Pages

Monday, April 24, 2017

భూమి ఎప్పుడు పుట్టింది?

భూమి ఎప్పుడు పుట్టింది?


జవాబు: అనాది కాలం నుంచీ మానవుడు భూమి ఎలా ఏర్పడిందనే విషయంపై తర్జనభర్జన పడుతూనే ఉన్నాడు. నాలుగు వందల సంవత్సరాల క్రితమే భూమి సౌర కుటుంబంలోని గ్రహమనీ అది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని తెలుసుకోగలిగాడు. అప్పటి నుంచీ శాస్త్రజ్ఞులు శాస్త్రీయ పద్ధతుల్లో భూమి వయసును తెలుసుకోవడం ఆరంభించారు. ఆ పద్ధతుల్లో ‘రేడియోధార్మికత’ ఆధారంగా చేసే ప్రయోగాలు అతి ముఖ్యమైనవి. ఈ పద్ధతిలో అతి ప్రాచీన శిలలను సేకరించి వాటిలో నిక్షిప్తమై ఉండే యురేనియం, సీసం పాళ్లను అంచనా వేస్తారు. యురేనియం కొన్ని రేడియో వికిరణాలను వెలువరించే రేడియో ధార్మిక పదార్థం. అందువల్ల దాని నుంచి రేడియో ధార్మిక కిరణాలు ఎల్లపుడూ వెలువడుతుంటాయి. అలా యురేనియం రేడియో వికిరణాలను వెలువరిస్తూ చివరకు ‘సీసం’గా రూపాంతరం చెందుతుంది. యురేనియం-238 ఐసోటోప్‌ ద్రవ్యరాశిలోని సగభాగం 4.5 బిలియన్‌ సంవత్సరాల్లో సీసం-28గా రూపాంతరం చెందుతుంది. దీనిని యురేనియం ‘అర్ధజీవితం కాలం’ అంటారు. ఈ అర్ధజీవిత కాలం, ఆ శిలలో అప్పట్లో ఉండే యురేనియం, సీసంల పరిమాణాల ఆధారంగా శాస్త్రజ్ఞులు భూమి వయసును లెక్కకడతారు. అతి ప్రాచీన శిలలను సేకరించి ఈ రేడియోధార్మికత పద్ధతి ద్వారా శాస్త్రజ్ఞులు భూమి వయసు 3.5 బిలియన్‌ సంవత్సరాలుగా నిర్ధరించారు. ఈ శిలలు భూమి ఏర్పడిన తర్వాత ఏర్పడినవే. అందువల్ల భూమి వయసు 3.5 బిలియన్‌ సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంటుంది. మెటయోరైట్స్‌లో ఉండే సీసం, విశ్వ ఆవిర్భావం లాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే భూమి వయసు 4.6 బిలియన్‌ సంవత్సరాలుగా నిర్ణయించవచ్చు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Share this to your Friends

No comments:

Post a Comment

.