Pages

Wednesday, August 17, 2016

కూలబోయే ఇల్లు చెప్పిన పాఠం.!

కూలబోయే ఇల్లు చెప్పిన పాఠం.!                               

       _ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తి లో ఉండేవాడు.తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.దాదాపు పాతిక సంవత్సరాలకు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పని చేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ణి పిలిచి 'మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి, ఎంత ఖర్చైనా ఫర్వాలేదు. ఆ భవనం 'న భూతో, న భవిష్యతి' అనే రీతిలో అద్భుతంగా ఉండాలి ' అన్నాడు. ఇన్ని రోజులు పనిచేసిన మా యజమాని నాకు ఇచ్చిందేమీ లేదు,అతనేమో కోటీశ్వరుడయ్యాడు.......    అంచేత, ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలాభాగం డబ్బు సొంతం చేసుకొంటాను అనుకున్నాడు.                             అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరుకులతో నిర్మించి, పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా, వివిధ నగిషీలతో శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు. యజమాని ఆనందపడుతూ 'మిత్రమా...ఈ భవంతి మహత్తరంగా ఉంది.ఇన్నాళ్ళూ నమ్మకంగా పనిచేశావు..... నేను ఈ వ్యాపారం వదిలి వేరే దేశానికి వెళ్లిపోతున్నాను.అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని ఉన్న నీకు అపురూపమైన జ్ఙాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలనుకొంటున్నాను. ఈ భవంతి నీ కోసమే.! అంటూ ఆ భవనాన్ని అప్పగించి వెళ్లిపోయాడు.    ఆ యజమాని వెళ్ళాక కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో కూలబోయే ఆ భవనం లాగే ..

.మనిషి ధర్మం తప్పకూడదనీ, తుదిశ్వాస వరకూ దీన్ని విడిచిపెట్టకూడదనీ, అధర్మం గా "అర్థాన్ని" సంపాదిస్తే అనర్ధమే తప్ప, ఏ పరమార్థమూ నెరవేరదనీ  ఈ కథలోని నీతి.  KY
[2:17 PM, 8/16/2016] +91 94942 73703: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనే తపనతో  ఏర్పాట్లలో భాగంగా సెలవు దినము అయినప్పటికి పాఠశాలకు హాజరై ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతానికి గురై అసువులు బాసిన రంగారెడ్డి జిల్లా పూడురు మండలం మెడికొండ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభావతి అకాల మృతికి  ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం..

మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం

No comments:

Post a Comment

.