సోవియట్ రారాజు...కమ్యూనిస్ట్ నేత... "స్టాలిన్ "వర్దంతి సందర్భం గా.
★స్టాలిన్ పూర్తి పేరు జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్ (ఇంటిపేరు "జుఘాష్విల్") ఆయన రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధినేత. 1922 నుండి 1953లో అతను మరణించే వరకు "సోనియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ" జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
★అతను క్రమంగా తన అధికారాన్ని పటిష్ఠం చేసుకొని సోవియట్ తనవైపునకు తిప్పుకున్న ప్రతిభాశాలి స్టాలిన్. ఆయన పాలనా కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలోస్టాలినిజమ్ అంటారు.
స్టాలిన్ పాలన..
★1924లో లెనిన్ మరణానంత రం అధికారం కోసం లియాన్ ట్రాట్‌స్కీ, స్టాలిన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఫలితంగా ట్రాట్‌స్కీ సోనియ ట్ యూనియన్ నుండి వెళ్ళగొట్టబడ్డాడు.
స్టాలిన్ నాయకత్వంలో..
■ వ్యవసాయాన్ని సమిష్ఠీకరించ డం జరిగింది
■వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది.
■స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది.
■సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణనీయంగా ఆహారోత్పత్తి పెరిగింది.
■కానీ.. రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు.
■సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తం లోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేదం టే ఆశ్చర్యమేస్తుంది.
■ రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జెర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది.
■స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోయింది.
మహా ప్రక్షాలన...
★1930 దశకం చివరిలో స్టాలిన్ ప్రారంభించిన మహ ప్రక్షాలన సమయంలో అనేక మంది రాజకీయ ప్రత్యర్ధులని అరెస్ట్ చెయ్యడం, జైలు శిక్షలు లేదా మరణ శిక్షలు విధించడం జరిగింది. కొందరికి నామమాత్రపు విచారణతోనే మరణ శిక్షలు విధించిడం కూడా జరిగింది. దీని వల్ల స్టాలిన్ తీవ్ర విమర్శ లు ఎదుర్కొన్నారు.స్టాలిన్ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శకుల దాడి నుంచి ఆయన బయటపడ్డా నికి చాలా సమయమే పట్టింది.
రెండవ ప్రపంచ యుద్ధం..
★ఈ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ దురాక్రమణ రష్యా పై ఉప్పెన లా పడింది. ఎంతో నష్టాన్ని ఎదుర్కొని స్టాలిన్ అధ్వర్యంలో రష్యా సాగించిన పోరాటం నాజీ జర్మనీ ఓటమికి చాలా ముఖ్యమైన కారణమయ్యింది. (1939–1945), అయితే యుద్ధం సమయంలోను, అంతకు పూర్వం స్టాలిన్ అనుసరించిన కొన్ని చర్యలు పెద్ద తప్పిదాలుగాను, వాటివల్ల సోవియట్ ప్రజలు చాలా నష్టపోయినట్లుగాను చరిత్రకారులు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ఒక సూపర్ పవర్‌గా రూపొందింది. ఆ స్థానం సుమారు నాలుగు దశాబ్దాలు (1991 వరకు) కొనసాగింది.
స్టాలిన్ వ్యక్తిత్వం...
స్టాలిన్ వ్యక్తిత్వంపై కూడా విమర్శ లు ఉన్నాయి. ఆయన వ్యక్తి పూజని ప్రోత్సహించే వాడన్న విమర్శలూఉన్నాయి. బెల్జియం దేశానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు లూడో మార్టెన్స్ మాత్రం ఈ విమర్శలని కొట్టి పారేస్తున్నారు. స్టాలిన్ నేటి తరానికి మార్గదర్శకుడని కొనియాడుతున్నారు. అయితే, స్టాలిన్ ను తిట్టేవాళ్లు ఎంత మంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మందే ఆయన గురించి గొప్పగా చెప్పుకొనే వారూ ప్రపంచ వ్యాప్తంగా నేటికీ ఉన్నారంటే ఆయన వ్యక్తిత్వం కాక మరేమిటి?
No comments:
Post a Comment