Pages

Sunday, April 2, 2017

మీ ఆధార్‌ కార్డు ఎవ్వరు వాడకుండా తాళం....బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకోవచ్చు

మీ ఆధార్‌ కార్డు ఎవ్వరు వాడకుండా తాళం....బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకోవచ్చు


అవసరమైనప్పుడుఅన్‌లాకింగ్‌సదుపాయమూసమాచార భద్రత కోసం తప్పనిసరి కొత్తగా సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్‌లో ఖాతా తెరవాలన్నా.. అన్నింటికీ ఆధార్‌ కార్డే ఆధారం అయిపోయింది. కొన్ని రకాల డిజిటల్‌ చెల్లింపులకు కూడా ఆధార్‌ కార్డు ఉపయోగిస్తున్నాం. అలాంటప్పుడు పీఓఎస్‌ మిషన్ల వద్ద మన వేలి ముద్ర ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని సులభంగా హ్యాక్‌ చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు, వేలిముద్రల వివరాల ను కూడా సులభంగా భద్రపరుచుకోవచ్చు. కానీ ఆధార్‌తోనే వెరిఫికేషన్‌ ఉంటుందని చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా మన వివరాలు వాళ్లకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు.. సింపుల్‌గా యూఐడీఐఏ డేటాబే్‌స లో మన వివరాలకు తాళం వేసుకోవడమే. ఇలా ఆధార్‌ వివరాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్‌ చేసుకోడానికి, ఆ తర్వాత మనం కావాలనుకున్నప్పుడు అన్‌లాక్‌ చేయడానికి వీలుంది. ఇదంతా కూడా ఆన్‌లైన్‌లోనే చేసేసుకునే అవకాశాన్ని మనకు యూఐడీఏఐ కల్పిస్తోంది. ఎప్పుడైనా చెల్లింపులు చేయాలన్నా కూడా దా న్ని అన్‌లాక్‌ చేయనవసరం లేకుండా ఫోన్‌కు ఓటీపీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అది కూడా వద్దంటే మాత్రం ట్రాన్సాక్షన్‌ ఫెయిల్డ్‌ అనే సందేశం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల లాక్‌ చేసుకున్నప్పుడు మాత్రం ఆ విషయాన్ని తెలియజేసి, ఓటీపీ పంపమని అడగచ్చు. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే చెల్లింపులు పూర్తవుతాయి.
 లాక్‌ చేయడం ఎలా?

ఆధార్‌కార్డును లాక్‌ చేయడానికి ఈ దిగువ సూచనలు పాటిస్తే చాలు..
1. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి.


2. అందులో ఆధార్‌ సర్వీసెస్‌ అనే విభాగంలో.. ‘లాక్‌/అన్‌లాక్‌ బయోమెట్రిక్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


3. తర్వాత వచ్చే విండోలో మీ 12 అంకెల ఆధార్‌ కార్డు నంబరు ఎంటర్‌ చేయాలి.


4. తర్వాతి బాక్స్‌లో సెక్యూరిటీ కోడ్‌ (కాప్చా) ఎంటర్‌ చేయాలి.


5. జనరేట్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేయాలి.


6. అప్పుడు.. ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ ఎస్సెమ్మెస్‌ వస్తుంది. ఆ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ను సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేసి వెరిఫై బటన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత వచ్చే విండోలో ‘ఎనేబుల్‌’ బటన్‌ క్లిక్‌ చేస్తే చాలు. మీ ఆధార్‌ సమాచారం లాక్‌ అయినట్టే.


7. అన్‌లాక్‌ చేయాలనుకుంటే.. మళ్లీ ఇదే పద్ధతిలోలో వెళ్లి డిజేబుల్‌ లేదా అన్‌లాక్‌ చేస్తే సరిపోతుంది.

షేర్‌ చేయొద్దు..

మీ ఆధార్‌ వివరాలు వేరెవరికీ షేర్‌ చేయవద్దని చెప్పే హక్కు కూడా మీకుంది. అయితే అందుకు ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడ బయోమెట్రిక్‌ ఆధారంగా లాగిన్‌ అయి మీ వివరాలను ఇతరులతో షేర్‌ చేసుకోవడానికి గతంలో ఆమో దం తెలిపి ఉంటే.. ఆ బాక్స్‌ను అన్‌ టిక్‌ చేయించవచ్చు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

No comments:

Post a Comment

.