ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?
పాలు జంతువులనుండి , కొన్ని చెట్లనుండి లభిస్తాయి. జంతువు ఏదైనా పాలు వాటి శిశువులకు పోషణ ఇచ్చేందుకే ప్రకృతి సిద్ధంగా క్షీరదాలలో ఉన్న ప్రక్రియ. క్షీరదం ఏదైనా దాని ప్రతి కదలికకు, జీవన చర్యలకు కావాల్సింది గ్లూకోజు మాత్రమే! మనలాగే వాటికీ పెరుగుతున్న దశలో కాల్షియం వంటి లవణాలతో పాటు చక్కెరలు, పోషక విలువలున్న ఆహారం అవసరం. అది పాల ద్వారా శిశు దశలో లభిస్తుంది. కాబట్టి ఏ జంతువు పాలూ మనకు విషతుల్యం కాదు. పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలయినా, ఆవు పాలయినా, గాడిద పాలు, మేక పాలు అయినా పాలను మరగబెట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది. జిల్లేడు పాలు, మర్రిచెట్టు పాలు, రబ్బరు పాలు, రావి చెట్టు పాలు, గన్నేరు చెట్టు పాలు పోషక విలువలున్న పాలు కావు. ఆ పాలు ఆయా చెట్లకు రక్షణనిచ్చే విష ద్రవాలు. తెల్లనివన్నీ పాలు కావన్న సామెత ఇక్కడే అమలవుతుంది. చెట్ల పాలు తాగకూడదు కానీ జంతువుల పాలు వేడి చేసుకుని తాగితే ఏదీ హానికరం కాదు.
Worth reading ...
గంగా దాస్ ! నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు !
ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు గొప్పు తవ్వుతున్న గంగాదాస్ అదిరిపడ్డాడు .
“దేనికి ?” అడిగాడు అయాను .
ఏమో ! నాకేమి తెలుసు ? అంటూ వెళ్లిపోయింది ఆమె .
చేతులకు ఉన్న మట్టిని గబగబా బకెట్ లోని నీళ్ళల్లో ముంచి కడిగేసుకున్నాడు . తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు .
వడి వడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివరన ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ వేపు వెడుతున్నాడు . అతని మనసులో ఆందోళన . “ ఏమి జరిగింది ? మొక్కల గురించా ? ఎక్కడైనా పొరపాటు చేశానా ? లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా ? ఎవరినయినా కొట్టిందా ? అలా చెయ్యదే ! ఏమి జరిగింది ? ఇన్ని రోజులుగా ఒక్కసారీ ఎప్పుడూ తనను పిలవని ప్రిన్సిపాల్ మేడం ఎందుకు పిలిచారు ?” అడుగులు తడబడుతున్నాయి . గుమ్మం దగ్గరకి వెళ్ళాడు .
చిన్నగా స్ప్రింగ్ డోర్ మీద శబ్దం చేశాడు .
“అమ్మగారండీ !” లో గొంతుకతో పిలిచాడు .
“ లోపలికి రా !” ప్రిన్సిపాల్ గొంతు అధికారికంగా వినిపించింది . అతనిలో ఆందోళన పెరిగిపోయింది .
కళ్ళజోడు పెట్టుకుని , తెల్లని కాటన్ సారీ కట్టుకుని , తెల్లని జుట్టుతో ఉన్న ప్రిన్సిపాల్ ని చూడగానే వంగి వంగి నమస్కరించాడు .
ఆమె టేబుల్ మీద ఉన్న ఒక కాగితం తీసి అతనికి ఇస్తూ
“ చదువు” అంది
వణికిపోయాడు గంగాదాస్
“ మేడం నేను చదువుకోలేదు . నాకు ఇంగ్లీష్ రాదు . తెలుగు కూడా రాదు . ఏదైనా పొరపాటు చేస్తే మన్నిచండమ్మా ! తప్పు చేస్తే ఇంకొక్క అవకాశం ఇవ్వండమ్మా ! దయగలమీరే పొమ్మంటే ఎక్కడకి పోవాలమ్మా ?” దీనంగా అన్నాడు గంగాదాస్
అతడి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు .
“ మీ దయవలన నేను నా కూతురిని ఇక్కడ చదివించుకుంటున్నాను. మీరు పొమ్మంటే దానికి
ఇలాంటి స్కూల్ లో నా జన్మలో చేర్చలేను తల్లీ ! పొమ్మని అనకండమ్మా ” వణికిపోతున్నాడు
“ అరెరే ! ఏదేదో ఊహించేసుకోకు ! మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివ్బి తేటలు చూసి , నువ్వు మా సిన్సియర్ వర్కర్ వి కాబట్టి. ఈ కాగితం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తా ఉండు ! ఇది నీ కూతురు రాసినదే ! నీకు అది చదివి వినిపించాలి అనిపించి నిన్ను పిలిపించాను . ఇది నువ్వు వినాలి .”
ప్రిన్సిపాల్ గారి పిలుపు విని సరోజ టీచర్ అక్కడకి వచ్చింది . ఆమె ఆ పేపర్ తీసుకుని చదవడం మొదలు పెట్టింది
“ ఈ రోజు మా క్లాసులో మాత్రు దినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు .
“ నేను ఒక పల్లెటూరిలో పుట్టాను . అక్కడ ఇప్పటికీ విద్య వైద్యం అనేవి రెండూ గగన కుసుమాలే ! పిల్లలను కనడం అంటే ఆడవాళ్ళకు మళ్ళీ పుట్టడమే మా పల్లెటూళ్ళల్లో . పిల్లలను కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊరిలో .
అలాగే మా అమ్మకూడా నన్ను కంటూ తను కన్ను మూసింది . నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే , తన దగ్గర పాలు తాగకుండానే పురిటిలోనే చనిపోయింది .
నన్ను తన చేతులలోకి తీసుకున్నది అప్పటికీ ఇప్పటికీ మా నాన్న ఒక్కడే !
తల్లిని చంపి పుట్టాను అన్నారు . "శనిగొట్టుదానిని" అన్నారు . ఎవ్వరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కారు .
నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నాన్నమ్మా , తాతలూ అందరూ బలవంతం చేశారు , కొడుకును కనమని .
ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు .
ఆ ఊళ్ళో ఉంటె వాళ్ళు అందరూ అలాగే బలవంతం చేస్తారు అని , ఉన్న ఇంటినీ , పొలాలనూ అన్నిటినీ వదిలి నన్ను ... రోజుల పిల్లను ఎత్తుకుని నాకోసం నాకు అన్నీ తానే కావాలని , నా జీవిత ఔన్నత్యం కోసం తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలనూ వదిలి వట్టి చేతులతో , నా మీద ప్రేమతో , నన్ను పెంచాలి అనే కసితో ఈ పట్టణం వచ్చేశాడు .
చిన్నప్పుడు నాకోసం ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటాడో !
ఇప్పుడు తలచుకుంటూ ఉంటె అనిపిస్తుంది .
ఒక్కటే రొట్టె ఉంటె తనకు రొట్టెలు ఇష్టం ఉండవు అనేవాడు . నాకు ఇప్పుడు తెలుస్తోంది
నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు నాన్న అనుకునేవాడు అని .
తాను పస్తులు ఉంటూ నాకు తినిపించాడు అని ఇప్పుడు తెలుస్తోంది .
తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలూ నాన్న నాకు కల్పించాడు .
నన్ను ఈ స్కూల్ లో చదివించడం కోసం నాన్న ఇక్కడ తోటమాలిగా చేరాడు .
ప్రేమ ఆప్యాయత అనేవి అమ్మకు మారుపేర్లు అయితే అవి నేను పొందుతున్నది నాన్న నుండి .
సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం అయితే మా నాన్నే నాకు అమ్మ
అమ్మకు ప్రతిరూపం త్యాగం అయితే మా నాన్న త్యాగం ముందు అది చాలా తక్కువ
ప్రేమ ఆప్యాయత , త్యాగం , సానుభూతి ....... ఇలాంటి పదాలకు నిర్వచనం “అమ్మ” అయితే మా నాన్న అంతకన్నా ఎక్కువ నాకు .
మా నాన్న ప్రపంచం లోని అందరి అమ్మల కన్నా గొప్ప అమ్మ
ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను నా తండ్రికి ఈ ప్రపంచం లోని తల్లితండ్రులు అందరికన్నా గొప్పవాడి గా సెల్యూట్ చేస్తున్నా !
ఇంకా ఈ స్కూల్ లో ఉన్న తోటమాలి నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను .
ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు . నా టీచర్ కి ఇది నచ్చకపోవచ్చు .
కానీ నిస్వార్ధ ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత .
చదువుతున్న సరోజ టీచర్ గొంతు లో కన్నీటి జీర !
వింటున్న ప్రిన్సిపాల్ చీర చెంగుతో కళ్ళను అద్ధుకుంటోంది
గంగాదాస్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు దిగమింగు కుంటున్నాడు .
ఆ ఎ . సి . గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వింటోంది .
ఆ పేపర్లను సరోజ టీచర్ చేతులలోనుండి తీసుకున్నాడు . గుండెలకు హత్తుకున్నాడు . నిలబడలేక పోతున్నాడు .
ప్రిన్సిపాల్ మేడం అతడికి దగ్గరగా వచ్చింది . కుర్చీ దగ్గరకి తీసుకు వెళ్ళింది . కూర్చో బెట్టింది తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్ళను అతడి చేతికి ఇచ్చింది . ఆమె గొంతులో ఏదో తెలియని ఆర్ద్రత .
“ గంగా దాస్ !
మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 10/10 మార్కులు ఇచ్చాము . మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసం ఎవరూ రాయలేరు . ఎందుకంటే ఇది ఒక కూతురు తన తల్లి పట్ల చూపే అభిమానానికి వెయ్యి రెట్లు అభిమానాన్ని వ్యక్తపరుస్తున్న వ్యాసం . మేము రేపు మన స్కూల్ లో మాతృదినోత్సవం జరపబోతున్నాము . దానికి ముఖ్య అతిధి నువ్వే !.
నిన్ను మించిన తల్లి ఇంతవరకూ మా స్కూల్ చరిత్రలో మాకు తెలీదు . అందుకే నీకు సత్కారం చెయ్యాలని నిర్ణయించుకున్నాము . నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాను .” అంది
“ మేము ఈ సత్కారం చెయ్యడానికి ముఖ్య కారణం పిల్లలను తల్లులే కాదు తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు అనే విషయం అందరికీ తెలియాలని .
. నీవు చేసిన త్యాగానికి , నీవు నీ కుమార్తె పట్ల చూపిన ప్రేమకు గుర్తింపు గా ఈ సత్కారం చెయ్యాలి అనుకుంటున్నాము . ఇది ఎందరికో స్పూర్తిదాయకం కావాలి .
నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ప్రపంచం లో గొప్ప తల్లి అన్న మాటలను నిజం చెయ్యాలి అనుకుంటున్నాము .
మా స్కూల్ లో ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అని పిల్లల తల్లి తండ్రులకు చెప్పాలి అనుకుంటున్నాము .
నువ్వు మా బడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలివి మాత్రమె కాదు .
నీ జీవితపు తోటలో పూసిన పూబాలను కాపాడుతున్న ఒక చక్కటి తోట మాలివి .
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment