Pages

Monday, August 29, 2016

భార్య-భర్త

" నేను ఢిల్లీలో పోలీసులని భలే మోసం చేశాను."

భార్య : " ఏం చేశారు? "

భర్త : " నేను 20 అంతస్తుల బిల్డింగ్‌లోని 15వ అంతస్తు చూస్తున్నప్పుడు పోలీసు వచ్చి నువ్వు ఎన్నో అంతస్తు చూస్తున్నావు? " అని అడిగాడు.

నేను ' 5వ అంతస్తు చూస్తున్నాను అన్నాను.

పోలీసు 5 రూపాయలు పెనాల్టీ వేశాడు. ఆ విధంగా నేను 10 రూపాయలకి పోలీసుని మోసం చేశాను."

.................................

" ఈ ఇంట్లో బట్టలుఉతకడం, అంట్లుతోమడం, వంటపని అంతా నేనే చేస్తాను మరి! "

" అలాగా, జీతం ఎంతిస్తారేమిటి? "

" అయ్యో జీతం అడిగితే మా ఆవిడ ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది కదా! "

.....................................

భర్త : " డార్లింగ్ నీ కోసం. . . నీ పుట్టిన రోజు కానుకగా ఈ నెక్లెస్ తెచ్చాను.

చూసావా? ఎలావుందో? "

భార్య : " మరి! ఈసారి పుట్టిన రోజుకు కారును తెచ్చి ఇస్తానన్నారుగా "

భర్త : " గోల్డ్ నెక్లెస్‌కు డూప్లికేట్‌గా రోల్డ్‌గోల్డ్ తెచ్చాను. కానీ కారుకు డూప్లికేట్ కారు మరి వుండదుగా "

...........................................

అలిగి పుట్టింటీకొచ్చిన కూతురు తిరిగి కాపురాని కెళ్తుంటే తల్లి అడిగింది.

" ఏమ్మా నీ తప్పు తెల్సుకున్నావా? " అని.

" అది కాదు, ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది.

అక్కడయితే అన్ని పనులూ ఆయనే చేస్తారు. ఈ నిజం తెల్చింది నాకు " అంది.

.......................................

క్యాన్సిల్

గోపి : ఒరేయ్ రాజా, నీ దగ్గర రెండు సెల్‌ఫోన్సు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా

రాజు : అదేంట్రా అలా అడుగుతావ్‌. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటి!

గోపి : నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా

రాజు : ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండటానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను

గోపి : నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా

రాజు : ఏరా నీకింకా నమ్మకం కలగలేదా,

గోపి : రెండు కలర్ టీవీలుంటే...

రాజు : నా దగ్గర రెండు కలర్ టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావ్ కదూ. ఈ ప్రశ్న క్యాన్సిల్

గోపి : ఆ ...!

రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?

 రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?


పెరుగు ప్రాచీన కాలంనుండి అద్భుతమైన పోషక విలువలతో మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడుతోంది. పెరుగునే యోగ్రర్ట్ అని పిలుస్తారు. పెరుగు అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది క్రీమీ టేస్ట్ ను కలిగి ఉంటుంది. అంతే కాు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతే కాదు మరీ ముఖ్యంగా పాల కంటే పెరుగు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇంకా పెరుగులో ప్రోటీన్స్ మరియు క్యాల్సియం కంటెంట్ అధికంగా ఉన్నాయి. పాలు పడనివారు, ఇష్టం లేనివారు, మరియు ల్యాక్టోజ్ ఇన్టాలరెన్స్ వల్ల సులభంగా జీర్ణించుకోలేని వారు పాలకు బదులుగా పెరుగును ఖచ్ఛితంగా తినాల్సి ఉంటుంది. పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి . కాబట్టి దీన్ని మన డైలీ, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ ప్రయోజనాలు ఎముకలు, దంతాలు, బ్రెయిన్, స్టొమక్, మరియు ప్రేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది .

మరియు మీరు ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆపానవాయువు సమస్యలను ఎదుర్కోరు. పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ పెరుగు తినడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యేటటువంటి అన్ని రకాల న్యూట్రీషియన్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా బాడీకి చేరుతాయి. అందువల్ల, పెరుగు వల్ల పొందే ఇన్ని ప్రయోజనాలను ఖచ్చితంగా మిస్ చేయకూడదు. వివిధ రకాలా ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తినడం నివారించే ప్లెయిన్ గా ఇంట్లో తయారుచేసుకొనే హెల్తీ పెరుగును తినడం వల్ల మరిన్ని హెల్తీ, అమేజింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు... మరి డైలీ బెసిస్ లో రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల ఏం జరగుతుందో తెలుసుకుందాం....!

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది:

మీరు హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే , అప్పుడు ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో పెరుగు ఉండాల్సిందే . ఎవరైతే రెగ్యులర్ గాపెరుగు తింటారో వారిలో హైబ్లడ్ ప్రెజర్ లక్షణాలు, కిడ్నీ మరియు హార్ట్ డిసీజ్ వంటి లక్షణాలు పెరగవని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. అందుకు పెరుగులో ఉండే పొటాషియమే అంటున్నారు.

మానసిక ఏకాగ్రత పెంచుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో స్ట్రాంగ్ బ్రెయిన్ మరియు మెంటల్ కాన్ సంట్రేషన్ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది . ఇది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వల్లే ఇలా జరగుతుంది. రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో మెమరీ పవర్ పెరుగుతుందని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది. Show Thumbnail

బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది :

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు గ్యాస్ సమస్యలు నివారించబడి బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మరియు ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. మరియు మలబద్దక సమస్యలను కూడా నివారిస్తుంది.

నడుము చుట్టుకొలత తగ్గించుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అంటే కేవలం పెరుగు తినడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. అంతే కాదు పెరుగు రెగ్యులర్ గా తినడం వల్ల ఒత్తిడికి(ఇది నడుము చుట్టూ కొవ్వు చేరే) కారణం అయ్యే హార్మోనుల ఉత్పత్తిని తగ్గిస్తుంది. Show Thumbnail

సంతోషంగా ఉండవచ్చు:

పెరుగులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థకు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ బి12, విటమిన్స్ వెజిటేరియన్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని చాలా వరకూ అనిమల్ ఫుడ్స్ లో ఎక్కువగా చూస్తుంటాము. విటమిన్ బి 12 ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతాయి.

ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు:

ప్రతి రోజూ పెరుగు తింటుంటే దంతక్షయ సమస్యలుండవు . పాల వల్ల దంతక్షయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ల్యాక్టోజ్ షుగర్స్ ఉండటం వల్ల పెరుగు దంతాలకు మరియు ఎముకలకు చాలా మేలు.
[9:22 AM, 8/28/2016] +91 94415 65994: 🌹🕉అంతర్యామి🕉🌹

🌻👌రథ శాంతి👌🌻

🌺 భగవానుడు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని ఆనందంగా ఆరోగ్యంగా అనుభవించడం, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మనిషి విజ్ఞతపై ఆధారపడి ఉంటాయి అనుభవాల ఆటుపోట్లు జీవితాన్ని ఒక పట్టాన సాఫీగా సాగనివ్వని మాట యథార్థమైనా, కళ్లముందున్న జీవితకాలం అపూర్వమని తెలుసుకోవాలి. దాని ప్రస్థానం ఉన్నతంగా సాగాలి.
🌺 జీవితకాలం నూరేళ్లుగా నిర్దేశితమైంది. అంతకుపైబడి జీవించినవారూ ఉన్నారు. ఒక వయసు దాటాక జీవన దశలను గుర్తుచేస్తూ సాగే వేడుకలు- పాటించాల్సిన ధర్మాలను తెలియజేస్తాయి. కుటుంబ యజమానికి అరవై ఏళ్ళ వయసు రాగానే షష్టిపూర్తి వేడుక నిర్వహిస్తారు      🌼 కుటుంబసభ్యులు, బంధువులు చేరి వివాహ వేడుకను మరపించేలా చేస్తారు. అరవై ఏళ్ళ వయో దశనే ‘ఉగ్రరథ శాంతి’ అనీ అంటారు. ఉగ్రరథుడు అంటే యమధర్మరాజు. నిండు నూరేళ్లు జీవించేలా దీవించాలని కోరుతూ ఆయనకు జరిపే శాంతి ఇది

🌺 మానవ శరీరమే రథం. ఇంద్రియాలే గుర్రాలు. కోరికలు పగ్గాలు. రథ సారథి జీవుడు. గమ్యం పరమాత్ముడి సన్నిధి... అని చెబుతాయి శాస్త్రాలు అరవై వరకు జీవితాన్ని ఒడుదొడుకులతో, ఉరుకులు పరుగులతో గడుపుతూ అలసిపోతాడు మనిషి. బరువు బాధ్యతలను ఎదిగిన సంతానానికి అప్పగించి, ప్రశాంతంగా కాలం గడిపే వయసుగా ఈ దశను భావిస్తాడు. ఇది జీవన పోరులో విరామ ఘట్టం. డెబ్భై ఏడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజుల వయసు నాటికి భీమరథ శాంతి జరుపుకొంటారు. కొంతమంది డెబ్భై సంవత్సరాల వయసులోనే ఈ శాంతి చేస్తారు. భీమరథుడన్నా యమధర్మరాజే!

🌺 ఎనభై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులకు దేవరథ శాంతి, తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజులకు దివ్యరథ శాంతి, నూట అయిదు సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజుల వయసుకు మహా దివ్యరథ శాంతి చేసుకుంటారు!

🌺 మనది చాంద్రమానం. జీవితకాలంలో వెయ్యి పూర్ణచంద్రోదయాలు చూసినవారికి- అంటే ఎనభై సంవత్సరాలకు పైన ‘సహస్ర పూర్ణచంద్ర దర్శనం’ వేడుక జరుపుతారు.                          🌸వయసు యాభై సంవత్సరాలు దాటిన తరవాత, ప్రతి పది సంవత్సరాలకు ఓ ఉత్సవంగా చేసుకోవాలని ఆర్యోక్తి.

🌺 మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నతమైంది. ఆదర్శప్రాయమైంది. కుటుంబాల్లోని పెద్దలు మార్గదర్శకులే కాదు, సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులనీ శాస్త్రాలు చెబుతున్నాయి              👉

రథ శాంతి

రథ శాంతి

🌺 భగవానుడు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని ఆనందంగా ఆరోగ్యంగా అనుభవించడం, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మనిషి విజ్ఞతపై ఆధారపడి ఉంటాయి అనుభవాల ఆటుపోట్లు జీవితాన్ని ఒక పట్టాన సాఫీగా సాగనివ్వని మాట యథార్థమైనా, కళ్లముందున్న జీవితకాలం అపూర్వమని తెలుసుకోవాలి. దాని ప్రస్థానం ఉన్నతంగా సాగాలి.
🌺 జీవితకాలం నూరేళ్లుగా నిర్దేశితమైంది. అంతకుపైబడి జీవించినవారూ ఉన్నారు. ఒక వయసు దాటాక జీవన దశలను గుర్తుచేస్తూ సాగే వేడుకలు- పాటించాల్సిన ధర్మాలను తెలియజేస్తాయి. కుటుంబ యజమానికి అరవై ఏళ్ళ వయసు రాగానే షష్టిపూర్తి వేడుక నిర్వహిస్తారు     
🌼 కుటుంబసభ్యులు, బంధువులు చేరి వివాహ వేడుకను మరపించేలా చేస్తారు. అరవై ఏళ్ళ వయో దశనే ‘ఉగ్రరథ శాంతి’ అనీ అంటారు. ఉగ్రరథుడు అంటే యమధర్మరాజు. నిండు నూరేళ్లు జీవించేలా దీవించాలని కోరుతూ ఆయనకు జరిపే శాంతి ఇది

🌺 మానవ శరీరమే రథం. ఇంద్రియాలే గుర్రాలు. కోరికలు పగ్గాలు. రథ సారథి జీవుడు. గమ్యం పరమాత్ముడి సన్నిధి... అని చెబుతాయి శాస్త్రాలు అరవై వరకు జీవితాన్ని ఒడుదొడుకులతో, ఉరుకులు పరుగులతో గడుపుతూ అలసిపోతాడు మనిషి. బరువు బాధ్యతలను ఎదిగిన సంతానానికి అప్పగించి, ప్రశాంతంగా కాలం గడిపే వయసుగా ఈ దశను భావిస్తాడు. ఇది జీవన పోరులో విరామ ఘట్టం. డెబ్భై ఏడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజుల వయసు నాటికి భీమరథ శాంతి జరుపుకొంటారు. కొంతమంది డెబ్భై సంవత్సరాల వయసులోనే ఈ శాంతి చేస్తారు. భీమరథుడన్నా యమధర్మరాజే!

🌺 ఎనభై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులకు దేవరథ శాంతి, తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజులకు దివ్యరథ శాంతి, నూట అయిదు సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజుల వయసుకు మహా దివ్యరథ శాంతి చేసుకుంటారు!

🌺 మనది చాంద్రమానం. జీవితకాలంలో వెయ్యి పూర్ణచంద్రోదయాలు చూసినవారికి- అంటే ఎనభై సంవత్సరాలకు పైన ‘సహస్ర పూర్ణచంద్ర దర్శనం’ వేడుక జరుపుతారు.                      
   🌸వయసు యాభై సంవత్సరాలు దాటిన తరవాత, ప్రతి పది సంవత్సరాలకు ఓ ఉత్సవంగా చేసుకోవాలని ఆర్యోక్తి.

🌺 మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నతమైంది. ఆదర్శప్రాయమైంది. కుటుంబాల్లోని పెద్దలు మార్గదర్శకులే కాదు, సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులనీ శాస్త్రాలు చెబుతున్నాయి              

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

డిజిటల్ లాకర్‌తో మీ ఫైల్స్ సేఫ్..లాగిన్ కూడా సింపుల్

   మీరు మీ విలువైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో భద్రపరిచి వాటిని అవసరమైనప్పుడు డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా.. మీ విలువైన డాక్యుమెంట్లు మెయిల్ లో పెట్టుకుంటే హ్యాక్ అవుతున్నాయా.. అయితే ఇలాంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది డిజిటల్ ఆన్‌లైన్ లాకర్‌ను ప్రవేశపెట్టింది. దీనిపైన చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వారందరికోసం...👇👇

     స్టెప్: 1

    ఎవరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.©©♏

స్టెప్: 2

    అవి తెలిసిన వారు digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి సైన్‌ఆప్ క్లిక్ చేయాలి.
   
    స్టెప్: 3

   మీరు సైన్‌ఆప్ క్లిక్ చేయగానే మిమ్మల్ని సెల్ నంబర్ అడుగుతుంది. ఆ సెల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ నంబర్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అలాగే మెయిల్ కి కూడా ఓ సందేశం వస్తుంది.

స్టెప్:4

     ఆ నంబర్ కింద ఓ డబ్బాలాంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు వచ్చిన సందేశాన్నినమోదు చేయాలి.

స్టెప్: 5

     అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.

   స్టెప్:6

   ఆధార్ సంఖ్య నమోదు చేసిన తర్వాత సంబంధిత నెట్‌లోకి ప్రవేశించవచ్చు. అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను దాచుకోవచ్చు.

స్టెప్ : 7

   మీరు అప్ లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ కోడ్ వస్తుంది. దీంతో సురక్షితంగా ఈ పత్రాలను ఇతరులకు పంపవచ్చు.©©♏
   
స్టెప్: 8

   ఇక్కడ పత్రం సైజ్ కి లిమిట్ ఉంటుంది. ఒక్కో పత్రం 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ అది తీసుకోదు. ఒక్కో ఖాతాకు 1 జిబి వరకు స్పేస్ ఉంటుంది.

స్టెప్: 9

    ఈ డిజిటల్ లాకర్ కి పాస్ వర్డ్ ఉంటుంది కాబట్టి మీ పత్రాలన్నీ సేఫ్ గా ఉంటాయి. మీరునేరుగా నెట్ నుంచే మీరు అనుకున్న చోటుకు పంపవచ్చు. ఆధార్‌లో నమోదైన వివరాలనే డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి మోసాలు ఇక్కడ ఉండవు.

స్టెప్ :10

   ఇందులో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశం ఉంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు తెలుపుతుంది. నెట్‌లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వచ్చేస్తాయి.
   
   స్టెప్ :11

     మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్ కి కాని షేర్ చేసుకునే సౌకర్యం కూడా వుంది.

ఉత్పాదక విప్లవాలు

ఉత్పాదక విప్లవాలు

🔻విప్లవం          ప్రాధాన్యం

1. గ్రీన్ రెవల్యూషన్
ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం

2. బ్లూ రెవల్యూషన్
చేపల ఉత్పత్తికి సంబంధించినది

3. ఎల్లో రెవల్యూషన్(పసుపు విప్లవం)
నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినది

4. వైట్ రెవల్యూషన్
(శ్వేత విప్లవం)పాల ఉత్పత్తికి సంబంధించినది

5. బూడిద వర్ణ విప్లవం
గుడ్లు,కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తులను పెంచడం

6. గోల్డ్ రెవల్యూషన్(స్వర్ణ విప్లవం)
పూలు,పండ్ల తోటల అభివృద్ధికి సంబంధించినది

7. పింక్ రెవల్యూషన్
రొయ్యల ఉత్పత్తిని పెంచుట

8. గ్రే రెవల్యూషన్
ఉన్ని ఉత్పత్తులకు సంబంధించినది

9. గోధుమ వర్ణ విప్లవం
బయోమాస్ వస్తువులకు సంబంధించినది

10. బ్రౌన్ రెవల్యూషన్
తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి

11. ఆపరేషన్ ఫ్లడ్  
పాల ఉత్పత్తిని అధికం చేయడం

నాకు మరణం లేదు నేను అమరజీవిని

నాకు మరణం లేదు
నేను అమరజీవిని
నేను మరణించిన నా కళ్ళు ఈ లోకాన్ని చూడగలవు
నా గుండె ఇంకా లబ్ డబ్ మని కొట్టుకోగలదు
నా కాలేయం యధావిధిగా పనిచేస్తుంది
నా మూత్రపిండాలు కూడా పని చేస్తాయి
అంటే నాకు మరణం లేదు
నేను అమరజీవిని
నా కళ్లు ఇద్దరికి చూపునిస్తాయి
నా గుండె ఒక్కరిని బతికిస్తుంది
నా కాలేయం ముగ్గురికి ఉపయోగపడుతుంది
నా కిడ్నీలు, కర్ణ భేరులు నలుగురి కి ఉపయోగపడుతాయి
పురాణాల్లో అమృతం తాగితే అమరులవుతారట వారికి మరణం ఉండదట
అలాగే నేను నా అవయవదాన అంగీకారపత్రం పై సంతకం చేసి అమరుడనయ్యాను
నాకింక మరణం లేదు
నేను అమృతం తాగాను
ఆ అంగీకారపత్రం మిాద సంతకం చేస్తే అమృతం తాగినట్టే
    మరి మిారు ఇంత మందిని కాపాడాలనుకుంటున్నారా?
    అయితే వెంటనే అవయవదాన అంగీకార పత్రంపై సంతకం చేసి కాపాడండి.
    మన వల్ల ఇంకొందరి ప్రాణాలను కాపాడండి.
   “చనిపోయాక శరీరాన్ని కాల్చితే బూడిద అవుతుంది
       పూడ్చితే మట్టి అవుతుంది
       దానం చేస్తే అమరత్వం సిద్దిస్తుంది”
 www.jeevandan.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకొండి.

మహా భారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

మహా భారతం నుండి
 నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

*12.
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది,

13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.

14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.   ...మీ...సైకాలజిస్ట్ ...ప్రత్యుష సుబ్బారావు  గుంటూరు

గురువులం

గురువులం

మేమిలాగే ఉంటాం,
 ఎప్పటిలాగే ఉంటాం
ఎందుకంటే, మేం కేవలం గురువులం!
నీడనిచ్చు చెట్టులా, వాననిచ్చు మబ్బులా!
వెంటపడే నాన్నలా, పక్కనుండే అమ్మలా!
మాలో మార్పు లేదు, ఓర్పు మాత్రమే ఉంది!
అవే చూపులు, అవే మాటలు
అవే పాఠాలు, అవే నల్లబల్లలు
అవే సుద్దముక్కలు, అవే రాతలు!
విసుగు చెందని మనసులు మావి
విరామమెరుగని వృత్తులు మావి!
సంపాదించే వ్యాపారులం కాము
పాలించే నాయకులం కాము!
చిన్నచూపు చూసినా చింతించం
పెద్ద మనసు చేసినా గర్వించం!
నాలుగు గోడలే మా ప్రపంచం
విద్యాలయమే మా విశ్వనగరం!
ఎందుకంటే, మేం కేవలం గురువులం!

ఎన్నో కళ్ళు మావైపు చూస్తుంటాయి
రెండే కళ్లు మిమ్మల్ని అదుపు చేస్తుంటాయి!
మీ రాతలను, గీతలను సరిచేస్తూ
మీ మాటలను, చేతలను సవరిస్తూ
మీ చదువే మా చదువుగా
మీ మార్కులే మా మార్కులుగా!
మంచి కోసమే నిందిస్తాం
బాగు కోసమే బాధిస్తాం!
ఎదుగుతూ ఒదుగుతూ
ఎక్కడికో ఎగిరెగిరి పోతుంటారు
ఎక్కడినుండో ఏనాటికో వాలిపోతారు!
మీరే స్థితిలో ఉన్నా మహదానందం
మీ పలకరింపే పరమానందం!
గురువును మించిన శిష్యులైనా
కొండ అద్దమందు చిన్నదవదా!
మీరెంత ఎత్తుకు ఎదిగినా
మాముందు చిన్నపిల్లలే కదా!
ఎందుకంటే, మేం కేవలం గురువులం!

ఎగతాళి చేసిన మీ చేతులే భక్తితో జోడిస్తాయి
వెక్కిరించిన మీ మాటలే వినయంగా వినిపిస్తాయి!
మీ బాల్యస్మృతులకు చిరునామా మేము
మీ భవిష్యత్తుకు నజరానా మేము!
మీరంటే ఒక జలపాతం, ఒక నదీ ప్రవాహం!
నిలకడలేని ఆపసోపాల ప్రయాణం మీది
నిశ్చలమైన నిలువెత్తు నిగ్రహం మాది!
నేర్చుకుంటూ జ్ఞానతృష్ణతో వెళ్ళిపోతుంటారు
నేర్పిస్తూ లక్ష్యాన్ని చూపిస్తూ నిలిచిపోతుంటాం!
మా క్షేమం కన్నా మీ సంక్షేమం మిన్న
మా ఆనందం కన్నా మీ ఆశయం మిన్న
ఎందుకంటే, మేం కేవలం గురువులం

Saturday, August 27, 2016

నీ విలువ ఎంత --?

 నీ విలువ ఎంత --?


ఒక వ్యేక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఏంత” అని.
అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.
ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.
కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు.
తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.
కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు....
ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.... అది వారి స్థాయి.
కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి...Human LIFE  is a great boon🙏🙏
Love your life and try to associate with the people,  who can appraise your value. 👍

పండితుడు

పండితుడు


🌺శ్రీమద్రామాయణ కథా ఘట్టాల్లో అత్యంత ఆసక్తికర సందర్భం ఒకటుంది. శ్రీరాముడు తన సందేహం తీర్చుకోవడానికి వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి తలుపు తడతాడు. లోపల నుంచి ఆయన ‘ఎవరూ?’ అని ప్రశ్నిస్తాడు. ‘నేను’ అంటాడు రాముడు. ‘నేనంటే?’ అని మళ్ళీ ప్రశ్న. ‘అది తెలుసుకుందామనే వచ్చాను’ అని శ్రీరాముడు బదులిస్తాడు. ‘నేను అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే నేనూ ఉన్నాను. నాకు తెలిసిన తరవాత నీకు తెలియజేస్తాను’ అంటాడు ఆ మహాముని!

🌺రామాయణంలోనే మరొక ఘట్టంలో- జనక మహారాజు ఆస్థానానికి అష్టావక్రుడు వెళ్తాడు. ద్వారపాలకుడు ‘ఎవరు వచ్చారని మహారాజుకు చెప్పమంటారు’ అని అడుగుతాడు. ‘నేను వచ్చానని చెప్పు’ అంటాడాయన. ద్వారపాలకుడు వెళ్ళి మహారాజుతో ‘మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు’ అంటాడు. ‘ఎవరు?’ అని జనకుడి ప్రశ్న. ‘నేను వచ్చానని చెప్పమన్నారు!’ అంటాడా సేవకుడు. దానికి మహారాజు- ‘నేను’ చచ్చాక రమ్మను’ అని చెప్పి పంపుతాడు. ఆ సమాధానాన్ని విని అష్టావక్రుడు అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లు పోయిన తరవాత మళ్ళీ రాజును కలవడానికి వెళ్తాడు. ‘అష్టావక్రుడు’ వచ్చాడని చెప్పమంటాడు. బహుశా ఆయనకు ‘నేను’ అనే పదానికి సమాధానం కొంతవరకు దొరికిందన్న మాట!

🌺తనకేమీ తెలియదని మనిషి తెలుసుకోగలిగితే అది గొప్ప విషయమే! ఆ తరవాతైనా, తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ‘అన్నీ తెలుసు’ అనుకుంటే ఇంక తెలుసుకోవడానికి ఏమీ లేదు. ‘నాకే తెలుసు’ అనుకోవడమే అసలు సమస్య. ‘ఇతరులకేమీ రాదు’ అనడం వల్లనే గొడవ మొదలవుతుంది. సమస్త స్పర్ధలకూ అదే కారణం. ఇదే అంశం గురించి భర్తృహరి ఒక సుభాషితంలో ‘నేను కొద్దిగా తెలుసుకొని ఉన్న కాలంలో మదగజంలా వ్యవహరించాను. నేనే సర్వజ్ఞుడినని తలచాను. పెద్దల వల్ల కొద్దికొద్దిగా తెలుసుకున్నాక- నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించాను. జ్వరం తగ్గిన తరవాత శరీరం ఎంత సుఖపడుతుందో, అలా నన్ను అప్పటివరకు పట్టుకుని ఉన్న గర్వాన్ని విడిచి సుఖపడ్డాను’ అంటాడు.

🌺‘పండితుడు’ అనే మాట చాలా బరువైంది. ఆత్మ సంబంధ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడే పండితుడు. అంటే, ముందు తనను తాను తెలుసుకొని ఉండాలి. నిజానికి అది చాలా కష్టమైన పని. అంత తేలికైంది కాదు. తెలుసుకోగలిగితే పండితుడు అవుతాడు.

🌺అహమేవ పండితః, అహం పండితః, నాహం పండితః అని సంస్కృతంలో మూడు వాక్యాలున్నాయి. నేను మాత్రమే పండితుణ్ని, నేను కూడా పండితుణ్ని, నేను పండితుణ్ని కాదు- అని ఆ మాటలకు అర్థం. ఇందులో- నాహం పండితః అనే మాట వినయంతో కూడినది. ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, నేను పండితుణ్ని ఎలా అవుతానని అతడు ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. అహం పండితః అనడంలో- తనకు తెలుసు అనుకుంటున్నదంతా చెబుతాడు. తాను మాత్రమే పండితుణ్ని అన్నప్పుడు ఆ వ్యక్తి మాట తీరు అంతే కాబోలునని సరిపెట్టుకోవచ్చు. తక్కినవారు పామరులని, పనికిమాలినవారని అదేపనిగా నిందించటంతోనే మనుషుల మధ్య గొడవలు మొదలవుతాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం.

🌺మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం, మనకున్న సామర్థ్యాన్ని విధి నిర్వహణలో ప్రదర్శించటం ఒక్కటే- మనం చేయగలిగే పని. మనిషి తన అధికారం, ఆధిపత్యం, గర్వంతో తాను చాలా గొప్పవాడినని విర్రవీగితే; వాటి వల్ల ఇతరులకు కష్టనష్టాలు కలిగితే- అది అతడి లోపభూయిష్ఠ ప్రవర్తనే అవుతుంది. దీనికి పరిష్కారంగా మహాభారతం ‘ఇతరులు ఏం చేస్తే మన మనసుకు బాధ కలిగిందో, అది ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాల కన్నా గొప్పది’ అని ప్రబోధించింది. మన పనిలో మనం నిమగ్నమై మనశ్శాంతిగా ముందుకు సాగడమే జీవన భారతంలో శాంతిపర్వం. అది తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు!

- డాక్టర్‌ తలారి వాసు

💐ఈనాడు సౌజన్యంతో

నీకు నువ్వే దీపం

నీకు నువ్వే దీపం


ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు.
ఒకతని దగ్గర లాంతరు ఉంది.
 ఇంకొకతని దగ్గరలేదు.
కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.

దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు.
కారణం దీపమున్న వ్యక్తితో బాటు దీపం లేని వ్యక్తి నడవడమే.

లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు.
కారణం దాని అవసరం అక్కడ లేదు.

అట్లా ఇద్దరూ చాలా దూరం నడిచాకా ఒక నాలుగురోడ్ల కూడలికి చేరారు.
అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది.
అక్కడినించీ దార్లు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపుకి, లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి వెళ్ళాలి.

లాంతరు ఉన్న వ్యక్తి కుడివేపు తిరిగి వెళ్ళిపోయాడు.
కాంతి అతనితో బాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది.

లాంతరు లేని వ్యక్తి ఎడమవేపుకి తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు.
కారణం చీకటి.
అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్ళిపోయాకా తన మార్గం అంధకారబంధురమయింది.
 తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమయినా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధ పడ్డాడు.

మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు.
తరువాత మనదారి మనం వెతుక్కోవాలి.
చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపరు.
గురువు చేసే పనయినా అదే.
 గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది.
 శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నపుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు.

నీకు నువ్వే దీపం అని బుద్ధుడనడం వెనక అర్థమదే.

పాదాలకు పగుళ్లు ఎందుకు ఏర్పడుతుంటాయంటే..

పాదాలకు పగుళ్లు ఎందుకు ఏర్పడుతుంటాయంటే..


మనం నేల మీద నిలబడటానికి, నడవడానికి సహకరించే పాదాలు ఎప్పుడూ మన భారాన్ని మోస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా వత్తిడికి గురవుతూ ఉంటాయి. పాదాలతో పాటు అర చేతులు కూడా రకరకాల పనులలో సహకరిస్తూ ఉంటాయి. అందువల్ల పాదాల చర్మం (sole), అరచేయి చర్మం (palm) మందంగా ఉంటాయి. మందంగాను, దృఢమైన కండర పొరతోను ఉండడం వల్ల శరీర రక్త ప్రసరణ వ్యవస్థ (blood circulatory system) అరికాళ్లు, అరచేతుల్లో తుదికంటా ఉండదు. కొంత వరకు విస్తరించి తర్వాత ఆగిపోతుంది. అంటే నీటిని, పోషక విలువల్ని పంపిణీ చేసే రక్తనాళికలు అరికాలి చర్మంలో నేలను తాకే చిట్టచివరి పొర వరకు చేరవన్నమాట. నీరులేని పంట పొలాలు బీటలు వారినట్టే నీరు అంతగా లభించని అరికాలి చర్మం కూడా పగుళ్లకు లోనవుతుంది.

ఈ స్థితి చలికాలంలో ఎక్కువ. ఎందుకంటే ఆ రుతువులో చర్మంలో రక్తనాళాలు మరింత లోతుల్లో ఉంటాయి. చలికాలంలో చర్మం పాలిపోయినట్టు తెల్లగా ఉండడానికి కారణం కూడా అదే. ప్రతి పూట కాసేపు అరికాళ్లను బకెట్టులోని నీటిలో నానబెట్టి కొంచెం కొబ్బరి నూనె వంటి లేపనాలు పూసుకుంటే అరికాలి పగుళ్లను చాలా మటుకు నివారించవచ్చు. అనవసరంగా సౌందర్య సాధనాలను ఉపయోగించడం డబ్బు వృథా!

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, జనవిజ్ఞానవేదిక.

నోబెల్ అవార్డులు నోబెల్ బహుమతులు

నోబెల్ అవార్డులు

నోబెల్ బహుమతులు


🔹 1. భౌతిక శాస్త్రం

1.ఆర్డర్ మెక్ డొనాల్డ్(కెనడా)
2.తకాకి కజిత(జపాన్)


🔹 2.రసాయన శాస్త్రం

1.థామస్ లిండాల్(స్వీడన్)
2.పాల్ మాడ్రిచ్(అమెరికా)
3.అజీజ్ సంకార్(టర్కీష్ అమెరికన్)


🔹 3.వైద్యశాస్త్రం
1.విలియం కాంప్ బెల్(అమెరికన్)
2.సతోషి ఒమురా(జపాన్)
3.తు యుయు (చైనా)


🔹 4.సాహిత్యం
1.స్వెత్లానా అలెక్సీవిచ్(బెలారస్)


🔹 5.ఆర్ధిక శాస్త్రం
1.ఆంగస్ స్టీవర్ట్ డేటన్(స్కాట్లాండ్)


🔹 6.శాంతి బహుమతి
1.టునీషియా నేషనల్ డైలాగ్ క్వార్టెట్(టునీషియా)


🔻ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారం నోబెల్ బహుమతి.


🔻నోబెల్ బహుమతిని స్వీడన్ కి చెందిన రసాయన శాస్త్రవేత్త 'ఆల్ఫ్రెడ్ నోబెల్' జ్ఞాపకార్ధం ఇవ్వడం జరుగుతుంది.


🔻ఆల్ఫ్రెడ్ నోబెల్ :


🔹 ఆల్ఫ్రెడ్ నోబెల్ పూర్తీ పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ .


🔻 ఆల్ఫ్రెడ్ నోబెల్ 1833 అక్టోబర్ 21 న స్వీడన్ లోని స్టాక్ హోం లో జన్మించాడు.


🔻 17 ఏళ్ల వయసులో పారిస్ లోని ఒక పరిశోధనశాలలో పని చేసాడు.


🔻 1862 లో 'నైట్రోగ్లిజరిన్' మీద ప్రయోగాలు చేసాడు.


🔻 పారిశ్రామిక పేలుడు పదార్ధంగా పేటెంట్ తీసుకున్నాడు.


🔻 1867 లో నైట్రోగ్లిజరిన్ ను ఉపయోగించి డైనమైట్ ను తయారుచేసి దానికి పేటెంట్ తీసుకున్నాడు.


🔻 తరువాత స్వీడన్ ,అమెరికా,జర్మనీ లలో పేలుడు పదార్ధాల కంపనీలు ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు.


🔻 చివరికి తను చేసిన పేలుడు పదార్ధాల పట్ల విరక్తి చెంది 1895 లో తన ఆస్తినంతా తన పేరు మీదగా అవార్డుల కోసం వినియోగించాలని విల్లు రాసి 1896 డిసెంబర్ 10 న మరణించాడు.


🔻 అందుకే ప్రతి సంవత్సరం అతని వర్ధంతి సందర్భంగా అనగా డిసెంబర్ 10 న స్వీడన్ రాజధాని స్టాక్ హోం లో విజేతలకు నోబెల్ అవార్డులు అందజేస్తారు.


🔻 శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానం చేస్తారు.


🔻 నోబెల్ అవార్డులు 1901 నుంచి ప్రారంభమైనవి.
-


🔻1901 నుంచి ఈ నోబెల్ అవార్డులు భౌతిక,రసాయన,మానవ శరీర ధర్మ లేదా వైద్య శాస్త్రాలు,సాహిత్యం,శాంతి రంగాల్లో ఇస్తూ వస్తున్నారు.
-


🔻అయితే 1968 లో స్వేరిజెస్ రిక్స్ బ్యాంక్ 300 వ వార్షికోత్సవం సందర్భంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్ధం ఆర్ధిక శాస్త్రం లో కూడా ఒక బహుమతిని ప్రవేశపెట్టింది.
దీనిని 'ది స్వేరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరి ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్' గా పిలుస్తారు.
-


🔻ప్రతి సంవత్సరం ఈ బహుమతిని ఒక ఫీల్డ్ లో గరిష్టంగా ముగ్గురికి ప్రధానం చేస్తారు.

-🔻మరణించిన వారికి ఈ అవార్డును ప్రకటించరు.


🔻 నోబెల్ అవార్డును ప్రస్తుతం 6 రంగాలలో ఇస్తున్నారు.


🔻 నోబెల్ బహుమతిని ఎంపిక చేసి,ప్రధానం చేసే సంస్థలు :


🔻భౌతిక శాస్త్రం - రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్(స్వీడన్)


🔻రసాయన శాస్త్రం - రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్(స్వీడన్)


🔻వైద్య శాస్త్రం,శరీర ధర్మ శాస్త్రం - నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్(స్వీడన్)


🔻సాహిత్యం రంగం - స్వీడిష్ అకాడమి(స్వీడన్)


🔻శాంతి రంగం - నార్వే పార్లమెంటరీ కమిటీ(నార్వే)


🔻ఆర్ధిక శాస్త్రం - స్వేరిజేస్ రిక్స్ బ్యాంక్(స్వీడన్)


🔻అత్యధిక నోబెల్ బహుమతులు పొందినవారు :


🔻ఇప్పటి వరకు అమెరికా పౌరులు అత్యధికంగా నోబెల్ బహుమతి పొందారు.

🔻మూడుసార్లు నోబెల్ బహుమతి పొందినది :


🔻రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ


🔻ఒకే రంగాలలో రెండుసార్లు నోబెల్ పొందినవారు :


🔻జాన్ బర్దీన్ - (1956-భౌతిక శాస్త్రం,1972-భౌతిక శాస్త్రం)ఫ్రెడరిక్ సాంగర్ - (1958-రసాయన శాస్త్రం,1980-రసాయన శాస్త్రం)


🔻వేర్వేరు రంగాలలో రెండుసార్లు నోబెల్ పొందినవారు :


🔻మేరీ క్యూరీ(భౌతిక శాస్త్రం-1903,రసాయన శాస్త్రం-1911)


🔻లీనస్ కార్ల్ పౌలింగ్(రసాయనశాస్త్రం-1954,శాంతి-1962)


🔻గ్రహీత.        రంగం            సంవత్సరం

1.రవీంద్రనాథ్ ఠాగూర్
                    సాహిత్యం    1913

2.సి.వి.రామన్   ఫిజిక్స్    1930

3.మధర్ థెరిస్సా   శాంతి   1979

4.అమర్త్యసేన్   అర్ధ శాస్త్రం  1998

5.కైలాష్ సత్యార్ది   శాంతి     2014

రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?


రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?

పెరుగు ప్రాచీన కాలంనుండి అద్భుతమైన పోషక విలువలతో మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడుతోంది. పెరుగునే యోగ్రర్ట్ అని పిలుస్తారు. పెరుగు అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది క్రీమీ టేస్ట్ ను కలిగి ఉంటుంది. అంతే కాు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతే కాదు మరీ ముఖ్యంగా పాల కంటే పెరుగు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇంకా పెరుగులో ప్రోటీన్స్ మరియు క్యాల్సియం కంటెంట్ అధికంగా ఉన్నాయి. పాలు పడనివారు, ఇష్టం లేనివారు, మరియు ల్యాక్టోజ్ ఇన్టాలరెన్స్ వల్ల సులభంగా జీర్ణించుకోలేని వారు పాలకు బదులుగా పెరుగును ఖచ్ఛితంగా తినాల్సి ఉంటుంది. పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి . కాబట్టి దీన్ని మన డైలీ, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ ప్రయోజనాలు ఎముకలు, దంతాలు, బ్రెయిన్, స్టొమక్, మరియు ప్రేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది .

మరియు మీరు ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆపానవాయువు సమస్యలను ఎదుర్కోరు. పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ పెరుగు తినడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యేటటువంటి అన్ని రకాల న్యూట్రీషియన్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా బాడీకి చేరుతాయి. అందువల్ల, పెరుగు వల్ల పొందే ఇన్ని ప్రయోజనాలను ఖచ్చితంగా మిస్ చేయకూడదు. వివిధ రకాలా ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తినడం నివారించే ప్లెయిన్ గా ఇంట్లో తయారుచేసుకొనే హెల్తీ పెరుగును తినడం వల్ల మరిన్ని హెల్తీ, అమేజింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు... మరి డైలీ బెసిస్ లో రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల ఏం జరగుతుందో తెలుసుకుందాం....!

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది:

మీరు హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే , అప్పుడు ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో పెరుగు ఉండాల్సిందే . ఎవరైతే రెగ్యులర్ గాపెరుగు తింటారో వారిలో హైబ్లడ్ ప్రెజర్ లక్షణాలు, కిడ్నీ మరియు హార్ట్ డిసీజ్ వంటి లక్షణాలు పెరగవని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. అందుకు పెరుగులో ఉండే పొటాషియమే అంటున్నారు.

మానసిక ఏకాగ్రత పెంచుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో స్ట్రాంగ్ బ్రెయిన్ మరియు మెంటల్ కాన్ సంట్రేషన్ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది . ఇది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వల్లే ఇలా జరగుతుంది. రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో మెమరీ పవర్ పెరుగుతుందని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది. Show Thumbnail

బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది :

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు గ్యాస్ సమస్యలు నివారించబడి బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మరియు ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. మరియు మలబద్దక సమస్యలను కూడా నివారిస్తుంది.

నడుము చుట్టుకొలత తగ్గించుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అంటే కేవలం పెరుగు తినడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. అంతే కాదు పెరుగు రెగ్యులర్ గా తినడం వల్ల ఒత్తిడికి(ఇది నడుము చుట్టూ కొవ్వు చేరే) కారణం అయ్యే హార్మోనుల ఉత్పత్తిని తగ్గిస్తుంది. Show Thumbnail

సంతోషంగా ఉండవచ్చు:

పెరుగులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థకు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ బి12, విటమిన్స్ వెజిటేరియన్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని చాలా వరకూ అనిమల్ ఫుడ్స్ లో ఎక్కువగా చూస్తుంటాము. విటమిన్ బి 12 ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతాయి.

ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు:

ప్రతి రోజూ పెరుగు తింటుంటే దంతక్షయ సమస్యలుండవు . పాల వల్ల దంతక్షయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ల్యాక్టోజ్ షుగర్స్ ఉండటం వల్ల పెరుగు దంతాలకు మరియు ఎముకలకు చాలా మేలు.

మోసానికి మోసం

మోసానికి మోసం


ఆహారం దొరక్క నకనకలాడుతోంది ఓ నక్క.
దాంతో ఒక పథకాన్ని ఆలోచించింది.
ఒక కొలను ఒడ్డుకు పోయి తచ్చాడసాగింది.
 సూర్యకిరణాలు నడినెత్తికి రావడంతో చిన్న చిన్న జంతువులన్నీ ఆహార సంపాదనకు బయటకు వచ్చాయి.

'మిత్రులారా! బద్దకం భవిష్యత్తును నాశనం చేస్తుంది. వేకువనే మేల్కొని పనులు చేసుకోవడం మంచి పని'
 అంటూ అటుగా పోతున్న కుందేళ్ల గుంపును ఉద్దేశించి హితవాక్యాలు చెప్పింది నక్క.

"నిజమే కాని చలి మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు!"
అని సమాధానమిచ్చాడు కుందేళ్ల నాయకుడు.

 "చలిని చూసి మీరు భయపడటమా? ఆ చలే మిమ్మల్ని చూసి భయపడి పారిపోయే మంత్రం నా దగ్గర ఉంది. నిండా మునిగిన వాడికి చలే ఉండదంటారు. వేకువనే ఈ నీటిలో మునగండి, హాయిగా ఉండండి"
అంది నక్క.
ఇవి కుతంత్రపు మాటల్లా ఉన్నాయని గ్రహించిన కుందేళ్లు
"రేపటి నుండి అలానే చేస్తాము"
 అని తప్పించుకుని పోయాయి.

"ఈ కుందేళ్లు నా మాటలు నమ్మినట్లున్నాయి. నిండా మునిగితే ఊపిరాకడ చస్తాయి. ఇక ఒడ్డున కాచుకుని ఉంటే చాలు నా తిండి సమస్య తీరిపోయినట్లే"
అని పైకే అంది నక్క.
ఈ మాటలు కొలనులో ఉన్న మొసలి విని
"నక్క బావా, నీ మాటలు యథార్థం కాదు. చలిని భరించలేక ఈ కొలనులోని చేపలన్నీ నన్ను బయటపడేయమని కోరుతున్నాయి. అది నా ఒక్కడి వల్లా సాధ్యం కావడం లేదు. నువ్వు తోడుంటే వాటిని తోడి బయటపడేద్దాము"
 బతిమాలింది మొసలి.
 దాని మాటలు నిజమని నమ్మిన నక్క
"ఓస్, అంతేనా, అయితే పద పోదామ"
అంటూ చెంగున ఎగిరి మొసలి వీపుపై కూర్చుంది.
కొద్దిదూరం పోయాక మొసలి నీటిలో బుడుంగున మునిగింది.
 ఈత రాని నక్క ఊపిరాకడ చచ్చి చివరకు మొసలికి ఆహారమైపోయింది.

🍀నీతి:
ఇతరులను మోసం చేసేవారు చివరకు వారు కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోక తప్పదు.
 అందుకే అంటారు ఎవరు తీసిన గోతిలో వారే పడతారని

డయాబెటిస్ వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారా?...



డయాబెటిస్ వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారా?...

అయితే,ఇవి తినండి!
టైప్ 2 డయాబెటిస్ వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని
ఆందోళన చెందుతున్నారా? అయితే ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలున్న ఆహార పదార్థాలు
తీసుకుంటే అలాంటి ఆందోళన నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు
చెబుతున్నారు. డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడేవారికి కంటి చూపు
దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అలాంటి వారు వారంలో రెండుసార్లు ఒమేగా ఫ్యాటీ
ఆమ్లాలున్న ఆహారపదార్థాలు తీసుకుంటే ఆ ముప్పు నుంచి బయటపడవచ్చని వారు
తెలిపారు.
స్పెయిన్ లో 2003 నుంచి 2009 వరకు 55-80 ఏళ్ల మధ్య వయస్కులైన
టైప్-2 డయాబెటిస్ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసినట్టు
పరిశోధకులు తెలిపారు. మానవుని కంట్లోని రెటీనాలో ఒమెగా-3 పాలీ అన్ శాచురేటెడ్
ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయని, మధుమేహంవల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ
ఆమ్లాలు కాపాడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిశోధనల వివరాలను జామా
ఆప్తమాలజీ ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు.
ఒమేగా-3 ఆమ్లాలు చేపల్లో అధికంగా
దొరుకుతాయన్న సంగతి తెలిసిందే

సాటివారికి సాయం



సాటివారికి సాయం

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి దేవుడు అంటే మక్కువ. పాప భీతి ఎక్కువ.
ఆమె భర్త మరణించాడు. ఆమెకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు అంజయ్య. ఆ ఇద్దరు పిల్లలనూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద జేసింది. ఒకసారి చిన్నవాడు అంజయ్యకి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తామని మొక్కింది.శ్రీ వేంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది.ఏమైతే నేం?
అంజయ్యకి జబ్బు తగ్గింది. కానీ కొండకి వెళ్ళలేదు. మొక్కు తీర్చలేదు. ఇలావుండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు. కంగారు పడిపోయింది. అచ్చమ్మ "ఏరా!స్వామి ముడుపు కనిపించటం లేదు. ఏమైందిరా"
అని కేకలు పెట్టింది. "నేనే తీశానమ్మా"అన్నాడు అక్కడే వున్న అంజయ్య. "అపచారం!అపచారం!ఆ ముడుపు ఎందుకు తీశావురా? "అంది అచ్చమ్మ చెంపలేసుకొంటూ."లేదమ్మా! ఆ పాతిక రూపాయలూ నారయ్యకు ఇచ్చాను" అన్నాడు అంజయ్య."వాడికెందుకు ఇచ్చావురా? వాడికేమొచ్చిందిరా?""ఏమొచ్చేదేమిటమ్మా!జ్వరమొచ్చింది.
డబ్బు ఇస్తేగానీ మందు ఇవ్వనన్నాడు డాక్టరు అందుకని...." అని అంజయ్య అంటూ ఉండగానే - "ఎంత ఘోరం"
 అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ.ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు. వస్తూనే తల్లి కేకలు విన్నాడు. "ఏమిటమ్మా! ఏం జరిగింది?" అని అడిగాడు. జరిగింది అంతా చెప్పింది అచ్చమ్మ. "ఏరా అంజీ!నిజమేనా?"
అని తమ్ముడ్ని అడిగాడు రామయ్య. "నిజమే అన్నయ్యా!
కాని ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు.నారయ్యకి జ్వరం తగ్గటానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను"
 అన్నాడు అంజయ్య. "భేష్!మంచి పని చేశావురా!" అని మెచ్చుకొన్నాడు రామయ్య. "ఏమిట్రా! తప్పు అని చెప్పకపోగా నీవూ వాడినే సమర్థిస్తున్నావా?" అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది అచ్చమ్మ."అవునమ్మా! చిన్నవాడు అయినా మన అంజయ్య చేసిన పని చాల గొప్పది. ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవటం మానవ ధర్మం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా!.కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు-ముప్పులేదు.ఆపదలో ఉన్న ఒక అనాధ బాలునికి తన సొమ్ము సాయపడిందని భగవంతుడు ఆనందిస్తాడు." - అన్నాడు రామయ్య. "నిజమే బాబూ!
మీరు ఇద్దరూ నా కళ్ళు తెరిపించారు. మానవ సేవే మాధవ సేవని చెప్పే వారే గాని చేసేదెవరు?" "ఒరే అంజయ్యా!
 వయస్సు చిన్నది అయినా నీ మనస్సు వెన్నరా." అని అంజయ్యని మెచ్చుకొంది అచ్చమ్మ.అప్పుడే బీరువాలో నుంచి
పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య. అమ్మ చేతికిచ్చి "అమ్మా! ఈ సొమ్ము తీసుకో! మళ్ళీ స్వామి వారికి ముడుపు కట్టుకో! ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది. నీ దడుపూ తొలగిపోతుంది!" అన్నాడు నవ్వుతూ.
LOVE ALL
SERVE ALL

గాడిద గర్వం



గాడిద గర్వం


ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద , కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా, దిట్టంగా ఉండేది. రెండు జంతువులూ చాలా స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక సింహం 🦁తన దారిలో వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దానిని చంపి,తినాలని అనుకుంది.సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. అంతే, చెట్టు మాటున దాగి, గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది.సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని చంపుతుందేమోనని"కొక్కొరోకో....కొక్కొరో" మని అరవసాగింది. కోడి పుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది.కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని, తనను తాను మృగరాజులా ఊహించుకుని సింహం వెంటబడడం ప్రారంభించింది.సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది.అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చింది అనుకుని ఒకేఒక్క గెంతులో గాడిద మీద పడింది. తన పని ముగించి బ్రేవుమంది.

నీతి:
 అహంకారం ఆపదలకు నాంది.
.