ఏడుపు (కన్నీరు)వచ్చేదాకా నవ్వుతారెందుకు?
ఏడుపు (కన్నీరు ) వచ్చేదాకా నవ్వుతారు ఎందుకు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ . నవ్వినా , ఏడ్చినా కన్నీరు వస్తుంది . నవ్వు ... ఏడ్పూ రెండూ కూడా సైకలాజికల్ చర్యలే . ఎమోషన్ కు లోనైనప్పుడే రెండూ అనుభవిస్తాము . ఆ సమయములో కార్టిసాల్ , ఎడ్రినాలిన్ బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి . సుఖ దు:ఖాలలో అత్యున్నత స్థాయికి చేరితే కన్నీళ్ళు పర్వంతం అవుతుంది . ఈ రెండు అవస్థలలోనూ స్ట్రెస్ తగ్గుతుంది . మనసు ప్రశాంతము తయారవుతుంది . భారము తగ్గుతుంది . అందువల్ల ఈ విషయము మనిషి ఆరో్గ్యానికి మరింత అనుకూలమైనదిగా బావించవచ్చు .
కన్నీరు మూడు రకాలు అంటున్నారు - కనీసం ఏడుపు మూడు రకాలు! కన్నీరు కంటిలో వెలుపలి, పై మూలలో తయారవుతుంది. అది బయటికి రావడం మాత్రం లోపలి కింద మూలనుంచి జరుగుతుంది. అంటే కన్నీరు మొత్తం కంటిలో పరుచుకుంటుందని అర్థం. మిల్లి మీటరులో మూడవ వంతు మందం ఉండే ‘పంక్టా’ అనే గొట్టాలు నీటిని ముక్కులోకి, నోట్లో గొంతు మొదట్లోకి కూడా పంపుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత నోట్లో కూడా రుచి మారిన భావం కలుగుతుంది. కనుబొమ్మలు కదిలినందుకు నీరు కన్ను అంతటా పరచుకుంటుంది. కన్ను ఆర్పడానికి 0.2 నుంచి 0.3 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి రెండు నుంచి పది సెకండ్ల కొకసారి, మనం, కళ్ళు ఆర్పుతాము. కొంతమంది ఎక్కువగానూ, ఎక్కువ సేపూ కళ్ళార్పుతుంటారు. అలాంటి వారు, జీవిత కాలంలో ఏడు సంవత్సరాలు అదనంగా (నిద్ర కాక) కళ్ళు మూసుకుని బతుకుతారని లెక్క తేలింది.
కన్నీటిలో మూడు రకాల ద్రవాలుంటాయి. అవి మూడు వేరువేరు గ్రంధులలో తయారవుతాయి. మొదటిది తెల్లగుడ్డలో పుట్టే జిగురు ద్రవం. అది కనుగుడ్డు మీద సమంగా అంతటా పరుచుకునే ద్రవం. రెండవ పొర నీళ్లుగా ఉంటుంది. ఇది లాక్రిమల్ గ్రంధులలో తయారవుతుంది ఇందులో రకరకాల ప్రొటీన్లు, ఆంటి బయోటిక్స్, ఖనిజ లవణాలు ఉంటాయంటే ఆశ్చర్యం కదూ! ఈ కంటినీరు, కనుగుడ్లను సూక్ష్మ జీవుల నుండి కాపాడి వేడిని నియంత్రించి, ఉప్పుదనాన్ని అందించి, రకరకాలుగా సాయపడుతుంది. ఇక కనుబొమ్మల చివరన ఉండే మైలోమియన్ గ్రంధుల నుంచి కొవ్వుతో వచ్చేది మూడవ పొర. ఈ పొర లేకుంటే కన్నీరు వెంటనే కారిపోతుంది. ఆరిపోతుంది కూడా! కన్నీళ్ళకు మూడు రకాల ద్రవాలున్నట్లే ఏడుపు కూడా మూడు రకాలు, దుమ్ముపడితే వచ్చేవి ఒక రకం. కాంతి, పొగలాంటి వాటి కారణంగా ఏడుపు మరో రకం, భావోద్వేగంతో నవ్వినా, ఏడ్చినా వచ్చేవి మూడవరకం! ఇదీ కన్నీటి గాధ!
ప్రశ్న:* *అరచేతిలో ఐసుగడ్డ తొందరగా కరగదు. అదే నీటిలో వేస్తే తొందరగా కరుగుతుంది. ఎందుకు?*
*జవాబు:* ఐసుగడ్డ ద్రవీభవించాలంటే దానికి తగిన ఉష్ణం చేరాలి. దాన్ని అరచేతిలో ఉంచుకున్నప్పుడు చాలా భాగానికి గాలితో స్పర్శ ఉంటుంది. కానీ గాలిలో ఉష్ణ ప్రవాహత (thermal conductivity) తక్కువ. కొంత మేరకు అరచేతితో స్పర్శ ఉన్నా అది లెక్కలోకి రాదు. అదే ఐసుగడ్డను నీటిలో వేసినప్పుడు అది కొంత మేరకు తేలినా, అధిక భాగం నీటికి తాకి ఉంటుంది. గాలి కన్నా నీటి ఉష్ణవాహకత్వం ఎక్కువ. కాబట్టి సరిపడినంత ఉష్ణం తొందరగా ఐసుగడ్డను చేరడం వల్ల అది తొందరగా కరిగిపోతుంది.
ప్రశ్న: చలనాన్ని వ్యతిరేకించే బలమే ఘర్షణ బలం. అంటే వస్తువును నిశ్చల స్థితిలో బల్ల మీద ఉంచితే దానిపై ఘర్షణ బలం పనిచేయదా ?*
*సమాధానం* :
సాధారణంగ చలనాన్ని వ్యతిరేకించే బలమును ఘర్షణ బలం అని నిర్వచించుకుంటాము. అయితే స్పర్శలో ఉన్న రెండు వస్తువుల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది.
ఘర్షణ బలం పలు రకాలు.
స్థైతిక ఘర్షణ
జారుడు ఘర్షణ
దొర్లుడు ఘర్షణ
ప్రవాహి ఘర్షణ
స్థిరంగ వస్తువు కదలకుండా ఉన్నదంటే అర్థం ఆ వస్తువు ఉన్న తలము ఆ వస్తువును కదలకుండా ఆపుతుందన్న మాట. వస్తువుకు తలానికి మధ్య ఉంటే సూక్ష్మ బుడిపెల మధ్య గల అంతర్గత బంధాల వలన వస్తువు కదలకుండా ఉంటుంది. ఈ సందర్భంలో వస్తువుపై పని చేసే ఘర్షణను *స్థైతిక ఘర్షణ* అంటారు.
తలముపై వస్తువు కదులుతుందంటే సూక్ష్మమైన బుడిపెల మధ్య ఉన్న బంధాలు వీగిపోయాయని అర్థం. కదులుతున్న వస్తువు చలనాన్ని నిరోధిస్తూ తలం కలిగించే బలమే *జారుడు ఘర్షణ*. ఇది చలనానికి వ్యతిరేక దిశలో పని చేస్తుంది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువగ ఉంటుంది.
బంతి వంటి వస్తువు తలము మీద దొర్లుతూ ఉంటే వస్తువుపై తలం కలిగించే ఘర్షణను *దొర్లుడు ఘర్షణ* అంటారు. ఇది స్థైతిక, జారుడు ఘర్షణల కంటే తక్కువగ ఉంటుంది.
గాలి, నీరు వంటి ప్రవాహులలో కలిగింపబడే ఘర్షణను *ప్రవాహి ఘర్షణ* అంటారు. గాలిలో వెళ్ళే విమానంపై ప్రవాహి ఘర్షణ పనిచేయును. నీటిలో ఈదే చేపపై ప్రవాహి ఘర్షణ పనిచేయును.
.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment