Pages

Wednesday, March 22, 2017

రాష్ట్రం కథ : జమ్మూ కాశ్మీర్

రాష్ట్రం కథ :  జమ్మూ కాశ్మీర్


జమ్మూ కాశ్మీర్ వైశాల్యం 2,23,236 చదరపు కిలో మీటర్లు  జమ్మూ దీనికి శీతాకాలపు రాజధాని  ,శ్రీనగర్ వేసవి కాలపు  రాజధాని . అధికార భాష ఉర్దూ . అయినా ఎక్కువ మాట్లాడే భాషలు కాశ్మీరీ ,డొంగ్రి ,లడక్
ముఖ్యమైన నదులు ..తావీ,జీలం చీనాబ్ ,సింధు .గంగ ,యమునా నదులు
సరస్సులు ..మనసబల్ సరస్సు ,వూలార్,నాగీన్,దాల్ లేక్
జమ్మూ కాశ్మీర్ ని మూడు ప్రాంతాలు గా చూడవచ్చు
 1.జమ్మూ 2.కాశ్మీర్ లోయ ౩.లడఖ్ ప్రాంతం
కాశ్మీర్ చరిత్రని తెలియజేసే చారిత్రక గ్రంధం ;;రాజ తరంగిణి ,కల్హాణుడి విరచితం
ప్రస్తుతం ముఖ్య మంత్రి  ; మెహబూబా ముఫ్తీ సయీద్
370 వ అధికరణ ప్రకారం కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వబడింది
అసెంబ్లీ సభ్యుల సంఖ్య 87 మంది .6 గురు లోక్ సభ ,4 రాజ్యసభ సీట్లు ఉంటాయి
ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం .వరి, గోధుమ ,మొక్కజొన్న.ఆపిల్ ,రేగు ,ద్రాక్ష ప్రధాన పంటలు
పరిశ్రమల కంటే చేతి పనులు ,స్వయం ఉపాధి మీద ఎక్కువ ఆధార పడతారు .కాశ్మీరీ తివాచీలు ,శాలువాలూ ,నగిషీ పనులూ ,హస్త కళల కి కాశ్మీర్ ప్రసిద్ధి
జమ్మూ కాశ్మీర్ ప్రకృతి సౌందర్యానికి  ప్రసిద్ధి .భూలోక స్వర్గం ,సూపర్ స్విట్జర్లాండ్ గా పిలవబడే జమ్మూ కాశ్మీర్ ఫల పుష్పాలూ ,జలపాతాలలో ,సెలయేళ్ళతో ,సరస్సు ల తో ,ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది
కాశ్మీర్ మార్చ్ నుంచి జూన్ వరకూ దర్శించడానికి వీలు గా ఉంటుంది .దాల్ సరస్సు లో బోటు షికారు ,మొగల్ గార్డెన్స్ ,చశ్మా షాహీ ,శాలీమార్ ,హరి పర్వతం ,హజరత్ మసీద్ ,అనంత్ నాగ్  ముఖ్య దర్శనీయ స్థలాలు .గుల్మార్గ్ ,సోనా మార్గ్,వేసవి విడుదులు
అమర్ నాధ్ గుహ హిందువుల పవిత్ర స్థలం .ఇది శ్రీనగర్ కి 153 కిలో మీటర్ల దూరం లో ఉంటుంది .ఎక్కువ శాతం ముస్లిం లూ,హిందువుల తో పాటు బౌద్ధులు కూడా ఎక్కువ సంఖ్య లో నివసిస్తారు
లడఖ్ ,కార్గిల్ ,ద్రాస్  సెక్టార్ లో సైనిక  స్థావరాలు ఉనాయి .ఇవి దేశం లోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేసే ప్రాంతాలు
ఇవండీ జమ్మూ కాశ్మీర్ విశేషాలు సంక్షిప్తం గా ..రేపు మరో రాష్ట్రం చూద్దాం.

No comments:

Post a Comment

.