జి.ఎస్.టి What is G.S.T in Telugu
నిజానికి ప్రజలు తమకు తెలియకుండానే ఈ పరోక్ష పన్నులను(VAT/అమ్మకపుపన్ను,ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్) అనాదిగా చెల్లిస్తూనే వస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా పన్ను శ్లాబులు ఎలా ఉన్నా అంతిమ భారం వినియోగదారుడిపైనే కదా.ఒక విషయాన్ని గమనిస్తే ప్రజలు పన్ను కడుతున్న దానిలో 50% కూడా ప్రభుత్వ ఖజానాకు చేరడంలేదు. వ్యాపారుల తప్పుడు లెక్కలో, అధికారుల ధనదాహమో, ప్రజల్లో కొరవడిన నైతిక విలువలో .. ప్రజలు కడుతున్న పన్నులు ప్రభుత్వానికి సరిగా చేరడంలేదు. దీనికి తోడు కొన్న వస్తువును సరైన బిల్లు ఇవ్వకపోవడం, ప్రజల్లో అవగాహనాలేమి, రాజకీయ జ్యోక్యం, ట్యాక్స్ తప్పించుకునే మార్గాలు ఉండటంతో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. GST రాకతో ఇవన్నీ చక్కబడతాయని నేను అనుకోవడం లేదు. ట్యాక్స్ పరిధి విస్తృతం అవడం, చాలా వరకు లావాదేవీలు లెక్కలోకి రావడం, జాతీయ ఆదాయం కొలవడానికి కొన్ని అడ్డంకులు తొలగడం, జరుగుతాయేమో కానీ, పన్ను ఎగవేత దారులు మరిన్ని దారులు వెతుక్కునే ప్రమాదాలు లేకపోలేదు. సామాన్యులపై ప్రభావం చట్టం అమలైతే గానీ అంచనా వేయలేము.
కొన్ని రోజులుగా , ప్రజల్లో ముఖ్యంగా నెటీజన్లలో GST పట్ల అవగాహన పెరగడం, స్వతంత్రంగా పన్ను రేట్లపై తమ తమ అభిప్రాయాలు పంచుకోవడం చట్టం అమలుకు శుభసూచికం.
ఇదే ఊపులో వినియోగదారుల చట్టాలను తెలుసుకొని వినియోగదారుని హక్కుల ఉల్లంఘన పై సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు సర్క్యులేట్ అవ్వాల్సిన తరుణం ఇది.
GST ద్వారా బియ్యం, ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు వంటి నిత్యావసరాలు ఇప్పుడు పన్ను నుంచి మినహాయింపు ఉన్నందున, ఇంతకుముందు కన్నా మినిమం 5% తగ్గాలి. ఉదాహరణకి మనం కొనే బస్తా బియ్యం ముందు కన్నా జులై 1 నుంచి రూ.50 నుంచి రూ.150 వరకూ తగ్గాలి (రకాన్ని బట్టి). కానీ దీన్నే అదునుగా భావించి వ్యాపార సంఘాలు ధరలు పెరిగాయని మూకుమ్మడిగా జనాలని మోసం చేసే అవకాశం లేకపోలేదు. అలా కాకుండ ఇంకోకోణంలో చుస్తే పన్ను లేకపోవడం, పన్ను వసూలు అధికారుల ఒత్తిళ్లు లేకపోవడం వలన ఈ వస్తువులు అమ్మే వ్యాపారుల మధ్య ఉత్సాహవంతమైన పోటీతత్వం పెరిగి ధరలు ఇంకా తగ్గాలి. దానికి ఇంకా సంవత్సరం పైనే పట్టొచ్చని నా నమ్మకం (వ్యాపార వర్గాల్లో నైతికత ఉండి, GST సక్రమంగా అమమలైతే ).
వినియోగదారుడు తాను చెల్లించే ధరకు నాణ్యమైన వస్తువులు, సర్వీసులు పొందుతున్నాడా అని ఆలోచిస్తే భారత దేశంలో దురదృష్టవశాత్తూ 30% కూడా లేదనే చెప్పాలి. ఆ దిశగా GST లాంటి చట్టాల కన్నా ముందే వీటిపై ప్రభుత్వం మరిన్ని చట్ట సవరణలు చేయాల్సిన అవశ్యం ఉంది.
ప్రభుత్వం ప్రజల ముక్కు పిండి పన్ను వసూలు చేయడానికి సిద్ధం అయినప్పుడు దానికి మించి నాణ్యమైన వస్తువుల్ని, సర్వీసుల్ని అందించడానికి మార్గాలు వెతక్కపోవడం శోచనీయం.
మేలుకో వినియోగదారుడా మేలుకో..
GST గురించి
తెలుసుకోబోయేముందు భారతదేశంలో ఉన్న పన్నుల వ్యవస్థ గురించి కొద్దిగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది.
స్థూలంగా సింపల్ గా చెప్పాలంటే...
పన్నులు 2 రకాలు...
1. Direct Tax
అంటే ఎవరు ఎంత పన్ను కడతారో ముందే కాల్క్యులేట్ చేస్కోవచ్చు. పన్ను భారం ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ పై ఉంటుంది.
eg: Income Tax, Professional Tax
2. Indirect Tax
అంటే పన్ను ఎవరు కడుతున్నాడో, ఎక్కడినుంచి వసూలు అవుతుందో చెప్పలేం. పన్ను ప్రభావం తెలియకుండానే చాలామంది పై ఉంటుంది.
eg: VAT, Central Excise
ఒక కంపెనీ ఒక టీవీ ని ఉత్పత్తి చేస్తే దాని ఉత్పత్తి పైన Central Govt. కి కట్టే పన్ను - Central Excise.
కంపెనీ వాడు ఏదైనా షాప్ వాడికి అమ్మినా లేదా షాప్ వాడు జనాలకు అమ్మినా అమ్మకం మీద ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్ను- VAT.
ఇప్పుడు GST విషయానికి వద్దాం..
GST ఒక పరోక్ష పన్ను. పైన చెప్పుకున్న VAT, సెంట్రల్ ఎక్సైజ్ లాంటి అనేక పన్నులు లేకుండా దేశ వ్యాప్తంగా ఒకే పన్నుగా ఉండాలనే ఉద్దేశ్యం తో ప్రవేశ పెడుతున్నదే GST.
ఒక కేస్ స్టడీ తీసుకుందాం అర్థం అవడానికి...
ఇదివరకు ఉన్న విధానం...
మనం ఒక TV కొన్నాం అనుకోండి. దానిపై నిర్ణయించిన పన్నుని TV ధరతో పాటె కలిపి తెలియకుండా కొంటాము. అంటే టీవీ ధర తో పాటు దానికి అయ్యే టాక్స్ మన దగ్గర నుంచి షాప్ వాడు వసూలు చేసుకుంటాడు. మన దగ్గర వసూలు చేయినదాన్ని ప్రభుత్వానికి లెక్కలో చూపించి ఆ నెలలో కట్టేస్తాడు (దొంగ లెక్కలు రాయకపోతే). ఇదే టీవీ ని మనకు అమ్మిన షాప్ వాడు కూడా ఉత్పత్తి దారుడి/ కంపెనీ దగ్గరనుంచి (Manufacturer) దాని ధర తో పాటు పన్ను కట్టి తెచ్చుకుంటాడు. అక్కడ కూడా ఉత్పత్తి దారుడు షాప్ వాడి దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుని ప్రభుత్వానికి నెలాఖరులో లెక్కచూపి కట్టేస్తాడు. ఈ పన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాలి.
ఇంతే కాకుండా టీవీ ఉత్పత్తి కంపెనీ ఉత్పత్తి పైన కుడా ఎలాగూ సెంట్రల్ గవర్నమెంటుకి సెంట్రల్ ఎక్సైజ్ చెల్లిస్తుంది.
ఇలా మనం కొన్న టీవీ పై ఉత్పత్తి దగ్గరనుంచి వినియోగదారుడికి చేరెవరకు పరోక్షంగా వివిధ పన్నులు వివిధసార్లు పడుతుంది. ఉత్పత్తిదారునికి వినియోగదరిడికి మధ్య ఎంత మంది మీడియేటర్లు (డీలర్స్) ఉంటే అన్ని సార్లు పన్ను పడుతూ వస్తుంది. ఇలా అంతిమ పన్ను భారం ఒకరిపైన ఉండదు. ఈ వస్తువు ట్రాన్సక్షన్ లో పాల్గొన్న అందరిపై పడుతుంది.
ఇప్పుడు మారబోయే విధానం....
GST విధానంలో ముందులా ఉత్పత్తి పన్ను , అమ్మకపు పన్నులు అంటూ వివిధ దశల్లో వివిధ పన్నులు ఉండవు. అంతా కలిపి ఒకే పన్ను ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి అప్పుడు ఒక పన్ను, అమ్మకం అప్పుడు ఒక పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
eg: ఇంతకుముందు (సెంట్రల్ ఎస్క్సిజ్ 14.5 % VAT 14.5% ) మొత్తం వివిధ దశల్లో పన్ను 29 కి పైగా ఉండేది. ఇప్పుడు అన్నే కలిపి 28% గా నిర్ణయించారు.
వస్తువు రకాన్ని బట్టి పన్నులు పెరగడమో తరగడమో జరిగాయి
.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment