Pages

Tuesday, May 24, 2016

One milliion dollar



 ప్రతిమనిషి తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సందేశం..
బ్రెజిల్ దేశంలో ఒక కోటీశ్వరుడు...తన One Million Dollar ఖరీదుగల
బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే..
నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ..ఈయన ఒక పెద్ద అవివేకి అని...
One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!
మీడియా మరియు మిగిలిన ప్రజలు అతనికి చాలా తిట్టారు కూడా..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని..
చాలామంది చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి ఉన్నారు..!!
పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి పెట్టారు..!!
ఆ తతంగాన్నిఅందరూ ఉత్సుకతతో మరియు ఆత్రుతతో చూస్తూ ఉన్నారు..!!
కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!

అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..??
మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!!
దీనిని వేరోకరికైనా  ఇవ్వచ్చు కదా..అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!
అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!

"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!!
దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం
తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే..!!
కానీ మీరు మాత్రం...
వెలకట్టలేని...

మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..etc..

ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి..!!
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా..వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి..!!
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని..ఆలోచన కాని లేదు..!! ఎందుకు..??
కారు పోయినా..డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?? వాటికి విలువ కట్టగలమా..??
.
.
.
.
.
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేము..!!
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు..!!
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..??

ఆలోచించండి..!!
అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడాను క్షమించండి..!! "

Saturday, May 21, 2016

జీవిత సారాంశము..

జీవిత సారాంశము..

బిడ్డ పుట్టినప్పుడు:
"లాలీ  లాలీ లాలీ లాలీ...
లాలీ లాలీ లాలీ లాలీ...
వటపత్రసాయికి
వరహాల  లాలీ
రాజీవనేత్రునికి రతనాల లాలీ
 మురిపాల కృష్ణునికి ముత్యాల  లాలీ..."

 16 ఏళ్ళకి:
"పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
నేటి సరికొత్త  జాజిపువ్వల్లె
 నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..."

 18 ఏళ్ళకి:
"ఎక్కడ ఉన్నా పక్కన  నువ్వే  ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేం అల్లరీ..
నా  నీడైనా అచ్చం  నీలా  కనిపిస్తూ  వుంది..
అరే ఇదేం గారడీ..
నేను  కూడా  నువ్వయానా
 పేరుకైనా  నేను  లేనా..."


  25 ఏళ్ళకి:
"My Love is Gone
My Love is Gone
My Love is Gone
My Love is Gone
పోయే  పోయే లవ్వేపోయే
పోతే పోయిందే ..
its gone, its gone,
 its gone, my love is gone."


35 ఏళ్ళకి:
"ఎందుకే  రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా
ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా
తాను  దూర సందు లేదు
తాను  దూర సందు లేదు
తాను  దూర సందు లేదు
మెడకేమో డోల రవణమ్మా
సతాయించాకే రవణమ్మా
బాగోదే రవణమ్మా
 ఛీ ఛీ అంటారే రవణమ్మా"

45 ఏళ్ళకి:
"జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
బ్రతుకు సమరములో.. 
పండిపోయితిరా..
బ్రతుకు సమరములో.. 
పండిపోయితిరా..
 మంచి తెలిసి మానవుడిగా మారినానురా...."

55 ఏళ్ళకి:
"సంసారం  ఒక చదరంగం
అనుబంధం  ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు రుణపాశాలు తెంచే  వేళలో
సంసారం  ఒక చదరంగం
 అనుబంధం  ఒక రణరంగం.."


65 ఏళ్ళకి:
 (పురుషుడు)
"కాశీకి  పోయాను  రామాహరి
గంగ తీర్థమ్ము  తెచ్చాను  రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.."
(స్త్రీ)
"కాశీకి పోలేదు రామాహరి
ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి
 మురుగు  కాల్వలో నీళ్ళండి రామాహరి.."

75 ఏళ్ళకి:
"జగమంత  కుటుంబం నాది
ఏకాకి  జీవితం నాది
సంసారం సాగరం నాదే
 సన్యాసం శూన్యం నాదే"

85 ఏళ్ళకి:
"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు  లేదులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...
 లోకమెన్నడో చీకటాయెలే..."

100 ఏళ్ళకి:
"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.

Thursday, May 19, 2016

Friendship in telugu

స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.

  • శత్రువు ఒక్కడైనా  ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే.
  • విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు.
  • మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు.
  • కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది .
  • అహంకారి కి మిత్రులుండరు .
  • ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం .
  • ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం.
  • చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం.
  • నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు .
  • మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు .
  • మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు .
  • మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు .
  • స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు !!            

Sunday, May 15, 2016

Intelligent wife


ఒక రోజు ప్రొద్దున్నే భర్త, భార్యను అడుగుతాడు : పద డార్లింగ్ మనం యోగ చేయడానికి వెళ్దాం 

భార్య : అంటే నేను లావుగా వున్నననేగా మీ అర్థం
భర్త : అది కాదు ఆరోగ్యానికి యోగ మంచిదని
భార్య : అంటే నాకు రోగాలున్నాయా ?
భర్త  : అది కాదు డియర్, లేచేది లేకుంటే వదిలేయ్ 
భార్య : అంటే నేను సోమరిపోతుననేగా మీ అర్థం 
భర్త : ఛ ఛ , నీవు అపార్థం చేసుకున్నావ్ 
భార్య : ఓహో, నాకు అర్థం చేసుకునే తెలివి లేదనేగా మీ అర్థం
భర్త : లేదు, లేదు అట్లా అని నేను అనలేదు
భార్య : అంటే నేను అబద్దాలకోరుని అన్నట్టు 
భర్త : అబ్బ, పోడుగించాకే
భార్య : అంటే నేను  గయ్యాలిని అని మీ అర్థం 
భర్త : నేను యోగాకు వెళ్ళను 
భార్య : ఓహో, మీకు యోగ వెళ్ళే ఉద్దేశ్యమే లేదు,  సతాయించడం తప్ప
భర్త : అబ్బబ్బా, సరే పడుకో, నేను వోక్కన్నే వెళ్తా 
భార్య : అవునులే,నన్ను ఎటు తీసుకేల్తారని 
భర్త  : నాకు తల తిరుగుతుంది, యోగ కేన్సిల్
ార్య : నేను రెడీ అనగానే మీకు తల తిరుగుతుంది. . . . . . . . . . . . . . . . తప్పేక్కడబ్బా అని ఆలోచిస్తూ భర్త యోగ నిద్ర లోకి జారుకుంటాడు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.