Pages

Tuesday, July 11, 2017

వివేకానందుని వర్దంతి

విశ్వమానవ విశ్వాసాలను జయించిన.. 'వివేకానందుని వర్దంతి నేడు..

బలమే జీవనం... బలహీనతయే మరణం"
లేండి..!, మేల్కొనండి...!! మీ గమ్యం చేరేదాక విశ్రమించవద్దు"
మానవసేవాయే మాధవసేవ"
.ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. 
భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు స్వామివివేకా నందుడు. మన దేశ సంస్కృతీ సాంప్రదాయా లను వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే మహా గ్రంధాలను చదివి, అమ్మ చెప్పిన మాటలోనే, అదే బాటలోనే ఒకరికి అపకారం తలపెట్టకుండా ఉపకారిగా వ్యవహరించిన ఆదర్శవంతుడు. వివేకానందుడు బోధనలు నాటికి, నేటికీ, రేపటికీ ఎప్పటికీ మనం గుర్తుకోవలసిన ఆచరించినవలసిన సూక్తులు.*
ఆయన 1863 జనవరి 12న జన్మించారు. మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు.
తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు. అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.తన గురువు రామకృష్ణుడు నేర్పిన 'జీవుడే దేవుడు' అనేది వివేకానందుని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు... విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు.*

ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.*

నరేంద్రుని జీవితంలోని కొన్ని సంఘటనలు..

ఒకరోజు ధ్యానములో మునిగివుండగా, పెద్ద నాగుపాము అతని ముందు ప్రాకసాగింది. అక్కడే వున్న తోటి బాలురు దానిని చూచి భయపడి నరేంద్రుని అక్కడ్నించి లెమ్మని కేకలు వేశారు. కాని అతనికి ఆకేకలు వినబడలేదు. తన ధ్యానంలో తను నిమగ్నమయి వున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆ పాము అక్కడ్నించి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి నరేంద్రుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. పాము వచ్చినా పారిపోలేదు ఏమిటని అతని తల్లిదండ్రులు ప్రశ్నించగా, తనకా సంగతే తెలియదనీ, ధ్యానంలో హాయిగా వున్నదని నరేంద్రుడు జవాబిచ్చాడు.*

తల్లి పెట్టిన పరీక్ష..

వివేకానందుడు ప్రపంచమత మహా సమావేశాలకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, ఇక కొన్ని రోజులలో అతను బయలుదేరుడానికి సమయం ఆసన్నమైన సమయంలో వివేకానందుడు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.