Pages

Wednesday, March 22, 2017

మిగతా జంతువుల్లాగా గుర్రం ఎందుకు నేల మీద కూర్చోదు?



ప్రశ్న: మిగతా జంతువుల్లాగా గుర్రం ఎందుకు నేల మీద కూర్చోదు?


జవాబు:

మామూలుగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి. అలా కూర్చోవడం ద్వారా అవి తమ కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. అది అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం. దానికి కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నులుచుని ఉన్నప్పుడు మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యం ఉంది. అందువల్ల అది మిగతా జంతువుల లాగా తన కాళ్లను ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అంతేకాదు అది నిలబడి నిద్రపోగలదు కూడా. ఒకోసారి నేలపై పూర్తిగా ఒక పక్కకు ఒరిగి పడుకుంటుంది.





వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా..
ప్రశ్న: బోరు బావుల నుంచి బయటికి వచ్చే నీరు శీతకాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటాయి. ఎందువల్ల?

జవాబు: పగలు సూర్య కాంతి ఎక్కువగా ఉండటం వల్ల భూమి పైపొర వేడెక్కుతుంది. రాత్రిపూట సూర్యకాంతి లేకపోవడం వల్ల భూమి చల్లబడుతుంది. కానీ పై పొరలో ఉన్న పగటి వేడి బోరు బావిలోని నీరున్న కింది పొరలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. అందువల్ల పగలు ఇంట్లో ఉన్న బిందెలోని నీరు ఎండ వల్ల వెచ్చగా ఉన్నా బోరు బావిలోని నీరు అదే వెచ్చదనంతో ఉండదు.

కానీ రాత్రి పూట మీరు ఎండాకాలంలో బోరు నీళ్లు కొట్టినట్లయితే అవి కాస్త వెచ్చగానే ఉంటాయి. అంటే ఆ పాటికి మాత్రమే పగటి వేడి లోపలి నీటికి చేరిందన్న మాట. అలాగే చలికాలంలో బయట పగలు చల్లగానే ఉన్నా కిందటి రోజు పగటి కాంతి వల్ల ఆలస్యంగా ఎంతో కొంత వేడెక్కిన నీరు బోరు బావిలో నుంచి బయటికొస్తుంది. బోరు నీళ్లు ఇలా పగలు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో కాస్త వెచ్చగా అనిపించడానికి కారణం భూమి పొరలలో ఉష్ణ ప్రవాహం ఆలస్యం కావడమే!.
 
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

No comments:

Post a Comment

.