Pages

Monday, August 29, 2016

రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?

 రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?


పెరుగు ప్రాచీన కాలంనుండి అద్భుతమైన పోషక విలువలతో మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడుతోంది. పెరుగునే యోగ్రర్ట్ అని పిలుస్తారు. పెరుగు అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది క్రీమీ టేస్ట్ ను కలిగి ఉంటుంది. అంతే కాు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతే కాదు మరీ ముఖ్యంగా పాల కంటే పెరుగు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇంకా పెరుగులో ప్రోటీన్స్ మరియు క్యాల్సియం కంటెంట్ అధికంగా ఉన్నాయి. పాలు పడనివారు, ఇష్టం లేనివారు, మరియు ల్యాక్టోజ్ ఇన్టాలరెన్స్ వల్ల సులభంగా జీర్ణించుకోలేని వారు పాలకు బదులుగా పెరుగును ఖచ్ఛితంగా తినాల్సి ఉంటుంది. పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి . కాబట్టి దీన్ని మన డైలీ, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ ప్రయోజనాలు ఎముకలు, దంతాలు, బ్రెయిన్, స్టొమక్, మరియు ప్రేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది .

మరియు మీరు ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆపానవాయువు సమస్యలను ఎదుర్కోరు. పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ పెరుగు తినడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యేటటువంటి అన్ని రకాల న్యూట్రీషియన్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా బాడీకి చేరుతాయి. అందువల్ల, పెరుగు వల్ల పొందే ఇన్ని ప్రయోజనాలను ఖచ్చితంగా మిస్ చేయకూడదు. వివిధ రకాలా ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తినడం నివారించే ప్లెయిన్ గా ఇంట్లో తయారుచేసుకొనే హెల్తీ పెరుగును తినడం వల్ల మరిన్ని హెల్తీ, అమేజింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు... మరి డైలీ బెసిస్ లో రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల ఏం జరగుతుందో తెలుసుకుందాం....!

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది:

మీరు హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే , అప్పుడు ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో పెరుగు ఉండాల్సిందే . ఎవరైతే రెగ్యులర్ గాపెరుగు తింటారో వారిలో హైబ్లడ్ ప్రెజర్ లక్షణాలు, కిడ్నీ మరియు హార్ట్ డిసీజ్ వంటి లక్షణాలు పెరగవని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. అందుకు పెరుగులో ఉండే పొటాషియమే అంటున్నారు.

మానసిక ఏకాగ్రత పెంచుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో స్ట్రాంగ్ బ్రెయిన్ మరియు మెంటల్ కాన్ సంట్రేషన్ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది . ఇది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వల్లే ఇలా జరగుతుంది. రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో మెమరీ పవర్ పెరుగుతుందని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది. Show Thumbnail

బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది :

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు గ్యాస్ సమస్యలు నివారించబడి బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మరియు ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. మరియు మలబద్దక సమస్యలను కూడా నివారిస్తుంది.

నడుము చుట్టుకొలత తగ్గించుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అంటే కేవలం పెరుగు తినడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. అంతే కాదు పెరుగు రెగ్యులర్ గా తినడం వల్ల ఒత్తిడికి(ఇది నడుము చుట్టూ కొవ్వు చేరే) కారణం అయ్యే హార్మోనుల ఉత్పత్తిని తగ్గిస్తుంది. Show Thumbnail

సంతోషంగా ఉండవచ్చు:

పెరుగులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థకు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ బి12, విటమిన్స్ వెజిటేరియన్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని చాలా వరకూ అనిమల్ ఫుడ్స్ లో ఎక్కువగా చూస్తుంటాము. విటమిన్ బి 12 ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతాయి.

ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు:

ప్రతి రోజూ పెరుగు తింటుంటే దంతక్షయ సమస్యలుండవు . పాల వల్ల దంతక్షయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ల్యాక్టోజ్ షుగర్స్ ఉండటం వల్ల పెరుగు దంతాలకు మరియు ఎముకలకు చాలా మేలు.
[9:22 AM, 8/28/2016] +91 94415 65994: 🌹🕉అంతర్యామి🕉🌹

🌻👌రథ శాంతి👌🌻

🌺 భగవానుడు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని ఆనందంగా ఆరోగ్యంగా అనుభవించడం, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మనిషి విజ్ఞతపై ఆధారపడి ఉంటాయి అనుభవాల ఆటుపోట్లు జీవితాన్ని ఒక పట్టాన సాఫీగా సాగనివ్వని మాట యథార్థమైనా, కళ్లముందున్న జీవితకాలం అపూర్వమని తెలుసుకోవాలి. దాని ప్రస్థానం ఉన్నతంగా సాగాలి.
🌺 జీవితకాలం నూరేళ్లుగా నిర్దేశితమైంది. అంతకుపైబడి జీవించినవారూ ఉన్నారు. ఒక వయసు దాటాక జీవన దశలను గుర్తుచేస్తూ సాగే వేడుకలు- పాటించాల్సిన ధర్మాలను తెలియజేస్తాయి. కుటుంబ యజమానికి అరవై ఏళ్ళ వయసు రాగానే షష్టిపూర్తి వేడుక నిర్వహిస్తారు      🌼 కుటుంబసభ్యులు, బంధువులు చేరి వివాహ వేడుకను మరపించేలా చేస్తారు. అరవై ఏళ్ళ వయో దశనే ‘ఉగ్రరథ శాంతి’ అనీ అంటారు. ఉగ్రరథుడు అంటే యమధర్మరాజు. నిండు నూరేళ్లు జీవించేలా దీవించాలని కోరుతూ ఆయనకు జరిపే శాంతి ఇది

🌺 మానవ శరీరమే రథం. ఇంద్రియాలే గుర్రాలు. కోరికలు పగ్గాలు. రథ సారథి జీవుడు. గమ్యం పరమాత్ముడి సన్నిధి... అని చెబుతాయి శాస్త్రాలు అరవై వరకు జీవితాన్ని ఒడుదొడుకులతో, ఉరుకులు పరుగులతో గడుపుతూ అలసిపోతాడు మనిషి. బరువు బాధ్యతలను ఎదిగిన సంతానానికి అప్పగించి, ప్రశాంతంగా కాలం గడిపే వయసుగా ఈ దశను భావిస్తాడు. ఇది జీవన పోరులో విరామ ఘట్టం. డెబ్భై ఏడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజుల వయసు నాటికి భీమరథ శాంతి జరుపుకొంటారు. కొంతమంది డెబ్భై సంవత్సరాల వయసులోనే ఈ శాంతి చేస్తారు. భీమరథుడన్నా యమధర్మరాజే!

🌺 ఎనభై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులకు దేవరథ శాంతి, తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజులకు దివ్యరథ శాంతి, నూట అయిదు సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజుల వయసుకు మహా దివ్యరథ శాంతి చేసుకుంటారు!

🌺 మనది చాంద్రమానం. జీవితకాలంలో వెయ్యి పూర్ణచంద్రోదయాలు చూసినవారికి- అంటే ఎనభై సంవత్సరాలకు పైన ‘సహస్ర పూర్ణచంద్ర దర్శనం’ వేడుక జరుపుతారు.                          🌸వయసు యాభై సంవత్సరాలు దాటిన తరవాత, ప్రతి పది సంవత్సరాలకు ఓ ఉత్సవంగా చేసుకోవాలని ఆర్యోక్తి.

🌺 మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నతమైంది. ఆదర్శప్రాయమైంది. కుటుంబాల్లోని పెద్దలు మార్గదర్శకులే కాదు, సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులనీ శాస్త్రాలు చెబుతున్నాయి              👉

No comments:

Post a Comment

.