గురుకుల టీచర్ పోస్టులకు రాత పరీక్ష మే 28న
జూన్‌లో మెయిన్స్ నిర్వహణనాన టీచింగ్ పోస్టులకు త్వరలో తేదీలు ఖరారు9 రకాల పోస్టులకు విద్యార్హతల ప్రకటన
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లోని తొమ్మిది రకాల కేటరిగీ పోస్టులకు విద్యార్హతలు నిర్ణయిస్తూ శుక్రవారం వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. దాంతో పాటు టీచింగ్ పోస్టులైన టీజీటీ, పీజీటీ, పీఈటి, పీడి పోస్టుకు మే, జూన్‌లలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. స్ర్కీ నింగ్ టెస్టులో ఒక పోస్టు కు15 మంది ని ఎంపికచేసి మెయిన్స్ పరీక్ష జూన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. టీజీటీ, పీజీటీ, పీఈటీ పోస్టులకు ఈ నెల 18 నుంచి మే 4 వరకు, లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు పోస్టులకు ఈ నెల 20 నుంచి మే 6 వరకు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఈ నెల 20 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా టీచింగ్ కేటగిరీ విద్యార్హతల్లో డిగ్రీలో 60శాతం మార్కులకు బదులు జనరల్ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45శాతంగా నిర్ణయిస్తూ కొత్త అర్హతలను ప్రకటించారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల విద్యార్హతల్లో ఇంటర్మీడియట్‌కు బదులు పదో తరగతి పాస్ అయితే చాలనే నిబంధన చేర్చారు. టీజీటీ, పీజీటీ పోస్టుల్లో ఈసారి కొత్త గా బీకాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
టెట్‌కు 20శాతం వెయిటేజీ
ట్రైన్డ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ కల్పించనున్నట్లు నిబంధనలు సిద్ధంచేశారు. అయితే మెయిన్స్ పరీక్షకు మాత్రమే టెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్స్ రాతపరీక్ష మార్కులకు 80శాతం వెయిటేజి, టెట్ స్కోర్‌కు 20శాతం వెయిటేజి కల్పించి ఎంపిక మెరిట్ జాబితాలను సిద్ధం చేయనున్నారు. ప్రిలిమ్స్ రాతపరీక్ష నుంచి ఒక్కో కేటగిరీ నుంచి 15మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష మార్చి 19, మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక తేదీలను నిర్ణయించింది.
వయోపరిమితి పెంపు వర్తిస్తుంది
ఈ పోస్టులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు 10 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి పెంపు వర్తించనుంది. జనరల్ అభ్యర్థులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ఠ వయసు 44 ఏళ్లలోపు ఉండాలి. ఇక రిజర్వేషన్లలో 58ఏళ్ల వయసు దాటిన వారు అర్హులుకాదు. ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీలో పనిచేసిన వారికి మూడేళ్ల వయోపరిమితి వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు వివరాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులందరూ ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్షల తేదీలు
పీజీటీ, టీజీటీ, పీడీ: ప్రిలిమినరీ మే 28, మెయిన్స్ జూన్‌లో.. దరఖాస్తులు ఈ నెల 18 నుంచి మే 4 వరకు.
క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్: మే, జూన్‌లో, దరఖాస్తులు ఈ నెల 20 నుంచి మే 4 వరకు
పీఈటీ, లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు: మే, జూన్‌లో రాత పరీక్ష, దరఖాస్తులు ఈ నెల 20 నుంచి మే 6 వరకు
మ్యూజిక్ టీచర్: మే, జూన్‌లో రాత పరీక్ష, దరఖాస్తులు ఈ నెల 20 నుంచి మే 4 వరకు
పోస్టుల వారీగా విద్యార్హతలు
స్టాఫ్ నర్సు: 3.5 సంవత్సరాల నర్స్ ట్రైనింగ్ కోర్సు(జీఎనఎం) లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి.
పీఈటీ: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45శాతం), ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో యూజీ డిప్లొమా.
ఫిజికల్ డైరెక్టర్: డిగ్రీ, బీపీఈడీ కోర్సుల్లో జనరల్ అభ్యర్థులు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45శాతం మార్కులతో
ఉత్తీర్ణత సాధించాలి.
మ్యూజిక్ టీచర్: పదో తరగతి ఉత్తీర్ణతోపాటు ఇండియన్ మ్యూజిక్‌లో డిప్లొమా లేదా డిగ్రీ, డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్‌లో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సుతో పాటు మ్యూజిక్‌లో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ లేదా ఎంఏ ఫోక్ ఆర్ట్స్ లేదా డిగ్రీతో పాటు క్లాసికల్ మ్యూజిక్‌లోలో డిప్లొమా చేసి ఉండాలి.
లైబ్రేరియన్: సాధారణ డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్సలో డిగ్రీ చేసి ఉండాలి.
క్రాఫ్ట్ టీచర్: టెన్త్ క్లాస్ పూర్తిచేసి ఉండాలి. వుడ్ వర్క్,/టైలరింగ్/ బుక్ బైండింగ్, ఎంబ్రాయిడరీ, కార్‌పెంటర్, డ్రెస్ మేకింగ్, సీవింగ్ టెక్నాలజీ చేసి వుండాలి. లేదా వుడ్ వర్క్/టైలరింగ్/బుక్ బైండింగ్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి.
ఆర్ట్ టీచర్: విద్యార్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్ష సీబీఆర్టీ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది. పరీక్ష తేదీకి వారంముందు హాల్ టికెట్లు ఇవ్వనున్నారు. మే లేదా జూన్‌లో ఆంగ్ల మాధ్యమంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, ఆర్ట్ కోర్సులోమోడల్ డ్రాయింగ్ (బి) డిజైన్, డిప్లొమా (సి) పెయింటింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ ఇన హైగ్రేడ్ డ్రాయింగ్ కోర్సు చేసి ఉండాలి. లేదా ఎస్‌బీటీఈటీ ద్వారా డిప్లొమా ఇన్ హోంసైన్స్‌లో శిక్షణ పొంది ఉండాలి. లేదా ఎస్‌బీటీఈటీ నిర్వహించిన మూడేళ్ల క్రాఫ్ట్ టెక్నాలజీ డిప్లొమా కోర్సు, లేదా బీఎఫ్‌ఏ ఇన్ అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, బీఎఫ్‌ఎలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి.
పీజీటి: సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో పీజీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45శాతం). బీఏ-బీఈడీ లేదా బీఎస్సీ- బీఈడీ చేసి ఉండాలి.
టీజీటీ: బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులలో ఏదేనీ ఒకదాంట్లో, బీఎస్సీ- బీఈడి లేదా బీఏ-బీఈడిలో 50శాతం(ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45శాతం) మార్కులు సాధించి ఉండాలి. టీఎస్, ఏపీ టెట్‌లో పేపర్-2లో అర్హత సాధించి ఉండాలి. ప్రిలిమ్స్‌లో టెట్ పేపర్ 2 మార్కులకు 20శాతం, రాత పరీక్ష మార్కులకు 80శాతం వెయిటేజీ కల్పించనున్నారు.
No comments:
Post a Comment