్టెతస్కోప్ -- రెనె లీనెక్
👉స్పిన్నింగ్ జెన్ని-- జేమ్స్u. హర్‌గ్రీవ్స్,
👉హెలికాప్టర్ - బ్రెక్వెట్,
👉హైడ్రోజన్ బాంబ్-- ఎడ్వర్డ్ టెల్లర్,

రకరకాల అధ్యయన శాస్త్రాలు

రకరకాల అధ్యయన శాస్త్రాలు

.

జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ

పండ్ల తోటల పెంపకం - పామాలజీ

విత్తనాలు - కార్పోలజీ

పక్షులు - ఆర్నిథాలజీ

ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ

జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ

మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్

విష పదార్థాలు - టాక్సికాలజీ

పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ

కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ

నేరం, నేరస్తులు - క్రిమినాలజీ

భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్

ఆల్గేలు - ఫైకాలజీ

రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ

నదులు - పొటామాలజీ

శిలల స్వభావం - లిథోలజీ

అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్

వివిధ మతాలు - థియోలజీ

జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ

స్టాంపుల సేకరణ - ఫిలాటెలి

జనాభా లక్షణాలు - డెమోగ్రఫి

జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి

ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి

మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్

చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ

నిద్ర - హెప్నాలజీ

శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ

మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ

ఎక్స్‌రే కిరణాలు, రేడియో ధార్మికత - రేడియోలజీ

మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ

అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి

జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ

మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ

స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ

భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ

కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ

చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి

వాస్తు - ఆస్ట్రాలజీ

కీటకాలు - ఎంటమాలజీ

విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ

జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్

కణాలు - సైటాలజీ

జంతువులు - జువాలజీ

దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ

పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్

విమానాలు - ఎరోనాటిక్స్

భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ

వాతావరణం- మెటియారాలజీ

చెట్లు - డాండ్రోలజీ

జన్యువులు - జెనెటిక్స్

వైరస్‌లు - వైరాలజీ

బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ

జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ

భూకంపాలు - సిస్మోలజీ

పర్వతాలు - ఓరాలజీ

సమాజం - సోషియాలజీ

బోధనా పద్ధతులు - పెడగాగి

షెల్స్ - కాంకోలజీ

ఎముకలు - ఆర్థోపెడిక్స్

చేపలు - ఇక్తియాలజీ

జంతువుల వైఖరి - ఎథోలజీ

లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి

రాసిన రికార్డులు - ఫిలాలజీ

వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ

నిఘంటువులు - లెక్సికోగ్రఫి

గర్భధారణ, ప్రసవం - అబ్‌స్టేట్రిక్స్

తూనికలు,కొలతలు-మెట్రోలజీ

కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్

ఎముకలు - ఓస్టియోలజీ

కణతులు - అంకాలజీ

నరాలు - న్యూరాలజీ

వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ

ధ్వని - అకౌస్టిక్స్

గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ

వర్షపాతం - హైటోలజీ

పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్

మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి

కాలం - హొరాలజీ

భూగర్భ జలం - హైడ్రాలజీ

తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ

కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ

నాణేలు - న్యూమిస్‌మ్యాటిక్స్

రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ

కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ

పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ

వేలిముద్రలు - డాక్టిలోలజీ

గుహలు - స్పెలియాలజీ

భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్

చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ

ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ

మానవ అందం - కాలోలజీ

నీటి క్షీరదాలు - సిటోలజీ

వ్యాధులు - పాథాలజీ

సంఖ్యలు - న్యూమరాలజీ

మొక్కలు - బోటనీ

గడ్డి - అగ్రోస్టాలజీ

.

31 తెలంగాణ జిల్లాలు – వివరాలు

31 తెలంగాణ జిల్లాలు – వివరాలు



68-revenue divisions
కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు  – 21,
మండలాలు –125,
రెవెన్యూ డివిజన్లు– 25,
పోలీస్ కమిషనరేట్‌లు– 4,
 పోలీస్ డివిజన్లు– 23,
పోలీస్ స్టేషన్లు– 91,
 సర్కిళ్లు– 28


మొత్తం జిల్లాలు   : 31,
విస్తీర్ణం చ.కి.మీలో: 1,12,077

జనాభా               : 3,50,03,674,

అక్షరాస్యత          : 66.46,

మండలాల సంఖ్య: 584,

రెవెన్యూ డివిజన్లు: 68,

రెవెన్యూ గ్రామాలు: 10,966,

జిల్లాల ప్రాముఖ్యత

అతిపెద్ద జిల్లా:
భద్రాద్రి-కొత్తగూడెం 8,062చ.కి.మీ,
అతిచిన్న జిల్లా:
హైదరాబాద్ 217చ.కి.మీ,


జిల్లాజనాభా

ఎక్కువ: హైదరాబాద్ 39,43,323,

తక్కువ : రాజన్న సిరిసిల్ల జిల్లా 5,43,694,

జిల్లా అక్షరాస్యత
ఎక్కువ : హైదరాబాద్ 83 %,

తక్కువ : కామారెడ్డి 48.49 %

మండలాలు

ఎక్కువ         : నల్లగొండ 31,

తక్కువ.       : వరంగల్ అర్బన్ 11,

మండల జనాభా
ఎక్కువ :  హైదరాబాద్ జిల్లాలో బహదూర్‌పుర 4,68,158

రెండో మండలం: ఖమ్మం అర్బన్
తక్కువ :
మహబూబబాద్ జిల్లాలో గంగారం 10,780,


*గ్రామాలు
ఎక్కువ*    : సంగారెడ్డి 600,

తక్కువ    : హైదరాబాద్ 100,

*రెవెన్యూ డివిజన్లు
ఎక్కువ*      : రంగారెడ్డి 11,

తక్కువ ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్*
31 జిల్లాలు -వాటి వివరాలు
ఆదిలాబాదు జిల్లా-

విస్తీర్ణం                : 4,153చ.కి.మీ
జనాభా               : 7,21,433
అక్షరాస్యత          : 63.01%
మండలాలు         : 18
రెవెన్యూ గ్రామాలు: 504
రెవిన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు.


నల్లగొండ జిల్లా౼
విస్తీర్ణం                 : 6,863చ.కి.మీ
జనాభా               : 16,31,399,
అక్షరాస్యత          : 65 %,
మండలాలు         : 31
రెవెన్యూ గ్రామాలు: 565
రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ.

నిర్మల్ జిల్లా-

విస్తీర్ణం                 : 3,845చ.కి.మీ
జనాభా               : 7,30,286
అక్షరాస్యత          : 57.73 %
మండలాలు         : 19
రెవెన్యూ గ్రామాలు: 428
రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా.

సూర్యాపేట జిల్లా🍎

విస్తీర్ణం                : 3,374చ.కి.మీ
జనాభా               : 10,99,560
అక్షరాస్యత          : 63 %
మండలాలు         : 23
రెవెన్యూ గ్రామాలు: 279
రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ
మంచిర్యాల జిల్లా🚌

విస్తీర్ణం                : 3,943చ.కి.మీ
జనాభా               : 7,07,050
అక్షరాస్యత          : 61.81 %
మండలాలు         : 18
రెవెన్యూ గ్రామాలు: 389
రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి.

యాదాద్రి భువనగిరి జిల్లా⛰

విస్తీర్ణం                : 3,092చ.కి.మీ
జనాభా               : 7,26,465
అక్షరాస్యత          : 68 %
మండలాలు         : 16
రెవెన్యూ గ్రామాలు: 296
రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్.

కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా🐠

విస్తీర్ణం                : 4,878చ.కి.మీ
జనాభా               : 5,92,831
అక్షరాస్యత          : 52.62 %
మండలాలు         : 15
రెవెన్యూ గ్రామాలు: 435
రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా🌹

విస్తీర్ణం                 : 6,175చ.కి.మీ
జనాభా               : 7,05,054
అక్షరాస్యత          : 60 %
మండలాలు         : 20
రెవెన్యూ గ్రామాలు: 574
రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా🏛

విస్తీర్ణం                : 8,062చ.కి.మీ
జనాభా               : 11,02,094
అక్షరాస్యత          : 62.63 %
మండలాలు         : 23
రెవెన్యూ గ్రామాలు: 449
రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం.

మహబూబాబాదు జిల్లా🌳

విస్తీర్ణం                : 2,877చ.కి.మీ
జనాభా               : 7,70,170
అక్షరాస్యత          : 57 %
మండలాలు         : 16
రెవెన్యూ గ్రామాలు: 297
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు.

వరంగల్లు(రూరల్) జిల్లా🌼

విస్తీర్ణం                : 2,175చ.కి.మీ
జనాభా               : 7,16,457
అక్షరాస్యత          : 66 %
మండలాలు         : 15
రెవెన్యూ గ్రామాలు: 233
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట.

వరంగల్లు(అర్బన్) జిల్లా👑

విస్తీర్ణం                 : 1,305చ.కి.మీ
జనాభా               : 11,35,707
అక్షరాస్యత          : 66 %
మండలాలు         : 11
రెవెన్యూ గ్రామాలు: 133
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు.
సంగారెడ్డి జిల్లా💊

విస్తీర్ణం                 : 4,441చ.కి.మీ
జనాభా               : 15,23,758
అక్షరాస్యత          : 64.26 %
మండలాలు         : 26
రెవెన్యూ గ్రామాలు: 600
రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్.

రంగారెడ్డి జిల్లా✈

విస్తీర్ణం                 : 5,006చ.కి.మీ
జనాభా               : 25,51,731
అక్షరాస్యత          : 75.87 %
మండలాలు         : 27
రెవెన్యూ గ్రామాలు: 594
రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్.

మేడ్చల్ జిల్లా🚙

విస్తీర్ణం                : 1,039చ.కి.మీ
జనాభా               : 25,42,203
అక్షరాస్యత          : 69 %
మండలాలు         : 14
రెవెన్యూ గ్రామాలు: 161
రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి
హైదరాబాద్ జిల్లా🏭

విస్తీర్ణం                 : 217చ.కి.మీ
జనాభా               : 39,43,323
అక్షరాస్యత          : 83.25 %
మండలాలు         : 16
రెవెన్యూ గ్రామాలు: 100
రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్.

కరీంనగర్ జిల్లా🦄

విస్తీర్ణం                 : 2,379చ.కి.మీ
జనాభా               : 10,18,119
అక్షరాస్యత          : 61 %
మండలాలు         : 16
రెవెన్యూ గ్రామాలు: 215
రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్.
సిరిసిల్ల రాజన్న జిల్లా🐚

విస్తీర్ణం                 : 2,019చ.కి.మీ
జనాభా               : 5,43,694
అక్షరాస్యత          : 66.1 %
మండలాలు         : 13
రెవెన్యూ గ్రామాలు: 170
రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల.

పెద్దపల్లి జిల్లా🦋

విస్తీర్ణం                : 2,236చ.కి.మీ
జనాభా               : 7,95,332
అక్షరాస్యత          : 60 %
మండలాలు         : 14
రెవెన్యూ గ్రామాలు: 215
రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని.


నిజామాబాదు జిల్లా:-

విస్తీర్ణం                : 4,261చ.కి.మీ
జనాభా               : 15,77,108
అక్షరాస్యత          : 54.42 %
మండలాలు         : 27
రెవెన్యూ గ్రామాలు: 438
రెవెన్యూ డివిజన్లు : నిజామాబాదు, ఆర్మూరు, బోధన్.

సిద్దిపేట జిల్లా🎾

విస్తీర్ణం                : 3,432చ.కి.మీ
జనాభా               : 10,02,671
అక్షరాస్యత          : 61.45 % మండలాలు         : 22
రెవెన్యూ గ్రామాలు: 376
రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు.

వికారాబాదు జిల్లా💥

విస్తీర్ణం                : 3,386చ.కి.మీ
జనాభా               : 8,81,250
అక్షరాస్యత          : 69 %
మండలాలు         : 18
రెవెన్యూ గ్రామాలు: 476
రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు.


కామారెడ్డి జిల్లా🔻

విస్తీర్ణం                 : 3,667చ.కి.మ
జనాభా               : 9,74,227
అక్షరాస్యత          : 48.49 %
మండలాలు         : 22
రెవెన్యూ గ్రామాలు: 474
రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి.

నాగర్‌కర్నూలు జిల్లా🔸

విస్తీర్ణం                 : 2,966చ.కి.మీ
జనాభా               : 8,60,613
అక్షరాస్యత          : 54.04 %
మండలాలు         : 20
రెవెన్యూ గ్రామాలు: 362
రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి.

మహబూబ్‌నగరు జిల్లా🔹

విస్తీర్ణం                : 4,037చ.కి.మీ
జనాభా               : 12,90,467
అక్షరాస్యత          : 57 %
మండలాలు         : 26
రెవెన్యూ గ్రామాలు: 454
రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట.

జోగులాంబ గద్వాల జిల్లా🏀

విస్తీర్ణం                : 2,928చ.కి.మీ
జనాభా               : 6,64,971
అక్షరాస్యత          : 51 %
మండలాలు         : 12
రెవెన్యూ గ్రామాలు: 226
రెవెన్యూ డివిజన్లు: గద్వాల.

జనగాం జిల్లా🔺

విస్తీర్ణం                : 2,187చ.కి.మీ
జనాభా               : 5,82,457
అక్షరాస్యత          : 61 %
మండలాలు         : 13
రెవెన్యూ గ్రామాలు: 200
రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం

మెదక్ జిల్లా:-

విస్తీర్ణం                : 2,723చ.కి.మీ
జనాభా               : 7,67,428
అక్షరాస్యత          : 55.52 %
మండలాలు         : 20
రెవెన్యూ గ్రామాలు: 381
రెవెన్యూ డివిజన్లు : మెదక్, తూప్రాన్, నర్సాపూరు
ఖమ్మం జిల్లా:-

విస్తీర్ణం                : 4,360చ.కి.మీ
జనాభా               : 13,89,566
అక్షరాస్యత          : 62.26 % మండలాలు         : 21
రెవెన్యూ గ్రామాలు: 380
రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు.

జగిత్యాల జిల్లా:-

విస్తీర్ణం                : 3,043చ.కి.మీ
జనాభా               : 9,83,414
అక్షరాస్యత          : 54.53 % మండలాలు         : 18
రెవెన్యూ గ్రామాలు: 284
రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి.


వనపర్తి జిల్లా:-

విస్తీర్ణం                : 3,055చ.కి.మీ
జనాభా               : 7,70,334
అక్షరాస్యత          : 54 % మండలాలు         : 14
రెవెన్యూ గ్రామాలు: 27931
రెవెన్యూ డివిజన్లు: వనపర్తి.
                  
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

Sunday, March 5, 2017

"స్టాలిన్ "

సోవియట్ రారాజు...కమ్యూనిస్ట్ నేత... "స్టాలిన్ "వర్దంతి సందర్భం గా.

Stalin "స్టాలిన్ "
★స్టాలిన్ పూర్తి పేరు జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్ (ఇంటిపేరు "జుఘాష్విల్") ఆయన  రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధినేత. 1922 నుండి 1953లో అతను మరణించే వరకు "సోనియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ" జనరల్ సెక్రటరీగా పనిచేశారు.

★అతను క్రమంగా తన అధికారాన్ని పటిష్ఠం చేసుకొని సోవియట్ తనవైపునకు తిప్పుకున్న ప్రతిభాశాలి స్టాలిన్. ఆయన పాలనా కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలోస్టాలినిజమ్ అంటారు.

స్టాలిన్ పాలన..


★1924లో లెనిన్ మరణానంత రం అధికారం కోసం లియాన్ ట్రాట్‌స్కీ, స్టాలిన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఫలితంగా ట్రాట్‌స్కీ సోనియ ట్ యూనియన్ నుండి వెళ్ళగొట్టబడ్డాడు.

స్టాలిన్ నాయకత్వంలో..
■ వ్యవసాయాన్ని సమిష్ఠీకరించ డం జరిగింది

■వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది.

■స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది.

■సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణనీయంగా ఆహారోత్పత్తి పెరిగింది.

■కానీ.. రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు.

■సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తం లోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేదం టే ఆశ్చర్యమేస్తుంది.

■ రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జెర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది.

■స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోయింది.

మహా ప్రక్షాలన...


★1930 దశకం చివరిలో స్టాలిన్ ప్రారంభించిన మహ ప్రక్షాలన సమయంలో అనేక మంది రాజకీయ ప్రత్యర్ధులని అరెస్ట్ చెయ్యడం, జైలు శిక్షలు లేదా మరణ శిక్షలు విధించడం జరిగింది. కొందరికి నామమాత్రపు విచారణతోనే మరణ శిక్షలు విధించిడం కూడా జరిగింది. దీని వల్ల స్టాలిన్ తీవ్ర విమర్శ లు ఎదుర్కొన్నారు.స్టాలిన్ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శకుల దాడి నుంచి ఆయన బయటపడ్డా నికి చాలా సమయమే పట్టింది.

రెండవ ప్రపంచ యుద్ధం..


★ఈ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ దురాక్రమణ రష్యా పై ఉప్పెన లా పడింది. ఎంతో నష్టాన్ని ఎదుర్కొని స్టాలిన్ అధ్వర్యంలో రష్యా సాగించిన పోరాటం నాజీ జర్మనీ ఓటమికి చాలా ముఖ్యమైన కారణమయ్యింది. (1939–1945), అయితే యుద్ధం సమయంలోను, అంతకు పూర్వం స్టాలిన్ అనుసరించిన కొన్ని చర్యలు పెద్ద తప్పిదాలుగాను, వాటివల్ల సోవియట్ ప్రజలు చాలా నష్టపోయినట్లుగాను చరిత్రకారులు భావిస్తున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ఒక సూపర్ పవర్‌గా రూపొందింది. ఆ స్థానం సుమారు నాలుగు దశాబ్దాలు (1991 వరకు) కొనసాగింది.

స్టాలిన్ వ్యక్తిత్వం...


 స్టాలిన్ వ్యక్తిత్వంపై కూడా విమర్శ లు ఉన్నాయి. ఆయన వ్యక్తి పూజని ప్రోత్సహించే వాడన్న విమర్శలూఉన్నాయి. బెల్జియం దేశానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు లూడో మార్టెన్స్ మాత్రం ఈ విమర్శలని కొట్టి పారేస్తున్నారు. స్టాలిన్ నేటి తరానికి మార్గదర్శకుడని కొనియాడుతున్నారు. అయితే, స్టాలిన్ ను తిట్టేవాళ్లు ఎంత మంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మందే ఆయన గురించి గొప్పగా చెప్పుకొనే వారూ ప్రపంచ వ్యాప్తంగా నేటికీ ఉన్నారంటే ఆయన వ్యక్తిత్వం కాక మరేమిటి?



Saturday, February 25, 2017

ATM పిన్ మర్చిపోయారా..? నిమిషంలో తెలుసుకోండి !

ATM పిన్ మర్చిపోయారా..? నిమిషంలో తెలుసుకోండి !

ATM పిన్ మర్చిపోయారా..? నిమిషంలో తెలుసుకోండి !
సాధారణంగా ATM పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డు కి అప్లై చేయడం లాంటివి చేస్తారు. కాని ఇప్పుడున్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు. బ్యాంకుకు వెళ్ళే అవసరమా అంతకన్నా లేదు. కేవలం నిమిషంలో మీ పిన్ తెలుసుకోవచ్చు.

పిన్ తెలుసుకోడానికి మీకు కావలసినవి:
1. ATM కార్డ్

2. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్

3. మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్.

దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్లి మీ కార్డు ని పెట్టండి. ఆ తర్వాత...

1. Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి

2. Pin Generate లేదా ATM Pin reset అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి


3. మీ Account Number ని ఎంటర్ చేయండి

4. మీ Phone number ఎంటర్ చేయండి

5. మీ ఫోన్ కి OTP (One Time Password) వస్తుంది

6. OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ని మార్చితే సరిపోతుంది. పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ ఆక్టివేట్ అవుఉతుంది.

ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసి అవగాహన కలిపించండి.  
Please Leave your Comment below
Share this to your Friends

దేశీయ ఆవు నెయ్యి - ఉపయోగాలు

 దేశీయ ఆవు నెయ్యి - ఉపయోగాలు 

1. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది . మతిభ్రమణం తగ్గుతుంది
.
2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది .
.
3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది
.
4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది
.
5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది
.
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది
.
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు
.
7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది
.
.
8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊదడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది
.
9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
.
10. 20 - 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతి బెల్లం కలిపి తినిపిస్తే భంగు , గంజాయి , మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది
.
11. అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి
.
12. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి
.
13. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ , మల బద్ధకం రావు . ఉంటె పోతాయి
.
14. ఆవు నెయ్యి బల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది
.
15. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .
.
16. మీరు బలహీనంగా , సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు
.
17. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు , వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది
.
18. హృద్రోగులకు ఆవునెయ్యి వరం .
.
18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది
.
19. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు
.
20. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది .
.
22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి .
.
ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుదామా , వాటిని నరికి తిని, ఆ జాతిని లేకుండా చేసుకుందామా?
.
Please Leave your Comment below
Share this to your Friends

Thursday, February 23, 2017

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? 



సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. 

అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. 

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు;-

  • ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. 
  • శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. 
  • చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. 
  • ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. 
  • ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. 
  • ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. 
  • ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. 
  • ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. 
  • మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం. 
  • జీవారాధాన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. 
  • శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. 
  • అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, 
  • మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. 
  • మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. 
  • మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. 
  • వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. 
  • అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, 
  • అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. 
  • మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, 
  • శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. 
  • ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి. 
  • ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. 
  • విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? 
  • అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. 
  • ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. 
  • అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. 
  • శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. 
  • జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. 
  • సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. 
  • అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 
  • మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. 
  • శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. 
  • అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, 
  • తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు...
 తెలుగు లోమీరు కని వినీ ఎరుగని మంచి విషయాల కొరకు;క్లిక్- https://telugufb.blogspot.com/
 .
పిల్లలకు/పెద్దలకు అందిరికి పనికి వచ్చే విసయాల కొరకు;- https://telugufb.blogspot.com/
 .
హిందూమతానికి సంబందించిన విసయలకోరకు;-https://telugufb.blogspot.com/
.
తెలుగు లో విజ్ఞానానికి ;- https://telugufb.blogspot.com/

Wednesday, February 15, 2017

భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు? బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?

ప్రశ్న: బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?


🔷 జవాబు: బొగ్గులో కార్బన్‌ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్‌ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలే కాకుండా కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.

బొగ్గును కాల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్‌ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.

                


ప్రశ్న: భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు?


జవాబు: చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే కాలం, అలా తిరుగుతూనే దాని అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే పరిభ్రమణ కాలం సమానంగా ఉండడం వల్ల ఎల్లప్పుడూ చంద్రుని ఒక వైపు ఉపరితలమే మనకు కనిపిస్తుంది. చంద్రుని కక్ష్యకు ఉండే ఈ ధర్మాన్ని ఏక కాలిక భ్రమణం (Synchronous Rotation) అంటారు. చంద్రుడు ఇలా తిరగడానికి కారణం చంద్రునిపై భూమి ప్రయోగించే ఆటుపోట్ల ప్రభావం. చంద్రునిపై ఎలాంటి సముద్రాలు లేకపోవడంతో అక్కడ ఆటుపోట్లకు గురై పొంగిపొరలే నీరు లేనందున, భూమి గురుత్వాకర్షణ బలం చంద్రుని తలంపైనే పనిచేస్తుంది. ఆ ప్రభావం చంద్రుని తలాన్ని పైకి కిందకీ ఊగేటట్లు చేస్తుంది. అందువల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే పరిభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతూ, అది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే ప్రదక్షిణ కాలానికి సమానమైంది. అందువల్లే మనం ఎల్లప్పుడూ చంద్రుని ఒకవైపు ఉండే గోతులను (Craters) ఎత్తు పల్లాలను చూస్తున్నాం. అదే కాకుండా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో చంద్రుడు ఉపరితలంలో సగం కన్నా ఎక్కువగా, 59 శాతం మేర చూడగలుగుతున్నాం. మానవుడు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు చంద్రుని అవతలి వైపునకు వెళ్లి అక్కడి ఛాయాచిత్రాలను భూమికి పంపే వరకు అది ఎలా ఉంటుందనే సంగతి మనకు తెలియలేదు.

బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మా  ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?


బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.
  
బ్రాహ్మా  ముహూర్తం
సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా  ముహూర్తం అంటారు.
  
ఆఖరి నిమిషాలు
రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా  ముహూర్తం అంటారు.
  
పూజలు
బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.
  
విద్యార్థులకు
విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.
  
జీవక్రియలు
మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.
  
ఒత్తిడి
అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.
  
పెద్దవాళ్లు ఎందుకు లేవాలి ?
ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.

ఫ్రెష్ ఆక్సిజన్
రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.

గృహిణులు ఎందుకు లేవాలి.?
గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

ఆందోళన
బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని..ఆందోళన లేకుండా అయిపోతాయి....

సూర్యోదయము
ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....

ఆరోగ్యము
బ్రహ్మా ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.

Saturday, February 4, 2017

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.
   
దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

33) గోపుర దర్శనం తప్పక చేయాలి.

34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.    
 దేవుడి ఎదుట చెంపలు ఎందుకు వేసుకుంటారంటే?🌷
సహజంగా దైవ దర్శనానికి వెళ్లినపుడు చెంపలు వేసుకుంటారు? ఇదేం ఆచారం? అని చాలామందికి అనుమానం వస్తుంది. చెంపల్ని సంస్కృతంలో ‘హనువు’ లని పిలుస్తారు. మనం మాట్లాడటానికి ఎంతో ఎక్కువగా సహకరించేవి దవడలే. ఇవి సక్రమంగానూ, ధర్మబద్ధంగానూ ఉండటం బట్టి ఆంజనేయుడిని ‘హనుమాన్’ అని పిలిచారు.
మనం ఈ హనువులతో ఏదైనా తప్పు చేసి ఉంటే (చాడీలు, అబద్ధాలు, అపనిందలు) వాటిని క్షమించవలసిందని .. ఇక ఎప్పుడు అలా చేయకుండా చేయమని భగవంతుడినికి అడగటమే చెంపలు వేసుకోవడంలోని పరమార్ధం

Sunday, January 29, 2017

దయ్యాల సంచి

 దయ్యాల సంచి


ఒకానొకప్పుడు ధనికులైన భార్యాభర్తలు ఉండేవారు. వారికి జిన్‌హో అనే కొడుకు ఉండేవాడు. కొడుకును పెంచడానికి వాన్‌క్యూన్‌ అనే ఒక వృద్ధ సేవకుణ్ణి ని…యమించారు. అతడు పిల్లవాడికి రకరకాల కథలు చెప్పేవాడు. పిల్లవాడు కథల్ని చాలా ఇష్టంగా వినేవాడు. ఆతడు చెప్పే కథల్లో భయంకరమైన వింతజంతువులు, క్రూరమైన పులులు, దేవదూతలు, అందమైన యువరాణులు, వీరులు, కరుణాహృదయులైన రాజులు వచ్చేవారు.
వీరితో పాటు ప్రతి కథలోనూ ఒకద…య్యం తప్పకుండా వచ్చేది. ఆ కథలు జిన్‌హోకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల వాటిని తను మాత్రమే వినాలని పట్టుబట్టాడు. అందువల్ల ఆ కథల్ని సేవకుడు ఇతరులకు చెప్పడానికి అనుమతించేవాడు కాదు. తను కూడా విన్న కథలను వేరెవ్వరికీ చెప్పేవాడుకాదు. అలా చేయడం వల్ల కథల్లోని ద…య్యాలను మరెక్కడికీ వెళ్ళనివ్వకుండా కట్టిపడవేయవచ్చునన్న ఆలోచన!

కథలు చెప్పే సేవకుడైన వాన్‌క్యూన్‌ దయ్యాలకని ప్రత్యేకంగా ఉచ్చుదారంతో ఒక తోలు సంచీని తయారు చేసి, దాన్ని జిన్‌హో పడక గదిలోని గోడకు తగిలించాడు. ప్రతిరాత్రి జిన్‌హో నిద్రపోయే ముందు సేవకుడు సంచీని ఒడిలో వుంచుకుని కథ చెప్పేవాడు. కథ ముగుస్తున్నప్పుడు సంచీ మూతిని తెరిచేవాడు. కథలోని దయ్యం అందులోకి వెళ్ళేది. అదే కథను మళ్ళీ ఎవరైనా చెబితే తప్ప ఆదయ్యం ఆ సంచీ నుంచి వెలుపలికి రాలేదు. వాన్‌క్యూన్‌ సంచీ మూతిని గట్టిగా బిగించి మళ్ళీ గోడకు తగిలించేవాడు.

ఇలా రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలూ గడిచాయి. వాన్‌క్యూన్‌ ఒకసారి చెప్పిన కథను మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. జిన్‌హో కూడా తను విన్న కథను మరెవ్వరికీ చెప్పలేదు. సంచీలో చేరిన దయ్యాలు వెలుపలికి వచ్చే మార్గం లేక తపించసాగాయి. కథలు చెప్పడంలో వాన్‌క్యూన్‌, వినడంలో జిన్‌హో నిమగ్నులై పోవడం వల్ల తోలు సంచీలో దయ్యాలు బాధతో పుట్టించే శబ్దాలను వినలేకపోయేవారు అంతలోనే జిన్‌హో పదిహేనేళ్ళవాడయ్యాడు.

అప్పటి ఆచారం ప్రకారం పెళ్ళీడు కొచ్చాడు. వాడి తల్లి దండ్రులు ఒక చక్కని అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. ధనిక వర్తకుడి కూతురైన ఆ అందమైన అమ్మాయి పేరు మిన్‌జీ. పెళ్ళిరోజు రానేవచ్చింది.
పెళ్ళి కొడుకు జిన్‌హో, అతని తండ్రి పెళ్ళికూతురు ఇంటికి బయలుదేరడానికి ఉదయమే సిద్ధమ య్యారు. రానున్న పెళ్ళికూతురికి ఆప్యాయంగా స్వాగతం పలకడానికి ఇంట్లోని పనివాళ్ళందరూ ఏర్పాట్లలో, హడావుడిగా ఉన్నారు. ముసలి సేవకుడు వాన్‌క్యూన్‌, ఇంట్లోని ఒక్కొక్క గదినీ పరిశీలించి చూస్తూ, ఏర్పాట్లను గమనించసాగాడు.

అలా వస్తూ, జిన్‌హో గదిలోకి తొంగిచూశాడు.  ఏవో గుసగుసలు వినిపించాయి. ఒక్క అడుగు వెనక్కు వేసి సద్దు చేయకుండా ఆలకించాడు. విభిన్న కంఠస్వరాలు వినిపించాయి. ఎవరూ లేని చోట ఇన్ని కంఠస్వరాలు ఎలా వచ్చాయా అన్న ఆశ్చర్యంతో గది లోపలికి వెళ్ళాడు. అతని చూవులు తోలుసంచీ మీద పడ్డాయి. అది అటూ ఇటూ కదులుతోంది. ఆ సంచీలోంచే గుసగుసలు వినిపించాయన్న సంగతి అతడు ఊహించాడు. అవి ద…య్యాల మాటలు అని గ్రహించగానే అతడు, పిల్లిలా అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి, సంచీకి చెవులు ఆనించి గుసగుసలను విన్నాడు.

‘‘కురవ్రాడికి ఈరోజు పెళ్ళి కాబోతున్నది. మనల్ని ఇన్నాళ్ళిలా ఊపిరాడ కుండా బంధించినందుకు మన పగతీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వాణ్ణి చంపేద్దాం. వాడు చచ్చాక, ఎవరో ఒకరు ఈ సంచీ మూతి విప్పి మనకు విముక్తి కలిగించకపోరు!’’ ‘‘అవును, అవును, అలాగే చంపేద్దాం. అయితే ఎలా?’’ ‘‘నేను విషపు బావి కథలోని దయ్యాన్ని. పెళ్ళికూతురు ఇంటికి వెళుతూన్న దారిలో నేనా బావిని వచ్చేలా చేస్తాను. దప్పిక గొన్న వాడు బావిని చూడగానే నీళ్ళు తాగడానికి ఆగుతాడు. అంతే ... ఆ పైన అంతే సంగతులు ఆ హా హా!’’ ‘‘బావుంది. ఒకవేళ వాడు బావివద్ద ఆగి నీళ్ళు తాగకుండానే వెళ్ళిపోయాడే అనుకుందాం. విషపు తుప్పపళ్ళ కథలోని ద…య్యమైన నేను ఊరుకుంటానా? దారికి పక్కనే చెట్టుగా చేతికి అందే పళ్ళతో కనిపించి ఊరిస్తాను.

పండు కోసి రుచి చూశాడంటే చాలు! వాడిపని అయిపోతుంది. ఆ హా హా!’’ ‘‘ఒకవేళ దానిని కూడా తప్పించుకుని పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నాడే అనుకుందాం. నా కథలో కనకనలాడే మేకు వుంది. దానిని నేను అతడు కాలు పెట్టే మెత్తకింద దాస్తాను. కాలు మోపగానే ... ఆ హా హా!’’ ‘‘దాన్ని కూడా తప్పించుకుంటే, నా కథలోని విష నాగ సర్పాన్ని పెళ్ళి కూతురు పడకకింద ఉంచుతాను.

అర్ధరాత్రి సమ…యంలో అది వెలుపలికి వచ్చి, వాణ్ణి కాటేస్తుంది... దాన్నుంచి తప్పించుకోవడం వాడితరంకాదు, ఆ హా హా!’’ దయ్యాల కుట్రను విన్న వాన్‌క్యూన్‌ దిగ్భ్రాంతి చెందాడు. అవి సంచిలోపల ఉన్నప్పటికీ హాని కలిగించగల శక్తి వాటికివున్న సంగతి అతనికి తెలుసు. వాన్‌క్యూన్‌ గబగబా ఇంటినుంచి వెలుపలికి వచ్చాడు. పెళ్ళికొడుకు తెల్లగుర్రం మీద వెళుతూన్న పరివారాన్ని చేరుకున్నాడు. తిన్నగా జిన్‌హో దగ్గరికి వెళ్ళి, ‘‘అ…య్యా, ఈ రోజు, నీ గుర్రాన్ని నేను ముందుండి నడుపుతాను,’’ అంటూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ‘‘వద్దు, నువ్వు ఇంటికి తిరిగివెళ్ళు. అక్కడ నీకు బోలెడన్ని పనులున్నాయి!’’ అన్నాడు జిన్‌హో.

వాన్‌క్యూన్‌ అక్కడి నుంచి …యజమానిని సమీపించి, ‘‘అయ్యా, ఈ రోజు చాలా గొప్ప రోజు కదా! ఈ రోజు చిన్న యజమాని గుర్రాన్ని నడిపించాలన్నది నా చిరకాల వాంఛ,’’ అన్నాడు.‘‘సరే, అలాగే కానివ్వు. అనుమతి ఇస్తున్నాను,’’ అన్నాడు జిన్‌హో తండ్రి. వాన్‌క్యూన్‌ పరమానందం చెందాడు. ఎలాగైనా చిన్న యజమానిని దయ్యాల నుంచి కాపాడాలన్న కృతనిశ్చయంతో, గుర్రం ముందు నడవసాగాడు. వాన్‌క్యూన్‌ అనుమానించినట్లే, దారి పక్కన బావి కనిపించగానే, నీళ్ళు తెమ్మన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, బావిలోనుంచి నీళ్ళు తోడడానికి చాలా సేపవుతుంది.

అంతసేపు మీరు ఈ మండే ఎండలో ఉన్నట్టయితే, పెళ్ళి దుస్తులు చెమటకు తడిసిపోగలవు,’’ అంటూ వాన్‌క్యూన్‌ ఆగకుండా ముందుకు వెళ్ళిపో…యాడు. దాహంగా ఉన్నప్పటికీ, సేవకుడి మాటల్లోనూ నిజం ఉందని గ్రహించిన జిన్‌హో మరేం మాట్లాడలేక పోయాడు. మరికొంతదూరం ముందుకు వెళ్ళాక, బాట పక్కన వున్న చెట్టుకు తుప్పపళ్ళు చేతికి అందేలా నేలబారుగా కనిపించడంతో, ‘‘వెళ్ళి ఆ పళ్ళు కోసుకురా.


వాటిని తిని దాహం చల్లార్చుకుంటాను,’’ అన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, ఇవాళ తమకు పెళ్ళి. వధువు గారి ఇంట షడ్రసోపేతంగా విందు కాచుకుని వున్నప్పుడు, ఈ తుప్పపళ్ళు తింటారా?’’ అంటూ, జిన్‌హో సమాధానానికి ఆగకుండా, గుర్రం కళ్ళాన్ని పట్టుకుని వేగంగా ముందుకు నడవసాగాడు. జిన్‌హో, సేవకుడితో వాదన ఎందుకని మౌనం వహించాడు. ఊరేగింపు ముందుకు సాగి కొంత సేపటికి పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నది. పెళ్ళి కొడుకు గుర్రంపై నుంచి కిందికి కాలుమోపి దిగడానికి వీలుగా, ఇద్దరు సేవకులు చిన్న మెత్తను తెచ్చివేశారు. వాన్‌క్యూన్‌, దాన్ని దూరంగా తీసివేస్తూ, ‘‘చూడండి, అవి ఎంతమెత్తగా ఉన్నాయో! మా యజమాని కాలు జారితే మరేమన్నా ఉందా. వెళ్ళి చెక్కబల్ల తీసుకు రండి,’’ అన్నాడు.

ఒక సేవకుడి దుందుడుకు ప్రవర్తనకు, జిన్‌హో, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రితో సహా అక్కడవున్న వారందరూ విస్తుపోయారు. అయినా, సేవకులు వెళ్ళి కొయ్యబల్ల తెచ్చి వేయడంతో వాన్‌క్యూన్‌ చేయి అందివ్వగా, పెళ్ళికొడుకు గుర్రం పైనుంచి, కొయ్య బల్లపై అడుగు మోపి కిందికి దిగాడు. పెళ్ళికొడుకు బృందం అలంకరించబడిన ఉద్యానవనంలోకి చేరింది. అందమైన దుస్తులతో ఆభరణాలతో అలంకరించిన పెళ్ళి కూతురు మిన్‌జీని వేదిక మీదికి తీసుకువచ్చారు. పెళ్ళి ఘనంగా జరిగింది. విందు భోజనాలు ఏర్పాటయ్యాయి. అవి ముగిశాక, పెళ్ళికొడుకూ కూతురూ పడక గదికి చేరడానికి ముందే, వాన్‌క్యూన్‌ పెద్ద కత్తితో లోపలికి వెళ్ళాడు. పడక మీది పట్టుపరుపులను తొలగించి, వాటి కింద దాక్కునివున్న సర్పాన్ని తెగనరికాడు.

అంతలో అందరూ అక్కడికి చేరారు. ఆ దృశ్యాన్ని చూసిన జిన్‌హో, ‘‘నాన్నా, వాన్‌క్యూన్‌ మన ప్రాణాలు కాపాడాడు!’’ అన్నాడు కృతజ్ఞతతో. మరునాడు జిన్‌హో పెళ్ళికూతురును వెంటబెట్టుకుని తన పరివారంతో స్వగృహానికి తిరిగివచ్చాడు. విందు జరుగుతున్న సమయంలో, వాన్‌క్యూన్‌ జిన్‌హోను సమీపించి, నిన్నటి తన వింత ప్రవర్తనకుగల కారణాన్నీ, సంచీలోని దయ్యాల గురించీ చెప్పాడు. అంతావిన్న పెళ్ళికూతురు భర్తతో, ‘‘జిన్‌హో! ఈరోజు నుంచి నువ్వు నాకు ఆ కథలు చెప్పు. ఒక్కొక్క దయ్యంగా వదిలిపెడదాం,’’ అన్నది సంతోషంగా. స్వస్తి. 

వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు



 వివేకానందుడు ఒక్క వాక్యం, కేవలం ఒక్కటంటే ఒక్క వాక్యంతో  ఒక వ్యక్తిలో, ఓ సమూహంలో, కొన్ని దేశాలకి, ప్రపంచానికే ధైర్యం నింపగల ధీరుడు, ఇతను మన భారతీయుడు అని సగర్వంగా చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఎలాంటి వాళ్ళకయినా ఓ మాట చెప్తున్నాము , కొన్ని రోజులు వివేకానందుడు సూక్తులు, కథలు చదవండి. మొదటలో మామూలుగా అనిపించొచ్చు, చదవటం అలవాటు తక్కువగా కనుక ఉండుంటే అలానే అనిపిస్తుంది కూడా, కానీ నమ్మకంతో అలా కొన్ని రోజులు కొనసాగించండి. ఇతనప్పుడు మీకు వ్యసనం అవుతాడు, బాగు పరిచే వ్యసనం అవుతాడు. ఇప్పుడు మీకోసం వివేకానందుడు చెప్పిన ఒక గొప్ప కథని తీసుకొచ్చాం. ఒకసారి చదివి అతని భావాలని హత్తుకోండి, జీవితాంతం మిమ్మిల్ని గెలిపించేందుకు అలా మీ గుండెల్లో ఒదిగిపోతాడు..

వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు

ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది.
ఒకరోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది.
రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ‘‘ఇది ముసలిదైపోయింది.
ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు.
అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి.
ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక,
దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు.
తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు.
యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి ఎంత దారుణం అనుకుంది.
ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను.
తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది.
ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది.
పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది.
పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది.
అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది.
ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది.

స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు

.