Pages

Tuesday, July 4, 2017

మితిమీరితే ....

మితిమీరితే ....


మితిమీరిన  ఖర్చు  ...  *_పేదరికం పాలు చేస్తుంది._*

మితిమీరిన  పొదుపు  ..  *_కష్టాల పాలు చేస్తుంది._*

మితిమీరిన  సంపాదన  ...  *_మనశ్శాంతిని లేకుండా చేస్తుంది._*

మితిమీరిన  కర్తవ్యం  ...  *_అగచాట్ల పాలు చేస్తుంది._*

మితిమీరిన  క్రమ శిక్షణ  ...  *_రక్త సంబధీకులను దూరం చేస్తుంది._*

మితిమీరిన  బాధ్యతలు  ...  *_అప్పుల పాలు చేస్తుంది._*

మితిమీరిన  హాస్యం  ...  *_నవ్వుల పాలు చేస్తుంది._*

మితిమీరిన  కోపం  ...  *_శతృవులను వృద్ధి చేస్తుంది._*

మితిమీరిన  ఆలోచనలు  ...  *_జీవితాన్ని దుర్భరం చేస్తుంది._*

మితిమీరిన  వ్యసనాలు  ...  *_అప మృత్యు పాలు చేస్తుంది._*

మితిమీరిన  స్వార్ధం  ...  *_అందరినీ దూరం చేస్తుంది._*

మితిమీరిన  పోటీ  ... 
*_నష్టాల పాలు చేస్తుంది._*

మితిమీరిన  లాభార్జన  ...  *_వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది ._*

మితిమీరిన  వస్తూత్పత్తి  ...  *_నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది._*

మితిమీరిన  గర్వాహంకారం  ...  *_ఆపదలు కొని తెస్తుంది._*

మితిమీరిన అలంకారం  ...  *_వెగటు పుట్టిస్తుంది._*

మితిమీరిన  శృంగారం  ...  *_వైరాగ్యాన్ని కలిగిస్తుంది._*

మితిమీరిన  కామాంధకారం  ...  *_జీవచ్చవాన్ని చేస్తుంది._*

మితిమీరిన  దారిద్రయం  ..  *_నేరాల పాలు చేస్తుంది._*

మితిమీరిన  అధికార దాహం  ...  *_హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది._*

మితిమీరిన  త్యాగం  ...  *_కడగండ్ల పాలు చేస్తుంది._*

మితిమీరిన  వ్యావసాయకోత్పత్తి  ...  *_భూమిని నిస్సారం చేస్తుంది._*

మితిమీరిన  జనాభా పెరుగుదల  ...  *_దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది._*

మితిమీరిన  స్నేహాలు  ...  *_అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది._*

మితిమీరిన  గారాబం  ...  *_చెడు స్నేహాల పాలు చేస్తుంది._*

మితిమీరిన  వేదాంతం  ...  *_వెటకారం పాలు చేస్తుంది._*

మితిమీరిన  ఈర్ష్ర్యాసూయాద్వేషాలు  ..  *_నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది._*

మితిమీరిన   భక్తి  ...  *_మూర్ఛల పాలు చేస్తుంది._*

మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...   *_నాస్తికత్వానికి నాంది పలుకుతుంది._*

మితిమీరిన  ఉపవాసాలు  ...  *_నిస్రాణతకు దారి తీస్తుంది._*

మితిమీరిన  ప్రేమ  ...  *_అనుమానాలకు దారి తీస్తుంది._*

మితిమీరిన  నమ్మకం  ..  *_ద్రోహానికి దోహదం చేస్తుంది._*

మితిమీరిన  విశ్వాసం  ...  *_లోకువ పాలు చేస్తుంది._*

మితిమీరిన  ఋణం  ...  *_మరణం పాలు చేస్తుంది._*

మితిమీరిన  అభిరుచి  ...  *_దుబారాకు దారి తీస్తుంది._*

మితిమీరిన  కీర్తి దాహం  ...  *_ఆదాయాన్ని మింగేస్తుంది._*

అతి సర్వత్ర వర్జయేత్  ...
                     తస్మాత్  ...                  జాగ్రత  ...  
జాగ్రత  ... 
జాగ్రత .

మితా హారం  ..._*
మిత భాషణం  ..._*
మితమైన నిద్ర  ..._*
మిత సంసారం  ..._*
మిత సంపాదన_*
మనో కాలుష్య రహితంగా ..._*
జీవన యానం సాగిస్తే  ..._*
పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు   ...   అదే రాచబాట._*
శాంత ప్రశాంత యుతమైన మనశ్శాంతికి   ...   అదే పూల తోట._*

మూర్తీభవించిన మానవతా విలువలకు   ...   అదే పెట్టని కోట._*
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.