Pages

Monday, December 26, 2016

వైర్‌లెస్‌ రూపకర్త ఎవరు?

 వైర్‌లెస్‌ రూపకర్త ఎవరు?wireless invented by


వైర్‌లెస్‌ను కనుగొన్న గూగ్లీమో మార్కోనీ 1874 ఏప్రిల్‌ 25న ఇటలీలో జన్మించారు. ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రైవేట్‌గానే చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్న కోరిక బాగా ఉండేది. ఆ దృష్టితోనే మార్కోనీ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించేవాడు.

వివోర్నో టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్షించింది. 'వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?' అన్నది ఆ వ్యాసం. అప్పటికి (1894) టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కోనీ ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకు తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు.

తన పరిశోధనని ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో దానిని బ్రిటిష్‌ వారికి ఇచ్చాడు. మార్కోనీ రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు.

క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు మార్కోనీ. 1901లో అట్లాంటిక్‌ మహా సముద్రాన్నిదాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్‌లెస్‌ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్‌ వ్యవస్థ ఫలితంగా ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కోనీ 1909లో భౌతిక శాస్త్రంలో కార్ల్‌ ఫెర్డినాండ్‌ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్‌ బహుమతి పొందారు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కోనీ.

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఆన్‌లైన్ ప్రశ్నాపత్రం

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఆన్‌లైన్ ప్రశ్నాపత్రం

      
 పరీక్షలకు అరగంట ముందే ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేస్తారు. పరీక్ష పూర్తయిన గంటలోనే మూల్యాంకనం జరిగిపోతుంది. వెంటనే ఇంటర్‌బోర్డుకు మార్కులు అప్‌లోడ్ అయిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షల నుంచే ఈ కొత్త విధానం అమలులోకి తేవాలని ఇంటర్‌బోర్డు యోచిస్తున్నది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

ఇంటర్మీడియట్‌లో సైన్స్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలలో అక్రమాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రాక్టికల్ పరీక్షల విధానంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పరీక్షా కేంద్రాలకు ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నాపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే.. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన గంటలోనే మూల్యాంకనం చేస్తారు. విద్యార్థులు సాధించిన మార్కులను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.

ఈ మేరకు టైం షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. బోర్డు నిర్దేశించిన సమయం ప్రకారం ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేసుకోవడం, తిరిగి విద్యార్థులు పొందిన మార్కులను బోర్డుసైట్‌కు ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయనున్నారు. ఈ విధానాన్ని ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నుంచే అమలుచేయనున్నట్టు తెలంగాణ ఇం టర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో ఒక సబ్జెక్టు కోసం ఈ విధానాన్ని అమలుచేశామని, అది విజయవంతమైందని బోర్డు అధికారులు
ధృవీకరించారు. అదే స్ఫూర్తితో రెగ్యులర్ పరీక్షలలో కూడా అమలు చేయాలని బోర్డు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

నేరుగా ఎగ్జామినర్‌కే ప్రశ్నాపత్రం

రాష్ట్రంలో ప్రాక్టికల్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు ఒక ఎగ్జామినర్‌ను నియమిస్తారు. వారికి ప్రాక్టికల్ ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిస్తారు. అందుకోసం ఎగ్జామినర్‌కు వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఇస్తారు. ఓటీపీ నంబర్ అప్‌లోడ్ చేసినవారికి మాత్రమే ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించిన గంటలోపే మూల్యాంకనం పూర్తిచేయాలి. విద్యార్థులు సాధించిన మార్కులు వెంటనే తిరిగి ఇంటర్‌బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా పంపించాలి.

ఈ మేరకు బోర్డు నిర్దేశించిన సమయంలోనే మార్కుల వివరాలు అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత సర్వర్ పనిచేయదు. విద్యార్థుల మార్కులు అప్‌లోడ్ కావు. ఈ క్రమంలో విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు ఈ విధానంపై ఇప్పటికే అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. పరీక్షల ముందు మరోసారి ఎగ్జామినర్లకు అవగాహన కల్పించాలని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

ప్రతిభకు న్యాయం ```

దీనివల్ల దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతిభావంతులు నిజాయితీగా మార్కులు పొందడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. డబ్బులకు మార్కులు అమ్ముకునే విధానం ఇకనుంచి ఉండదని అంటున్నారు. ఈ క్రమంలో మార్కుల విధానంలో గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు ఇకనుంచి అన్యాయం జరుగదన్న భావన వ్యక్తమవుతున్నది. అక్రమాలకు చెక్ పెట్టడం, విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా అన్‌లైన్ ప్రశ్నాపత్రం పంపిణీ ప్రక్రియను తాము స్వాగతిస్తున్నామని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూధన్‌రెడ్డి అన్నారు.

ఈ మేరకు ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని జంట కార్పొరేట్ విద్యాసంస్థల తీరు వల్ల ప్రాక్టికల్ పరీక్షలు చాలా గందరగోళంగా తయారయ్యాయి. ఎగ్జామినర్లను మభ్యపెడుతూ.. తమ విద్యార్థులకు కావాల్సిన మార్కులు వచ్చేలా కొందరు తెరవెనుక కుతంత్రాలు చేసేవారు. ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నాపత్రం పంపిణీ, ఆన్‌లైన్‌లో మార్కుల అప్‌లోడ్ వల్ల ఇక జంట కార్పొరేట్ సంస్థల అరాచకాలకు తెరపడినట్టేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

తెలంగాణ 'గురుకుల' పోస్టుల పరీక్షా విధానం...

తెలంగాణ 'గురుకుల' పోస్టుల పరీక్షా విధానం....


👉గురుకులాల్లో పోస్టుల భర్తీకి కొత్త విధానం

👉 తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

👉 అమలుకు టీఎస్‌పీఎస్సీకి అనుమతి

👉 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రాత పరీక్షలు

👉 ప్రాథమిక, ప్రధాన పరీక్షలుగా నిర్వహణ

✍ తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి కొత్త పరీక్షల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
పరీక్ష నిర్వహణ, భర్తీ బాధ్యతలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించిన ప్రభుత్వం ...పరీక్షల విధానాన్ని కూడా కమిషన్ నిర్వహించే (గ్రూప్1,2) పరీక్షల స్థాయిలోనే నిర్దేశించింది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 2444 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ కొత్త పరీక్షల విధానాన్ని ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం(జూన్ 30) ఉత్తర్వులు జారీ చేసింది.

👉🏼దీనిని చేపట్టేందుకు పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అనుమతించింది. గురుకుల పాఠశాలల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ (టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ), ప్రత్యేక (ఆర్ట్, క్రాఫ్, సంగీత)ఉపాధ్యాయులు, గురుకుల జూనియర్ కళాశాలల అధ్యాపకులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, వ్యాయామ సంచాలకుడు (ఫిజికల్ డైరెక్టర్) పోస్టులకు, ప్రిన్సిపాళ్ల పోస్టులకు నిర్వహించాల్సిన పరీక్షలు, వాటిల్లోనూ పాఠ్యాంశాలు, వాటికి కేటాయించిన మార్కులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


📉ఆబ్జెక్టివ్ తరహా విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రాథమిక, ప్రధాన పరీక్షలు జరుపుతామని తెలిపింది. ప్రిన్సిపాల్, జూనియర్, డిగ్రీ అధ్యాపకుల పోస్టులకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్ష (ఇంటర్య్వూ)లు నిర్వహిస్తామని తెలిపింది.

✏గురుకుల విద్యాసంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తొలిసారిగా ప్రత్యక్ష నియామకాల ద్వారా తొలిసారిగా పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నందున కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ

🔹ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం పరీక్షల విధానం అమలుకు అనుమతించినందున త్వరలోనే పబ్లిక్ సర్వీసు కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది.

🔻తాజా ఉత్తర్వుల ప్రకారం పరీక్షల విధానం ఈ కింది విధంగా ఉంటుంది.

1. ఉపాధ్యాయ (టీజీటీ, పీజీటీ) పోస్టులు

🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
*

🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)

🔹 మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధాన పరీక్ష (మార్కులు300)

🔹 పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన (స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్).( పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు)


🔹మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150

🔹 పేపర్2లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన


🔹 మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150

*2. ప్రిన్సిపాల్స్ *

🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)

🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)

🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధాన పరీక్ష (మార్కులు 330)

🔹 పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన ( స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్). పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు.


🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150

🔹పేపర్2లో విద్యాహక్కుచట్టం, జాతీయ పాఠ్యాంశ ప్రణాళికలు, పాఠశాల సంస్థ, ఉపాధ్యాయ సాధికారిత, శిశు అభివృద్ధి


🔹మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150

🔹 మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30

🔹 మొత్తం మార్కులు 330

3. జూనియర్ అధ్యాపకులు

🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు150)

🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)

🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధానపరీక్ష (మార్కులు 330)

🔹 పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన (స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్). పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు.

🔹 మొత్తం ప్రశ్నలు 100, కాలవ్యవధి 90 నిమిషాలు, మార్కులు 100

🔹 పేపర్2లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన

🔹మొత్తం ప్రశ్నలు 200, సమయం 180 నిమిషాలు, మార్కులు 200


🔹మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30

🔹మొత్తం మార్కులు 330

4. డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు

🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)

🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్)

🔹మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150

🔹ప్రధానపరీక్ష (మార్కులు 330)

🔹 పేపర్1లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన

🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150, నిమిషాలు, మార్కులు 300

🔹 మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
🔹 మొత్తం మార్కులు 330

5. ప్రత్యేక ఉపాధ్యాయులు

🔹 (ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్)
పరీక్ష (మార్కులు 200)

🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, సబ్జెక్టు డిసిప్లిన్, నాలెడ్జి

🔹 మొత్తం ప్రశ్నలు 200, కాలవ్యవది 180 నిమిషాలు, మార్కులు 200                      

ప్రపంచంలో మతంలేని ప్రజలు

ప్రపంచంలో మతంలేని  ప్రజలు

 no religion
భారతదేశం.. .0.6%
అమెరికా......20%
రష్యా.      .. .30.5%
Nyoo జిలాండ్..34.7%
సోమేనియా..   36.15%
బల్ గేరియా....37%
బెల్జియం. .  ... 38.75%
హంగరీ.   ..   ..39%
జర్మనీ..  ...       40%
దక్షిణకొరియా.. 41%
ఇంగ్లండ్.. .......41.5%
ఫిన్లాండ్.  ......  44%
నెదర్లాండ్.    ..  47%
చైనా..  ....    ..  47%
నార్వే...        ... 51.5%
ఫ్రాన్స్ ....       ...53.5%
హాంగ్ కాంగ్...     57%
జెక్ రిపబ్లిక్...     57.5%
మకాల్...    ...    60.9%
వియత్నాం...      62.5%
స్వీడన్...       ... 64%
డెన్మార్క్...     ...  72%
జపాన్...       ...    76%
ఎస్తోనియా...      76.5%

గీతాంజలి. -రవీంద్రనాథ్ టాగోర్.

గీతాంజలి.  -రవీంద్రనాథ్ టాగోర్.

 rabindra nath tagore
 అంతరాత్మ అంటేనే భయం.
ఎంతో దూరం నడచి ఒంటరిగా
ఈ సహజ సంకేతానికి వచ్చాను.
కాని ఈ నిశ్చల నిశ్శబ్ద నిశీధంలో
ఎవరిదో అడుగుల చప్పుడు
నా వెనుకనే వినిపిస్తూ ఉంది.
అతని నుంచి తప్పించుకోవాలని
వెంటనే ప్రక్కకు తొలుగుతాను.
కాని అతన్ని తప్పించుకోలేను.
అతను త్వరత్వరగా నడిచి
తన ఉనికికి గుర్తుగా ధూళి రేపుతాడు.
నేను మాట్లాడిన ప్రతిమాటకూ
అతను బిగ్గరగా శృతి కలుపుతాడు
అతను ఎవరో అనుకున్నావు కదూ
నన్ను అంటిపెట్టుకొని గోలచేస్తూ ఉండే
చిన్నారి నా అంతరాత్మనే ప్రభూ!
అతను చాలా అల్లరివాడు.
అతన్ని తోడుగా తీసుకొని
నీ ఇంటి ముందుకు రావాలంటే భయం.

శ్రీనివాస రామానుజన్

నేడు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జన్మదినంsrinivasa ramanajum

(డిసెంబర్ 22, 1887—ఏప్రిల్ 26, 1920)
భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త.

🔻20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది.

🔹చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు.

🔻ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు.

🔹పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.


🍄జీవిత విశేషాలు🕹

✳బాల్య0
రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రం లోని ఈరోడ్ పట్టణములో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు.

♦రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు. తల్లి కోమలటమ్మాళ్ గృహిణి మరియు ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంబకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రామానుజన్ ఒకటిన్నర సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదగోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మూడు నెలలు పూర్తవక మునుపే ఆ బిడ్డ కన్నుమూశాడు. డిసెంబర్ 1889 లో రామానుజన్ కు మశూచి (అమ్మవారు) వ్యాధి సోకింది. కానీ తంజావూరు జిల్లాలోని ఈ వ్యాధి సోకి మరణించిన చాలామంది లాగా కాకుండా బ్రతికి బయట పడగలిగాడు.

♦తరువాత రామానుజన్ తల్లితోపాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు. 1891లో మళ్ళీ 1894 లో రామానుజన్ తల్లి ఇరువురి శిశువులకు జన్మనిచ్చినా ఏడాది తిరగక మునుపే వారు మరణించడం జరిగింది.

♦అక్టోబరు 1, 1892లో రామానుజన్ అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. మార్చి 1894లో ఇతడిని ఒక తెలుగు మాధ్యమ పాఠశాలకు మార్చడం జరిగింది.రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం కోల్పోవడంతో,  రామానుజన్ తల్లితో సహా కుంబకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. నాన్న తరుపు తాత చనిపోవడంతో రామానుజన్ను మళ్ళీ మద్రాసులో నివాసం ఉంటున్న తల్లి తరుపు తాత దగ్గరికి పంపించారు. కానీ అతనికి మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడు. అతని తాత, అమ్మమ్మలు రామనుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ ఆరు నెలలు కూడా తిరగక మునుపే కుంబకోణం పంపించేశారు.

♦రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నపుడు అతని బాధ్యతలు తల్లే చూసుకొనేది. కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు. ఆమె నుంచి రామానుజన్ సంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు.రాల వయసు లోపలే ఆంగ్లము, తమిళము, భూగోళ శాస్త్రం, గణితంలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. మంచి మార్కులతో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచాడు. 1898 లో అతని తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీ నరసింహం అని నామకరణం చేశారు. అదే సంవత్సరంలో రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే మొట్ట మొదటి సారిగా గణితశాస్త్రంతో (formal mathematics) పరిచయం ఏర్పడింది.

🍄యవ్వనం
1909, జులై 14వ తేదీన రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహమైంది.పెళ్ళైన తరువాత రామానుజన్ కు వరీబీజం వ్యాధి సోకింది. ఇది శస్త్ర చికిత్స చేయడం ద్వారా సులభంగా నయమయ్యేదే కానీ వారికి తగినంత ధనం సమకూరక కొద్ది రోజుల పాటు అలానే ఉన్నాడు. చివరకు 1910, జనవరి నెలలో ఒక వైద్యుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో ఆ గండం నుంచి బయటపడ్డాడు. తరువాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు.

🔢గణిత శాస్త్రజ్ఞులచే గుర్తింపు

✳అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పని చేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసు కున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో ఇలా గుర్తు చేసుకున్నాడు.

“ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.

🔹 అంతటి గొప్ప విజ్ఞానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమాన పరచలేను”

♦తరువాత రామస్వామి రామానుజన్ ను కొన్ని పరిచయ లేఖలు రాసి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్ది మంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రామచంద్ర రావు దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్ర రావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడి, అవి అతని రచనలేనా అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్ధానా గురించి, అతని రచనలు ఆ ప్రొఫెసర్ కు కూడా అర్థం కాలేదని చెప్పాడు.

🔴ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలతో పరిచయం

🔘నారాయణ అయ్యర్, రామచంద్ర రావు, E.W. మిడిల్‌మాస్ట్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎం.జే.ఎం. హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్ని లోపాలున్నాయని వ్యాఖ్యానించాడు. హిల్ రామానుజన్ ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదుగానీ, రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు.

🔯రామానుజన్ పై ఇతర గణిత శాస్త్రవేత్తల అభిప్రాయాలు

🔴రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్దులైన ఆయిలర్, గాస్, జాకోబి మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం..

☮ఇంగ్లండు జీవనం☮

☢1914 మార్చి 17 న రామానుజన్ ఇంగ్లండుకు ప్రయాణమయ్యాడు. శాకాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లండులో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలనా చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్తమైంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గురించి హార్డీ ఇలా చెప్పాడు:

🔘నేనోసారి రామాంజున్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్ళాను. దాని నంబరు 1729. ఈ నంబరు చూట్టానికి డల్‌గా కనిపిస్తోంది ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. అతడు "కాదు, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య; రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది" అని అన్నాడు.

🔘వీటిని ట్యాక్సీక్యాబ్ సంఖ్యలు అంటారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం.

🖲ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొద్దుగా, కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లండు నుంచి పాలిపోయిన అస్థిపంజరం వలే తిరిగి వచ్చిన రామానుజన్ ను చూసి ఆయన అభిమానులు చలించి పోయారు. అనేక రకాల వైద్య వసతులు కల్పించినా ఆయన కోలుకోలేక పోయాడు. దాంతో ఆయన 1920, ఏప్రిల్ 26న పరమపదించాడు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతం గానే ఉండటం విశేషం.

✍🏻వ్యక్తిత్వం

♦రామానుజన్ చాలా సున్నితమైన భావాలు, మంచి పద్ధతులు కలిగిన బిడియస్తుడిగా ఉండే వాడు. ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొనడం జరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవాడు. ఆమె కలలో కన్పించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవాడు. భగవంతునిచే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచనా సూత్రం కానేరదు అని అప్పుడప్పుడూ అంటుండేవాడు .

♦రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు. ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రచయితలు అతిగా అర్థం చేసుకున్నారని వివరించాడు. అంతేకాదు, రామానుజన్ యొక్క శుద్ధ శాఖాహారపు అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు.

♦రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది.

♦భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

లాల్‌బహదూర్‌శాస్ర్తీ

లాల్‌బహదూర్‌శాస్ర్తీ

lal bahadur shastry
దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు, ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.

మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్‌బహదూర్‌శాస్ర్తీగారికి ఈ విషయం తెలి పారు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దానె్నలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా?

దేశ ప్రధాని కాకముందు లాల్‌బహదూర్‌శాస్ర్తీగారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీఅయ్యారు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితాశాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయ త్నం కారణంగా ఇనే్నళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. దేశ ప్రధాని ఐన లాల్‌బహదూర్‌శాస్ర్తీ.
ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మించేది.

మొత్తం ఎనిమిది భాషల్లో నీట్

 మొత్తం ఎనిమిది భాషల్లో నీట్

neet in how many languages
👉న్యూఢిల్లీ: మెడికల్ ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీటీ-యూజీ) విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది.

మొత్తం ఎనిమిది భాషల్లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. 2017-18 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జీపీ నడ్డా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం దీనిని ఖరారు చేశారు.
వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, తెలుగు, తమిళ భాషల్లో ఇక జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

 దీంతోపాటు నీట్కు అర్హత పొందిన అభ్యర్థి ఆలిండియా కోటాలోనే కాకుండా రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఉండే ఇతర కోటాల కింద కూడా సీటు పొందేందుకు అర్హత కలిగి ఉంటాడు.
మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ ఏడాది మే నెలలో నీట్ నిర్వహణ గురించి కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. వాటన్నింటిని క్రోడికరించి కేంద్రంలోని వైద్యశాఖ కు చెందిన సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు.

ప్రశ్న: కాంతి లేని సమయాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగదెందుకు? ట్యూబ్‌లైట్‌ కాంతిలో ఈ క్రియ జరగుతుందా?

ప్రశ్న: కాంతి లేని సమయాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగదెందుకు?

ట్యూబ్‌లైట్‌ కాంతిలో ఈ క్రియ జరగుతుందా?

ప్రశ్న: కాంతి లేని సమయాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగదెందుకు? ట్యూబ్‌లైట్‌ కాంతిలో ఈ క్రియ జరగుతుందా?
జవాబు: మొక్కల్లో జరిగే ఆ చర్య పేరే కిరణ జన్య సంయోగ క్రియ (Photo-synthesis). కాంతి కిరణాల సమక్షంలో జరిగేది కాబట్టే ఆ పేరు. ఈ క్రియలో పాల్గొనే నీరు, కార్బన్‌ డయాక్సైడుల కన్నా వాటి నుంచి ఏర్పడే పిండి పదార్థాలకు శక్తి ఎక్కువ. అంటే శక్తి తక్కువ ఉన్న పదార్థాలు కలిసి శక్తి ఎక్కువగా ఉన్న పదార్థాలుగా మారాయన్నమాట. శక్తిని సృష్టించలేమనీ, నశింపచేయ లేమని శక్తి నిత్యత్వ సూత్రం (Law of conservation of energy)లో చదువుకుని ఉంటారు. కాబట్టి కాంతిశక్తే
పిండిపదార్థాలలో నిగూఢమవుతుందన్నమాట. కాంతి లేకుండా కిరణ జన్య సంయోగ క్రియ జరగదు. ట్యూబ్‌లైటు వెలుగులో కూడా ఈ క్రియ జరుగుతుంది. అయితే ఈ కాంతి తీవ్రత తక్కువ కాబట్టి నెమ్మదిగా జరుగుతుంది.

చక్కని కధ

చక్కని ఎద్దు... కధ.. 


అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.

గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.

ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.

పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.

గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.

గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.

"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!

దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'

గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.

తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!

గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.

చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...

జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.

ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి

ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..





ధర్మం చేయండి బాబు


ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.

ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?

'అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం' అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- "ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?" అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, 'వాడికి ఆకలిగా ఉంది' అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- 'తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!' అని.

పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- "మీకు ఎంత చెల్లించాలి?" అని.

"నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!"అన్నది ఆ యువతి నవ్వుతూ. "దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!" అన్నది.

పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. "అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి" అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.

ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-
ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.

చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.

ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. 'ఎలాగైనా ఆమెను రక్షించాలి' అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!

ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.
ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె... బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:

ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.
సం/-

దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!

మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.







అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.
అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.
ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య ఆనుకున్నాడు.
కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది.అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను,తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి : ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.







గొప్ప గుణం💦💭
💦💭రవి చంచల 💭💦

💦💥  కొడంగల్ పట్టణం లోని కోస్గి లో సుదర్శన్ ,మాదవరెడ్డి  ,  అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో సుదర్శన్ తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు సుదర్శన్  అంటే చాలా ఇష్టం. కాని  మాదవరెడ్డి మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో సుదర్శన్ కున్న  గొప్ప పేరును చూసి  అసూయపడేవాడు. ఎలాగైనా సుదర్శన్ ను  దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు నారయణ ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన  సుదర్శన్కు  అప్పగించారు. అది చూసి ఓర్వలేని మాదవరెడ్డి మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు.  సుదర్శన్ ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు.  గుడి తాళాలను పెట్టెలో పెట్టి సుదర్శన్ భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

ఒక రోజు  సుదర్శన్ భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను  మాదవరెడ్డి చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి  మాదవరెడ్డి ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు సుదర్శన్ వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్దవీరేశము  ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు , సుదర్శన్ , మాదవరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద వీరేశము , సుదర్శన్ తో  తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. సుదర్శన్  గ్రామ పెద్ద వంక చూసి "అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు" అని బదులిచ్చాడు. "ఈ  మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని  మాదవరెడ్డి చెప్పాడు.

గ్రామ పెద్ద  వీరేశముకు  , మాదవరెడ్డి మాటలపై నమ్మకం కలుగలేదు.  సుదర్శన్ నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద -సుదర్శన్  ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను వీరేశము కు   అందజేసారు.  ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే "రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ వీరేశము గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను మాదవ రెడ్డి చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య మాదవరెడ్డి తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు గ్రామపెద్ద - " మాదవరెడ్డి నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన సుదర్శన్ పై  నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను" అన్నాడు. అప్పుడు   మాదవరెడ్డిని  క్షమించి వదిలివేయమని సుదర్శన్ గ్రామపెద్దను వేడుకున్నాడు.  సుదర్శన్  మాట కాదనలేక వీరేశము  మాదవరెడ్డి ను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే  గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. , మాదవరెడ్డి, సుదర్శన్  చేతులుపట్టుకొని "అసూయతో చేసిన నేరానికి క్షమించమని" అడిగాడు.  "ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడ సుదర్శన్. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు. 💥💦ఈ కథ రాసినవారికి వందనాలు 💦పోస్ట్ ::రవి చంచల










Wednesday, December 7, 2016

మన తెనుగు (తేనె+అగు) లేదా తెలుగు (తేనె+అలుగు) భాష వయస్సు దాదాపు 2000 సంవత్సరముల పైమాటే.

 మన తెనుగు (తేనె+అగు) లేదా తెలుగు (తేనె+అలుగు) భాష వయస్సు దాదాపు 2000 సంవత్సరముల పైమాటే.11 వ శతాబ్దంలో నన్నయ తెలుగు వ్యాకరణం సమకూర్చి, సంస్కృతంలో వ్యాసుడు వ్రాసిన మహాభారతాన్ని, తెలుగు భాషలోకి అనువదించాడు. మహాభారతం మన మొదటి సాహిత్య పద్య గద్య ఇతిహాసం.


తెలుగు అజంత భాష. ప్రతి పదం అచ్చుతోనే ముగిసి పదానికి అందం తెస్తుంది. తేనె కన్నా తీయనిది తెనుగు భాష. తెలుగు భాష గొప్పదనమంతా అక్షరాల అల్లికలోనే వుంది. ఇంటి ముందు చక్కని ముగ్గును చూసినంత ఆనందం కలుగుతుంది.

మొదట్లో 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు కలిపి 60 అక్షరాలుండేవి. కాలక్రమేణా, కొన్ని అక్షరాల వాడకం తగ్గి 56, 54, 52 గా పరిణమించాయి. ఇప్పుడు  12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరాలను మాత్రం వాడుతున్నాము. అరసున్న, విసర్గం వాడకం చాలా వరకు తగ్గిపోయింది.

మన దేహానికంతా వ్యాయామ సౌకర్యం వుంది. ముఖానికి మాత్రం లేదు. తెలుగు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః) పలికే టప్పుడు, ముఖకదలికతో ముఖానికి మంచి వ్యాయామం చేకూరుతుంది. అలాగే హల్లుల వల్ల ముఖం అన్ని భాగాలకు, ఈ క్రింది విధంగా వ్యాయామం కలుగుతుంది.

                     క ఖ గ ఘ ఙ ......................... కంఠ భాగము
                     చ ఛ జ ఝ ఞ ......................నాలుక మొదటి భాగము
                     ట ఠ డ ఢ ణ ..........................నాలుక మధ్య భాగము
                     త థ ద ధ న ..........................నాలుక కొన భాగము
                     ప ఫ బ భ మ .........................పెదవులకు
                    య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ..పూర్తి నోరు భాగమంతా

అయితే, ఇప్పుడు నేను, నా వాళ్లయిన అందరు తెలుగు ప్రజలు, బంధువులు, స్నేహితుల కోసం, నా చిన్నతనంలో నేర్చుకున్న 52 అక్షరాలను 'అ నుంచి ఱ' వఱకు ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న వాక్యాలతో చిన్న పిల్లల చేష్టలను వర్ణిస్తూ, ఒక సరదా సంఘటనను సృష్టించుకొని, ఒక చిన్న కథగా చెప్పి, సంతోషపఱుస్తాను.

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో,
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని,
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు.

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు,
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

చదివినందులకు ధన్యవాదములు.

"కూలీ"

 "కూలీ"

ఒకానొక ఊర్లో భీద కూలివాడు
ఉండేవాడు..
ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు
వెళ్లి ఏదైనా పని చెప్పండి అని
బ్రతిమలాడేడు ...
చెక్కల వ్యాపారి సరే అని చెప్పి.
జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత
అని చెప్పేడు..
.
కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు
బ్రతకడానికి 100 రూపాయలు అవసరము
అవతాయి .కాబట్టి నాకు
100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.
అప్పుడు కలప వ్యాపారం చేసే
యజమాని  అలా కుదరదు...
.
నీ పనికి తగ్గట్టుగా నీ జీతం
ఉంటుంది..
పని  ఎంత ఎక్కువగా
చేస్తే  అంత డబ్బు వస్తుంది..
అని బదులిచ్చాడు..
.
కూలివాడు తప్పక సరే అన్నాడు..

 .
కూలివాడు యజమాని  చెప్పిన
ఒప్పందం కి సరే అని చెప్పేడు.
అప్పుడు ఆ యజమాని  ఆ కూలివాడుకి
ఒక మంచి బలమైన  కత్తి ఒకటిచ్చి
అడవిలో పెద్ద పెద్ద చెట్ల మ్రానులను
నరికి తెమ్మన్నాడు...
.
కూలివాడు సరే అని వెళ్లి అడవిలో
చెట్లను నరకడం మొదలుపెట్టేడు..
ఎలాయితేనే  పొద్దు కునికే సరికి
15 చెట్లను నరికి వాటిని తెచ్చి
యజమానుడుకి అప్పజేప్పేడు.
యజమానుడు భళా  దాసుడా..
ఎవరైనా ఒక్కరోజులో 7 చేట్లకంటే
ఎక్కువగా నరకలేరు...
నువ్వు ఏకం గా 15 చెట్లు నరికావు...
భళా అని పొగిడి..
నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ
కష్టపడ్డావ్ అని మెచ్చుకుని.
చెట్టుకు 10 రూపాయలు చప్పున
ఆ కూలివాడుకి 150రూపాయలు
ఇచ్చాడు..
.
ఆ  కూలివాడు మరుసటి రోజు
అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే
ఇంకా డబ్బులువస్తాయి కదా అని
మొదటి రోజు కంటే ఎక్కువ సేపు
కష్టపడి పోద్దు కున్కేసరికి 10 చెట్లను
నరికి తెచ్చి యజమానుడుకి చెట్టుకు
10 రూపాయలు చప్పున 10 చెట్లు అప్పజెప్పి
100 రూపాయలు కూలి  తీసుకున్నాడు..
.
మూడవరోజు కూలివాడు  ఇంకా కష్టపడి
పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు
నరికి  యజమానుడుకి అప్పజెప్పి
చెట్టుకు 10 రూపాయలు చప్పున
50 రూపాయలు తీసుకుని
వెళ్ళిపోయాడు...
మరుసటి రోజు ఎలా అయిన
ఎక్కువ చెట్లు నరకాలని వేకువ
జామున చీకటితో బయలుదేరివెల్లి
ఆ అడవిలో  ఎన్నడులేనంత గా
కష్టపడి వేకువజామున నుండి చీకటి
 పడేవరకు  కష్టపడి
ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి
అప్పజేప్పేడు .
.
అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు
10 రూపాయలు చప్పున పది
రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో
పెట్టేడు.
పనివాడు పది రూపాయల నోటు
 వైపు దీనముగా చూస్తూ శాయశక్తులా కష్టం
పెంచినా ఫలితం పది రూపాయలేే
అని తలంచి...
ఎంత చేస్తే అంత అన్నయజమానుడితో
ఉన్న ఒప్పందం గుర్తెరిగి
చేసేది ఏమీ లేక...
వెళ్ళిపోతూ  వెళ్లిపోతూ
.
అయ్యగారు నా కష్టం లో ఎటువంటి
లోపం లేదు..
చీకటి పడేవరకు చెమట ఓర్చి
శ్రమించాను కాని ఒకటి కంటే
ఎక్కువ నరకలేకపోయాను...
అని దీనముగా అన్నాడు..
.
అపుడు యజమానుడు నేను నీకు
ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు
అవుతుంది ??అని అడగగానే.
కూలివాడు నేను రోజు నా  పనిలో
మునిగిపోవడంవలన కత్తికి పదును
పెట్టె సమయం నాకు లేదు...
అందుకే కత్తికి ఒక్కసారికూడా
పదును పెట్టలేదు అని అన్నాడు...
అపుడు యజమానుడు 
అర్ధం లేని నీ శ్రమకు ,
ఆర్ధిక పతనానికి 
శరీర శ్రమలకి 
కారణం కత్తికి పదును లేకపోవడమే.

.
పదును పలితం...
ఎటువంటి సమస్యనైనా సులువుగా 
కోసిపారేయడమే

మార్పు  లేని జీవితం , పదును లేని
మొద్దుబారిన కత్తిలాంటిది..
ఏవేవో శ్రమలు పడతాం కాని
ఫలితం ఆవిరి.....
కష్టపడుతున్న..
కష్టపెట్టే పరిస్థితులు మాత్రం
మారనే మారవు
పదునైన ఆలోచనలతో మాత్రమె
గోప్పవిజయాలు సాధించగలము..




మనసుకు హత్తుకునే కథ

 మనసుకు హత్తుకునే కథ

.
భార్య భర్తల మధ్య ప్రేమనీ చూడండ
.
ఆరోజు వారి పెళ్ళిరోజు, నీలిమ భర్త సoతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది....
.
వారికి పెళ్లయి కొన్ని సoవత్సరాలు అయ్యింది. మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది. రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం లేదు, కాని ఇద్దరు ఒకే ఇంట్లోనే వుంటున్నారు...
.
నీలిమ ఆలోచన అoతా ఒకటే !
ఈరోజు తమ పెళ్ళిరోజు గుర్తున్నదా లేదా అని....
.
అంతలొ కాలింగ్ బెల్ మోగింది. నీలిమ ఆనందంతొ తలుపు తెరిచింది...
.
వర్షంలొ తడిసి వున్నాడు, చేతిలో పువ్వుల బోకే వుంది. ఇద్దరు గత స్మృతులలోకి వెళ్ళి మాట్లాడు కుంటున్నారు....
.
అంతలో ఫొన్ రింగ్ వినపడింది. నీలిమ పక్క గదిలోకి వెళ్లి ఫోన్ తీసింది....
.
అటువైపునుండి . . . ఇది సంతోష్ గుప్త గారి ఇల్లేనా? సారి మేడమ్ ఇక్కడ ఒక accident అయ్యింది. ఒకతను చనిపోయాడు, పర్సులో మీ భర్త గారి ఫొటో వుంది, మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి.....
.
నీలిమ ఒక్కసారి shock!!!!!!..
.
అయిన వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే వున్నాడు. అది ఎలా సాద్యం? ..
.
లేదు మేడమ్ ఈరోజు 4. 30pm కి train accident జరిగింది , మీ భర్త పర్సు వుంది ఇక్కడ....
.
నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెల్లి చూస్తే సంతోష్ లేడు...
.
నీలిమ ఒక్కసారి కూలబడింది. ఎవురు మరి? సంతోష్ ఆత్మ ? చివరగా నన్ను సంతోష పెట్టడానికి ఆత్మరూపంలో వచ్చాడా !!!! ..
.
దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు. నేను కూడ అతనితో పాటు చనిపోతే బాగుండు. ..
.
.
మరో జన్మలోనైనా కలిసి వుండేవాళ్ళం. ఒకటే ఆవేదన !ఆవేదన .
.
ఇంతలొ బాత్రూమ్ తెరుచుకున్న సౌండు , ఎదురుగా సంతోష్...
.
.
సారీ నీలిమ నీకొక విషయం చెప్పడం మరిచాను. ఈరోజు station లో
నా పర్సు పోయింది అని ఇంకా ఏదో చెపుతున్నాడు...
.
అవి ఏవీ నీలిమ చెవిని చేరడం లేదు ! అతనికోసo తన గుండె వేదన ! తనకున్న పట్టరాని సంతొషంతొ !!!!! ఒక్కసారి వెళ్ళి మనసారా హత్తుకుంది....
.
జీవితo అనేది ఇంకొక అవకాశం కోసం కాదు , అది వున్నప్పుడే మనం ఉపయోగిన్చుకోవాలి., ఆనందంగా వుండాలి...
.
ఈజన్మలో .......
అది అమ్మ - -నాన్నలతో
అది మన జీవిత బాగస్వాములతో అది మన తోబుట్టులతో,....,
అది మన మిత్రులతో . . .
జీవితం ఆస్వాదించండి ! ఆనందంగా వుండండి .....
Please Share to All.

Friday, December 2, 2016

చంద్రశేఖర వేంకట రామన్

చంద్రశేఖర వేంకట రామన్ వర్థంతి సందర్భంగా సమాచారం.. Image cv raman

సి.వి.రామన్ FRS [1] (నవంబర్ 7 , 1888 - నవంబర్ 21 , 1970 ) భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టాడు 1930 డిసెంబరులో రామన్కు నోబెల్ బహుమతివచ్చింది.
1954లో భారత ప్రభుత్వం ఆయనను
భారతరత్నపురస్కారంతో సత్కరించింది .

🐔ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు.

🍇విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు.

🎲తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు.

🍒ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు.
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు.

🍭ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది.
ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు.

🍈చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది.

🐌చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు.
నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు.
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు.

🍡 సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి) పూర్తి చేశాడు.

🍟1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు.

🍏చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు.
తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేరారు.

జీవితంలో డబ్బే ముఖ్యము కాదు ( పాత రష్యన్ కథ )

 జీవితంలో డబ్బే ముఖ్యము కాదు ( పాత రష్యన్ కథ )



ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు..
ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..
మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!
అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! 

ఇంకో రాగి నాణెం వస్తుంది..

మళ్ళీ రుద్దుతాడు..

మరోటి వస్తుంది..

మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!

అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. 

ఓ మనిషీ..!
ఇది మాయానాణెం..
దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..

అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!!
అని చెప్తుంది..

అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు..
తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు..

పిల్లల్ని మర్చిపోతాడు..

ప్రపంచాన్ని మర్చిపోతాడు.

.అలా రుద్దుతునే వుంటాడు..

గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!!

ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది..
రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు..

అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు..

పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..

కొత్త భవనాలు వెలసి వుంటాయి..

కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..

స్నేహితులు..

చుట్టాలు..

పుస్తకాలు..

ప్రేమ,పెళ్ళి... 

జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలనూ అనుభవిస్తుంటారు..

ఆ మనిషికి ఏడుపు వస్తుంది.

ఇంతకాలం ఇవన్నీ వదిలెసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలుతాడు..!!

ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వుంటున్నామా అనిపిస్తుంది...

సంపాదనలో పడి ..

కెరీర్ లో పడి..

కీర్తి కాంక్షలో పడి..

లక్ష్య చేధనలో పడి,

బంగారు నాణెం వంటి జీవితాన్ని..

మకిలి రాగినాణెం లా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది..!!

అమ్మ చేతి ముద్ద..

భార్య ప్రేమ..

పిల్లల అల్లారు ముద్దు..

స్నేహితుడి మందలింపు..

ఆత్మీయుడి ఆలింగనం..

ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి..

ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి.

Image cv raman
.