Pages

Monday, April 24, 2017

పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి.

చాలా మంది పేరులో ఏముందని భావిస్తారు. కానీ

పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి.

 పేరు లోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణ గణములు, మనస్తత్వం, అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట. ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి, శబ్దం బట్టి ఆ పేరు (పదం) యొక్క ఉనికి తో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి ! ఆలస్యం ఎందుకు ? చూసేయండి మరి …

‘‘A’’

అనే అక్షరం అన్నింటికీ ప్రధానం. ఈ అక్షరంతో ప్రారంభమైన పేరు గల వారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదలగల వారు. ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది. వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడుతారు.

‘‘B’’

లభించిన దానితో తృప్తి పడే స్వభావం. చాలామందితో కలుపు గోలుగా, తిరగడమూ ఉండదు. తమ పని తాము చేసుకు పోతూ ఉంటారు. కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు. వీరికి కొత్త వాతావరణం, ప్రదేశం ఇబ్బంది కల్గిస్తుంది. కొన్ని సందర్భాలలో చిన్న పిల్లల్లా సిగ్గు పడతారు. విజ్ఞుడు అనే కీర్తి కూడా వస్తుంది.

‘‘C’’

వీరికి ఊహా శక్తి, ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంత వరకు కనిపిస్తుంది. వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా హడావుడి చేయడం తగ్గిస్తే మంచిది.

‘‘D’’

అందరితో సన్నిహితంగా ఉన్నా కొందరే మిత్రులు ఉంటారు. వీరికి మాత్రం విశ్వాస పాత్రులైనవారు కూడా కొందరే. వీరు ఉత్సాహాన్నీ, శక్తిని కలిగి ఉంటారు. ప్రాపంచిక విషయాలపట్ల ఆసక్తి చూపుతారు. గౌరవంకు ప్రాముఖ్యాన్నిస్తారు.

‘‘E’’

భవిష్యత్తును ఎక్కువగా ఊహించ శక్తిని కలిగి ఉంటారు. ప్రాపంచిక సుఖం, దైవికం, ఊహాశక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు.

‘‘F’’

భక్తి, పూజలల్లో ఎక్కువగా ఆసక్తిగా చూపుతారు. ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు. కుటుంబంపై ఎక్కువగా ప్రేమ చూపుతారు. నిరాడంబర జీవితం, శాంతిని కాంక్షిస్తారు. నిబ్బరంగా ఉంటారు.

‘‘G’’

వీరు ఎక్కువగా ఉదారంగా ఉంటారు. ముందు చూపు, కొత్త ఆలోచనలు చేస్తారు. కొంచెం తొందరపాటు గుణం. తనకు తాను తెలుసుకొనే ఆత్మజ్ణానంపై ఆసక్తిని కలిగి ఉంటారు. ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది.

‘‘H’’

స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు. బయటకు కఠినంగా కనిపించినా, లోలోన సున్నిత మనస్కులు. ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు. స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు.

‘‘I’’

వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది. మనసులో ఉన్న దానినిబయటకు చెప్పేస్తారు. తాను చెప్పిన దానిని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తుంటారు. కాస్త తొందరపాటు స్వభావం. ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది.

‘‘J’’

వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువ. విజయాలన అందకొనే శక్తిని కలిగి ఉంటారు. వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. తనకు తానుగా ప్రతిదీ నేర్చుకొనే తత్వం కలిగి ఉంటారు.

‘‘K’’

మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. తరచుగా మనో చంచలత్వం కూడా ఉంటుంది. కష్టపడితే ప్రసిద్దులు కావాటానికి అవకాశం వీరికి ఎక్కువ.

‘‘L’’

వీరు ఒక సమస్యను పలు కోణాల నుండి పరిశీలించి చూసే స్వభావాన్నిస్తుంది. తన వాదనా బలంతో ఇతరులను వశపరచుకుంటారు. అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళతారు.

‘‘M’’

సున్నితంగా, గంభీరంగా, లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. కాస్త అతివిశ్వాసం. ప్రజ్ణావంతులు.

‘‘N’’

కాస్త స్థిరం లేని స్వభావం. మనోచంచలం. ప్రారంభించిన పనిని అర్దాంతరంగా వదిలేస్తారు. చేయాలనుకుంటే చాల పట్టుదలతో పనిచేస్తారు. తరచూ ఆర్దిక ఇబ్బందులు పడుతుంటారు. దైవ భక్తి ఎక్కువ.

‘‘O’’

ధృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. విజయం సాధించే వరకు పట్టుదలగా పనిచేస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఎక్కువగా గౌరవాన్ని పొందుతుంటారు.

‘‘P’’

లోతైన, గాఢమైన మనస్సును కలిగి ఉంటారు. తమ కష్టాలను ఇతరులతో పంచుకొనే స్వభావం తక్కువ. వీరు ఎదుటి వారికి త్వరగా అర్దంకారు. సందర్భం, అవకాశాలు వచ్చే వరకు వేచిచూసే స్వభావం కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు.

‘‘Q’’

నిదానమైన వివేకం, ధృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ. నాయకత్వ లక్షణాలు అధికం.

‘‘R’’

ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారై ఉండి, గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు. దైవిక స్వభావం కలిగి ఉంటారు.

‘‘S’’

వీరు ఒక సమస్య వచ్చిందటే హడలి పోవడంతో పాటు, అందరినీ హడావుడి చేస్తారు. కొన్నిసార్లు కఠినంగానూ, మరి కొన్ని సార్లు సున్నితంగా ఉంటారు.

‘‘T’’

మనసుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు. ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్ధతో చేస్తారు. వీరికి పోరాడే శక్తిని కలిగి ఉంటారు.

‘‘U’’

చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. వీరిలో ఆత్మ విశ్వాసం తక్కువగా ఉంటుంది. వీరు లోతైన ఆలోచనలు కలిగి, దైవ సంబంధమైన విషయాలపట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉంటారు. ఆత్మ, పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు. వీరికి ప్రాపంచిక విషయాసక్తి కూడా ఒక వైపు ఉంటుంది.

‘‘V’’

డబ్బు సంపాదించటంలో ఘటికులు అని చెప్పొచ్చు. వీరు చదివిన దాన్ని పరిమళించేటట్టూ చేస్తారు. వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి, తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు. వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లైతే అన్ని విషయాల్లో విజయం సాధించడంతో పాటు, విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు.

‘‘W’’

తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు. ప్రతిదాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు. వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ, హడావుడి చేసే మనస్తత్వం ఉంటుంది. వీరు ఒక్కసారిగా కాక, పలు ప్రయోగాల తర్వాత విజయాన్ని చవిచూస్తారు.

‘‘X’’

తెలియని విషయాన్ని తేటతెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు. మనదేశంలో ఈ అక్షరంతో ప్రారంభం అయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి.

‘‘Y’’

శాంతం, ఏకాంతాన్ని ఆశిస్తారు. వీరు కలుపుగోలుతనంగా అంతగా ఉండలేరు. ప్రతి విషయాన్ని బయటికి చెప్పక, మసులోనే ఉంచుకొని మధన పడుతుంటారు. వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు. విజయం కోసం వీరు అధికంగా కష్ట పడాల్సి ఉంటుంది.

‘‘Z’’

చాలా ప్రగాఢమైన పిడివాద స్వభావంగా ఉంటారు. వీరు ఎలాంటి మార్పులేని అభిప్రాయంతో ఉంటారు. వీరు ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తారు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి⁠


Please Leave your Comment below / Ask doubts ??Suggestions.................
Share this to your Friends

No comments:

Post a Comment

.