Pages

Friday, July 28, 2017

Fashion Designing Courses NIFT - Hyderabad

Fashion Designing Courses NIFT - Hyderabad Fashion Designing Courses NIFT - Hyderabad Fashion Designing Courses NIFT - Hyderabad Fashion Designing in NIFT - Hyderabad Admissions


One Year Programmes;-

Course:-Fashion & Clothing Technology (FCT)

The programme;- by Department of Fashion Design is tailor made for the garment industry professionals from the areas of apparel design, construction/technology. The curriculum of the course has been structure to meet the requirements of the industry & has been specially designe with a view to help aspirants who would like to join the fashion industry as well as for those who are already working in the industry.

COURSE CONTENT :The curriculum is structured to instill practical problem solving ability within the students. The primary subjects are pattern development and draping, technical garment art, textile appreciation and garment construction. Students also get inputs in marketing and merchandising, production planning and control, and market sourcing

CAREERS: The programme targets to upgrade the skills of professionals working in the garment industry. The course prepares candidates to get absorbed in the industry in the areas of sample coordination, merchandising and production.

Award: Certificate
Eligibility:Minimum 10+2/10+2 with 1-2 years of experience/10+2 with Diploma.
Duration: 1 Year, 5 Days/week
Campuses: Bengaluru, Bhubaneshwar, Chennai, Hyderabad, Mumbai, New Delhi & Patna
Seates: 30
Course Fee:75,000
Course Coordinator: Ms. Shoba Uppe, Asst.Prof. - 9849491130
Ms. Jasti Pooja, Asst.Prof. -9642103513

Course:-Indian Fashion Apparel & Boutique Management

The programme is conducted by Department of Fashion Design. It has been designed to provide entrepreneurial guidelines for boutique management. The programme gives an insight into the Indian ethnic apparel market and prepares aspirants for fashion business.

COURSE CONTENT: An interactive and practical approach ensures a better understanding of the field and its management. Areas of study include design, Indian pattern making, construction, traditional Indian textiles and embroideries and Boutique marketing & management.

CAREERS: The programme trains aspirants for entrepreneurial ventures in Indian apparel fashion market. The course prepares candidates for design, sampling coordination and boutique management.

Award: Certificate
Eligibility:Minimum 10+2
Duration: 1 Year, 5 Days/week
Campus:Hyderabad
Seates: 30
Course Fee:75,000
Course Coordinator: Dr. Sarvani V -9949515375 & Ms. Fatima Bilgrami-9440689873

Course:-Contemporary Ethnic Wear (CEW)

The programme conducted by the Department of Knitwear Design aims to prepare professionals for Indian apparel industry and for careers as entrepreneurs. Ethnic Indian clothing is a fast growing sector. A holistic and focused approach in the course will thus help students to understand textiles and garments, as well as conceptualize design.

COURSE CONTENT: Areas of study: Design Process, Surface Techniques & Development, Introduction to Pattern Development, Garment Construction and Textile basics.

CAREERS: The course trains professionals to occupy as design assistants and sampling coordinators in the Indian apparel industry. It also builds up on skill to facilitate entrepreneurship in the same field.

Award: Certificate
Eligibility: Minimum 10+2/10+2 with 1-2 years of experience/10+2 with Diploma
Duration: 1 Year, 5 Days/week
Campus:Hyderabad
Seates: 30
Course Fee:75,000
Course Coordinator: :  Mr. Shivanand Sharma -9885837670, Dr. I Rajitha-9441512423 & Ms. Prachi Bajaj -9581981081








Six-Months Programmes;-

Course:-PRODUCT DEVELOPMENT IN LADIES WEAR :

The programme is conducted by Department of Fashion Technology and its make the student understand the fundamentals of design and construction of the ladies and kids wear. Towards the end of the course the students get opportunity to work at design studio or set up their own design studio or take up job work.

COURSE CONTENT
Areas of study include in-depth understanding of Pattern Making and Garment Construction for product development for kids wear, embroideries and surface techniques, production & quality control, elements of design & Design sensitivity.

CAREERS
Take up job work • Setup Design studio • Freelance designer for clients, celebrities, movies, etc., • Work under designer as design coordinator • Work in retail outlets.

Award: Certificate
Eligibility: 10+2 / Diploma / Graduate
Duration: 6 months,5 days / week
Campuses: Hyderabad
Seats: 30
Course Fee: Rs. 55000/-
Course Coordinators : Ms. V. Priyadarshini- 9177392288

Course:-PROCESS IMPROVEMENTS IN GARMENT INDUSTRY :

The programme is conducted by Department of Fashion Technology and is tailor made for the garment industry professionals in the areas manufacturing and operations. The course provides great exposure to variety of productivity and process improvement techniques relevant to Indian readymade garment industry.

COURSE CONTENT
The course covers in depth understanding of the productivity and process improvement techniques in mass manufacturing garment industries. The course is structured to provide inputs on application of Work Study, Ergonomics, Quality Control and Lean Manufacturing tools and techniques in mass manufacturing o garments.

CAREERS
The Programme targets at upgrading the skills of the people working at supervisor and operator levels as well as the candidates aspiring to join the garment manufacturing industry.

Award: Certificate
Eligibility: 10+2 with 1-2 years of experience or 10+2 with Diploma or 10+2=3 (Graduate)
Duration: 6 months,5 days / week
Campuses: Hyderabad
Seats: 30
Course Fee: Rs. 45000/-
Course Coordinators:  Dr. Rajaram -9866761888 & Dr. Rajani Jain -9989773520



     

Three Months Programmes

Course:-Apparel Retailing and Visual Merchandising (ARVM)

The Course is designed to impart the fundamental of Fashion Retailing and key concepts to manage day to day Fashion Retails Operations. The course aims at creating functionally ready professionals to the evolving Fashion Retail Industry.

COURSE CONTENT
Visual merchandising, personality development (for retail front end), Graphic designing, Fashion vocabulary.

CAREERS: Career opportunities in Fashion Retail store, operations, Merchandisers etc.

Award Certificate
Eligibility Intermediate or +2 Pass
Duration 3 months ,5 days / week
Campus Hyderabad
Seats 30
Course Fee Rs. 30,000/-
Course Coordinator: Mr. M. Annaji Sharma -9618227214& Mr. Shivkumar M. Belli-9703440564

Course:-Craft Contemporary Evening wear for Women:-

The programme proposed to be conducted by Fashion Design Department, to trains & prepares the candidates in making contemporary hi – fashion evening wear, utilizing the precise skills of pattern making & garmenting procedures.definitely learn to think like a designer.

COURSE CONTENT
Areas of study include in-depth understanding of Pattern Making and Garment Construction for product development for kids wear, embroideries and surface techniques, production & quality control, elements of design & Design sensitivity.

CAREERS
Take up job work • Setup Design studio • Freelance designer for clients, celebrities, movies, etc., • Work under designer as design coordinator • Work in retail outlets.

Award Certificate
Eligibility 10+2
Duration 3 months ,5 days / week
Campus Hyderabad
Seats 20
Course Fee Rs. 35,000/-
Course Coordinator: Prof. Dr. Malini Divakala-9848392577 & Ms. Shoba Uppe-9849491130

Course:-Contemporary Saree Designing:-

Indian saree is classic design from which is in demand both as a traditional and occasional wear . A holistic approach in this course helps the students to understand types and design aspects of a saree. it will enable the students to design a saree for partywear,wedding wear,formal wear ect. Using different surface ornamentation techniques like tie-dye, batik, block & screen printing, embroidery ect.

COURSE CONTENT
The course includes technical aspects of the saree, varation design inputs, ornamentation by tie-dye and Other surface techniques.

CAREERS
This programme prepares the professionals for saree design in boutiques and also amis to facilitate aspiring enterpreneur

Award: Certificate
Eligibility: 10 +2
Duration: 3months ,5 days / week
Campus: Hyderabad
Seats: 30
Course Fee: Rs. 30,000/-
Course Coordinator:  Ms. Jyotirmai S-9440660733 & Mr. Prithwiraj Mal-9703044163

Course:-Fashion Drawing for Designers:-

The programme is offered by the Fashion Design Department and Designed to introduce and develop beginner’s level fashion illustration skills useful for the working fashion professional and enthusiast.

COURSE CONTENT
The programme introduces the 10 head women’s fashion illustrations croqui,poses,faces,hairstyles,garments and details as well as rendering fabric

CAREERS
This programme is useful for a working professional in the fashion business to communication design ideas .it is also useful for developing a professional fashion design portfolio

Award Certificate
Eligibility Open to all. Preferred experience in basic drawing
Duration 3 months, 3 days /week
Campuses Hyderabad
Seats 30
Course Fee Rs. 35,000/-
Course Coordinators:  Ms. Jasti Pooja -9642103513
Fabrication of Scarf / Stole Design:

A holistic approach in the course will help the students to design scarf / stole using various yarn caft techniques like braiding, knotting, crochet,macrame and surface ornamentation techniques like tie and dye, batik,printing ect

COURSE CONTENT
Area of study includes yarn craft techniques like braiding, knotting, crochet,macrame and surface ornamentation techniques like tie and dye, batik,printing ect basic design conceptualization and ideas for product development

CAREERS
This programme is designed for the aspiring professionals who can open their own boutiques through development of design skills for product development using yarn craft, tie and dye and various printing techniques and surface ornamentations.
Award: Certificate
Eligibility :Minimum 10+2
Duration: 3 month/ 5 days / week
Campuses: Hyderabad
Seats: 30
Course Fee: Rs. 30,000/-
Course Coordinators:  Ms. Jyotirmai S-9440660733 & Ms. Sasmita Panda- 9490471020
Print Design for Apparel and Home:

Print is the Fastest and more demanded textiles technique ,its demand is increasing due its application in various product categories.Technical advancemaent of printing techniques like digital , screen automatic flat bed ect . are among various fast execution methods which are making it more popular. The course will equip an individual to understand technical and creative aspects of print design.

COURSE CONTENT
The Program will Focus in developing an overall knowledge of print design which is Design and Technology based . print application will prepare the candidate to expertise not just in apparel but also print application in home category of design .The program will provide exposure to foreign print expert

CAREERS
The course will helps an individual to develop design skill for developing prints for garments ,sarees, table linens ,fashion accessories,wall screens,interior design ect.

Award Certificate
Eligibility 10+2 minimum
Duration 3 month / 5 days / week
Campuses Hyderabad
Seats 30
Course Fee Rs. 30,000/-
Course Coordinators:  Ms. Rakhi Wahee Pratap-9346604681 & Mr. G. Rajesh Kumar -9490105201




One Month Programmes;-                    

Course:-Fashion Digital Marketing:

The course is designed to orient participants towards digital marketing in e-commerce which can offer endless possibilities of exposure to various techniques with major focus on e-commerce. The students are expects to gain working knowledge in digital marketing domain

COURSE CONTENT
Introducation to Digital Marketing, Websites Optimization , Web Analytics ,Search Engine, ptimization , Digital Markating, Email Markating, Social Markating , Mobile Markating.

CAREERS
To Emerge as a professional in sales, Marketing, Business Development Branding Advertising, Communications.

Award: Certificate
Eligibility: 10+2 or Higher in any stream with knowledge of Internet & basics of E-commerce
Duration: 1 month / 4 days / week
Campuses: Hyderabad
Seats: 30
Course Fee: Rs. 20,000/-
Course Coordinators: Mr. T.V.S.N. Murthy -7731821115

Other Details:- http://www.nift.ac.in/hyderabad/ce1.html
 
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Sunday, July 16, 2017

సహాయం

సహాయం


ఒకప్పుడు - నిస్సహాయుడికి చేసేది
ఇప్పుడు - తిరిగి సహాయాన్ని ఆశించి చేసేది.
                  *దోపిడీ*

ఒకప్పుడు -  లేని వాడు ఉన్న వాడిని దోచుకోవటం
ఇప్పుడు - ఉన్న వాడు లేని వాడిని దోచుకోవటం
                  *ప్రేమ*

ఒకప్పుడు - మనం అనే భావన
ఇప్పుడు - మానకేంటి లాభం అని చూసుకుని కలిగేది
అబ్బాయి అయితే ఆస్తి.. అమ్మాయి అయితే ఉద్యోగం చూసి చేసేది
                  *కోపం*

ఒకప్పుడు - తప్పుని చూస్తే కలిగేది
ఇపుడు - బాలహీనుడు మీద మాత్రమే కలుగుతుంది.
                *అసూయ*

ఒకప్పుడు - గొప్ప వాడిని చూస్తే కలిగేది
ఇపుడు - పక్క వాడు బాగు పడటం  చూస్తే చాలు
               *నిజాయితీ*

ఒకప్పుడు - మంచితనం
ఇపుడు - చేతకానితనం
                *మోసం*

ఒకప్పుడు - తప్పు
ఇపుడు - తెలివి
                 *ద్రోహం*

ఒకప్పుడు - నేరం
ఇపుడు - నమ్మిన వాడికి దక్కే సత్కారం
               *గెలుపు*

ఒకప్పుడు - తెలివికి బలానికి దక్కే విలువ
ఇప్పుడు - పక్కవాడిని మోసం చేస్తే వచ్చే రాబడి
              *ఓటమి*

ఒకప్పుడు - మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్పే పాఠం
ఇప్పడు - పక్క వాడు బాగా తెలివి మీరాడు జాగ్రత్త అని చెప్పే గుణ పాఠం
               *చదువు*

ఒకప్పుడు - కొత్త విషయాలు నేర్పేది
ఇపుడు - వ్యాపారం
             *వ్యాపారం*

ఒకప్పుడు - తనకు తెలిసిన విద్యతో బ్రతికే జీవన శైలి
ఇపుడు - బలహీనుడి మోసం చేసే సరికొత్త విధానం


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

GST అమలు తీరుతెన్నులు ఇలా ఉండబోతుంది

GST అమలు తీరుతెన్నులు ఇలా ఉండబోతుంది..

 ప్రతి వ్యాపారి జాగ్రత్త వహించండి..
 పాత తరం విధానాలకి చరమగీతం పాడండి..
 లైసెన్స్ లేని వ్యాపారం ఇకపై కుదరదు..
 భారత వాణిజ్య విధానం ఇప్పటిదాకా ఒకరకం అయితే ఇకపై పూర్తిగా భిన్నమైన పరిస్థితి..
 ప్రతి అమ్మకం - కొనుగోలు పూర్తిగా పేపర్ పై చూపించాల్సి ఉంటుంది..
 కట్టు తప్పితే వేటుకు సిద్ధంగా ఉండండి..

 దేశవ్యాప్తంగా జులై 1 నుండి GST విధానం 100% అమలులోకి వస్తుంది.
 ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉన్న VAT విధానం పూర్తిగా రద్దవుతుంది..
 దేశ స్వతంత్రానంతరం నేటి వరకు లేని 4 ఉత్పత్తులపై కూడా ఈ GST విధానంలో చేర్చబడ్డాయి. అవి.. విద్య, వస్త్రాలు, ఔషధాలు, వృత్తి ద్వారా అందించే సేవలు. ఇకపై వీటిని కూడా వివిధ రకాలుగా పన్ను సేవలలో చేర్చడం జరిగింది.

 ఇప్పుడున్న VAT విధానం నుండి GST కి మరాలనుకుంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.
 GST విధానంలో పన్నులు 7 రకాలుగా విభజించబడ్డాయి. 0, 5, 8, 12, 18, 28, 40 శాతం శ్లాబులు ఉన్నాయి. వీటిలో FMCG వ్యాపారానికి 40% వర్తించదు.

 CGST-SGST : ఈ విధానం కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునేవారికి వర్తిస్తుంది. ఇక మీదట ఒక కంపెనీ తయారీ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు. కేవలం డిపో ట్రాన్స్ఫర్ విధానం మాత్రమే ఉంటుంది. దానికి ఎలాంటి పన్ను లేదు. అందుకని ఆ విషయం గురించి మీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి.

ఇకపై ప్రతినెలా మీ కంపెనీ మీకిచ్చిన అమ్మకాలు, మీరు చూపించే ఖరీదులు తప్పకుండా Match అవ్వాల్సి ఉంటుంది. Match కానిచో ఆయా కంపెనీలను అడిగి నిర్ధారణ చేసుకొని సవరించుకోవాల్సి ఉంటుంది. Match కాని పక్షంలో Input టాక్స్ కి ప్రమాదం సంభవిస్తుంది.

మొదటి సంవత్సరం ఎలాంటి శాశ్వత చెక్ పోస్టులు ఉండవు. సేల్ టాక్స్ అధికారులు మొబైల్ చెక్ పోస్టుల ద్వారా రహదారుల వెంట అక్కడక్కడా సరుకు రవాణా వాహనాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక రవాణా అయ్యే ప్రతి సరుకుకి సంబంధించి బిల్లు, వేబిల్లు తప్పనిసరిగా జత చేసి ఉండాలి.

50వేలు పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్ కి అప్ లోడ్ చేసి ఆన్ లైన్ ద్వారా తప్పని సరిగా వేబిల్లు పొందాలి. తదుపరి మాత్రమే మన అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకు పంపాలి. ఇది ఒక ఊరి నుండి మరొక ఊరికి మాత్రమే కాకుండా మన పక్క షాపుకి ఇవ్వాలన్న  వేబిల్లు తప్పనిసరి. అది లేకుండా సరుకు మార్చుట తీవ్ర నేరంగా పరిగనించబడుతుంది. అనుసరించని వారికి కఠినమైన జరిమానా, న్యాయపరమైన చర్య, జైలు శిక్ష విధించబడుతుంది

 GST విధానంలో నెలవారీ అమ్మకాలకు నింపే VAT 200 కి బదులు కొత్తవిధానం  అమలులోకి వచ్చింది. ఇందులో మనం ప్రతినెలా సేల్స్ ని 5 రకాల పద్ధతుల్లో ఆన్ లైన్ ద్వారా పంపాల్సి వస్తుంది.. తెలుసుకోవాల్సి వస్తుంది.. అన్నీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.

1. R1 Form ప్రతినెలా 10తేదీలోపు
2. R2 Form ప్రతినెలా 13తేదీలోపు
3. R3 Form ప్రతినెలా 15తేదీలోపు
4. R4 Form ప్రతినెలా 17తేదీలోపు
5. R5 Form ప్రతినెలా 20తేదీలోపు
1. మన ఖరీదుకి సంబంధించినది
2. దాని నిర్ధారణ (GST Dept ద్వారా వచ్చేది)
3, 4, 5 లు నెలనెలా అప్ లోడ్స్ చేయాల్సినవే.

ఇవన్నీ ప్రతినెలా అప్ లోడ్ చేయాల్సినవే. ఇలా చివరివరకు MATCH & MISMATCH తరువాత అమ్మకం మరియు కొనుగోలుదారుల Submission Comparision చేసుకునే ప్రక్రియ. ఇకపై ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ విషయమై మీ చార్టెడ్ అకౌంటెంట్ లేదా సంబంధిత సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ నుండి గానీ ప్రాక్టికల్ గా నేర్చుకోవడం తప్పనిసరి.

ఈ GST విధానంలో  లెక్కలు అన్నీ దాదాపుగా VAT లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును ప్రతి నెలా GST కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం.

నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంక్ ద్వారాగానీ, E-బ్యాంక్ ద్వారా గానీ, ఆన్ లైన్ ద్వారాగానీ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారాగానీ మాత్రమే చెల్లించాలి. నగదు, చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు.

VAT విధానంలో ప్రతినెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెలచివరలో ఒకేసారి VAT200 ద్వారా తెలిపేవారు. కానీ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్, ఇంటర్ నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగియుండాలి.

మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబరు క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి లావాదేవీ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఏదైనా అధికారి ద్వారాగానీ, జరిగిన పొరపాట్లను ఆఫీసుకి వెళ్లి మార్చుకునే అవకాశంగానీ లేదు. తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమి చేయలేడు. ప్రతినెలా 20వ తేదీన అప్ లోడ్ చేసిన పిదప తదుపరి ఎలాంటి మార్పుచేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అవకాశం అసలే లేదు. అంతా కంప్యూటర్ మయమే కనుక 20వ తేదీన వేసే ఫైనల్ రిటర్న్  జాగ్రత్తగా వేయాలి. కాబట్టి నిర్లక్ష్యం వహించకండి..

ఒక యజమాని పేరుతో ఒకరికి ఒక ఫర్మ్ మాత్రమే ఉండాలి. ఒకటికంటే ఎక్కువ ఫర్ములు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఫర్ము PAN కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. కనుక ఒకరికి పలు రకాల ఫర్ములు ఉండలేవు. ఈ విషయంలో జాగ్రత్త.

ఇక ముందు GST అమలు తర్వాత ఒకవేళ ఒకే రాష్ట్రంలో అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి గోడౌన్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి C & F కి గానీ, గోడౌన్ నుండి ఆఫీస్ కిగానీ, స్టాక్ ట్రాన్స్ ఫర్ అనే విధానం ఒక డెలివరీ చాలాన్ ద్వారా మాత్రమే జరగాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి మరో డిస్ట్రిబ్యూటర్ కి కూడా  సరుకు మార్పిడి (ట్రాన్స్ ఫర్ ) ఉండదు. దీనికి తప్పకుండా బిల్లు ఉండి తీరాలి. కాబట్టి ఒక వేళ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం బిల్లు ద్వారానే జరపండి. ఒకవేళ ఇతర రాష్ట్రం నుండి గనక అయితే సొంత డిపో అయినా కూడా కంపెనీ బిల్లు ద్వారా సరుకు పంపాల్సి ఉంటుంది.

ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు. బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్ మినహా మిగతా వాటిపైన కూడా పన్ను విధింపు ఉంది. కాబట్టి తరువాత ఇచ్చే డిస్కౌంట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక్క కంపెనీ ద్వారా అది కూడా బిల్లులో పొందుపరిచిన స్కీములకి మాత్రమే పన్ను ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా గమనించగలరు.

GST విధానం ద్వారా FMCG ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వేచి చూడాలి.

ఇక ముందు కూడా ప్యాక్ చేయబడిన ప్రతి సరుకులపైన MRP విధిగా ఉంటుంది.

ఇకపై GST పన్ను ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ - C & F వ్యవస్థకి పెనుముప్పు రానుందని చెప్పాలి.

ఇంకో కొత్త విధానం ఏమిటంటే ధరల నియంత్రణ చట్టం. ఉదాహరణకి గులాబ్ జామ్ ధర రూ. 100/- అనుకోండి. అదే గులాబ్ జామ్ పైన మరో ప్యాకెట్ ఉచితంగా ఇస్తేగనుక దాని ధరను నియంత్రణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. కనుక ఈ విషయమై కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోండి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. కాలమే దీనికి సమాధానం చెబుతుంది.

ఇట్టి సవరణలను అర్ధం చేసుకుని సక్రమమైన వ్యాపారులను గుర్తించి, తప్పు చేసేవాళ్లను పసిగట్టేందుకు ప్రభుత్వం రేటింగ్ విధానం తీసుకువచ్చింది. అన్నీ సక్రమంగా నిర్వర్తించే వాళ్ళకి  భవిష్యత్ లో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం ఉంది. అంతేగాక భవిష్యత్ లో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందాము అనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది. రేటింగ్ తగ్గితే అట్టి అవకాశాలు చేజారి పోవచ్చు కూడా. ఇది కాకుండా భవిష్యత్ లో ఈ రేటింగ్ పద్దతి ద్వారానే  బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కార్ లోను గానీ, ఇళ్లు లోన్ గానీ, వ్యాపార లోన్ గానీ ఈ విధానంలోనే చూడబడుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉంటేనే మనకి భవిష్యత్ ఉంది.

ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే చాలావరకు FMCG కంపెనీలు మైగ్రేషన్(మార్పిడి) ద్వారా వచ్చే TAX డిఫరెన్స్ ని NET LOSS పద్దతిలో లెక్కగట్టి అట్టి నష్టాన్ని పూడుస్తామని వ్రాతపూర్వకంగా తెలిపాయి. అందుకని మీరందరూ క్లోజింగ్ స్టాక్ ని సక్రమంగా లెక్కచేసి పెట్టుకోండి. అట్టి ప్రొడక్ట్ లపై ఉన్న టాక్స్ ని కూడా లెక్కచేసి పెట్టుకోండి. ఇది వ్యాపారి సబ్మిషన్ లో చెప్పాల్సి ఉంటుంది. అట్టి టాక్స్ సంస్థ ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పద్దతిలో GST లోకి మారిపోతుంది. ఇది కాకుండా 18% లోపు ఉన్న టాక్స్ లకు 40% ఎక్సయిజ్ టాక్స్ పద్దతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై వివరంగా ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ 18% పైన గనుక టాక్స్ ఉంటే అట్టి ప్రొడక్ట్ కి టాక్స్ + 60% రిఫండ్ ఉంటుంది. దాని వివరాలు కంపెనీ ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇకముందు మనం అమ్మే ప్రతి ప్రొడక్ట్ కి HSN CODE విధానం ఉంటుంది. ఇది ఏమిటంటే అమ్మే ప్రతి వస్తువుకి GST ఫార్మాట్ లో ఒక కోడ్ ఇస్తుంది. అది మనం క్యాంపెయిన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. అది లేనిదే బిల్లు చేయలేరు. కాబట్టి దాని విషయమై కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి. దాటవేత ధోరణిని అంగీకరించకండి. వారిచ్చిన సమాచారం పూర్తిగా నిర్ధారణ చేసుకొని నమ్మకం కలిగిన తరువాతనే వారితో లావాదేవీలు జరపండి. లేదంటే ప్రమాదంలో పడతారు.

ఇప్పటి వరకు మీరు లావాదేవీలు నెరపిన కంపెనీల నుండి క్రెడిట్ నోట్స్, డామేజ్ స్టాక్, గడువుతీరిన సరుకు, సేల్స్ మ్యాన్ జీతభత్యాలు, పెండింగ్ లో ఉన్న క్రెడిట్ నోట్స్ అన్నీ త్వరగా రెడీ చేయండి (GST మొదలయ్యేలోపు అన్నింటికీ సంబంధించిన క్రెడిట్ నోట్స్ తయారుచేసుకొని ఆయా కంపెనీలకు పంపండి). ఆ డాక్యుమెంట్ ని జాగ్రత్త చేయండి. వీలయినంతవరకు కంపెనీల ద్వారా రావలసిన బెనిఫిట్స్ త్వరగా తెప్పించుకోండి. ఎందుకంటే GST తరువాత అట్టి క్లెయిమ్స్ కి 18% టాక్స్ పడే అవకాశం ఉంది.

ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్, లాడ్జ్ బిల్స్ మరియు ఇతరములపై కట్టే టాక్స్ లను input క్రెడిట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ ఖరీదు, అద్దెలు పైన గానీ టాక్స్ లు కట్టిన యెడల అది కూడా ఇన్ పుట్ టాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఇది రిఫండ్ గా లెక్క చూసుకోవాలి. దానిని నెల అంతంలో నింపే రిటర్న్ లో క్లుప్తపరచాలి. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఒకవేళ ఇంటర్మ్ సేల్స్ మేన్స్ కిగానీ, డిస్ప్లే ఖర్చుకి గానీ, కంపెనీ తరఫున చేసిన ఖర్చునుగానీ కంపెనీలనుండి క్లెయిమ్ చేయునప్పుడు తప్పకుండా invoice రైజ్ చేసి టాక్స్ జోడించి పంపించాలి. అట్టి టాక్స్ ని ఇన్పుట్, ఔట్ పుట్ లో సరిగ్గా క్లెయిమ్ చేసుకోవాలి.

సాధారణంగా న్యాయపరమైన విధానాలు..

 GST ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి వ్యాపారి తమ లావాదేవీలకు చెందిన సమాచారాన్ని పుస్తకాల ద్వారా గానీ, కంప్యూటర్ ద్వారాగానీ మీ చెంతనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. తనిఖీ సందర్భంలో GST అధికారి అడిగిన దరిమిలా అన్నిటినీ రోజువారీగా చూపించే విధంగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైన విషయం

 దీనికిగాను మీకంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే అకౌంటెంట్ గానీ, ఎప్పుడంటే అప్పుడు సమాచారం ఇవ్వగలిగే పరిజ్ఞానంగానీ కలిగి ఉండాలి.

 మీ వ్యాపారంలో మీరిచ్చే జీతాల లెక్క సరిగ్గా ఉండాలి. మీరిచ్చే నెలవారీ జీతాలన్నీ ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒక వేళ అలాచేయకుండా నగదు రూపేణా జీతాలు ఇస్తే అట్టి జీతాల ఖర్చును, ఖర్చుల క్రింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశం ఉంది.

 మీ మీ ట్రావెల్ ఖర్చులు, ఇతర చెల్లింపులు అన్నీ తప్పకుండా ఫర్మ్ కింద క్లెయిమ్ చేయాలి.

 మీదగ్గర ఉన్న, కేవలం ఖరీదు చేసిన సరుకు అయితేనే టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి. ఇతరత్రాకి ఇన్ పుట్ క్రెడిట్ రాదు. కనుక జాగ్రత్త వహించి అలాంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు అమ్ముకోవాలి. ఆ తరువాత స్టాక్ హోల్డింగ్ గా చూపరాదు.

 C & F - సూపర్ స్టాకిస్ట్ లు పాతవ్యాపారానికి సంబంధించి C Form గానీ, F Form గానీ డిసెంబర్ లోగా తమతమ కంపెనీలతో క్లియర్ చేసుకోవాలి. ఆలస్యమైనా లేదా తదుపరి లావాదేవీల పైన టాక్స్ పడే అవకాశం ఉంది.

 31 మార్చ్ 2017 క్లోజింగ్ స్టాక్ మరియు 30జూన్ వరకు ఖరీదును సరిగ్గా లెక్కచేసుకొని అట్టి క్లోజింగ్ స్టాక్ ని క్వాంటిటీ రూపేణా లెక్కకట్టుకొని GST ఇంప్లీమెంటేషన్ రోజు వరకు రెడీగా ఉంచుకోవాలి. కంపెనీల నుండి మీ మీ ఖరీదు లావాదేవీల అకౌంట్ కాపీని తప్పకుండా తెప్పించి పెట్టుకోవాలి. అట్టి ఖరీదులను మీ పుస్తకాలతో సరి చూసుకోవాలి. అశ్రద్ధ పనికి రాదు.

 అలా సరిచేసిన స్టాక్ ని పన్ను రేట్ల పరంగా తయారు చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ద్వారానే మీ GST లో ఇన్ పుట్ క్రెడిట్ జమ అవుతుంది.

 మీకు వచ్చిన మీ GSTIN నెంబర్ ని మీ సరుకు సరఫరా దారులు అందరికీ ఇవ్వండి. అలాగే మీరు సరుకు సరఫరా చేసే కష్టమర్ల GSTIN నెంబర్లను ముందుగానే సేకరించి పెట్టుకోండి.

 మీరు అమ్మే లేదా కొనే ప్రతి వస్తువుకి HSN CODE ఉంటుంది. ఇది తప్పని సరి కాబట్టి అట్టి ప్రొడక్ట్స్ యొక్క HSN CODES యొక్క మోడల్ తెలుసుకొని ఒక షీట్ లో రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే GST తరువాత ప్రతి వస్తువు యొక్క HSN CODE ద్వారానే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.

 జరిమానాలు - శిక్షలు

 ఇక్కడ చట్టం చాలా పకడ్బందీగా నిర్మించబడింది. మన తప్పులకు ఆడిటింగ్ గానీ, స్థానిక అధికారుల నుండి గానీ ఎలాంటి నోటీసులు ఇవ్వబడదు. ఇక మీదట ఏ అధికారికి అలాంటి అధికారాలు ఉండవు. కేవలం మనమిచ్చే సమాచారాన్ని బట్టి మన తప్పులను ఆన్లైన్ ద్వారానే నిర్ధారించబడతాయి. ఒకవేళ నిర్ధారించిన నాడు ఇన్వెస్టిగేషన్ టీమ్ రావొచ్చు. లేదా అట్టి తప్పును నేరంగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్టు చేయవచ్చు. అలా అరెస్టు చేసే ముందు మనకు తగిన కారణాలను చూపుతారు. అరెస్టు అయిన వెంటనే 24 గంటలలోపు సదరు వ్యాపారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. ఆపై వెంటనే బెయిల్ దొరుకుతుంది. ఆఫెన్సస్ U/S 132 యాక్ట్ కింద అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంది.

 132 సెక్షన్ పరిధి : ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా బిల్లు లేదా సర్వీసు invoice లేకుండా ఆ సరుకు గానీ, సర్వీసు గానీ సప్లై చేస్తూ దొరికినచో లేదా కావాలని పన్ను ఎగవేతకు ఉపక్రమించిననూ.. ఏ సరుకు గానీ, సర్వీసుగానీ ఇవ్వకున్నను కేవలం ఇన్ పుట్ టాక్స్ క్లెయిమ్ కొరకు తప్పుడు బిల్లులు ఇచ్చి దొరికినచో.. తద్వారా ఎవరైనా లాభపడినచో... సదరు వ్యాపారి input tax credit చేసుకొని తరువాత అట్టి టాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేయనిచో.. దానిని కావాలని చేసిన ద్రోహం క్రింద పరిగణించి శిక్ష వేసే అవకాశం ఉంది. అట్టి తప్పుల వల్ల నేరనిర్ధారణ జరిగితే జైలు తప్పదు.

 మరో ముఖ్య విషయం.. GST అప్లోడ్ చేయడానికి GST అథారిటీ పొందిన సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే సాధ్యం. ఒక వేళ ఏ ఇతర చిన్నచిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు గానీ ఇంటర్నల్ GST బిల్లింగ్ కొరకు సాఫ్ట్ వేర్ ఇచ్చిననూ GST uploding మాత్రం తప్పకుండా అర్థరైజ్డ్ సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే చేయగలరు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. దేశంలో మొత్తం 34 కంపెనీలు మాత్రమే అధరైజేషన్ కలిగిన సాఫ్ట్ వేర్ కలిగిఉన్నాయి. వాటిలో ఆయా ట్రేడ్ కి సపోర్ట్ చేసే సాఫ్ట్ వేర్ ని జాగ్రత్తగా ఎంచుకోండి..


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.

తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.


1. మొదలు పెట్టె కారం -- శ్రీకారం
2. గౌరవించే కారం ----సంస్కారం,
3. ప్రేమ లో కారం --- మమకారం
4. పలకరించేకారం ----నమస్కారం,
5. పదవి తో వచ్చే కారం ---అధికారం,
6. అది లేకుండా చేసే కారం------ అనధికారం,
7. వేళాకోళం లో కారం ---- వెటకారం
8. భయం తో చేసే కారం ---- హాహాకారం,
9. బహుమతి లో కారం --- పురస్కారం,
10. ఎదిరించే కారం --- ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
12. లెక్కల్లో కారం --- గుణకారం,
13. గుణింతం లో కారం -- నుడికారం
14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
15. సమస్యలకు కారం ----- పరిష్కారం,
16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
17. సంధులలో కారం --- 'ఆ'కారం,
18. సాయం లో కారం      --- సహకారం
19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
20. మేలు చేసే కారం ----ఉపకారం,
21. కీడు చేసే కారం -- అపకారం
22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
23. విష్ణువు లో కారం ----శాంతాకారం,
24. ఏనుగులు చేసేది --- ఘీంకారం
25. మదం తో చేసే కారం --- హూంకారం,
26. పైత్యం తో వచ్చే కారం --వికారం,
27. రూపం తో వచ్చే కారం --ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం- ప్రాకారం,
29. ఒప్పుకునే కారం --- అంగీకారం,
30. చీదరించుకునే కారం ---చీత్కారం
31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
           మన గ్రూప్ అందరికి-----     నమస్కారం. కారం. కారం.





Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

హరితహారం పాట

హరితహారం పాట


మనమంతా కలిసి
జనమంతా కదిలి
ఊరూరా మొక్కలు నాటాలి
చంటి బిడ్డలా చక్కగా పెంచుతు
భావి తరాలకు బహుమతినివ్వాలి

ఊరూ వాడ గుడి బడి
అన్ని చోట్లా మొక్కలు నాటాలి
చంటి బిడ్డలా చక్కగ పంచుతు
భావి తరాలకు బహుమతినివ్వాలి   "పల్లవి"

హరితహారంతో ముందుకు సాగాలి
చెరువులు సెలకలు పొలం
గట్లపై
 మొక్కలు నాటి చక్కగ పెంచాలి
చంటి బిడ్డలా సక్కగ సాకి
భావి తరాలకు బహుమతినివ్వాలి  "పల్లవి "

ప్రజలంతా దండుగా కదలాలి కలిసికట్టుగా ముందుకు సాగుతూ
ఊరూరా మొక్కలు నాటాలి
చంటి బిడ్డలా చక్కగ పెంచుతు
భావి తరాలకు బహుమతినివ్వాలి!  "పల్లవి"
గుముడాల చక్రవర్తి గౌడ్






తెలంగాణకు హరితహారం నినాదాలు

1. చెట్టంటనే తల్లి లెక్క!
    చెట్టుంటనే నోట్లే బుక్క!!

2. చెట్టు ఆరోగ్యానికి నిశాన్!
    తెగనరికితే తప్పదు పారేషాన్!!

3. ఊరూ వాడా పచ్చగుండాలె!
    పిల్లా పాపా సల్లగుండాలె!!
 🌿🐰🌿
4. చెట్టు నరికితే అమాస!
    మొక్క నాటితే పునాస!!

5. బతకనీ చెట్టుని...
    బతుకునిచ్చే కనికట్టుని!

6. నీళ్లు పోసి చూడు! చెట్టు-
    కన్నీళ్ళు తుడుస్తది చూడు!!

7. పైలంగా కాపాడు! చెట్టు
    నీ జీవితకాలపు తోడు!!
🌿🐰🌿
8. చెట్టు నరికితే సత్తెనాశనం!
    మొక్క నాటితే కొత్త జీవునం!!

9. అడిగితే అన్నం పెట్టేది కన్నతల్లి!
    అన్నీతానయి అండగావుండేది చెట్టుతల్లి!!

10. హరితహారానికి ఉపకారం!
      పచ్చటి తెలంగాణకు             శ్రీకారం!!




Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Wednesday, July 12, 2017

ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?

ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?


అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడతారు.

అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.

టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు, జ్ఞానులు చెబుతారు.

1) ధర్మ శాస్త్రం ప్రకారం .. మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం పట్టుకునే అవకాశం ఎక్కువ.

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే... ఐతే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుంటే ఈ దిక్కువైపు తిరిగి భోజనం చేస్తే దీర్గాయుష్షు వస్తుంది.

తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.

ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టేవారిని తిట్టటం చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు, దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము.

భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం. భోజనానంతరము ఎంగిలి ఆకులు, కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

మహాకాళి బోనాలు

మహాకాళి బోనాలు


ప్రకృతి అంతా శక్తి సమన్వితం. పరమాత్మను జగన్నాథుడిగా, ప్రకృతిని జగన్మాతగా ఆరాధిం} సంప్రదాయం అనాదిగా ఉంది. మానవ జీవ వికాసం ప్రకృతి కరుణ వల్ల క్రమానుగతంగా కొనసాగుతోందని పలువురి ప్రగాఢ విశ్వాసం. అందుకే జగజ్జననిగా, మూల బ్రహ్మాత్మికగా, ఆద్యశక్తిగా ప్రకృతిని దర్శిస్తారు. సృష్టి, స్థితి, లయ కారకమైన ప్రకృతేశ్వరిని వివిధ రీతుల్లో ఆరాధిస్తూ సమాజం తన కృతజ్ఞతా భావం చాటుకుంటుంది.*_

జ్ఞానం, సంపద, శక్తి- ఈ మూడింటినీ ప్రకృతికి అధినాయకురాలైన అఖిలాండేశ్వరి అనుగ్రహిస్తోందని భక్తుల నమ్మకం. ఆ అమేయశక్తి పట్ల ఆదరాన్ని, ప్రేమాస్పద భక్తితత్పరతను వెల్లడించుకొనేందుకే వారు అమ్మతల్లికి ఉత్సవాలు, జాతరలు, కొలుపులు నిర్వహిస్తారు.*_

ప్రకృతి ఆకృతులైన విభిన్న కళలే గ్రామదేవతలు. ఈ మాతృశక్తి రూపాల్ని ఆషాఢ మాసంలో శ్రామికులు, కర్షకులు తమదైన సంప్రదాయ సంవిధానంలో సేవించుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పచ్చదనం సర్వత్రా వెల్లివిరియాలని, ఆరోగ్య సౌభాగ్యాలు కొనసాగాలని కోరుతూ బోనాల్ని శక్తిరూపాలకు సమర్పిస్తారు. భక్తిచైతన్యం, సామాజిక సమైక్యత ప్రస్ఫుటమవుతాయి. జంటనగరాల్లో ఆషాఢ బోనాల సంబరం అంబరాన్ని తాకుతుంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి జాతరతో ఈ వైభవం పతాక స్థాయికి చేరుకుంటుంది.*_

సురిటి అప్పయ్య అనే భక్తుడు 1815లో ఉజ్జయినీ మహాకాళి విగ్రహాన్ని స్థాపించి, ఆలయం నిర్మింపజేశాడు. ఆ ప్రాంగణంలోని ఓ బావికి 1864లో మరమ్మతు చేస్తున్నప్పుడు, తవ్వకాల్లో మాణిక్యాలదేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహంతో పాటు, అప్పటివరకు కొయ్య విగ్రహంగా ఉన్న మహాకాళి స్థానంలో ఒక రాతి విగ్రహాన్నీ ప్రతిష్ఠాపన చేశారు. అప్పటినుంచి మహాకాళి, మాణిక్యాలదేవి ‘జంట దేవతలు’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆశ్రిత కల్పవల్లిగా భావించే మహాకాళి భక్తులు ఏటా బోనాలు సమర్పిస్తున్నారు. ‘నీ కృప వల్ల మేం సుభిక్షంగా ఉన్నాం. మమ్మల్ని ఇలాగే సర్వదా అనుగ్రహించు తల్లీ!’ అనే భావాన్ని వ్యక్తీకరించడమే బోనాలు, ఉపహారాల సమర్పణలోని ఆంతర్యం!

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆషాఢ జాతర- ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. ‘ఎదుర్కోలు’గా వ్యవహరించే ఈ ప్రక్రియలో, ఓ కలశంలోకి అమ్మవార్ని ఆవాహన చేసి, పురవీధుల్లో మేళతాళాలతో వూరేగిస్తారు. ఘటోత్సవం తరవాత బోనాలు(అన్న పదార్థాలు) సిద్ధం చేస్తారు. ప్రత్యేక పాత్రలో బోనాల్ని నింపి, పసుపు కలిపిన జలపాత్రనూ తలపై ధరించి మహిళలు ఆలయానికి తరలి వెళతారు. జగదంబకు ఆ పదార్థాల్ని నివేదించి, ‘సాక బెట్టుట’ అనే వేడుక ద్వారా, తమ లోగిళ్లను చల్లగా చూడాలని తల్లిని వేడుకుంటారు. శాఖ- అంటే ఓ వేప కొమ్మను పసుపు కలిపిన నీటిలో ఉంచి, మహాకాళికి అభిషేకించడమే- ‘సాక బెట్టుట’. ఫలహారపు బండ్లు, గావు పట్టు, సాగనంపు రంగం వంటి ఘట్టాలతో, పోతురాజుల నృత్య విన్యాసాలతో మహాకాళి జాతర మహా భక్తితరంగితమవుతుంది.*_

‘కాకతి’మాతను ఇలవేల్పుగా పూజించిన కాకతీయులు, అమ్మతల్లికి ఆషాఢ ఉత్సవాలు నిర్వహించేవారు. గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయాన్ని కాకతీయులు నిర్మించినట్లు చెబుతారు. బోనాల వేడుకలు ఏటా ఈ ఆలయం నుంచే ప్రారంభమవుతాయి.

ప్రకృతి శక్తి అనుగ్రహించిన అన్నం లేదా భోజనాన్ని తిరిగి భక్తిపూర్వకంగా ఆ అమ్మకు నివేదన చేయడమే ‘బోన సమర్పణం’. భోజనానికి రూపాంతరమే బోనం. భోజనం ద్వారా శక్తిని కలిగించే ఆ ‘దివ్య శక్తి’కి ధన్యవాదాలు తెలియజేసే జానపదుల ఆధ్యాత్మిక కార్యక్రమమే బోనాల సంబరం. దుర్గతి, దుఃఖం, దుస్సాధ్యం, దుష్టత్వం వంటి దుర్వికారాల్ని దూరంచేసే మాతృశక్తిని ఆషాఢ ఉత్సవ నేపథ్యంగా ఆరాధిస్తారు. ఈ జాతరలో జగదీశ్వరి అవతార తత్వం ప్రస్ఫుటమవుతుంది. ఘటోత్సవం- సృష్టి నిర్మాణానికి సంకేతం, వూరేగింపు- స్థితి కారకత్వానికి సూచిక. చివరలో సాగనంపు- లయానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
 డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్

ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!



హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు.

ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S

S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .

A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్ర‌తి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.
1) నేనేమి కావాల‌నుకుంటున్నా.??
2)దాని కోసం నేను ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌??
3) అనుకున్న‌ది సాధించ‌డం కోసం నేను వేటిని వ‌దిలివెయ్యాలి? వేటిని కొత్త‌గా ఆహ్వానించాలి? ఇలా ప్ర‌తి రోజూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకుంటూ….మ‌న‌లోని మార్పును మ‌న‌మే లెక్కించాల‌న్న మాట‌.!

V-Visualization ( ఆత్మ సాక్షాత్త్కారం)… మ‌నలోని భావాలకు మ‌న‌స్సులో దృశ్య‌రూపం ఇవ్వ‌డం. కాన్సియ‌స్ తో క‌ల‌లు క‌న‌డం అన్నమాట‌! ఉద‌యాన్నే మ‌న ల‌క్ష్యం అలా క‌ళ్ళ ముందు క‌న‌బ‌డితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌య‌త్నం చేస్తాం.

E-Exercise– ఇది ప్ర‌తి ఒక్క‌రికి తెల్సిన విష‌య‌మే… కండ‌రాలు, న‌రాలు ఉత్తేజిత‌మై…కొత్త శ‌క్తిని ప్రేరేపిస్తుంది.


R-Reading– రోజుకు 10 పేజీలు చ‌ద‌వడాన్ని అల‌వాటు చేసుకోవాలి..ఇది మ‌నలోని అంత‌ర్గ‌త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. ఫ‌లానా బుక్ చ‌ద‌వాల‌ని లేదు..మీకు తోచిన బుక్ ను చ‌దువుతూ పోండి.

S-Scribing( రాయ‌డం)- ఉద‌యం లేవ‌గానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియ‌ని పాజిటివ్ వేవ్స్ వ‌స్తాయ్.

సో….ఈ ప‌నుల‌న్నీ ఉద‌యం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మ‌ల్ని నిద్ర‌లేపండి.

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఇసుక నుంచి గాజును ఎలా తయారు చేస్తారు?

 ఇసుక నుంచి గాజును ఎలా తయారు చేస్తారు?

జవాబు: గాజు తయారీలో క్వార్ట్జ్‌ ఇసుక, సోడా తగుపాళ్లలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన మెత్తని, జిగురులాంటి పదార్థంగా మారుతుంది. అంటుకుపోయే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని సుమారు 1000 డిగ్రీల సెంటిగ్రేడు వరకు చల్లారుస్తారు. ఈ దశలో మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోయి, స్వచ్ఛమైన పారదర్శకత కలిగిన గాజు పదార్థం తయారవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని లోహపు ఆక్సైడులను కలపడం ద్వారా కావలసిన రంగులు వచ్చేలా కూడా చేయవచ్చు. చల్లార్చిన గాజు పదార్థాన్ని అచ్చుల యంత్రాల సాయంతో కావలసిన మందం కలిగిన గాజు పలకలు, దిమ్మలు, కడ్డీల రూపంలోకి మలుస్తారు. ఆ తర్వాత మెరుగు పెట్టడం, చెక్కడం అదనంగా చేస్తారు.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌



 ప్రశ్న : అత్యంత పెద్దపెద్ద ఓడలు సముద్రంలో వేగంగా మునగకుండా వెళ్లగలుగుతున్నాయి. అవి ఎందుకు మునగవు. అవి కూడా ఇనుముతో తయారయినవే కదా!

జవాబు : ఇనుముతో తయారుచేసినవే అయినా ఓడల మధ్యలో డొల్ల(hollow)  భాగం ఎక్కువ. గోళీయతత్వం (Spherecicity) ఉండడం వల్ల నికర సాంద్రత (Density) నీటి సాంద్రత కన్నా తక్కువ అవుతుంది. నీటి సాంద్రత కన్నా ఎక్కువ ఉన్న వస్తువులు మునుగుతాయనీ, తక్కువ ఉంటే తేలుతాయనీ ప్లవన సూత్రాలు (Laws of Floatation) పేరుతో మీరు పాఠశాల స్థాయిలోనే నేర్చుకొనిఉంటారు. ఉదాహరణకు ఒక లెక్క తీసుకుందాం. పళ్లెంలాగా పుటాకారం (concave)తో ఇనుప వస్తువు ఒకటి ఉందనుకొందాం. దాన్ని బోర్లించినపుడు నేల నుంచి దాని మూపురానికి ఉన్న గరిష్ట లంబ దూరం (height) h అనుకుందాం.
ఆ అంచు నుంచి ఈ అంచు వరకు ఉన్న దూరం a అనుకుందాం. దాని మందం t అనుకుందాం. అపుడు ఆ పళ్లెం(Spherical cap)  కున్న మధ్య ఘన పరిమాణం a అనుకుంటే దాని విలువV=ph/6 (3a2+h2)  అవుతుంది. అంటే అందులో నీళ్లు పోస్తే V విలువ గల నీళ్లు పడతాయన్న మాట. ఒకవేళ a, h,t లను సెం.మీ.లలో ప్రతిక్షేపించినట్లయితే V విలువ గల మిల్లీలీటర్ల నీరు లేదా V/1000 లీటర్ల నీరు ఆ పళ్లెంలో పడుతుంది. ఇది పళ్లెపు ఫలిత ఘన పరిమాణం. సాధారణంగా h, a విలువలతో పోల్చుకుంటే t విలువ చాలా తక్కువగా ఉంటుంది. ఓడలు పడవల విషయంలో a, h విలువలు మీటర్లలో ఉండగా, మందం సెం.మీ.లలోనే ఉంటుంది. అలాంటి పళ్లెపు గోళీయోపరితల వైశాల్యాన్ని A అనుకొంటే దాని విలువ A= p (a2+h2) గా ఉంటుంది. a, h \ విలువ వందలాది సెం.మీ. వుండగా, పడవ మందం 1 సెం.మీ. అనుకొంటే పడవ రేకు ఘన పరిమాణం సుమారుగా A మిల్లీలీటర్లు ( ఘన సెం.మీ. ఉంటుంది.) ఇప్పుడిక ఒక కచ్చితమైన లెక్క వేద్దాం. పళ్లెం లేదా పడవ a విలువ : 10 మీ., (లేదా 1000 సెం.మీ.) h విలువ 1 మీటరు (లేదా 100 సెం.మీ.). t విలువ 1 సెం.మీ. అనుకుందాం. పళ్లెం లేదా పడవలో పట్టే నీటి ఘనపరిమాణం పై సూత్రం ప్రకారం V= ~ 158000 లీటర్లు. ఇక పడవ లేదా పళ్లెపు వస్తు ఘన పరిమాణం A ఘన సెం.మీ. కాబట్టి పైన తెలిపిన రెండవ సూత్రం ప్రకారం A= ~ 3175 లీటర్లు. ఇలాంటి పడవ లేదా పళ్లెపు ద్రవ్యరాశి M అయినట్లయితే M= A.d (ఇక్కడ d = సాంద్రత)' d విలువ ఇనుముకు సుమారు 8 గ్రా. / ఘ. సెం.మీ. కాబట్టి మొత్తం పళ్లెం (లేదా ఇనుప ఓడ) ద్రవ్యరాశి MR ~ 25400000 గ్రా. నికర సాంద్రత RM/V R = 25400000/ 158000000 = 0.160 గ్రా / ఘ. సెం. ఇది నీటి సాంద్రత కన్నా సుమారు 6 రెట్లు తక్కువ కాబట్టి ఆ పళ్లెం లేదా పడవ నీటిలో తేలుతుంది. అంటే ఇందులో కొంత ద్రవ్యరాశి ఉన్న వస్తువుల్ని పెట్టినా మునగదన్నమాట.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
 

Tuesday, July 11, 2017

లీపు సంవత్సరం పిభ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది?

లీపు సంవత్సరం పిభ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది?


*మామూలుగా సంవత్సరానికి ఎన్నిరోజులూ? మరి నాలుగేళ్ళకి ఒక సారి లీపు సంవత్సరం వస్తుంది కదా.*.!  *అసలు లీపు సంవత్సరం అంటే ఏమిటి ఆ సంవత్సరంలో మిగతా అన్ని నెలలనూ వదిలేసి ఫిబ్రవరిలోనే ఒకరోజు ఎందుకు అదనంగా వస్తుంది*…? *ఈ అనుమానాలు మీకెపుడైనా వచ్చాయా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా మనలో చాలా మందికి అంతగా గుర్తుండి ఉండదు ఓసారి అసలు లీపు సంవత్సరం గొడవేంటో ఈ ఫిబ్రవరి 29 సంగతేంటో చూద్దాం రండీ…*!

*&భూమి సూర్యుడి చుట్టూ గిర..గిరాగిర..గిరా అంటూ తిరిగేస్తోందని మీకూ తెల్సుకదా. ఇలా సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చేసుకోవటానికి భూమికి సరిగ్గా  365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. అంటే 365 రోజుల మీద ఒక పావు పూట అన్న మాట. ఈ అయిదు గంటలని ఒక రోజుగా తీసుకోలేం, అలా అని క్యాలెండర్ లో అలానే వదిలేస్తే? కాలం గడిచే కొద్దీ కొన్ని సంవత్సరాలకి క్యాలెండర్ లో తేదీల లెక్కలు గందర గోళం గా తయారవుతాయి. అందుకే ఈ అదనపు 5 గంటల 48నిమిషాల 46సెకెన్ల కాలాన్ని ప్రతీ నాలుగు సంవత్సరాలకి ఒకసారి. నాలుగవ సంవత్సరానికి అదనపు రోజుగా కలుపుతున్నారు. ఈ అదనపు రోజు ఫిబ్రవరి లో వస్తుంది. అలా మొత్తం 366 రోజులుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అదన్న మాట సంగతి…*

అయితే సంవత్సరంలో 12 నెలలు ఉండగా కేవలం ఫిబ్రవరి నెలకే 29 రోజులెందుకు? అదేదో డిసెంబర్ నేలకే ఒకరోజు అదనంగా చేరిస్తే కొత్త సంవత్సరం వేడుకలని ఇంకాస్త ఎక్కువ సేపు చేసుకునేవాళ్లం కదా..! అయితే ఇక్కడా ఒక విషయం ఉంది… అప్పట్లో అంటే క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్ ల ప్రభావమే ఎక్కువగా ఉండేదన్న సంగతి తెలుసు కదా… రోం చక్రవర్తిగా జూలియస్ క్యేసర్ చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించేంత వరకూ రోమన్ క్యాలెండర్‌‌లో సంవత్సరానికి 355 రోజులు మాత్రమే ఉండేవి. ప్రతీ రెండు సంవత్సరాలకు 22 రోజలు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఈ గందర గోళం వద్దనుకున్న క్యాసర్ ఈ క్యాలెండర్ విధానంలో మార్పులు చేసి మొదటి శతాబ్దంలో మెరుగైన క్యాలెండర్‌ను ప్రజలకు అందించాలని నిర్ణయించారట.

ఆదేశించింది రాజు కదా అందుకే మేధావులందరూ కలిసి కిందా మీదా పడి 365 రోజుల క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్కువ వస్తుందనీ, అందువల్ల ఆ రోజును ఆగస్టు నెలలో కలపాలనీ అనుకున్నారు, మొత్తం మీద రోమన్ క్యాలెండర్‌లో ఫిబ్రవరి నెలకు 30 రోజులు, జూలై నెలకు 31 రోజులు, ఆగస్టు నెలకు 29 రోజులు ఉండేలా నిర్ణయించారు. అయితే ఆ ముచ్చటా ఎక్కువ రోజులు ఉండలేదు… జూలియస్ క్యాసర్ తర్వాత చక్రవర్తిగా అధికారం చేపట్టిన “క్యేసర్ ఆగస్టస్” ఈ క్యాలెండర్‌లో తనకు నచ్చినట్టు మరికొన్ని మార్పులు చేశాడు. తాను పుట్టిన నెల అయిన ఆగస్టుకు తక్కువ రోజులు ఉండటం ఆయనకు ఇష్టం లేకుండా పోయింది. దీంతో క్యాలెండర్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అంతకు ముందు చక్రవర్తి జూలియస్ క్యేసర్ పుట్టిన నెల అయిన ఫిబ్రవరికి రోజులు తక్కువ చేసి, తాను పుట్టిన ఆగస్టు నెలకు సంపూర్ణంగా 31 రోజులు ఉండేట్లు క్యాలెండర్‌లో మార్పులు చేయించారట.దాంతో పాపం ఫిబ్రవరి చిన్నదైపోయింది. అందుకే ప్రతీ లీపు సంవత్సరం లో వచ్చే అదనపు గంటల రోజుని ఫిబ్రవరికి ఇచ్చాడట క్యాసర్ ఆగస్టస్” అదండీ సంగతీ… చక్రవర్తుల పుట్టినరోజుల వల్ల ఆగస్టు అలా ఎదిగి పోయిందీ… ఫిబ్రవరి ఇలా చిన్నదై పోయి నాలుగేళ్ళకోసారి ఇలా లీప్ మంత్ గా సంతృప్తి పడుతోంది. పాపం ఇవన్నీ పక్కన పెడితే ఈ ఫిబ్రవరి 29న పుట్టిన వాళ్ళ సంగతే కాస్త కంగారు వ్యవహారం ఔతోంది పుట్టిన రోజు ఎప్పుడు చేసుకోవాలో అర్థం కాక బిక్కమొహం వేస్తూంటారు.




*ప్రశ్న:* ఒళ్ళు గగుర్పాటు చెందితే రోమాలు లేచి నిలబడతాయి ఎందుకు?

*జవాబు:* చలి, భయము, అందోళన వంటివి కలిగినప్పుడు మన శరీరము పై గల రోమాలు లేచి నిలబడతాయి. అప్పుడు శరీరము గగుర్భాటు చెందుతుంది. శరీరము పై ఉండే ప్రతి వెంట్రుక క్రింద చిన్న కండరము ఉంటుంది. అది సంకోచించినప్పుడు ఆ వెంట్రుక లేచి నిలబడుతుంది. మన శరీరము లోని స్వతంత్ర నాడీవ్యవస్థ ప్రభావము తో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దీనిని శాస్త్రీయముగా "Pilo erection" అంటాము. ఆ సమయము లో వెంటుకల మధ్య గాలి బంధింపబడుతుంది. గాలి గదులు తయారవుతాయి. ఆ గాలి ఉష్ణబందక పదార్ధము గా ఉంటుంది. అందువల్ల శరీరము లోని వేడి బటటికి పోదు. శరీరము వెచ్చగా ఉండి చలి నుండి తట్టుకోగల శక్తి వస్తుంది.

జంతువులలో ఈ పక్రియ తమ శత్రువుల్ని బెదిరించడానికి ఉపయోగపడుతుంది. పిల్లిలో ఇలా జరిగితే లావుగా తయారై చూడడానికి భయంకరం గా ఉంటుంది. దానిని చూసి శత్రువులు పారిపోతారు. మనకి ఆ అవసరము లేకపోయినా పరిణామరీత్యా (on the way of evolution) పాత గుర్తులు ఉందిపోయాయి. ఆ శరీర ధర్మమము అలాగే ఉండిపోయింది. అది తప్పించుకోవాలంటే వేడినిచ్చే బట్టలు వేసుకోండి. భయము తగ్గిందుకోండి. కామ్‌ గా ఉండండి.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

వివేకానందుని వర్దంతి

విశ్వమానవ విశ్వాసాలను జయించిన.. 'వివేకానందుని వర్దంతి నేడు..

బలమే జీవనం... బలహీనతయే మరణం"
లేండి..!, మేల్కొనండి...!! మీ గమ్యం చేరేదాక విశ్రమించవద్దు"
మానవసేవాయే మాధవసేవ"
.ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. 
భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు స్వామివివేకా నందుడు. మన దేశ సంస్కృతీ సాంప్రదాయా లను వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే మహా గ్రంధాలను చదివి, అమ్మ చెప్పిన మాటలోనే, అదే బాటలోనే ఒకరికి అపకారం తలపెట్టకుండా ఉపకారిగా వ్యవహరించిన ఆదర్శవంతుడు. వివేకానందుడు బోధనలు నాటికి, నేటికీ, రేపటికీ ఎప్పటికీ మనం గుర్తుకోవలసిన ఆచరించినవలసిన సూక్తులు.*
ఆయన 1863 జనవరి 12న జన్మించారు. మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు.
తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు. అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.తన గురువు రామకృష్ణుడు నేర్పిన 'జీవుడే దేవుడు' అనేది వివేకానందుని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు... విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు.*

ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.*

నరేంద్రుని జీవితంలోని కొన్ని సంఘటనలు..

ఒకరోజు ధ్యానములో మునిగివుండగా, పెద్ద నాగుపాము అతని ముందు ప్రాకసాగింది. అక్కడే వున్న తోటి బాలురు దానిని చూచి భయపడి నరేంద్రుని అక్కడ్నించి లెమ్మని కేకలు వేశారు. కాని అతనికి ఆకేకలు వినబడలేదు. తన ధ్యానంలో తను నిమగ్నమయి వున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆ పాము అక్కడ్నించి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి నరేంద్రుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. పాము వచ్చినా పారిపోలేదు ఏమిటని అతని తల్లిదండ్రులు ప్రశ్నించగా, తనకా సంగతే తెలియదనీ, ధ్యానంలో హాయిగా వున్నదని నరేంద్రుడు జవాబిచ్చాడు.*

తల్లి పెట్టిన పరీక్ష..

వివేకానందుడు ప్రపంచమత మహా సమావేశాలకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, ఇక కొన్ని రోజులలో అతను బయలుదేరుడానికి సమయం ఆసన్నమైన సమయంలో వివేకానందుడు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

పింగళి వెంకయ్య

భారతదేశ జాతీయ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గారి వర్దంతి నేడు.

 జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించు కోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య.
 పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య  చల్లపల్లి లోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని  సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో  వెళ్లాడు.

ఉద్యమాలలో పాత్ర..*
19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికా లో  జరుగుతున్న బోయర్ యుద్ధం లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహి త్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.

అభిమాన విషయం..*
ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండా
లనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతీ కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపాడు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసి, వెల్లడించారు.

త్రివర్ణ పతాక ఆవిష్కరణ..*
1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.  1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్న ముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 

1921లో అఖిలభారత కాంగ్రెస్ సమావేశాలు  బెజవాడలో జరిగాయి.గాంధీజీ వెంకయ్య ను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు.మహాత్ము డు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను  సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు  ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా  తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు.*

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందిం చాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని,  రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.*

1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాం గ  సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండా లోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ  సంస్కృతికి సంకేతం.

జాతీయ ఉద్యమంలో పాత్ర..*

పింగళి వెంకయ్య 1906 నుంచి 1922
వరకు  భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బెంగుళూరు మరియు మద్రాసు లలో రైల్వే గార్డుగా పనిచేశాడు. ఆ తరువాత కొంత కాలము బళ్లారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగము చేశాడు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి ఆయనను ఎంతో కాలము ఉద్యోగము చేయనివ్వలేదు. జ్ఞానసముపార్జనాశయముతో లాహోరు లోని ఆంగ్లో - వేదిక్ క‌ళాశాలలో చేరి ఉర్దూ  మరియు జపనీస్ భాషలను నేర్చుకున్నాడు. ఈయన ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యములో జపనీస్ మరియు చరిత్ర అభ్యసించాడు

'పత్తి' వెంకయ్య..*

1906 నుండి 1922 వరకు జాతీయో ద్యమాలతో పాటు మునగాల పరగణా  నడిగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెం లో నివాసముండి పత్తి మొక్కలలోని మేలు రకముల పరిశోధనలో వినియోగించాడు.  నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ పరిశోధనలలో కంబోడియా పత్తి అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశాడు. ఈయన కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వముకూడా గుర్తించడముతో ఈయనకు పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది. నడిగూడెంలోనే నేటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయములో పూజలు నిర్వహించి 1921 మార్చి31, ఏప్రిల్1వ తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించాడు.*

ఆఖరి సంవత్సరాలు..*

వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినం దుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం  గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం, జాతీయ పతాకాన్ని గురించి ప్రభుత్వం  ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య  పేరుని సూచించకపోవడం విచారకరం.

ప్రస్తుతానికి పింగళి వెంకయ్య గారి మనుమలు బిచ్చమెత్తు కొని జీవనం కొనసాగిస్తున్నారంటే వెంకయ్యగారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ప్రభుత్వాలకు అర్ధం కావడంలేదు..*

కన్నుమూసేముందు ఆయన చివరి కోరిక ను వెల్లడిస్తూ " నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు.
 (జ:ఆగష్టు 2, 1878 - మ:జూలై 4, 1963)
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

ప్రశ్న: కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

జవాబు: ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో రెండు తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి.


గురుత్వాక‌ర్ష‌ణ ఒకే బిందువు నుంచి ఎలా ప‌ని చేస్తుంది?*

*ప్రశ్న: వస్తువులు సౌష్టవాకారంలో వున్నా అసౌష్టవంగా వంకరటింకరగా వున్నా వాటి గురుత్వాకర్షణ ఒకే బిందువు (గరిమనాభి) నుంచి మాత్రమే పని చేయడమంటే ఎలా?*
*జవాబు :* 16వ శతాబ్దంలో గెలీలియో ప్రాయోగికంగా ఋజువు చేసేంతవరకూ పెద్ద వస్తువు (పెద్ద బరువు)ను, చిన్న వస్తువు (చిన్నబరువు)ను పైనుంచి ఒకేసారి వదిలితే పెద్ద వస్తువు ముందు కిందపడుతుందనీ, ఆ తరువాతే చిన్న వస్తువు పడుతుందని అందరూ నమ్మేవారు. నిజానికి వస్తువు రూపురేఖలు, సౌష్టవాసౌష్టవాలతో సంబంధం లేకుండా ఏ గ్రహం మీద కైనా వస్తువుల్ని పైనుంచి ఒకేసారి వదిలితే అన్నీ ఏకకాలంలోనే నేలమీద పడతాయి. ఇందుకు కారణం వస్తువుల ద్రవ్యరాశి (mass) తో పోల్చుకుంటే గ్రహాల ద్రవ్యరాశి చాలా కోట్ల రెట్లు ఎక్కువగా వుండటమే! తద్వారా వస్తువులు పడేపుడు వాటి వేగంలో కలిగే మార్పు (త్వరణం లేదా acceleration) ఒకే విధంగా వుంటుంది. అంటే ఓ వస్తువును భూమి మీద కొంత ఎత్తునుంచి వదిలితే మొదట దాని వేగం శూన్యమే అయినా ఒక సెకను తర్వాత అది తన వేగాన్ని సెకనుకు సుమారు 10 మీటర్ల మేరకు పెంచుకొంటుంది. అది అలా పెరుగుతూ రెండు సెకన్లు గడిపేటప్పటికి తన వేగాన్ని సెకనుకు సుమారుగా 20 మీటర్లకు పెంచుకొంటుంది. మూడు సెకన్ల తర్వాత (వదిలాక) దాని వేగం సెకనుకు సుమారు 30 మీటర్లు అవుతుంది. అంటే ప్రతి సెకనుకు సుమారు 10 మీటర్ల మేర వేగం పెరుగుతుందన్నమాట. ఈ 10 మీటర్లు/ సెకను2 ను భూమికున్న గురుత్వత్వరణం (acceleration due to gravity) అంటాము. దీనిని స్త్ర అనే అక్షరంతో చూపుతారు. వస్తువు ఏ రూపంలో వున్నా, ఏ ఆకారంలో వున్నా ఆ వస్తువులోని ప్రతి కణం, ప్రతి అణువు, ప్రతి పరమాణువు మీద భూమ్యాకర్షణత్వరణం ఇదే విలువతో ఒకే విధంగా వుంటుంది. కాబట్టి అన్ని బిందువులు ఒకే వేగంతో భూమి వైపు వెళతాయి (పడతాయి).
ఇలాకాకుండా ఒక బిందువు మీద ఎక్కువ త్వరణం, మరో బిందువు మీద తక్కువ త్వరణం వుండినట్లయితే ఆ వస్తువు తిరుగుతూ (ఎక్కువ వేగంతో పడుతున్న బిందువు వైపునకు) పడాలి. అదే నిజమయితే ఆ వస్తువును వేలాడదీసినపుడు అది పడకపోవడం వల్ల వేర్వేరు ప్రాంతాలలోని ద్రవ్యరాశి (m) వేర్వేరుగా వుండడం వల్ల ఆయా ప్రాంతాల ద్రవ్యరాశి మీద పనిచేసే బలం న్యూటన్‌ రెండవ సూత్రం ప్రకారం ఎస్త్ర అవుతుంది. అంటే వస్తువు తిరుగుతుంది. దీనినే బలభ్రమకం (moment of force)  అంటారు. వేలాడదీసిన దారాన్ని వస్తువులోని ఏ బిందువు దగ్గర తగిలించి వేలాడదీస్తే వస్తువు బలభ్రమకానికి లోనవదో (తిరగదో) ఆ బిందువునే ఆ వస్తువుకున్న గరిమనాభి (centre of gravity) అంటారు. ఆ బిందువు దగ్గర ఉన్న బలాలు సమతులనం (balance) చేసుకొని తటస్థ బలభ్రమకాన్ని శూన్యం చేస్తాయి. ఆకారంతో నిమిత్తం లేదు. ఇలాంటి తటస్థ బలభ్రమకాలకు ఓ బిందువు ప్రతి వస్తువుకు వుంటుంది. ఆ బిందువును ఆ వస్తువుకున్న గురుత్వ తత్వానికి మౌలిక ప్రతినిధిగా గరిమనాభి అంటారు.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య
       సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.








ప్రశ్న: *ఇసుకపై నడక అంత సులభంగా సాగదు. ఎందువల్ల?

జవాబు:* నిల్చున్న వ్యక్తి ముందుకు కదలాలంటే అతని ఒక కాలును వంచి గట్టిగా నేలను కొంత బలంతో తన్నాలి. అలా కాలితో నేలపై బలాన్ని ప్రయోగించడాన్ని చర్య అంటారు. న్యూటన్‌ మూడో గమన సూత్రం ప్రకారం *చర్యకు సమానమైన ప్రతి చర్య* ఉంటుంది. ఆ సూత్ర ప్రకారం వ్యక్తి తన కాలితో నేలపై ఎంత బలం ప్రయోగిస్తాడో, అంతే బలాన్ని నేల అతని కాలిపై ప్రయోగిస్తుంది. ఈ ప్రతి చర్య వల్ల ఆ వ్యక్తి ముందుకు కదులుతాడు.

ఇసుక నేలలో ఇసుక పొరలుపొరలుగా ఉంటుంది. దీనిపై నడుస్తున్న వ్యక్తి తన పాదంతో కలిగించే బలం ముందుగా ఇసుకలో పైనున్న పొరపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పొర ఆ బలాన్ని తన కింద పొరపై చూపిస్తుంది. ఆ విధంగా వ్యక్తి ప్రయోగించే బలం ఇసుకలో ఉన్న అట్టడుగున ఉన్న పొరకు చేరడానికి కొంత సమయం పడుతుంది. ఆ బలంతో కొంత బలాన్ని ఇసుక పొరలు శోషించుకుంటాయి. అందువల్ల ఇసుకపై వ్యక్తి పాదం కలిగించే బలం కన్నా ప్రతి చర్యగా ఇసుక పొరలు అతడి పాదంపై కలిగించే బలం తక్కువగా ఉంటుంది. పైగా ఆలస్యం కూడా జరుగుతుంది. అదే గట్టిగా ఉండే నేలపై కాలితో చర్య కలిగించిన తక్షణమే దానికి సమానమైన ప్రతిచర్య కాలిపై కలుగుతుంది. ఆ విధంగా ఇసుకపై నడక అంత సులభంగా సాగదు.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు

మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు "అల్లూరి సీతారామ రాజు" జయంతి
బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 7, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి.* ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

*బాల్యం, చదువు

సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం.వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.

రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.

ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.

1909లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లోతూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారంలో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.

రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తునిలో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.

రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

*బ్రిటీషు అధికారుల దురాగతాలు*

ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.

ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.

*మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం*

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.

అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.

*💪🏼విప్లవం మొదటిదశ*✊

ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.

గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది.

*విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:*

*చింతపల్లి*

1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.

*కృష్ణదేవు పేట*

ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవు పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి.

*రాజవొమ్మంగి*

ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.

వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.

*అడ్డతీగల*

రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమయింది.

*రంపచోడవరం*

అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ఠ ఇనుమడించింది. ఇతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు.

ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు.

*💪🏼విప్లవం రెండవదశ*✊

డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు.

ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.

1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)

క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.

జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.

2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.

సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.

*🌹మరణం*🌹

17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక "అగ్గిరాజు" అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యా



Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

హిమనీ నదులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?

ప్రశ్న: హిమనీ నదులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?

జవాబు: ఎత్తుగా ఉన్న పర్వతాల దగ్గర వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రత బాగా పడిపోవడం వల్ల గాల్లో ఉన్న తేమ మంచు బిందువులు కింద పడతాయి. అవన్నీ పేరుకుపోయి కొండల మధ్య ఉన్న లోయల్ని బావుల్లో నీళ్లు నింపినట్టుగా మంచు బిందువులతో నింపుతాయి. అక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడుకన్నా తక్కువ ఉండడం వల్ల, పీడనం కూడా తక్కువగా ఉండి మంచు బిందువులు ఘనీభవిస్తాయి. ఇలా నెలల తరబడి కొండల మధ్య పేరుకుపోయిన మంచు బిందువులు ఒక దిమ్మలాగా బల్లపరుపుగా కొండల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలను ఆక్రమిస్తాయి. ఇటువంటి మంచు దిమ్మలు విశాలమైన గాజు పలకలాగా కనిపిస్తాయి. దీనిపైన ఆసక్తి ఉన్నవాళ్లు ఐస్‌ స్కేటింగ్‌ వంటి శీతాకాలపు క్రీడలను ఆడుతుంటారు. ఇలాంటి మంచుతో కూడుకున్న విశాలమైన ఘనీభవించిన మంచు మైదాన ప్రాంతాలనే గ్లేషియర్‌హిమనీ నది అంటారు. వేసవి రాగానే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ మంచు కరిగి స్వచ్ఛమైన నీరులాగా పర్వతాల కిందివైపునకు ప్రవహిస్తుంది. ఇలా అనేక పాయలు కలిసి నదులుగా ఏర్పడతాయి. అలా హిమాలయ పర్వతాల నుంచి గంగా, యమునతో పాటు ఎన్నో నదులు ఏర్పడ్డాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,--శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

పేనుకొరుకుడు

బొప్పాయి పువ్వుని నలిపి పేనుకొరుకుడు (తాత్కాలికంగా తలమీద వచ్చే బట్టతల మచ్చ) వచ్చినచోట రుద్దితే వెంట్రుకలు పెరుగుతాయి. ఈ చర్మవ్యాధికి ఎలర్జీ ముఖ్యకారణం. ఈ వ్యాధిలో స్థిరాయిడ్స్ కు సంబంధించిన చుక్కల మందుతో రుద్దితే వెంట్రకలు వస్తాయి. కానీ, కొందరికి రాకపోవచ్చు, కొందరిలో వెంట్రకకలు కుప్పలు కుప్పలుగా రాలిపోయి పెద్దపెద్ద బట్టతల మచ్చలు ఏర్పడుతూ వుంటాయి. అలాంటప్పుడు బొప్పాయి పూలను వాడితే ఫలితం కన్పించవచ్చు..

ప్రయత్నించిచూడండి. రోజూ రెండు మూడు సార్లు కొన్నాళ్ళపాటు వాడితే మంచిది.


2. *బొప్పాయి చెట్టుకి గీత పెట్టి పాలను సెకరించి దానికి సమానంగా నీరు కలిపి పలచగా గజ్జి, తామర మచ్చల పైన రాస్తే చర్మవ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను నశిస్తాయి.*

3. *బొప్పాయి పాలని చిన్న అగ్గిపుల్లతో పురిపిడికాయపైన ఆరగా పెడితే పురిపిడి కాయలు రాలిపోతాయి.*

4. *బొప్పాయికాయనుగానీ, ఆకునుగానీ, ఆకునుగానీ దంచి, మెత్తగా పేస్ట్ లా చేసి ఆరికాళ్ళ ఆనే మీద కడితే ఆనెలు మెత్తపడతాయి.*

5. *బొప్పాయి కాయని దంచి రసం తీసి ఆ రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటమల తీవ్రత తగ్గుతుంది.*

6. *ముఖంమీద నల్లచుక్కలు కూడా ఈ ప్రయోగంతో తగ్గుతాయి.*
7. *శోభి మచ్చలమీద కూడా బొప్పాయికాయ రసం బాగా పనిచేస్తుంది.*
8. *బొప్పాయి గింజల్ని`కూడ పేస్టులా చేసి పైన చెప్పిన వ్యాధులన్నింటిలోనూ వాడవచ్చు.*,
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?

ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?


పాలు జంతువులనుండి , కొన్ని చెట్లనుండి లభిస్తాయి. జంతువు ఏదైనా పాలు వాటి శిశువులకు పోషణ ఇచ్చేందుకే ప్రకృతి సిద్ధంగా క్షీరదాలలో ఉన్న ప్రక్రియ. క్షీరదం ఏదైనా దాని ప్రతి కదలికకు, జీవన చర్యలకు కావాల్సింది గ్లూకోజు మాత్రమే! మనలాగే వాటికీ పెరుగుతున్న దశలో కాల్షియం వంటి లవణాలతో పాటు చక్కెరలు, పోషక విలువలున్న ఆహారం అవసరం. అది పాల ద్వారా శిశు దశలో లభిస్తుంది. కాబట్టి ఏ జంతువు పాలూ మనకు విషతుల్యం కాదు. పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలయినా, ఆవు పాలయినా, గాడిద పాలు, మేక పాలు అయినా పాలను మరగబెట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది. జిల్లేడు పాలు, మర్రిచెట్టు పాలు, రబ్బరు పాలు, రావి చెట్టు పాలు, గన్నేరు చెట్టు పాలు పోషక విలువలున్న పాలు కావు. ఆ పాలు ఆయా చెట్లకు రక్షణనిచ్చే విష ద్రవాలు. తెల్లనివన్నీ పాలు కావన్న సామెత ఇక్కడే అమలవుతుంది. చెట్ల పాలు తాగకూడదు కానీ జంతువుల పాలు వేడి చేసుకుని తాగితే ఏదీ హానికరం కాదు.

Worth reading ...

 గంగా  దాస్   !  నిన్ను  ప్రిన్సిపాల్  మేడం  పిలుస్తున్నారు !
ఆయా  వచ్చి  చెప్పిన  మాటలకు  ఎండలో  మొక్కలకు  గొప్పు  తవ్వుతున్న గంగాదాస్   అదిరిపడ్డాడు .
“దేనికి ?” అడిగాడు  అయాను .
ఏమో !  నాకేమి  తెలుసు ? అంటూ  వెళ్లిపోయింది   ఆమె .
చేతులకు  ఉన్న  మట్టిని   గబగబా   బకెట్  లోని  నీళ్ళల్లో  ముంచి  కడిగేసుకున్నాడు .  తలపాగా  విప్పి  చెమటలు  కారుతున్న  ముఖాన్ని  తుడుచుకున్నాడు .
వడి వడిగా అడుగులు  వేస్తూ   కారిడార్  చివరన  ఉన్న   ప్రిన్సిపాల్  రూమ్  వేపు  వెడుతున్నాడు .  అతని  మనసులో   ఆందోళన .  “ ఏమి  జరిగింది ?  మొక్కల  గురించా ? ఎక్కడైనా  పొరపాటు  చేశానా ? లేక  తన  పిల్ల  ఏమైనా  తప్పు  చేసిందా ?  ఎవరినయినా   కొట్టిందా ?  అలా  చెయ్యదే !  ఏమి  జరిగింది ?  ఇన్ని   రోజులుగా  ఒక్కసారీ  ఎప్పుడూ  తనను  పిలవని   ప్రిన్సిపాల్   మేడం  ఎందుకు  పిలిచారు ?”   అడుగులు  తడబడుతున్నాయి .  గుమ్మం   దగ్గరకి  వెళ్ళాడు .
చిన్నగా  స్ప్రింగ్  డోర్   మీద  శబ్దం  చేశాడు .
“అమ్మగారండీ !”  లో  గొంతుకతో   పిలిచాడు .
“ లోపలికి   రా !”   ప్రిన్సిపాల్  గొంతు  అధికారికంగా  వినిపించింది . అతనిలో   ఆందోళన  పెరిగిపోయింది .
కళ్ళజోడు పెట్టుకుని ,  తెల్లని  కాటన్ సారీ  కట్టుకుని ,  తెల్లని  జుట్టుతో ఉన్న  ప్రిన్సిపాల్ ని  చూడగానే   వంగి  వంగి  నమస్కరించాడు .
ఆమె   టేబుల్  మీద  ఉన్న  ఒక  కాగితం  తీసి  అతనికి  ఇస్తూ
 “ చదువు”  అంది
వణికిపోయాడు  గంగాదాస్
“ మేడం  నేను చదువుకోలేదు .  నాకు  ఇంగ్లీష్  రాదు .  తెలుగు  కూడా రాదు . ఏదైనా పొరపాటు  చేస్తే  మన్నిచండమ్మా !  తప్పు  చేస్తే  ఇంకొక్క  అవకాశం  ఇవ్వండమ్మా ! దయగలమీరే   పొమ్మంటే   ఎక్కడకి  పోవాలమ్మా ?”  దీనంగా అన్నాడు   గంగాదాస్
అతడి  కళ్ళల్లో  నీళ్ళు  ఆగడం  లేదు . 
“  మీ దయవలన   నేను  నా  కూతురిని  ఇక్కడ  చదివించుకుంటున్నాను.  మీరు  పొమ్మంటే  దానికి 
ఇలాంటి  స్కూల్  లో  నా  జన్మలో  చేర్చలేను   తల్లీ ! పొమ్మని  అనకండమ్మా ”  వణికిపోతున్నాడు
“ అరెరే !  ఏదేదో  ఊహించేసుకోకు !  మేము  నీ  పిల్లకి సీటు  ఇచ్చింది  ఆమె  తెలివ్బి  తేటలు  చూసి ,  నువ్వు  మా  సిన్సియర్ వర్కర్  వి  కాబట్టి.  ఈ  కాగితం  నీకు  చదివి  పెట్టడానికి   టీచర్  గారిని  పిలుస్తా  ఉండు !  ఇది  నీ  కూతురు  రాసినదే !  నీకు  అది  చదివి  వినిపించాలి  అనిపించి   నిన్ను  పిలిపించాను .  ఇది  నువ్వు  వినాలి .” 
ప్రిన్సిపాల్ గారి  పిలుపు  విని  సరోజ  టీచర్  అక్కడకి  వచ్చింది .  ఆమె ఆ  పేపర్  తీసుకుని  చదవడం  మొదలు  పెట్టింది
“  ఈ రోజు  మా క్లాసులో  మాత్రు  దినోత్సవం   గురించి  వ్యాసం  రాయమన్నారు .
“ నేను   ఒక  పల్లెటూరిలో పుట్టాను .  అక్కడ  ఇప్పటికీ  విద్య  వైద్యం అనేవి  రెండూ గగన  కుసుమాలే ! పిల్లలను  కనడం  అంటే   ఆడవాళ్ళకు  మళ్ళీ  పుట్టడమే  మా  పల్లెటూళ్ళల్లో .  పిల్లలను  కనలేక పురిటిలోనే  చనిపోయే తల్లులు  ఎక్కువ  మా  ఊరిలో .
 అలాగే  మా  అమ్మకూడా  నన్ను  కంటూ  తను  కన్ను  మూసింది .  నన్ను  తన  చేతుల్లోకి  తీసుకోకుండానే ,  తన దగ్గర  పాలు  తాగకుండానే   పురిటిలోనే  చనిపోయింది .
నన్ను  తన  చేతులలోకి  తీసుకున్నది  అప్పటికీ  ఇప్పటికీ  మా నాన్న  ఒక్కడే !
తల్లిని  చంపి   పుట్టాను  అన్నారు .  "శనిగొట్టుదానిని"  అన్నారు .  ఎవ్వరూ  నన్ను  కనీసం  ఎత్తుకునేవారు కారు .
నాన్నను  మళ్ళీ  పెళ్లి  చేసుకోమని  అమ్మమ్మ,  నాన్నమ్మా ,  తాతలూ  అందరూ  బలవంతం  చేశారు   ,  కొడుకును  కనమని .
ఎందరు  ఎన్ని  రకాలుగా  చెప్పినా  నాన్న  వినలేదు . 
ఆ ఊళ్ళో   ఉంటె   వాళ్ళు  అందరూ  అలాగే  బలవంతం  చేస్తారు  అని ,  ఉన్న  ఇంటినీ ,  పొలాలనూ  అన్నిటినీ  వదిలి  నన్ను  ...  రోజుల  పిల్లను  ఎత్తుకుని నాకోసం  నాకు   అన్నీ  తానే  కావాలని  ,  నా  జీవిత ఔన్నత్యం కోసం   తనకు  అక్కడ  ఉన్న  అన్ని  సౌకర్యాలనూ వదిలి  వట్టి  చేతులతో  ,  నా మీద  ప్రేమతో  ,  నన్ను  పెంచాలి   అనే  కసితో  ఈ  పట్టణం  వచ్చేశాడు .
చిన్నప్పుడు   నాకోసం ఎన్నెన్ని  కష్టాలు  పడి  ఉంటాడో !
ఇప్పుడు  తలచుకుంటూ  ఉంటె  అనిపిస్తుంది .
ఒక్కటే   రొట్టె  ఉంటె  తనకు  రొట్టెలు  ఇష్టం  ఉండవు  అనేవాడు .   నాకు  ఇప్పుడు  తెలుస్తోంది
 నా  ఆకలి  తీరితే  తన  ఆకలి  తీరిపోయినట్లు   నాన్న  అనుకునేవాడు  అని . 
 తాను  పస్తులు  ఉంటూ  నాకు  తినిపించాడు  అని  ఇప్పుడు  తెలుస్తోంది .
తన శక్తికి  మించి  నాకు  ఎన్నో  సదుపాయాలూ   నాన్న  నాకు  కల్పించాడు .
నన్ను ఈ స్కూల్  లో  చదివించడం కోసం  నాన్న  ఇక్కడ  తోటమాలిగా   చేరాడు .
ప్రేమ  ఆప్యాయత  అనేవి  అమ్మకు  మారుపేర్లు  అయితే అవి  నేను  పొందుతున్నది   నాన్న  నుండి .
సానుభూతి  అనేది  అమ్మకు  నిర్వచనం  అయితే   మా  నాన్నే  నాకు   అమ్మ
అమ్మకు  ప్రతిరూపం  త్యాగం  అయితే   మా నాన్న  త్యాగం  ముందు  అది  చాలా  తక్కువ
ప్రేమ  ఆప్యాయత  ,  త్యాగం  ,  సానుభూతి   .......  ఇలాంటి  పదాలకు  నిర్వచనం  “అమ్మ” అయితే   మా  నాన్న  అంతకన్నా   ఎక్కువ  నాకు .
మా  నాన్న  ప్రపంచం  లోని అందరి అమ్మల కన్నా గొప్ప  అమ్మ 
ఈ  మాతృదినోత్సవం  సందర్భంగా  నేను  నా తండ్రికి ఈ  ప్రపంచం  లోని  తల్లితండ్రులు  అందరికన్నా   గొప్పవాడి గా  సెల్యూట్  చేస్తున్నా !
 ఇంకా  ఈ స్కూల్  లో  ఉన్న  తోటమాలి   నా   తండ్రి  అని  గర్వంగా  చెప్పుకుంటాను .
ఈ  వ్యాస  రచనలో   నేను  ఫెయిల్  కావచ్చు .  నా టీచర్  కి  ఇది  నచ్చకపోవచ్చు .
 కానీ  నిస్వార్ధ  ప్రేమకు  ప్రతిరూపం  అయిన  నా  తండ్రికి  ఇది  నేను  అర్పించే   కృతజ్ఞత .
చదువుతున్న  సరోజ  టీచర్  గొంతు   లో కన్నీటి  జీర !
వింటున్న  ప్రిన్సిపాల్   చీర  చెంగుతో   కళ్ళను  అద్ధుకుంటోంది
గంగాదాస్  వెక్కి  వెక్కి  ఏడుస్తూ   ఏడుపు  దిగమింగు  కుంటున్నాడు .
ఆ   ఎ  . సి .  గది   నిశ్శబ్దంగా  అతడి  వెక్కిళ్ళ చప్పుడు   వింటోంది .
 ఆ  పేపర్లను  సరోజ  టీచర్  చేతులలోనుండి  తీసుకున్నాడు .  గుండెలకు  హత్తుకున్నాడు .  నిలబడలేక  పోతున్నాడు .
ప్రిన్సిపాల్  మేడం  అతడికి  దగ్గరగా  వచ్చింది . కుర్చీ  దగ్గరకి  తీసుకు  వెళ్ళింది .  కూర్చో బెట్టింది   తన టేబుల్  మీద   ఉన్న  గ్లాసులో  నీళ్ళను  అతడి  చేతికి  ఇచ్చింది .  ఆమె  గొంతులో  ఏదో  తెలియని  ఆర్ద్రత  .
“ గంగా దాస్ !
మీ  అమ్మాయి  రాసిన  ఈ వ్యాసానికి  మేము  10/10  మార్కులు  ఇచ్చాము . మాతృదినోత్సవం   సందర్భంగా  ఇంతకంటే   గొప్ప  వ్యాసం  ఎవరూ  రాయలేరు .  ఎందుకంటే   ఇది  ఒక  కూతురు  తన  తల్లి  పట్ల  చూపే  అభిమానానికి  వెయ్యి  రెట్లు అభిమానాన్ని  వ్యక్తపరుస్తున్న   వ్యాసం .   మేము  రేపు   మన స్కూల్  లో   మాతృదినోత్సవం  జరపబోతున్నాము  .  దానికి  ముఖ్య  అతిధి  నువ్వే !.
నిన్ను  మించిన  తల్లి   ఇంతవరకూ  మా స్కూల్   చరిత్రలో  మాకు  తెలీదు . అందుకే  నీకు సత్కారం  చెయ్యాలని  నిర్ణయించుకున్నాము . నీ అంగీకారం కోసమే  నిన్ను  పిలిపించాను .”  అంది
“ మేము  ఈ   సత్కారం  చెయ్యడానికి   ముఖ్య  కారణం    పిల్లలను  తల్లులే  కాదు  తండ్రులు  కూడా  అమితంగా  ప్రేమిస్తారు   అనే  విషయం  అందరికీ  తెలియాలని . 
.  నీవు  చేసిన  త్యాగానికి  ,  నీవు  నీ కుమార్తె  పట్ల  చూపిన  ప్రేమకు   గుర్తింపు  గా  ఈ సత్కారం  చెయ్యాలి  అనుకుంటున్నాము .  ఇది  ఎందరికో  స్పూర్తిదాయకం  కావాలి .
నిన్ను  గౌరవించడం  ద్వారా  మీ  అమ్మాయి  తన  తండ్రి  ప్రపంచం  లో  గొప్ప  తల్లి  అన్న  మాటలను  నిజం  చెయ్యాలి  అనుకుంటున్నాము .
 మా  స్కూల్  లో ఒక  గొప్ప   తండ్రి  ఉన్నాడు  అని  పిల్లల  తల్లి  తండ్రులకు  చెప్పాలి  అనుకుంటున్నాము .
నువ్వు   మా  బడి  తోటలో   పూల చెట్లను  కాపాడే  తోటమాలివి  మాత్రమె  కాదు .
నీ  జీవితపు  తోటలో  పూసిన  పూబాలను   కాపాడుతున్న   ఒక  చక్కటి తోట  మాలివి .
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Tuesday, July 4, 2017

జై టెలుగు టళ్ళీ...!

జై టెలుగు టళ్ళీ...!


తెలుగెక్కడుందిరా తెలుగోడా...!
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు
నాన్ననే డాడీకి డమ్మీని చేసావు
నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు
తన భాష చదవడం రాయడం రాదు
తెలుగునే వెలి వేసె మన బడులు కూడా
తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

లేత మనసుల్లోన నీతులే ముద్రించు
శతకాలు అటకెక్కి చెద పట్టినాయి
బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు
మన తెలుగు సామెతలు మంట గలిసాయి
రామాయణం లేదు...భారతం లేదు
భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు
కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి?
కదలరే టీవీల చుట్టూత చేరి...!

మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం
డాడీకి లైఫులో విజయమే లక్ష్యం

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు
దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా?
వెండి తెర హీరోలు వీరులంటున్నావు
నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా?
గుడి గుడీ గుంచాలు...కోతి కొమ్మచ్చి 
ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి
పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి
పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి

పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ
ఉనికినే మరచింది  అది అసలు బాధ

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

కూడు పెట్టని భాష 'భాష ' కాదన్నావు
డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు
తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు
కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు
గ్లోబునే గెలిచాము చూడమన్నావు
తల్లి వేరును మటుకు తెగ నరికినావు
తెలుగు మొనగాణ్ణి అని తొడ చరిచినావు
తల్లి పేరడిగితే తెల్లబోయావు

నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా?
సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా!

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!




ఓ మంచిమాట

*👉చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే..


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.