విజన్ 20/20
ఇల్లంతా హడావుడిగా ఉంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు నేను తప్ప. మావారి సంతోషానికి హద్దే లేదు. ఇక మా అత్తగారు అయితే చెప్పనక్కర్లేదు. ముందుగానే హెచ్చరికలు ఇచ్చేశారు 'పుట్టే పిల్లలు సన్నగా, పీలగా ఉంటే ఎత్తుకోనమ్మాయ్' అంటూ.ఇ వన్నీ వింటూ ఒకపక్క సంతోషం, మరోపక్క భయం. ఎందుకో తెలీదు. పోయిన ఏడాది మా అక్క వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి కానీ చదివించడానికి కానీ ఎంత కష్టపడిందో. బాబుకి సంవత్సరం వచ్చిన దగ్గర్నుంచీ స్కూళ్ళలో అడ్మిషన్లు. వీళ్ళకి తెలిసేటప్పటికి పెద్దపెద్ద స్కూళ్ళల్లో అడ్మిషన్లు అయిపోయాయి. దాంతో వాళ్ళు ఒక చిన్న స్కూల్లో చేర్పించి ఎంతో కష్టంగా చదివిస్తున్నారు.
మొత్తానికి ఫస్ట్‌క్లాసు నుంచే ఎంసెట్ ఫౌండేషన్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు మొదలు. బ్యాగులో పదిహేనుకు పైగా పుస్తకాలు రోజూ తీసుకెళ్ళాలి. సాయంత్రానికి స్టడీ అవర్స్. అక్క టెన్షన్ చూస్తే నాకు భయమేసింది- నాకు పుట్టే పిల్లల్ని నేను సరిగ్గా ఈ రోజుల్లోలాగా చదివించగలనా అని. నాకు తెలిసి మా చిన్నప్పుడు మూడు నాలుగేళ్ళు వస్తేకానీ స్కూల్లో చేర్పించడానికి వీల్లేదు. కానీ, ఇప్పుడు అంతా వేరే. ఇలా ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కింది. నిద్ర పట్టింది. పట్టీపట్టగానే నాకసలు ఒళ్ళు తెలియలేదు. ఇందాకటి భయాలన్నీ మరచిపోయి మనసు తేలిక అయినట్టయింది.
డాక్టర్ రూములో టెస్ట్ చేయించుకున్న తర్వాత స్కానింగ్ రాశారు. స్కానింగ్ రూములో నుంచి బయటికి రాగానే పక్కన ఒక కౌంటర్. దానిమీద 'ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఇన్‌ఫాంట్ అండ్ ఫీటల్ ఎడ్యుకేషన్'అని రాసి ఉంది. అది చూడగానే ఏంటో కనుక్కుందామని కౌంటర్ దగ్గరకు వెళ్ళాను. వెళ్ళగానే ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ ఇచ్చి ఒక టోకెన్ ఇచ్చి రూములోకి పంపించారు. అక్కడ వందమందికి పైగా ఉన్నారు. నా నంబరు 105. అందరూ ఆడవాళ్ళూ, గర్భవతులే. జ్యూస్ తాగుతూ కుర్చీలో కూర్చున్నాను.
ఒక గంట తర్వాత ఖరీదైన చీర కట్టుకుని, మేకప్ వేసుకుని ఎంతో అందంగా ఉన్న ఒకామె వచ్చి నా ముందు కూర్చుని ఎంతో మర్యాదగా ''నమస్కారమండీ'' అంది. నా మెడికల్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ చూపించమంది. అన్నీ తీసి చూపించా.
''ఫర్‌ఫెక్ట్ మేడమ్, మీరు కరెక్ట్ టైముకి వచ్చారు. ఇంకో రెండు నెలలు ఆగుంటే చాలా కష్టం అయ్యేది'' అంది.
నేను 'దేనికి' అని అడిగేలోపే ఆమే
No comments:
Post a Comment